
క్యాబ్‌ను సీజ్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
గచ్చిబౌలి: 104 చలానాలు పెండింగ్ ఉన్న ఓ క్యాబ్‌నుగచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ రఘు కుమార్ మంగళవారం ఉదయం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌పై నో పార్కింగ్‌లో పార్క్ చేసిన క్యాబ్(టీఎస్07యుఎ0202)కు రూ. 200 చలాన్ విధించారు. ఈ సందర్భంగా ట్యాబ్‌లో పరిశీలించగా సదరు వాహనపై 104 చలానాలు ఉన్నట్లు తేలింది. రూ. 17,805 చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించిన ఎస్‌ఐ క్యాబ్‌ను సీజ్ చేశారు. చలానాలు చెల్లించిన తరువాత కారు విడుదల చేస్తామని డ్రైవర్ రమేష్ గౌడ్‌కు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment