
చండీగఢ్: రెస్టారెంట్‌కు వెళ్లి సరదాగా విందు భోజనం ఆరగిద్దామనుకున్న ముగ్గురు మహిళల ఆనందాన్ని ఓ క్యాబ్ డ్రైవర్ ఆవిరి చేశాడు. క్యాబ్‌లో వారంతా వెళ్తుండగా.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ డ్రైవర్ వేధింపులకు దిగాడు. ఈ ఘటన అమృత్‌సర్‌లో శనివారం సాయంత్రం జరిగింది. ఎస్‌హెచ్‌ఓ రాబిన్ హాన్స్ వివరాల ప్రకారం.. రంజిత్ అవెన్యూ ప్రాంతంలోని రెస్టారెంట్‌కు వెళ్లేందుకు ముగ్గురు మహిళలు క్యాబ్ మాట్లాడుకుని వెళ్తున్నారు. కొంత దూరం వెళ్లాక.. వారిలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ డ్రైవర్ లైగింకంగా వేధించసాగాడు.
వారంతా అతనికి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం చెప్పడంతో వాహనాన్ని మరింత వేగంగా పోనిచ్చాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆ మహిళల్లో ఇద్దరు ఒక్కసారిగా వాహనం నుంచి కిందకు దూకేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఆ వెంటనే రోడ్డు వెంట వెళ్తున్నవారికి విషయం చెప్పి అలర్ట్ చేయడంతో.. కొంతమంది బైకులపై కారును వెంబడించారు. అందులో చిక్కుకున్న మరో మహిళను రక్షించారు. క్యాబ్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గంట వ్యవధిలోనే అతన్ని పట్టుకుని జైల్లో వేశారు.
Comments
Please login to add a commentAdd a comment