డ్రైవర్‌ బీభత్సం.. ప్రాణాలతో చెలగాటం | Man Clung To Speeding Car For 2 KM In Road At Ghaziabad | Sakshi
Sakshi News home page

కారు బ్యానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు

Published Thu, Mar 7 2019 1:22 PM | Last Updated on Thu, Mar 7 2019 2:05 PM

Man Clung To Speeding Car For 2 KM In Road At Ghaziabad - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్‌లో ఓ కారు డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. కారు బ్యానెట్‌పై వ్యక్తి ఉండగా... రెండు కిలోమీటర్ల దూరం డ్రైవ్‌ చేశాడు. ఘజియాబాద్‌కు చెందిన  ఓ యువ‌కుడు త‌న కారుతో మ‌రో క్యాబ్‌ను ఢీకొట్టాడు. దాంతో ఆ క్యాబ్ డ్రైవ‌ర్ ఆ యువ‌కుడిని ప్రశ్నించేందుకు కారుకు ఎదురుగా నిల‌బడి ఆపే ప్రయత్నం చేశాడు. కారును ఆపేందుకు నిరాక‌రించిన ఆ యువ‌కుడు .. అలాగే ముందుకు డ్రైవ్‌ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో క్యాబ్‌ డ్రైవర్‌ కారు బ్యానెట్‌పైకి ఎక్కాడు. అయినప్పుటికీ ఆ యువకుడు కారును ఆపకుండా రెండు కిలోమీటర్ల మేర డ్రైవ్‌ చేశాడు. కానీ క్యాబ్ డ్రైవ‌ర్ మాత్రం త‌న కారును బ్యానెట్‌ను పట్టుకుని వ‌ద‌ల్లేదు. ఈ ఘటనను అంతా అదే రోడ్డుపై వెళ్లున్న కొందరు వీడియో తీశారు. కారు బ్యానెట్‌పై ఉన్న యువకుడు కూడా కారు డ్రైవ‌ర్‌ను నిల‌దీస్తూ ఆ వీడియోలో క‌నిపించాడు. సమచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారు డ్రైవ‌ర్‌ను అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement