
క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ మృతి
కోల్‌కతా: సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) మాజీ చీఫ్ క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ (86) మంగళవారం రాత్రి మరణించారు. డిప్రెషన్, కాలేయ వ్యాధి కారణంగా ఏప్రిల్ 11 నుంచి ముఖర్జీ నగరంలోని బీఎన్‌ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన మనవడు ప్రణయ్ ముఖర్జీ తెలిపారు.
1987 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు రెండు దశాబ్దాలు ఈడెన్‌లో పిచ్‌లను తయారు చేయడంలో ప్రబీర్ కీలక పాత్ర పోషించారు. అయితే 2015 అక్టోబరు 8న భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఆరు గంటల పాటు సమయం దొరికినా ప్రబీర్ స్టేడియంను సిద్ధం చేయలేకపోయారని సౌరవ్ గంగూలీ విమర్శించడంతో... అప్పటినుంచి ప్రబీర్ ఈడెన్‌లో అడుగుపెట్టలేదు.