e challan
-
ఈ–చలాన్ల పేరిట సైబర్ మోసం...
సాక్షి, హైదరాబాద్: రోజుకో కొత్త మోసానికి తెరతీస్తున్నారు సైబర్ నేర గాళ్లు. ప్రజల్లో అవగాహన పెరిగిన మోసాలు కాకుండా సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో వల వేస్తున్నారు. తాజాగా వాహన దారులను ఈ–చలాన్ల పేరిట నకిలీ ఎస్ఎంఎస్లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ భద్రత నిపుణు లు తెలిపారు. పోలీసుల నుంచే వచ్చినట్లుగా అనిపించే నకిలీ వెబ్సైట్ లింకులను పంపుతున్నారు. వాటిపై క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ పేరిట బ్యాంకు ఖాతా, వ్యక్తిగత వివరాలు సేకరించి అందినకాడికి సొమ్ము కొల్లగొడుతున్నారు. తాజాగా ముంబైలో ఈ తరహా కేసు ఒకటి నమోదైనట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ముంబైలోని పెద్దార్‌రోడ్ ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడికి ఇలా నకిలీ మెసేజ్ పంపి పలు దఫాల్లో రూ.3 లక్షలు కొట్టే సినట్లు వెల్లడించారు. ‘వాహన్‌పరివాహన్. ఏపీకే (vahanaparivahan.apk)అనే మొబైల్ యాప్ పేరిట ఈ లింక్ పంపినట్లు తెలిపారు. ఈ–చలాన్ చెల్లించాలంటే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సాధారణ మెసేజ్‌ల తోపాటు వాట్సాప్ సందేశాలను వారు పంపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి సరికొత్త సైబర్ మోసాలపై ఎప్పటిక ప్పుడు అవగాహన కలిగి ఉండటంతోపాటు అప్రమత్తంగాను ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 3కోట్ల 59లక్షల చలాన్స్
-
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు నేటినుంచే రాయితీ
వరంగల్ క్రైం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాల చెల్లింపు రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించిన విషయం తెలిసిందే. మంగళవారంనుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదా యం రానుంది. దీంతోపాటు పెండింగ్ చలాన్ల పేరి ట ట్రాఫిక్ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందునుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రూ ల్స్‌ను అతిక్రమించిన వాహనదారుల జరిమానాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇటీవల ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది నగరంలోని వాహనదారులనుంచి జరిమానాలను ముక్కుపిండి వసూలు చేశారు. జరిమానాల్లో 50 శాతం చెల్లిస్తేనే వాహనాలను వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. అందరూ చెల్లిస్తే రూ.80కోట్లు వసూలయ్యే అవకాశం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలు ఉన్నాయి. 2018 జనవరి ఒకటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకింద 47,31,823 చల్లాన్లు ఉండగా, జరిమానా రూ.140,91,52,550 విధించారు. గత మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించిన సమయంలో, పోలీస్ అధికారులు వాహనాల తనిఖీల సందర్భంగా 20,17,109 చల్లానకుగాను రూ.62,72,66,426 వసూలయ్యాయి. మిగిలిన చలాన్లు 27,14,714 ఉండగా, జరిమానా రూ.80,18,86,124 పెండింగ్‌లో ఉంది. కాగా, ఈ ఏడాది జనవరినుంచి ఈ నెల 25వ తేదీ వరకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ద్విచక్ర వాహనాలపై 5,73,436, ఆటోలపై 20,700, కార్లపై 1,15,421, లారీలపై 938, భారీ వాహనాలపై 2081, మొత్తం 7,14,720 చలాన్లు విధించారు. వాహనాలపై రాయితీ ఇలా.... బైక్‌లు, ఆటోలపై 80శాతం, కార్లు, ట్రక్కులు, భారీ వాహనాలపై 60 శాతం, ఆర్టీసీ, తోపుడు బండ్లపై 90 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ అవకాశం కల్పించింది. చలాన్లు ఉన్న వాహనదారులు తప్పకుండా వినియోగించుకోవాలి. వాహనదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించొద్దు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. అతివేగంగా ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దు. వాహనదారులు నిబంధనలను పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. – సీపీ అంబర్ కిషోర్ ఝా ఇష్టారాజ్యంగా చలాన్ల విధింపు.. కమిషనరేట్ పరిధిలో వాహనదారులపై పోలీస్ అధికారులు విధించిన చలాన్లపై సర్వతా విమర్శలు వెల్లువెత్తాయి. ఉదయం సమయంలో వాకింగ్వెళ్లొచ్చే వాహనదారులపైనా విత్అవుట్ హెల్మెట్కింద జరిమానాలు విధిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగరంలో ప్రత్యేకంగా ఎక్కడ కూడా పార్కింగ్ స్థలాలు లేవు. కానీ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డు పక్కన నిలిపితే నో పార్కింగ్ పేరిట జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలను తెలియజేసే సైన్ బోర్డులు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ జరిమానాలు మాత్రం అంతటా వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్‌లో పనిచేసే కొంతమంది రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు పంపించే పనికి మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శలు లేకపోలేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సిబ్బంది చాలామంది జరిమానాల విధింపుపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. -
చలో.. చలాన్ కట్టేద్దాం..!
నిర్మల్: కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో విధించిన ఫైన్లపై రాయితీ ప్రకటించింది. ఈనెల 26 నుంచి జనవరి 10 వరకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రానప్పటికీ దాదాపు ఇదే ఫైనల్ అని, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాదారులు ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. బంపర్ డిస్కౌంట్లు.. గత ప్రభుత్వం 2022లో ఇలాగే చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. దీంతో అప్పట్లో చాలామంది వాహనదారులు తమ పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకున్నారు. సర్కారుకూ ఆదాయం సమకూరింది. ఇప్పుడు కొత్త సర్కారు కూడా అలాగే భారీ ఆఫర్లతో పెండింగ్ జరిమానాలను క్లియర్ చేయించే పనిపెట్టుకుంది. ఈనెల 26 నుంచి జనవరి 10 వరకు సమయం ఇచ్చింది. జిల్లాలో భారీగానే.. జిల్లాలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇందులో చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వెళ్తున్నారు. ఎ క్కువశాతం హెల్మెట్ లేకుండా, రాంగ్రూట్లో ప్ర యాణం, అతివేగం వంటివే ఉంటున్నాయి. రోడ్డుభద్రత నిబంధనలను ఉల్లంఘించిన వారికి పోలీ సులు సంబంధిత చలాన్లు విధిస్తున్నారు. చాలా మంది వాహనదారులు తమకు తెలియకుండానే ని బంధనలు అతిక్రమిస్తూ చలానాల బారిన పడుతున్నారు. ఎప్పుడో ఒకసారి ఎక్కడైనా పోలీసులు ఆపి తనిఖీ చేసినప్పుడే అసలు విషయం బయటపడుతోంది. మన వాహనంపై పెండింగ్ చలాన్లు ఉ న్నాయా.. లేదా.. అని తెలంగాణ పోలీస్‌శాఖ ఆన్లైన్లో ఈ–చలాన్ ద్వారా తెలుసుకోవచ్చు. కట్టేసిందే.. ఉత్తమం.. కొత్త ప్రభుత్వం వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ల చెల్లింపులకు ఇచ్చిన ఆఫర్లపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఇలాంటి ఆఫర్ మళ్లీ ఇస్తారో లేదోనని చాలామంది భావిస్తున్నారు. అలాగే ఈ గడువు ముగిసిన తర్వాత మరింత పకడ్బందీగా తనిఖీలు చేపట్టి, ఇబ్బందులు పెడతారేమోనన్న చర్చ కూడా సాగుతోంది. ఎప్పటికై నా కట్టాల్సినవే కనుక ఇప్పుడున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. ఎప్పటికై నా చెల్లించాల్సిందే.. వాహనదారులు తమ వాహనంపై ఉన్న చలాన్లను ఎప్పటికై నా చెల్లించాల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. జిల్లాలోని వాహనదారులంతా పెండింగ్ చాలన్లను క్లియర్ చేసుకోవాలి. – ప్రవీణ్‌కుమార్, ఎస్పీ -
వాహనదారులకు ఊరట!.. పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ
మహబూబ్‌నగర్ క్రైం: కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్లపై రాష్ట్ర పోలీస్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనం దగ్గరి నుంచి భారీ వాహనాల వరకు కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న చలాన్స్ చెల్లించడానికి ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. వాహనదారుల నుంచి పెండింగ్ జరిమానాలు రాబట్టేందుకు భారీస్థాయిలో రాయితీలు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులపై 90 శాతం, ద్విచక్ర వాహనాలపై 80 శాతం, ఆటోలు, కార్లు ఇతర ఫోర్ వీలర్స్‌పై 60 శాతం, లారీలు, ఇతర భారీ వాహనాలపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 26వ తేదీ నుంచి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి పెండింగ్ చలాన్స్ వసూలు చేసే ప్రక్రియపై దృష్టి పెట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 2021 నుంచి 2023 డిసెంబర్ వరకు 1,99,841 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9,36,67,245 వసూలు కావాల్సి ఉంది. అత్యధికంగా మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో 77,237 కేసులు ఉండగా, అత్యల్పంగా చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 2,076 ఈ–చలాన్ కేసులు పెండింగ్‌లో ఉండడం విశేషం. జిల్లాలో ఇప్పటివరకు ఈ–చలాన్ కేసులు 2,28,622 నమోదు చేయగా వీటి ద్వారా రూ.10,71,64,164 జరిమానాలు విధించారు. ఇందులో 58,953 కేసులలో రూ.2,90,23,180 జరిమానాలు చెల్లించారు. ఇంకా 1,99,841కేసులలో రూ.9,36,67,245 జరిమానాలు ప్రభుత్వానికి చెల్లించాలి. సద్వినియోగం చేసుకోవాలి.. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ కల్పించిన క్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి వాహనదారుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతాం. – టి.మహేష్, డీఎస్పీ మహబూబ్‌నగర్ -
ఈ–చలానాల పేరిట రూ.కోట్లు కొట్టేశారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసులు విధించే ఈ–చలానా వసూళ్లలో రూ.36.53 కోట్లను పక్కదారి పట్టించి భారీ మోసానికి పాల్పడిన ఘటనపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని గుంటూరు రేంజి ఐజీ జి.పాలరాజు తెలిపారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ–చలానా వసూలుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థ ఒక క్లోన్ అకౌంట్ ద్వారా ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించామని, సంబంధిత వ్యక్తుల అన్ని ఖాతాలు సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో గతంలో డీజీపీగా పనిచేసిన నండూరి సాంబశివరావు అల్లుడు అవినాశ్ కొమ్మిరెడ్డి, అతని సోదరి అక్షిత, మరికొందరి పాత్ర ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, ప్రజల సొమ్ము ప్రభుత్వానికి రాకుండా చేసిన ఈ కేసులో ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రూపాయికే టెండర్ వేసి.. రూ.కోట్లు కొల్లగొట్టారు మోటారు వాహనాలపై విధించే చలానాల వసూలుకు సంబంధించి 2015 నుంచి ‘కృష్ణా సొల్యూషన్స్’ అనే సంస్థ కొన్ని జిల్లాల్లో సేవలు అందిస్తోందని ఐజీ పాలరాజు చెప్పారు. ఈ అప్లికేషన్ వాడుతున్నందుకు ప్రతి చెల్లింపుదారు నుంచి రూ.5 చొప్పున యూజర్ చార్జీగా ఆ సంస్థ వసూలు చేస్తోందన్నారు, 2017 జూన్‌లో అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు ‘డేటా ఎవాన్ సొల్యూషన్స్’ అనే సంస్థ ఆధునికీకరించిన సాఫ్ట్వేర్ ఉందని, దీనిని కూడా ఉపయోగించమని సర్క్యులర్ ఇచ్చారని వివరించారు. దీంతో కృష్ణా సొల్యూషన్స్‌తో పాటు డేటా ఎవాన్ సొల్యూషన్స్ సేవలను కూడా వచ్చారన్నారు. 2018లో ఒక్కో జిల్లాలో ఒక్కో పద్ధతి వాడుతుండటంతో అన్నిచోట్ల ఒకే పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో డేటా సొల్యూషన్స్ ఎంపిక కోసం ఓపెన్ టెండర్లు పిలిచామన్నారు. టెండర్ విలువ రూ.2 కోట్లుగా నిర్ణయించామని చెప్పారు. ఈ టెండర్లలో రెండు సంస్థలు పాల్గొన్నాయన్నారు. కృష్ణా సొల్యూషన్స్ రూ.1.97 కోట్లకు టెండర్ వేయగా.. డేటా ఎవాన్ సొల్యూషన్స్ కేవలం ఒక్క రూపాయికే టెండర్ వేసిందన్నారు. అదేమని అడగ్గా.. తాము ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున సేవగా చేయాలన్న ఉద్దేశంతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నామని, మిగిలిన రాష్ట్రాల్లో వచ్చిన డబ్బులతో సంస్థను నడుపుతామని చెప్పడంతో డేటా ఎవాన్ సంస్థకే టెండర్ కేటాయించినట్టు వివరించారు. అందరిపైనా కేసులు డేటా ఎవాన్ సొల్యూషన్‌తో పాటు రేజర్పీఈ అనే నకిలీ కంపెనీని సృష్టించి నగదు దారి మళ్లించిన వారందరిపైనా కేసులు నమోదు చేశామని ఐజీ తెలిపారు. తమ శాఖకు సాంకేతిక సహకారం అందిస్తున్న కొత్తపల్లి రాజశేఖర్‌ను అరెస్ట్ చేశామని, అతని బినామీ ఆస్తులను గుర్తిస్తున్నామని చెప్పారు. కంపెనీ డైరెక్టర్లు కొమ్మిరెడ్డి అవినాష్, అక్షిత, రవికిరణ్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ను ఎవరు నిర్వహించారో, ఎవరు సహకరించారో వారిని కూడా గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే ఈ కేసు విచారణ పూర్తిచేసి బాధ్యులందరినీ అరెస్ట్ చేస్తామని పాలరాజు స్పష్టం చేశారు. ఇలా కొట్టేశారు ఈ–చలానా అప్లికేషన్‌కు డబ్బులు వివిధ పేమెంట్ గేట్‌వేల ద్వారా వస్తాయని పాలరాజు చెప్పారు. పేటీఎం, ఏపీ ఆన్లైన్, మీసేవ, డెబిట్, క్రెడిట్ కార్డులు, వెబ్, రేజర్‌పే వంటి విధానాల్లో చలానా మొత్తాల చెల్లింపులు జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఇలా వచ్చిన డబ్బులన్నీ డీజీ అకౌంట్‌కు అనుసంధానం అవుతాయన్నారు. చెల్లింపులు జరుగుతున్న తరుణంలో కొంత అవకతవకలు జరుగుతున్నట్టు తిరుపతి యూనిట్లో గుర్తించారన్నారు. ప్రతి రోజూ ఎంత వస్తుందన్నది డాష్‌బోర్డులో కనపడుతుందని, ప్రతినెలా 1వ తేదీన వసూలు చేసిన మొత్తం కొద్దిరోజుల తర్వాత చూస్తే తగ్గుతున్నట్టు గుర్తించడంతో విచారణ మొదలు పెట్టామన్నారు. దీనిపై లోతుగా విచారణ చేయడంతో పెద్దఎత్తున మోసం జరుగుతున్న విషయం వెలుగు చూసిందన్నారు. రేజర్‌పే ద్వారా వచ్చిన మొత్తాన్ని వేరే ఖాతాకు మళ్లించుకున్నట్టు గుర్తించామన్నారు. దీనికి సంబంధించి 2018లోనే ఒక క్లోనింగ్ ఖాతాను సృష్టించి.. దానిద్వారా డబ్బులను తమ ఖాతాలకు మళ్లించుకున్నారన్నారు. ఈ విధంగా పోలీసు శాఖకు రావాల్సిన రూ.36.53 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించినట్టు గుర్తించి వాటిని సీజ్ చేశామన్నారు. ఏ ఖాతాలకు మళ్లించారో ఆ ఖాతాల ద్వారా 2019 నుంచి కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించామని వివరించారు. -
చలాన్లు కట్టమన్నారని..
శంషాబాద్: ట్రాఫిక్ నింబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఓ వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపి చల్లాన్లు కట్టమని చెప్పడంతో ఆగ్రహానికి లోనైన అతను వాహనానికి నిప్పు పెట్టేందుకు యత్నించిన సంఘటన శంషాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక కిషన్‌గూడ ఫ్లై ఓవర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తొండుపల్లి వైపు నుంచి యాక్టీవాపై వస్తున్న ఫసీయుద్దీన్ ఆపారు. వాహనంపై మొత్తం 28 చలాన్లు ఉండగా మొత్తం రూ.9150 జరిమానా చెల్లించాల్సి ఉంది. జరిమానా చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించడంతో ఆగ్రహానికి లోనైన అతను వెంటనే పెట్రోలు ట్యాంక్ తెరిచి అందులో అగ్గిపుల్ల వేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు. ట్రాఫిక్ పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించిన అతడిపై ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనంపై త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం, రాంగ్ రూట్ తదితర అనేక ఉల్లంఘనలు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. -
ఫొటోలు తీయడమే కర్తవ్యమన్నట్లుగా.. ఏంది సారూ ఇది!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణ ఎంత ముఖ్యమో ట్రాఫిక్ నియంత్రణకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జిల్లా పోలీసులు ట్రాఫిక్ ని యంత్రణలో తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫి క్ నియంత్రణ సక్రమంగా నిర్వహించకపోగా పోలీసులే ట్రా ఫిక్ సమస్యలు సృష్టించే పరిస్థితి నడుస్తోంది. ప్రతి కూ డలిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ ట్రాఫిక్ మాత్రం నియంత్రణలో ఉండడం లేదు. పట్టపగలు భారీ వాహనాలు వెళ్తున్నా పట్టింపులేదు. ట్రాఫిక్ చలాన్ల ఫొటోలు తీయడం లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ఎక్కడ చూసినా, ఏ సమయంలోనైనా, ఏ పోలీసు కానిస్టేబుల్ అయినా ఫొటోలు తీయడమే తమ కర్త వ్యమన్నట్లుగా వ్యవహరిస్తూ కనిపిస్తుండడం గమనార్హం. ఇక పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు సంబంధించి పోలీసులు పలు చోట్ల తిష్ట వేసి తనిఖీలు చేస్తుండడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఫొటోలు తీసి, చలాన్లు వేసి, అందుకు సంబంధించిన జరిమానాలు వసూళ్లు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుండడం విశేషం. ఇదిలా ఉండగా మరోవైపు బార్ షాపుల వద్ద కొందరు కానిస్టేబుళ్లు మఫ్టీలో ఉండి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. ► ట్రాఫిక్ చలాన్లు పంపే విషయంలో ఒక విధానం లేకుండా పోయింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన గ్లామర్ బైక్ కలిగి ఉన్న ఒక వ్యక్తికి హెల్మెట్ ధరించనందుకు చలాన్ విధించినట్లు మెసేజ్ వచ్చింది. అయితే ఈ ఫొటో తీసింది మాత్రం హన్మకొండ జిల్లా కాజీపేటలో కావడం గమనార్హం. అది కూడా షైన్ బైక్ కావడం విశేషం. అసలు హన్మకొండకు వెళ్లని బైక్‌కు జరిమానా రావడం విడ్డూరం. పోలీసు శాఖ తప్పిదం అయినప్పటికీ చలాన్ మొత్తం చెల్లించాలని జిల్లా పోలీసులు చెబుతుండడం చిత్రంగా ఉంది. చెప్పుకుంటూ పోతే ఇలా ఇష్టం వచ్చినట్లు చలాన్లు వేసిన కేసులు కోకొల్లలు.కాగా ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు వసూలు చేసే విషయంలో పోలీసులు కొందరు వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తి స్తుండడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. -
30 వాహనాలు..రూ.68.57 లక్షలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్ టెన్’ వాహనాల జాబితాను మూడు కేటగిరీలుగా ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించారు. డీసీఎం వంటివి, ఆటోలు, ద్విచక్ర వాహనాలు.. ఈ మూడు విభాగాల్లోనూ టాప్ టెన్ చొప్పున మొత్తం 30 వాహనాలు ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.68,57,230 చెల్లించినట్లు తేలింది. వీటిపైనే ట్రాఫిక్ విభాగం 24,510 చలాన్లు జారీ చేసింది. జరిమానాగా చెల్లించిన టాప్ టెన్ వాహనాల్లో కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీవే ఎక్కువగా ఉన్నాయి. కేవలం పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకే నగరంలో 24 గంటలూ సంచరించే ఆస్కారం ఉంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను రాత్రి వేళల్లో మాత్రమే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం శీతల పానీయాల సరఫరా, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనే వాహనాలు సంచరిస్తుంటాయి. ఇవి ఆయా దుకాణాల పని వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో నగరంలోకి ప్రవేశించడం అనివార్యం. ఇలా వచ్చిన వాహనాలకు ట్రాఫిక్ పోలీసుల గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరో జరిమానా విధించడానికి ఆస్కారం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగరంలో సంచరిస్తున్నాయి. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతితక్కువ కావడంతో ఈ పని చేస్తున్నాయి. ఈ తరహాకు చెందిన 10 వాహనాలు ఐదేళ్ల కాలంలో రూ.56,43,700 జరిమానాగా చెల్లించాయి. ఇలాంటి వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై 24 గంటలకు ఒక చలాన్ కాకుండా ప్రతి ప్రాంతంలోనూ ఓ చలాన్ విధించడానికి ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కమర్షియల్ వాహనాల విషయం ఇలా ఉంటే.. ద్విచక్ర వాహనచోదకులూ ‘రికార్డులు’ సృష్టిస్తున్నారు. టూ వీలర్ నడిపే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉంది. ఇలా చేయని వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది ద్విచక్ర వాహనాలపైనే ఐదేళ్లల్లో 2,236 ‘హెల్మెట్’ జరిమానాలు పడ్డాయి. ఇతర ఉల్లంఘనలతో కలిపి మొత్తం 2,818 చలాన్లకు సంబంధించి ఇవి చెల్లించిన జరిమానా మొత్తం రూ.4,01,370గా ఉంది. ఫైన్లను ఈ వాహనచోదకులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇక గూడ్స్, సాధారణ ఆటోలు చేసే ఉల్లంఘనల్లో అత్య«ధికం ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్‌లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ కేటగిరీలో ‘టాప్ టెన్’ వాహనాలపై ఐదేళ్లల్లో 6,516 చలాన్లు జారీ కాగా వీటిలో అత్యధికంగా 2,847 సరుకు ఓవర్ లోడింగ్వే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రయాణికులను ఎక్కువగా ఎక్కించుకోవడంపై 2,659, రాంగ్ పార్కింగ్‌పై 574 జారీ అయ్యాయి. వీటితో సహా పది వాహనాలు ఐదేళ్లల్లో రూ.8,12,160 జరిమానా చెల్లించాయి. (చదవండి: ఫార్ములా- ఈ పనులు రయ్ ..రయ్) -
‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో వాహనాల వేగానికి కళ్లెం వేసేలా పక్కాగా ప్రణాళిక అమలు చేయడానికి సిటీ ట్రాఫిక్ వింగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ–చలాన్లు విధించడం మొదలెట్టడానికి ముందు కొన్ని రోజుల పాటు వాహనచోదకులకు అవగాహన పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రవాణా శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డివైడర్లు ఉన్న మార్గాల్లో కార్లు గరిష్టంగా గంటకు 60 కి.మీ., మిగిలిన వాహనాలు 50 కి.మీ., అవి లేని రూట్లలో వీటి వేగాన్ని గంటకు 50 కి.మీ., 40 కి.మీ.గా నిర్దేశించారు. కాలనీల్లో ఏ వాహనమైనా గంటకు 30 కి.మీ. వేగమే. ప్రస్తుతం రహదారులపై ఉన్న సూచికల బోర్డుల్లో పాత వేగ పరిమితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇక పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించడానికి ప్రస్తుతం ఆరు స్పీడ్ లేజర్ గన్స్, 44 సీసీ కెమెరాలను అనుసంధానించిన సాఫ్ట్వేర్ ఉపకరిస్తున్నాయి. వీటిని మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి ఉండే సీసీ కెమెరాలు తమ ముందు ప్రయాణిస్తున్న వాహనం వేగాన్ని క్షణాల్లో గుర్తించగలుగుతాయి. పగలు, రాత్రి కూడా వేగాన్ని గుర్తించడానికి ఉపకరించే విధంగా సాఫ్ట్వేర్, కెమెరాలను అభివృద్ధి చేయనున్నారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలకు చలాన్లు జారీ చేసే ముందు పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. దీనికోసం సైనేజ్ బోర్డులు, సోషల్ మీడియా తదితరాలను వాడాలని నిర్ణయించారు. సుదీర్ఘ అధ్యయనం చేశాం నగరంలో వేగ పరిమితుల విధింపుపై సుదీర్ఘ అధ్యయనం చేశాం. చండీఘర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు సిటీల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశాం. చండీఘర్ మోడల్‌ను హైదరాబాద్‌కు అనువుగా మార్పుచేర్పులు చేసి సిఫార్సు చేశాం. ఉత్తర్వుల్లో ఉన్న వేగ పరిమితులు అన్ని రహదారులకు వర్తిస్తాయి. తాజా ఉత్తర్వులు అమలులో వచ్చినా ఓఆర్ఆర్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే మార్గాల్లో గతంలో సూచించిన వేగమే వర్తిస్తుంది. రింగ్ రోడ్ మీద లారీలు గంటకు 80 కి.మీ., కార్లు వంటివి గంటకు 100 కి.మీ., ఎక్స్‌ప్రెస్ వే మీద గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ (చదవండి: ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు ) -
Hyderabad: మీ వాహనంపై 3 చలాన్ల కంటే ఎక్కువ ఉన్నాయా.. ఇక అంతే!
సాక్షి, హైదరాబాద్: 46 రోజుల పాటు అందుబాటులో ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రిబేట్ అవకాశాన్ని మీరు వినియోగించుకోలేదా? మీ వాహనంపై మూడు కంటే ఎక్కువ చలాన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయా? అయితే ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడైనా సరే నడి రోడ్డు మీదే మీ వాహనాన్ని ఆపేస్తారు. అక్కడికక్కడే పెండింగ్ చలాన్ సొమ్ము చెల్లిస్తేనే వాహనాన్ని వదిలిపెడతారు. ఈమేరకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత నెల 1 నుంచి ఈనెల 15 తేదీ వరకూ అందించిన ట్రాఫిక్ చలాన్ల ఈ–లోక్ అదాలత్‌ను వినియోగించుకోని వాహనదారుల ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా పెండింగ్ చలాన్ల డిస్కౌంట్లను రాచకొండ పరిధిలో వాహనదారులు బాగానే వినియోగించుకున్నారు. 46 రోజుల ఆఫర్ సమయంలో 30,63,496 వాహనదారులు చలాన్లను క్లియర్ చేయగా.. వీటి ద్వారా రూ.31,67,79,643 పెండింగ్ సొమ్ము వసూలు అయింది. ప్రస్తుతం మల్కాజ్గిరి, ఎల్బీనగర్, భువనగిరి మూడు జోన్లలో కలిపి 10 లక్షల వాహనాల చలాన్లు, రూ.100 కోట్లు సొమ్ము పెండింగ్‌లో ఉన్నాయి. 3 చలాన్ల ఉన్న వాహనాలు లక్ష.. పెండింగ్ చలాన్లపై రిబేట్ తర్వాత రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు, అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ ఉన్న వాహనాలు లక్ష వరకున్నాయి. వీటికి సంబంధించి రూ.50 కోట్ల చలాన్ సొమ్ము పెండింగ్‌లో ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
E Challan: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు రిబేటుతో చెల్లించడానికి అవకాశం కల్పించిన ఈ– లోక్ అదాలత్ శుక్రవారంతో ముగిసింది. మార్చి 1న మొదలైన ఈ పథకం తొలుత ప్రకటించిన దాని ప్రకారం అదే నెల 31తో ముగియాల్సి ఉంది. వాహన చోదకుల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో 15 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ– చలాన్ల బకాయిలు రూ.1,200 కోట్ల ఉండగా.. 90 నుంచి 25 శాతం వరకు రిబేట్స్ ఇవ్వడంతో ఈ– లోక్ అదాలత్ ద్వారా మొత్తం రూ.250 కోట్ల వరకు వసూలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రూ.300 కోట్లకు చేరడంతో విజయవంతమైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి 11.59 గంటల వరకు సమయం ఉండటంతో మరికొంత జమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.92 కోట్ల వాహనచోదకులు వినియోగించుకున్నారు. అత్యధికంగా ద్విచక్ర వాహనాలవే.. చెల్లింపులు జరిగిన అత్యధిక చలాన్లు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే అని అధికారులు వివరిస్తున్నారు. మొత్తం పెండింగ్ చలాన్లలో 70 శాతానికి పైగా క్లియర్ అయినట్లు స్పష్టం చేస్తున్నారు. కొన్ని వాహనాలు చేతులు మారడం, మరికొన్ని వినియోగంలో లేకపోవడం తదితర కారణాలతో 10 నుంచి 15 శాతం చలాన్లు చెల్లింపులు జరగలేదని భావిస్తున్నారు. ఈ– లోక్ అదాలత్‌లో పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై సోమవారం నుంచి చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సర్వర్‌లో పెండింగ్ చలాన్లు జాబితాను అప్డేట్ చేస్తున్నారు. ఇది క్షేత్రస్థాయి అధికారుల వద్ద ఉండే ట్యాబ్‌లకు అనుసంధానించి ఉంటుంది. రహదారులపై తనిఖీలు నిర్వహించనున్న ప్రత్యేక బృందాలు జరిమానాల బకాయి ఉన్న వారిని గుర్తించి పట్టుకుంటాయి. వీళ్లు ఎంత మొత్తం పెండింగ్‌లో ఉండే అంతా చెల్లించేలా చర్యలు తీసుకోనున్నాయి. మరోపక్క 15 చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న వారి జాబితాలను ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా రూపొందిస్తున్నారు. వారిపై ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేయనున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చలాన్ల సంఖ్య, చెల్లించాల్సిన మొత్తం ఆధారంగా టాప్ వైలేటర్స్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్ నుంచి ఆయా వాహన చోదకుల చిరునామాలు సంగ్రహిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా ఏర్పాటయ్యే ప్రత్యేక బృందాలకు ఇవి అందించనున్నారు. ఆ టీమ్స్ సదరు ఉల్లంఘనుల ఇళ్లకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న జరిమానా చెల్లించేలా ప్రయత్నాలు చేస్తాయి. ఫోన్ నంబర్ల డేటాబేస్ సమకూరింది ఈ– లోక్ అదాలత్ నేపథ్యంలో భారీ సంఖ్యలో పెండింగ్ చలాన్లు వసూలు కావడంతో పాటు వాహన చోదకులకు సంబంధించిన ఫోన్ నంబర్లతో కూడిన డేటాబేస్ సమకూరింది. కొన్ని వాహనాలు అనేక మంది చేతులు మారినా... ఆర్టీఏ డేటాబేస్‌లో అప్డేట్ కాని నేపథ్యంలో వారి చిరునామాలు, కాంటాక్ట్ నంబర్లు అందుబాటులో ఉండేవి కాదు. ఫలితంగా అనేక ఈ– చలాన్లు వాహనాల మాజీ యజమానులకు చేరేవి. ఈ– లోక్ అదాలత్ చెల్లింపుల నేపథ్యంలో ఓటీపీ తప్పనిసరి చేయడంతో వాహనచోదకులు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు తమ ఫోన్ నంబర్లను పొందుపరిచారు. ఈ వివరాలు సంగ్రహించిన సర్వర్ ప్రత్యేక డేటాబేస్ రూపొందించింది. ఈ నేపథ్యంలోనే ఈ– చలాన్‌ను వాట్సాప్ ద్వారా పంపే ప్రక్రియ కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాం. ఇలా చేస్తే ప్రతి ఉల్లంఘనుడికి కచ్చితంగా ఈ– చలాన్ చేరుతుంది. – నగర ట్రాఫిక్ ఉన్నతాధికారి -
వాహనదారులకు అలర్ట్.. చలాన్లు ఇంకా కట్టలేదా..?
నిర్మల్ (చైన్‌గేట్) : కోవిడ్ ఆంక్షలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ–చలాన్ ద్వారా వేసిన జరిమానాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఈ నెల 31 వరకు ఉంది. ప్రభుత్వం ప్రకటించిన రాయితీకి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మార్చి1 నుంచి వర్తింపజేసిన రాయితీని జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 45 శాతం మందే వినియోగించుకున్నారు. మరో 55 శా తం మంది ఇంకా స్పందించడం లేదు. జిల్లా వ్యా ప్తంగా వేల సంఖ్యలో వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినందుకు పోలీసులు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధించారు. అ యితే ఈ చలాన్ చెల్లింపునకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. దీంతో గడిచిన 25 రోజుల్లో జరిమానా విధించిన వారిలో సగం మంది కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ట్రాఫిక్ పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు ముందుకు రాని పరిస్థితి. ఈ–చలాన్‌పై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఎస్సై దేవేందర్ 38 నెలల కాలంలో... పోలీసులు 38 నెలల కాలంలో 4,41,996 ఈ–చలానా కేసులు నమోదు చేయగా రూ.20 కోట్లకు పై గా వసూలు కావాల్సి ఉంది. కానీ వీరిలో 2,76,659 మంది మాత్రమే 25 రోజుల్లో రాయితీతో కూడిన రూ.7,32,70,585 పెండింగ్‌లో ఉన్న ఈ– చలాన్ జరిమానా చెల్లించారు. అంటే 50 శాతం మంది కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఫిబ్రవరిలోగా మరో 1,65,337 కేసులకు సంబంధించిన ఈ–చలనా డబ్బులు 13,30,40,955 చెల్లించాల్సి ఉంది. జరిమానాలు ఇలా.. కరోనా, లాక్ డౌన్ సమయంలో మాస్కులు లేకుండా తిరిగిన వారికి ఈ చలానా రూ.1000 విధించా రు. ఇందులో వారు కేవలం రూ.100 చెల్లిస్తే చాలు మిగిలిన రూ.900 మాఫీ వర్తిస్తుంది. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలకు 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా 50 శాతం మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు వాహనాలకు విధించిన చలానా చెల్లించేందుకు ఆన్లైన్లో తెలంగాణ శాఖకు చెందిన http:// echalian. tspolice.gov.in వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో వాహనం నంబరు ఎంటర్ చేయగానే పెండింగ్ చలానాల వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. పెండింగ్ చలాన్ల సంఖ్య, మొత్తం జరిమానాతో పాటు తాజా రాయితీ తర్వాత ఎంత చెల్లించాలనే వివరాలన్నీ వస్తాయి. పేమెంట్‌పై క్లిక్ చేయగానే గేట్వేలు కనిపిస్తాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. సద్వినియోగం చేసుకోండి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు సద్విని యోగం చేసుకోవాలి. ఈ నెల 31లోగా రాయితీ చలాన్లు చెల్లించకపోతే గడువు ముగిసిన తర్వాత పోలీసులు విధించిన మొత్తం జరిమానా చెల్లించా ల్సి ఉంటుంది. – రావుల దేవేందర్, ట్రాఫిక్ ఎస్సై -
చలాన్ క్లియరెన్స్‌కు భారీ స్పందన.. నిమిషానికి 1000
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు భారీ తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్‌కు వాహన చోదకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోలీసులు పెట్టిన వన్‌టైమ్ డిస్కౌంట్ ఆఫర్లకు భారీగా స్పందన లభిస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్లైన్లో ప్రారంభమైన ఈ విధానంలో మంగళవారం వరకు 1.29 కోట్ల చలాన్లు చెల్లించారు. 15 రోజుల వ్యవధిలో చలాన్ల రూపంలో రూ.132 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. వీటిలో 80 శాతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు సంబంధించినవే కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో 56 లక్షల చలాన్లకు సంబంధించి రూ.43 కోట్లు వసూలయ్యాయి. చదవండి:హైదరాబాద్: కీలక నిర్ణయం.. ఎక్కడపడితే అక్కడ.. ‘ఫొటోలు’ తీయరిక! మార్చి 31 వరకు ఈ ఆఫర్ ఉండనుంది. నిమిషానికి వాహనాదారులు 1000 చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారు. మొదటి రోజేజే 5.5 కోట్ల రూపాయలు ఫైన్లుచెల్లించారు. డిసెంబర్ 2021 వరకు 80 లక్షల పెండింగ్ చలాన్ లు ఈ–చలాన్ చెల్లింపుల కోసం ఉద్దేశించిన అధికారిక వెబ్సైట్లో కొన్ని మార్పులు చేశారు. తొలినాళ్లల్లో అక్కడ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు ఇంజన్ లేదా చాసిస్ నంబర్ ఎంటర్ చేయడం కచ్చితం చేశారు. అప్పుడే పెండింగ్ చలాన్లు కనిపించేవి. అయితే తాజాగా చేసిన మార్పులతో కేవలం వాహనం నంబర్‌తోనే ఎంటర్ కావచ్చు. ఫోన్ నంబర్ పొందుపరిచి, దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం మాత్రం తప్పనిసరి. ఈ–లోక్ అదాలత్ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జారీ అయిన ఈ–చలాన్లకు మాత్రమే ఈ రిబేటు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చలాన్లకు మాత్రం మొత్తం చెల్లించాల్సిందేనని వివరిస్తున్నారు. చదవండి: అలా చేస్తే కిషన్‌రెడ్డిని హైదరాబాద్ నడిబొడ్డున సత్కరిస్తాం: మంత్రి కేటీఆర్ -
ట్రాఫిక్ చీఫ్ కీలక నిర్ణయం! ఇకపై అటువంటి చలాన్లు ఉండవా?
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ఈ– చలాన్ల ప్రధాన ఉద్దేశం రోడ్డు భద్రత పెంచడంతో పాటు ప్రమాదాలు, మరణాలు నిరోధించడం. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ జారీ విధానం ‘రోగమొక చోటైతే.. మందొక చోట’ అన్న చందంగా ఉంది. ఈ లోపాలను పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే ఎక్కువగా కన్నేసి ఉంచనున్నారు. అక్కడి ఉల్లంఘనులనే ఫొటోలు తీసి ఈ–చలాన్ల పంపనున్నారు. త్వరలో ఈ విధానం ప్రారంభం కానుందని, సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. 90 శాతం హెల్మెట్ కేసులే.. లక్డీకాపూల్ అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉండే ప్రాంతం. ఇక్కడ సరాసరిన వాహనాల సరాసరి వేగం గంటలకు 15 కి.మీ కూడా మించదు. అలాంటి చోట హెల్మెట్ ధరించినా, ధరించకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇలాంటి చోట్లా రోజూ వందలు, వేల సంఖ్యలో ‘వితౌట్ హెల్మెట్’ కేసులు నమోదు చేస్తూ ఈ–చలాన్లు జారీ చేస్తుంటారు. ►ఏటా జారీ అవుతున్న ఈ– చలాన్లలో 90 శాతం హెల్మెట్ కేసులే ఉంటున్నాయి. ప్రస్తుతం జారీ అవుతున్న ఈ– చలాన్ విధానంలో ఇలాంటి లోపాలు అనేకం ఉన్నాయి. వీటిని గమనించిన రంగనాథ్ కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతోంది. ►దీని ప్రకారం ఏ ట్రాఫిక్ పోలీసు ఉల్లంఘనులకు నేరుగా చలాన్ విధించరు. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది తమ వద్ద ఉన్న కెమెరాలతో ఉల్లంఘనకు పాల్పడిన వాహనం ఫొటో తీస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్‌లోని వాహనం చిరునామా ఆధారంగా ఉల్లంఘనకు సంబంధించిన ఈ– చలాన్ పంపిస్తున్నారు. ఈ ఫొటోలు తీసే పోలీసులు జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో ఉంటున్నారు. బ్లాక్ స్పాట్లలోనే.. ఒకే చోట ఉంటూ తమ కంటికి కనిపించిన ప్రతి ఉల్లంఘనను ఫొటో తీస్తున్నారు. ఇకపై వీళ్లు తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్ స్పాట్స్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే గడిచిన అయిదేళ్ల గణాంకాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు పోలీసుస్టేషన్ల వారీగా ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పోలీసులు కూడా ఏ తరహా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ ఉల్లంఘనలకే ప్రాధాన్యం ఇస్తూ ఫొటోలు తీస్తారు. చదవండి: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111? 125 ఆధునిక ట్యాబ్‌ల కొనుగోలు.. ►ఈ విధానం అమలు కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు కొత్తగా 125 అత్యాధునిక ట్యాబ్స్ ఖరీదు చేశారు. కెమెరాల స్థానంలో వీటిని వినియోగిస్తూ, ప్రత్యేక యాప్ ద్వారా ఉల్లంఘనుల ఫొటోలు తీయనున్నారు. దీంతో ఆ ఫొటో తీసిన సమయం, తేదీలతో పాటు ప్రాంతం కూడా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా నమోదవుతుంది. క్షేత్రస్థాయి పోలీసులు ఒకే చోట ఉండి ఫొటోలు తీయకుండా నిఘా ఉంచేందుకు ఇది ఉపకరించనుంది. ►మరోపక్క ప్రస్తుతం ఈ– చలాన్ల బట్వాడాకు సంబంధించి పోలీసు విభాగం పోస్టల్ శాఖకు నిర్ణీత రుసుం చెల్లిస్తోంది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఒక్కో ఈ– చలాన్‌కు రూ.15 చొప్పున పోస్టల్ శాఖకు చేరుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఈ– లోక్ అదాలత్‌లో వచ్చిన సొమ్ము నుంచి ఇది చెల్లించాల్సిందే. ఈ ఖర్చు తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. -
తెలంగాణలో జోరందుకున్న పెండింగ్ చలానాల చెల్లింపులు
-
ట్యాంక్‌బండ్‌పై అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఓ చిన్నారిని బలి తీసుకోగా.. ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడటానికి కారణమైంది. ఈ ప్రాంతం ప్రమాదాలు ఎక్కువగా జరిగే మార్గాల జాబితాలో, పాదచారులకు రెడ్జోన్గానూ ఉంది. ట్యాంక్‌బండ్‌పై 2012 అక్టోబర్ 27 రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కేసు లోకాయుక్త సుమోటోగా స్వీకరించే వరకు వెళ్లింది. అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ ఈ రహదారి భద్రతపై ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పటికైనా శాశ్వత చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు ట్యాంక్‌బండ్‌కు బలయ్యే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. అత్యంత కీలక రహదారి... అంబేడ్కర్ విగ్రహం జంక్షన్ నుంచి వైస్రాయ్ చౌరస్తా వరకు దాదాపు 2.6 కిలోమీటర్ల పొడవున్న ట్యాంక్‌బండ్ పాఠశాల, వ్యాపార జోన్లలో ఏ ఒక్కదాని కిందికీ రాదు. అయితే జంట నగరాలకు అనుసంధానంగా ఉన్న దీని చుట్టూ కీలకమైన ప్రాంతాలు, కార్యాలయాలు ఉన్నాయి. సచివాలయం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, మింట్ కాంపౌండ్ తదితరాతో పాటు పర్యాటక స్థలాలైన ఐమాక్స్, పీవీ మార్గ్, ఎన్టీఆర్ మార్గ్, లుంబినీపార్క్, ఎన్టీఆర్ గార్డెన్ తదితరాలు విస్తరించి ఉన్నాయి. ఆద్యంతం పూర్తిస్థాయిలో సరాసరిన, ఎలాంటి టర్నింగ్స్ లేకుండా ఉండే రహదారి ట్యాంక్‌బండ్. రహదారి వెడల్పు తక్కువగా ఉండటం, ప్రతి ఏటా జరిగే నిమజ్జనాలు, ఇటీవల ప్రారంభమైన సన్డే–ఫన్డే తదితరాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై డివైడర్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. చదవండి: జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? ఈ–చలానాలతోనే సరా..? ► ఈ ప్రాంతంలో గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల మించిన వేగంతో వెళ్లకూడదనే నిబంధన ఉంది. ► దీన్ని ఉల్లంఘిచిన వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ లేజర్ గన్స్‌తో కాచుకుని ఉంటారు. ఈ ఉల్లంఘనులకు చలాన్లు విధిస్తారు. ► అయితే వీటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోందే తప్ప ట్యాంక్‌బండ్‌పై ప్రమాదాలు తగ్గే దాఖలాలు కనిపించట్లేదు. ► మరోపక్క ఎలాంటి సాంకేతిక నిపుణుల పోస్టులు లేని ట్రాఫిక్ పోలీసులు ఈ గరిష్ట వేగాన్ని ఎలా నిర్ధారించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ► ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ వింగ్ పేరుతో ఇంజనీర్లతో నిండిన జీహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి ప్రాంతాలను సాంకేతికంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాలి. వాటిలో ట్రాఫిక్ పోలీసుల్ని భాగస్వాముల్ని చేసి పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఈ విషయంలో ‘గ్రేటర్’ మాత్రం అవసరమైన స్థాయిలో స్పందించిన దాఖలాలు లేవు. ఇలా ఎందుకు చేయరు? ► ఇరుకుగా ఉండటంతో పాటు డివైడర్ లేని ట్యాంక్‌బండ్‌పై రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఈ మార్గాన్ని వన్‌వేగా ప్రకటించాలి. ► నిర్దేశిత సమయంలో అప్పర్ ట్యాంక్‌బండ్‌ను ఒక దిశలో వెళ్లే వాహనాలకు, లోయర్ ట్యాంక్‌బండ్‌ను మరో దిశ వెళ్లే వాహనాలు కేటాయించాలి. ‘సన్డే–ఫన్డే’ సమయంలో ట్యాంక్‌బండ్ మొత్తాన్ని మూసేస్తున్న విషయం గమనార్హం. ►ట్యాంక్‌బండ్‌పైకి ఎక్కిన పాదచారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకుండా ఆద్యంతం రెయిలింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడికి వచ్చే వారు చూడాల్సిన విగ్రహాలు, జలాలు కూడా రెండు వైపులానే ఉన్నాయి కాబట్టి వీటివల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. -
‘సాక్షి’ కథనానికి స్పందన.. తప్పుడు ట్రాఫిక్ చలాన్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రహదారులపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనచోదకులకు ఈ–చలాన్లు విధించడంలో జరుగుతున్న పొరపాట్లపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. ‘ఈ–చలాన్ మా ఇష్టం’ పేరుతో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో ఈ–చలాన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాహనచోదకులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. చదవండి: మూసీపై నిర్మించనున్న వంతెనలకు కొత్త అందాలు తక్షణ చర్యలకు ఉపక్రమించిన ట్రాఫిక్ పోలీసులు పొరపాటున జారీ అయిన చలాన్లలో కొన్నింటిని తొలగించారు. మిగిలిన వాటిపై పరిశీలన చేపట్టారు. ఇకపై ఈ–చలాన్ విధింపుల్లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీపీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా తమ వాహనంపై తమ తప్పు లేకుండా చలాన్ పడిందనో, డబుల్ చలాన్ వచ్చిందనో ఫిర్యాదు చేస్తే తక్షణం దానిని పరిష్కరించాలని కమిషనర్ స్పష్టం చేశారు. చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా.. -
ఈ-చలాన్: హైదరాబాదీలకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ‘వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు’ న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రమిది. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉల్లంఘనులకు చలాన్లు పడటమేమో కానీ.. ఇష్టారాజ్యంగా పంపిస్తున్న ఈ–చలాన్ల కారణంగా సాధారణ వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా వచి్చన తప్పుడు చలాన్ తీయించుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు, ప్రధాన కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిగరాల్సి వస్తోంది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండట్లేదని వాహనచోదకులు వాపోతున్నారు. నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంటే కారణం... ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులకు జరిమానా విధించడం మొత్తం నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానంలో సాగుతోంది. ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు చౌరస్తాలతో పాటు ప్రధాన రహదారులపై ఉండి ఉల్లంఘనులను పట్టుకునే వారు. వారికి చలాన్ విధించి అప్పటికప్పుడే వారి నుంచి జరిమానా మొత్తాన్ని వసూలు చేసే వారు. కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్గా పిలిచే ఈ విధానంలో వాహనచోదకులతో ఘర్షణలకు, అవినీతికి ఆస్కారం ఉంటోందని ట్రాఫిక్ అధికారులు భావించారు. దీంతో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ను పూర్తిస్థాయిలో అమలు చేశారు. ఈ విధానంలో రహదారులపై ఉంటే ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనుల ఫొటోలు తీస్తారు. ఇవి పోలీసుస్టేషన్ నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. సిబ్బంది వాహనం నంబర్ ఆధారంగా ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామాకు ఈ–చలాన్ పంపుతారు. చదవండి: హైదరాబాద్: ఒక బైక్‌పై 88 చలాన్లు.. కంగుతిన్న పోలీసులు ఈ ఏడాది జూన్ 16న టీఎస్07ఈకే4800 నంబర్ కలిగిన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసులు రాంగ్ పార్కింగ్ ఇన్ క్యారేజ్ వే అంటూ ఈ–చలాన్ విధించారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ లిమిట్స్‌లో ఉదయం 11.33 గంటలకు, సాయంత్రం 4.08 గంటలకు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు చలాన్లు విధిస్తూ ఎవిడెన్స్‌గా రెండు ఫొటోలు పొందుపరిచారు. అయితే ఆ రెండూ ఒకే సందర్భంలో తీసినవి కావడం గమనార్హం. దీనికితోడు సాయంత్రం 4 గంటల సమయంలో సదరు వాహనచోదకుడు బంజారాహిల్స్‌లో తాను విధులు నిర్వర్తించే కార్యాలయంలో ఉండటం కొసమెరుపు. కనిపించక... కన్ఫ్యూజన్తో... ఇలా పోస్టు ద్వారా, ఎస్సెమ్మెస్ రూపంలో ఈ–చలాన్ అందుకునే ఉల్లంఘనుడు వానిటి చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో జరిగే పొరపాట్ల వల్లే ఈ తప్పుడు చలాన్లు విధింపు జరుగుతోందని తెలుస్తోంది. అక్కడ ఉండే సిబ్బందికి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ నుంచి వచ్చిన ఫొటోలోని వాహనం నంబర్ కొన్ని సందర్భాల్లో సరిగ్గా కనిపించట్లేదు. దీంతో వాళ్లే ఓ వాహనం నంబర్ ఊహించుకుని ఆ ఈ–చలాన్ విధించేస్తున్నారు. ఒక్కోసారి వచ్చిన ఫొటోనే మరోసారి వస్తోంది. దీన్ని పరిశీలించని సిబ్బంది రెండోసారీ చలాన్ వేసేస్తున్నారు. పోలీసుస్టేషన్ల పరిధులు, అవి ఉండే ప్రాంతాలపై అవగాహన లేని సిబ్బందో, కొత్తవారో ఈ ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తుంటే తప్పుడు చలాన్లు వెళ్తున్నాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానూ ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. చదవండి: ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్ కాళ్లరిగేలా తిరగాల్సిందే... ఇలాంటి పొరపాట్లకు తావుంటుందని అనుమానించిన ఉన్నతాధికారులు ఈ–చలాన్లు కనిపించే అధికారిక వెబ్సైట్లోనే ‘రిపోర్ట్ అజ్’ను చేర్చారు. ఎవరికైనా ఇలాంటి తప్పుడు, పొరపాటు చలాన్లు వస్తే దాని ద్వారానే ట్రాఫిక్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఇలా ఫిర్యాదు చేసినప్పటికీ ట్రాఫిక్ విభాగం నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. నెలల తరబడి వేచి చూసినా ఫలితం శూన్యమని, ఈ లోపు రహదారిపై ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తే పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ కట్టమంటున్నారని వాహనచోదకులు వాపోతున్నారు. ఈ తప్పుడు చలాన్లపై ఫిర్యాదు చేయడానికి స్థానిక ట్రాఫిక్ పోలీసుస్టేషన్లకు వెళ్లే ప్రధాన కార్యాలయానికి వెళ్లమని చెప్తున్నారని.. అక్కడకు వెళ్తే ఠాణాకు వెళ్లి సరిచూసుకోవాలని సూచిస్తూ కాళ్లరిగేలా తిప్పుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఎంత మొత్తుకున్నా వారికి నిరాశే మిగులుతోంది తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు. ఠాణా పరిధినే మార్చేశారు ఈ ఏడాది ఆగస్టు 24న టీఎస్11ఈబీ9776 నంబర్ కలిగిన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసులు రూ.1000 ఈ–చలాన్ విధించారు. ఖిల్వత్ సమీపంలోని రాజేష్ మెడికల్ హాల్ వద్ద తీసిన ఫొటో పొందుపరుస్తూ వాహనచోదకుడు హెల్మెట్ ధరించని కారణంగా చలాన్ వేసినట్లు అందులో పేర్కొన్నారు. అయితే సౌత్‌జోన్ పరిధిలోని పాతబస్తీలో ఉన్న రాజేష్ మెడికల్ హాల్‌ను ట్రాఫిక్ పోలీసులు నార్త్‌జోన్‌లోని గోపాలపురం ఠాణాకు లిమిట్స్‌కు ‘మార్చేశారు’. అంతే కాదు... ఎవిడెన్స్‌గా ట్రాఫిక్ పోలీసులు పొందుపరిచిన ఫొటోలో వెనుక కూర్చున్న వాళ్లు హెల్మెట్ ధరించలేదు. దీనికి పిలియన్ రైడర్ హెల్మెట్ ధరించలేదని చలాన్ విధించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చ్ 9న టీఎస్10 ఈకే6850 నంబర్ కలిగిన ద్విచక్ర వాహనానికి ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ జంపింగ్ అంటూ రూ.1000 ఈ–చలాన్ విధించారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని హోలీ ఫ్యామిలీ చౌరస్తా వద్ద ఈ ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొంటూ ఓ ఫొటోను ఎవిడెన్స్‌గా పొందుపరిచారు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి తాను వెళ్లలేదంటూ వాహనచోదకురాలు స్పష్టం చేస్తున్నారు. ఈ ఫొటోను ఎంత పరికించి చూసినా, ఏ స్థాయిలో పరిశీలించినా వాహనం నంబర్ కనిపించకపోవడం గమనార్హం. -
లాక్డౌన్ ఉల్లంఘనులకు ‘తెలంగాణ’ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలకు విరు ద్ధంగా బయటికి వచ్చి.. సీజ్ అయిన వాహనాల విడుదలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జరిమానాలు చెల్లించిన వారి వాహనాలను విడుదల చేయాలని అన్ని ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం నుంచి సోమవారం సర్క్యు లర్లు వెళ్లాయి. దీంతో పోలీసులు సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లేందుకు వాహనదారులకు వీలు కలిగింది. ఈ–పెట్టీ, ఈ–చలానాల జరిమానాలను చెల్లించి వాహనాలను తీసుకెళ్లవచ్చు. తీవ్రమైన వాటికి మాత్రం న్యాయస్థానం గడప తొక్కాల్సిందే. కరోనా విజృంభణతో మే నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘ నలకు పోలీసులు ఎపిడమిక్ యాక్ట్ సెక్షన్ ఐపీసీ 188 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఉల్లంఘనలపై వారి సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపు తున్నారు. అందులో జరిమానాలను ఈ–చలానా, ఈ–పెట్టీ కేసుల కింద పోలీసులే విధిస్తే.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చెల్లించి విడిపించుకోవచ్చు. చెల్లింపు ఇలా.. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి సెల్‌ఫోన్‌కు సందేశం వస్తుంది. అందులో ఉల్లంఘనలకు జరిమానా ఎలా చెల్లించాలో కూడా పొందుపరిచారు. టీ–యాప్, టీ–వ్యాలెట్, ఈ సేవ/మీసేవ/పేటీఎం/టీఎస్ఆన్లైన్ లేదా https://echalan.tspolice.gov.inలో చెల్లించాలి. కోర్టుకు వెళితే ఇలా.. ఈ మొత్తంలో కొన్ని తీవ్రమైన కేసులను పోలీసులు కోర్టుకు పంపుతున్నారు. అలాంటివారు మాత్రం నేరుగా కోర్టుకు వెళ్లి అక్కడ జరిమానా చెల్లించాలి. లేకపోతే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం.. ఆ వ్యక్తిపై పోలీసులు చార్జీషీట్ దాఖలు చేస్తారు. దాని ఆధారంగా కోర్టు అతనికి జైలుశిక్ష ఖరారు చేస్తుంది. లాక్డౌన్ ఎత్తివేసినా.. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు ఉంటాయని పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ఎస్పీ, కమిషనరేట్ కార్యాలయాలకు ఆదేశాలు అం దాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన దరిమిలా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా పూర్తిగా తొలగిపోని కారణంగా ఎపిడమిక్ యాక్ట్ కొనసాగు తుందని సోమవారం పోలీసు శాఖ స్పష్టం చేసింది. బహిరంగ, పనిచేసే ప్రాంతాల్లో మాస్కు విధిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని పునరుద్ఘాటించింది. పాటించనివారిపై ఎపిడమిక్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపింది. -
E Challan: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్
సాక్షి, హైదరాబాద్: మీ క్షేమం.. భద్రత కోసం నిబంధనలు పాటించండి అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా వాహనదారుల తీరులో ఏమాత్రం మార్పు ఉండడం లేదు. భారీగా జరిమానాలు విధిస్తున్నా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారికి అదే తీరులో పోలీసులు బుద్ధి చెబుతున్నారు. తాజాగా ముగ్గురు ఒకే వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుండడంతో పాటు సెల్‌ఫోన్ వినియోగిస్తూ టైటానిక్ సినిమాలో మాదిరి స్టిల్ ఇచ్చారు. ఇది చూసిన పోలీసులు వెంటనే కెమెరాకు పని చెప్పారు. ఆ తర్వాత రూ.3,600 జరిమానా వారికి పంపారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ముగ్గురు యువకులు పల్సర్‌పై వెళ్తున్నారు. మధ్యలో కూర్చున్న యువకుడు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ముందు చేతులు పెట్టి సెల్‌ఫోన్ చూపిస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌ను డ్రైవింగ్ చేస్తున్న యువకుడు పరిశీలిస్తున్నాడు. ఈ సీన్ అచ్చం టైటానిక్ సినిమాలో స్టిల్ మాదిరి కనిపించింది. ఈ విన్యాసం చూసిన పోలీసులు ఫొటో తీసి జరిమానా పంపించారు. పైగా వారు హెల్మెట్ కూడా ధరించలేదు. దీంతో అన్నీ కలిపి రూ.3,600 జరిమానా విధించారు. ఈ ఫొటోను సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. జరిమానాలు ఇలా.. హెల్మెట్ ధరించకపోవడం: రూ.100 బైక్‌కు అద్దాలు లేకపోవడం: రూ.100 బైక్‌పై ముగ్గురు ప్రయాణం: రూ.1,200 సెల్‌ఫోన్ డ్రైవింగ్: రూ.1,000 మాస్క్ సక్రమంగా ధరించకపోవడం: రూ.1,000 చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా.. రోడ్డు పై టైటానిక్ విన్యాసాలు. పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/kzMzoclLCJ — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 10, 2021 -
ఈ చలాన్‌తో దొరికిన ఆచూకీ
జహీరాబాద్ టౌన్: ఈ చలాన్ ద్వారా తప్పిపోయిన ఓ వ్యక్తి ఆచూకీ లభించింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. డీఎస్పీ శంకర్రాజు కథనం ప్రకారం.. హైదరాబాద్ మదీనాగూడకు చెందిన ముల్లపూడి సతీశ్ (35) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కాగా, లాక్డౌన్ సమయంలో మాస్కు లేకుండా ఏపీ10ఏయూ 9252 నంబర్ బైక్‌పై తిరుగుతున్న ఓ వ్యక్తిని జహీరాబాద్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అతని వద్ద బైక్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో జరిమానా విధించి ఈ చలాన్లో పొందుపరిచారు. ఈ వివరాలు రిజిస్టర్ ఫోన్ నంబర్‌కు మెసేజ్ ద్వారా వచ్చింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు తప్పిపోయిన సతీశ్.. జహీరాబాద్‌లో ఉన్నట్లు తెలుసున్నారు. వెంటనే డీఎస్పీ శంకర్‌రాజును కలిశారు. పట్టణంలో అమర్చిన కెమెరాల ఆధారంగా జహీరాబాద్ టౌన్ ఎస్సై వెంకటేశ్, కానిస్టేబుల్ హనీఫ్‌లు సతీశ్ ఆచూకీ కనుగొని బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సిరిసిల్లలో బైక్.. హైదరాబాద్‌లో జరిమానా
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలో విద్యానగర్‌కు చెందిన యూసుఫ్ హుస్సేన్ మహ్మద్‌కు చెందిన ఏపీ 13 ఇ 2646 నంబర్ గల సీడీ 100 బైక్‌కి హైదరాబాద్‌లో పోలీసులు జరిమానా విధించారు. స్థానిక అవసరాలకు మినహా బయటకు తీసుకెళ్లే అవసరం లేదని వాపోతున్నాడు. ఈనెల 12న ఉదయం 11.07 గంటలకు ఇదే నంబర్ గల వాహనం కుషాయిగూడ పీఎస్ పరిధిలోని ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్డులో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు ఆన్లైన్ జరిమానా రూ.1135 విధించారు. సమాచారం యూసుఫ్ సెల్‌ఫోన్‌కు వచ్చింది. ఆన్లైన్లో వాహన ఫొటోను పరిశీలించగా అదిగ్లామర్ వాహనంగా నిర్ధారించారు. ఇలాంటి వారిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని యూసుఫ్ పోలీసులను కోరుతున్నాడు. -
రాంగ్ రైడింగ్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారుప్రాంతాల్లో వాహనాలకు సరైన నంబర్ ప్లేట్ లేకుండా చక్కర్లు కొడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలనియంత్రణతో పాటు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ల మోత నుంచి తప్పించుకునేందుకు ప్లేట్ నంబరింగ్ సరైనది లేకుండానే రోడ్లపై సవారీ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలకు ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సైడ్ మిర్రర్లు లేకుండా వాహనం నడపడం... ఇలా వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఈ–చలాన్ జారీ చేద్దామని చూస్తున్న పోలీసులకే మస్కా కొడుతున్నారు. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి వాహనదారుల ఉల్లంఘనుల భరతం పడుతున్నారు. ఇలా నేరుగానే ప్లేట్ నంబర్ సరిగాలేని వాహనాలను పట్టుకొని వారిని పోలీసులు అడుగుతుండడంతో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నామని ఒప్పుకుంటున్నారు. మరికొందరేమో నేరాలు చేస్తున్న వారు కూడా సరైన నంబర్ ప్లేట్లు లేని వాహనాలను వాడుతున్నట్టుగా గుర్తించారు. అయితే చాలా మంది ట్రాఫిక్ ఉల్లంఘనులు సీసీటీవీ కెమెరాలకు చిక్కుతున్నా సరైన నంబర్ ప్లేట్ లేకపోవడంతో చలాన్లు జారీ చేయనివి లక్షల్లోనే ఉన్నాయని తెలిసింది. గతేడాదితో పొలిస్తే పది వేలు ఎక్కువే... గతేడాది జనవరి నుంచి జూలై వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో చేసిన ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా 28,508 సరైన నంబర్ ప్లేట్ లేని వాహనదారులపై జరిమానా విధించారు. ఈ ఏడాది అదే ఏడు నెలల్లో ఏకంగా 38,896 వాహన ఉల్లంఘనుల భరతం పట్టారు. నాలుగు నంబర్లు ఉండాల్సిన వాహనానికి మూడు ఉండడం, ఒకవేళ నంబర్లు సరిగా ఉన్న నంబర్ ప్లేట్‌ను వంచడం, కొన్ని అంకెలను మార్చి నంబర్ ప్లేట్ ఉపయోగించడం తదితరాలు గుర్తించారు. వెంటనే సదరు వాహనాల పూర్తి వివరాలు సేకరించి సరైన నంబర్ ప్లేట్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. వీరు మళ్లీ అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
తప్పొకరిది.. ఫైన్ మరొకరికి!
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): హెల్మెట్ ధరించని వాహనదారుడు ఒకరైతే.. మరో వాహనదారుడికి పోలీసులు చలాన్ పంపించారు. ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని క్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 19న ఎల్లారెడ్డిపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీఎస్ 02 ఈఈ 4628 నంబరు వాహనంపై హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్న వ్యక్తిని ఫొటో తీశారు. అనంతరం అతన్ని పట్టుకొని, చలాన్ పంపుతామని, ఫైన్ కట్టాలని మందలించి వదిలేశారు. కానీ చలాన్‌ను నిందితుడి చిరునామాకు కాకుండా చందుర్తి మండలం మూడపల్లికి చెందిన గోలి శ్రీనివాస్‌కు పంపించారు. అందులో రూ.135 ఫైన్ చెల్లించాలని ఉంది. దానిపై ఉన్న ఫొటోను పరిశీలించి, అది తనది కాదని బాధితుడు తెలిపారు. తన వాహనం నంబర్ టీఎస్ 02 ఈఈ 4328 అని, పోలీసులు చలాన్ తప్పుగా పంపించారని వాపోయాడు. చలాన్‌ను రద్దు చేయాలని శ్రీనివాస్ ఎస్పీని కోరారు. -
6 నెలలు.. 7082 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు
సాక్షి, సిటీబ్యూరో: వాహనదారులు రోడ్లపై రయ్యుమంటూ దూసుకెళ్లడమే కాదు... డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్ రింగ్ కాగానే రిసీవ్ చేసుకొని మాట్లాడేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గడచిన ఆరు నెలల్లో 60కిపైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే వాహనదారులు నిర్లక్ష్యం ఏ తీరులో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 272 వద్ద సెల్‌ఫోన్ మాట్లాడుతున్న లారీడ్రైవర్ టర్నింగ్ చేసే సమయంలో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని గుద్దింది. లారీ ఆగకుండా ముందుకెళ్లడంతో టైర్ల కింద పడి ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం చోటు చేసుకోవడంతో సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయవద్దంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూనే... వివిధ ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులను జాగృతం చేస్తున్నారు. 6 నెలలు.. 7082 కేసులు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 7082 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. వివిధ ట్రాఫిక్ జంక్షన్లలో ఉన్న సీసీ టీవీ కెమెరాలతో పాటు ట్రాఫిక్ పోలీసులు క్లిక్‌మనిపించిన కెమెరాలతో సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ. వెయ్యి జరిమానాను ఈ–చలాన్ ద్వారా పంపిస్తున్నారు. ఇక పోలీసులు వివిధ సందర్భాల్లో నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ దొరికితే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. చార్జిషీట్ రూపొందించి కోర్టులో దాఖలు చేస్తున్నారు. ఆయా కోర్టులు వారికి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు జరిమానా విధిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రెండు రోజుల జైలు శిక్షను కూడా విధిస్తున్నాయి. ‘‘సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అది మీ ప్రాణాలకే కాదు ఎదుటివారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అత్యవరమైతే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముంది. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం’’ అని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. -
మాస్క్ పెట్టి మస్కా కొట్టాలని చూస్తే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచరిస్తున్న ఉల్లంఘనులు నానాటికీ రెచ్చిపోతున్నారు. నిఘా నేత్రాలకు తమ నెంబర్ ప్లేట్లు చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. మాస్క్‌లతో సహా కొన్నింటితో మూసేయడం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పురాకపోవడం, నేరగాళ్ళు సైతం ఇదే బాటపట్టడంతో ట్రాఫిక్ కాప్స్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్స్ ‘కవరింగ్’కు పాల్పడిన వారిని పట్టుకుని శాంతిభద్రతల విభాగానికి అప్పగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులే ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నారు. శుక్రవారం ఈ తరహా నేరం చేసి పంజగుట్టలో చిక్కిన చంద్రాయణగుట్ట యువకుడిపై చీటింగ్ కేసు నమోదైంది.(నెంబర్‌ప్లేట్ కనిపించకుండా ట్యాంపరింగ్..) ఈ–చలాన్ తప్పించుకోవడానికే... సిటీ ప్రధానంగా ఈ నెంబర్ ప్లేట్ల కవరింగ్ అనేక ఈ–చలాన్లను తప్పించుకోవడానికే చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నగరంలో పూర్తి స్థాయి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. అంటే... ఒకప్పుడు మాదిరిగా రహదారులపై ఉండే ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల్ని పట్టుకున్నప్పుడు వారికి స్పాట్లో చలాన్ విధించడం, జరిమానా వసూలు చేయడం జరగట్లేదు. కేవలం క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలను నెంబర్ ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా కమాండ్ అండ్ కంట్రోల్ సిబ్బంది ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో వాహనాల నెంబర్, దాని ఆధారంగా సేకరించే చిరునామా కీలకం. తమ వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లను వి విధ రకాలుగా కవర్ చేయడం, వంచేయడం, విరిచే యడం చేస్తున్న వాహనచోదకులు వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా తప్పించుకుంటున్నారు. దీన్ని అదునుగా భావించి కొందరు నేరగాళ్ళు సైతం నెంబర్ ప్లేట్లు లేకుండా, వాటిని కవర్ చేసి తమ పని పూర్తి చేసుకుపోతున్నారు. గత నెల 31న అబిడ్స్ పరిధిలో సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఓ స్నాచర్ ఈ తరహాలోనే నే రం చేశాడు. ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడాని కి పోలీసులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. వెనుక వాటి మూసివేతలే ఎక్కువ... వాహనాల నెంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెప్తున్నారు. రోడ్లపై ఈ తరహా నెంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా తేలికపాటి వాహనాలు తప్పించుకునిపోలేవు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆ తరహా చర్యల జోలికి వెళ్ళట్లేదని ట్రాఫిక్ కాప్స్ అంటున్నారు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నెంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఉల్లంఘనల్ని వాహనం వెనుక నుంచే ఫొటోలు తీస్తుండటంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇర్రెగ్యులర్/ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉల్లంఘనగా పిలిచే వీటిపై ఇప్పటికే ట్రాఫిక్ విభాగం అధికారులు అనేకసార్లు స్పెషల్‌డ్రైవ్స్ చేశారు. అయినప్పటికీ వాహనచోదకుల్లో పూర్తి స్థాయి మార్పు రాలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. మాస్క్ పెట్టి మస్కా కొట్టాలని... పాతబస్తీలోని చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ జహూరుద్దీన్ గురువారం తన ద్విచక్ర వాహనంపై పంజగుట్టకు వచ్చాడు. తన రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపింకుండా వెనుక నెంబర్ ప్లేట్‌కు ఫేస్ మాస్క్ తగిలించేసిన ఇతగాడు పంజగుట్ట వైపు నుంచి వీవీ స్టాట్యూ వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆపి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇతగాడు ఉద్దేశపూర్వకంగానే నెంబర్ ప్లేట్ కవర్ చేసినట్లు నిర్థారించి స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. ఆ అధికారులు ఇతడిపై మోసం ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎవరైనా నగరవాసులు ఇలాంటి నెంబర్ ప్లేట్లతో కూడిన వాహనాలను గుర్తిస్తే ఆ ఫొటోలు తీసి పోలీసు అధికారిక వాట్సాప్ నెంబర్ 9490616555కు పంపాలని కోరుతున్నారు. -
జరిమానా కాదు.. నేరుగా కోర్టుకే
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే పిలియన్ రైడర్‌కు హెల్మెట్ తప్పనిసరి అని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాలకు సైడ్ మిర్రర్లు ఉండాలంటూ విధిస్తున్న ఈ–చలాన్లతో వాహనదారుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. అదే సమయంలో అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లు, యువకుల భరతం పడుతున్నారు. స్నేహితులు, బంధువుల కార్లు, బైక్‌లను తీసుకుని రహదారులపై దూసుకెళ్తూ ఇతరుల వాహనాలను ఢీకొట్టే వారిని కట్టడి చేయడం.. ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 5156 వితవుట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులు, 425 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. (నెంబర్‌ప్లేట్ కనిపించకుండా ట్యాంపరింగ్..) ఊహించని విధంగా... సైబరాబాద్‌లో విస్తృ్తతంగా వాహనాలను నిలిపి తనిఖీలు చేస్తున్నారు. ఒకే బైక్‌పై ముగ్గురి ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిని పట్టుకునేందుకు వాహన చోదకులు ఊహించని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లైసెన్స్ లేకుండా బండి నడిపే వారిని ఆపి అక్కడికక్కడే స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా సైబరాబాద్‌లో జనవరి నుంచి ఇప్పటివరకు 5,156 కేసులు నమోదుచేశారు. మైనర్లైతే తల్లిదండ్రులను పిలిపించి వారితో మరోసారి వాహనాలను నడపనీయమంటూ లిఖితపూర్వకంగా రాయించుకుని వాహనం ఇస్తున్నారు. ఇలా 425 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదుచేశారు. మేజర్లయితే కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇతర ప్రక్రియలతోపాటు ... లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ దరఖాస్తు నంబరు చూపించాకే వాహనాన్ని ఇస్తున్నారు. జరిమానా కాదు...నేరుగా న్యాయస్థానానికే ద్విచక్ర వాహనం, కార్లు, ఇతర వాహనాలు నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే నేరుగా న్యాయస్థానానికి వెళ్లాల్సిందే. గతంలో లైసెన్స్ లేకుండా నడిపితే పోలీసులు జరిమానా విధించి వదిలేసేవారు. కొద్ది నెలల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకొంటున్నారు. మరుసటి రోజు ఉదయం సదరు చోదకుడు ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని న్యాయస్థానంలో హాజరు కావాలి. వాస్తవానికి మోటార్ వాహన చట్టంలో ఇవన్నీ ఉన్నా.. పోలీసులు, రవాణా శాఖ అధికారులు అవసరమైన సందర్భాల్లోనే వినియోగిస్తున్నారు. ప్రమాదాలు తగ్గుతున్నా.. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎవరినీ ఉపేక్షించడం లేదు. అందరూ లైసెన్సును తప్పక దగ్గర ఉంచుకోవాలని ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కూడళ్ల వద్ద సైన్ బోర్డుల్లోనూ ఈ విషయాన్ని వివరిస్తున్నారు. హెల్మెట్ లేని వారికి జరిమానాను విధిస్తున్నారు. ఉల్లంఘిస్తే కఠిన శిక్షలే.. ♦లైసెన్సు లేకుండా తొలిసారి పోలీసులకు చిక్కితే.. వాహనం స్వాధీనం చేసుకుంటారు. తర్వాతి రోజు న్యాయస్థానంలో వాహనదారుడిపై చార్జిషీట్ దాఖలు చేస్తారు. కోర్టు సమయం పూర్తయ్యేవరకూ న్యాయస్థానం ప్రాంగణంలోనే నిలబడి ఉండాలి. జరిమానా చెల్లించాలి. ♦ రెండోసారి పోలీసులకు దొరికితే.. 48 గంటలపాటు జైల్లో ఉంచుతారు. ♦మూడోసారి చిక్కితే రెండు అంతకంటే ఎక్కువ రోజుల జైలుశిక్షతోపాటుగా భారీగా జరిమానా చెల్లించాలి. దీని ప్రభావం విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లే అవకాశాలపై ఉంటుంది. ♦ ఐదు, అంతకంటే ఎక్కువసార్లు దొరికితే మాత్రం వారం రోజుల జైలుశిక్ష అనుభవించి.. భారీ జరిమానా చెల్లించక తప్పదు. పోలీసుల నివేదిక అధారంగా కోర్టులు జరిమానాను నిర్ణయిస్తాయి. -
నెంబర్‌ప్లేట్ కనిపించకుండా ట్యాంపరింగ్..
నల్లకుంట: ద్విచక్రవాహనాల నంబర్‌ను ట్యాంపరింగ్ చేసి, మోటారు వాహన యాక్ట్‌కు విరుద్ధంగా నంబర్ ప్లేట్స్ తొలగించిన నాలుగు ద్విచక్ర వాహనాలను నల్లకుంట పోలీసులు సీజ్, వాహన యమానులపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. అడ్మిన్ ఎస్ఐ వీరశేఖర్ తెలిపిన మేరకు.. శుక్రవారం మధ్యాహ్నం వారాసిగూడకు చెందిన సయ్యద్ షకార్ తన యాక్టివా ద్విచక్రవాహనం(టీఎస్10ఈపీ1283)పై అడిక్‌మెట్ రోడ్డులో వచ్చాడు. ఆ సమయంలో వాహన తనిఖీలు చేస్తున్న నల్లకుంట పోలీసులు వాహనాన్ని పరిశీలించగా వాహనానికి ముందు వెనకాల ఉన్న నంబర్ ప్లేట్స్ లేవు. (పిలియన్ రైడర్లకు హెల్మెట్.. మిర్రర్ మస్ట్!) ♦ చిలకల్గూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎం.అభిలాష్ తన యాక్టివా ద్విచక్రవాహనం (టీఎస్10ఈజీ9892)పై వచ్చాడు. అతని వాహనాన్ని నిలిపిచూడగా నంబర్ప్లేట్లో చివర ఉన్న 2 నెంబర్ కనిపించకుండా ట్యాంపరింగ్ (నంబర్ ప్లేట్ వంచాడు) చేశాడు. ♦ నేరేడ్మెట్కు చెందిన కూరగాయల వ్యాపారి జి.రాజు తన ద్విచక్రవాహనం (టీఎస్08జీహెచ్2998) పై వచ్చాడు. పోలీసులు తనిఖీ చేయగా వాహనం నంబర్ ప్లేట్‌పై ఉండే చివరి నంబర్ 8 కనిపించకుండా ట్యాంపరింగ్ చేశాడు. ♦ పార్శిగుట్టకు చెందిన ఎయిర్టెల్ ఉద్యోగి ఈర్పుల ప్రవీణ్ కుమార్ నంబర్ ప్లేట్స్ తొలగించిన యాక్టివా (టీఎస్07జీఈ0809)పై అడిక్‌మెట్ రోడ్డులో గల నెబ్రస్కా హోటల్ వద్దకు వచ్చాడు. అతని వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు ఆర్సీ ఆధారంగా ఆ వాహనంపై 14 ట్రాఫిక్ వయోలెన్స్‌కు సంబందించి (రూ. 1450) పెండింగ్ చలానాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్స్ తొలగించిన నాలుగు వాహనాలను సీజ్ చేసిన పోలీసులు -
పిలియన్ రైడర్లకు హెల్మెట్.. మిర్రర్ మస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: పై మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు పిలియన్ రైడర్లు (మహిళలు) హెల్మెట్ ధరించకపోవడంతోనే మృతి చెందారన్న వాదనకు బలం చేకూరుతోంది. ఎందుకంటే హెల్మెట్లు ధరించిన రైడర్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. పేట్‌బషీరాబాద్, మేడ్చల్‌లో జరిగిన రెండు ప్రమాదాల్లో హెల్మెట్లు ధరించకపోవడంతో పాటు ఆయా ద్విచక్ర వాహనాలకు సైడ్ మిర్రర్ లేకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ సైడ్‌మిర్రర్ ఉండి ఉంటే ఆయా భారీ వాహనాల కదలికలను గుర్తించి ఉంటే ఈ ప్రమాదాలు జరగకపోయి ఉండొచ్చన్న మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. గతంలోనూ ఇటువంటి ఘటనలు వందల సంఖ్యలో జరుగుతుండటాన్ని గమనించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనుల వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మార్చి నెల నుంచి హెల్మెట్ లేని పిలియన్ రైడర్లకు, సైడ్ మిర్రర్ లేని వాహనాలకు ఈ– చలాన్లు విధిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనైతే ఈ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై భారీగానే కొరడా ఝుళిపించారు. కేవలం మూడు నెలల్లోనే హెల్మెట్ లేని పిలియన్ రైడర్ కేసులు 4,59,280, మిర్రర్ లేని వాహనాలకు 1,49,884 చలాన్లు విధించారు. ఇలా మొత్తం 6,09,164 ఈ– చలాన్లు జారీ చేశారు. (డబుల్స్ వస్తే రూ.500 జరిమానా) ప్రజల భద్రత కోసమే.. ‘ఎంవీ చట్టం 129 సెక్షన్ ప్రకారం నాలుగేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారూ పిలియన్ రైడర్‌గా ఉంటేæ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ లేకుండా చాలా ద్విచక్ర వాహనాలు కనిపిస్తాయి. ఇది నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు. మలుపు తీసుకునేటప్పుడు, ఏదైనా వాహనాన్ని అధిగమించేటప్పుడు, రోడ్లపై సందులను మార్చేటప్పుడు వెనుక నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రైడర్ గమనించడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రహదారి భద్రత దృష్ట్యా కొన్ని నెలల నుంచి ఈ ఉల్లంఘనుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామ’ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. మార్చి నెల నుంచిఈ– చలాన్లు ఇలా.. హెల్మెట్ పిలియన్ రైడర్ కేసులు:4,59,280 మిర్రర్ కేసులు: 1,49,884 మొత్తం: 6,09,164 ఈ‘పేట్‌బషీరాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో బైక్ వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు (పిలియన్ రైడర్లు) మృతి చెందారు. భారీ వాహనాలు వెనక నుంచి వచ్చి ఢీకొట్టడంతో రెండు బైక్‌లపై ఉన్న ముగ్గురు పిలియన్ రైడర్ల తలలకు తీవ్రగాయాలై మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాల్లో బైక్ రైడ్ చేస్తున్నవారు హెల్మెట్లు ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.’ఈ ‘బాచుపల్లిలో భారీ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఓ బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో పిలియన్ రైడరైన మహిళ దుర్మరణం చెందారు. హెల్మెట్ ధరించిన రైడర్ ప్రాణాలతో బయటపడ్డారు’. -
డబుల్స్ వస్తే రూ.500 జరిమానా
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు పయనించేందుకు నిషేధం విధించారు. డబుల్స్‌తో చక్కర్లు కొడితే రూ. 500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో ఓవర్ లోడింగ్‌పై దృష్టి పెట్టనున్నారు. ఇక లాక్‌డౌన్‌కాలంలోనూ రాష్ట్రంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మార్చి 24న లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐదో విడతగా లాక్డౌన్ పొడిగింపు కొనసాగుతోంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల మినహా, తక్కిన అన్ని చోట్ల సడలింపులు ఎక్కువే. చెన్నైలో కేసులు అమాంతంగా పెరగుతుండడంతో టెన్షన్ తప్పడం లేదు. దీంతో ఇక్కడ ఆంక్షల్ని మరింత కఠినం చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. సడలింపు పుణ్యమాని, రోడ్ల మీద వాహనాలు కిక్కిరిసి ఉన్నాయి. డబుల్స్, త్రిబుల్స్ అంటూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాళ్లు ఎక్కువగానే ఉన్నారు. అలాగే, కార్లలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు, ఆటోల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు పయనించేందుకు అవకాశం కల్పించినా, అంతకన్నా ఎక్కువగానే అనేక చోట్ల ప్రయాణిస్తున్నారు. ఇలా ఎక్కువమందితో పయనిస్తున్న వాహనాల భరతం పట్టేందుకు గురువారం నుంచి పోలీసులు దూకుడు పెంచనున్నారు.ద్విచక్ర వాహనల్లో ఒకరు మాత్రమే పయనించాలన్న ఆంక్షను విధించారు. డబుల్స్‌తో ఎవరైనా రోడ్డెక్కిన పక్షంలో వారికి రూ. 500 జరిమానా విధించనున్నారు. అలాగే, కార్లు, ఆటోల్లో అధిక శాతం మంది ఉంటే, సంఖ్యను బట్టి తలా రూ. 500 జరిమానా వడ్డించబోతున్నారు. ఆటోలు, కార్లకు అనుమతి ఇచ్చినప్పుడు తమకు సైతం అనుమతి ఇవ్వాలని కోరుతూ షేర్ ఆటోడ్రైవర్లు మంగళవారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరిని కట్టడి చేయడం పోలీసులకు శ్రమగా మారింది. ప్రమాదాలు.. లాక్డౌన్ అమల్లోకి వచ్చినా, నిబంధనల్ని ఉల్లంఘించి రోడ్డెక్కిన వాళ్లు ఎక్కువే. వీరిపై కేసులు వి«ధించినా, జరిమానాల వడ్డన మోగించినా ఏమాత్రం తగ్గలేదు. అదే సమయంలో ఈ కాలంలోనూ ప్రమాదాలు తప్పలేదు. జవనరిలో రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 731 మంది, ఫిబ్రవరిలో 232 మంది, మార్చిలో 610 మంది మరణించారు. లాక్ అమల్లోకి వచ్చినానంతరం ఏప్రిల్‌లో 119 మంది, మేలో 143 మంది ప్రమాదాల్లో మరణించినట్టు గణాంకాలు తేల్చాయి. -
సీజ్ చేసిన వాహనాల విడుదలకు ప్రొసీజర్..
కర్నూలు/మంత్రాలయం రూరల్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న మాధవరం చెక్‌పోస్ట్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీజ్ చేసిన వాహనాలను ఎలా విడుదల చేయాలో రెండు రోజుల్లో తెలియజేస్తామన్నారు. ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాలను సీజ్ చేశారో యజమానులు అక్కడికే వెళ్లి అండర్‌టేకింగ్ రాసివ్వాల్సి ఉంటుందన్నారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఎస్ఈబీ పరిధిలో పనిచేస్తాయి మద్యం, నాటుసారా, ఇసుక అక్రమ రవాణా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలోసి 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు కూడా ఎస్ఈబీ పరిధిలో పనిచేస్తాయన్నారు. స్థానిక పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, ఎస్ఈబీ టీం కలిసి సమన్వయంతో అక్రమ రవాణా కట్టడికి కృషి చేస్తాయన్నారు. నాలుగు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా నాటుసారా స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. అక్రమ రవాణా కట్టడికి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక భద్రతతో పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి నేతృత్వంలో అక్రమ రవాణా కట్టడికి ఎస్ఈబీ ప్రత్యేకంగా పని చేస్తుందన్నారు. ఎస్ఈబీ పనితీరు గురించి అక్కడ విధులు నిర్వహిస్తున్నవారిని అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గతంతో పోలిస్తే జిల్లాలో కేసుల నయోదు సంఖ్య నామమాత్రమేనన్నారు. 14 కంటైన్మెంమెంట్ జోన్లలో 28 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో వాటిని గ్రీన్ జోన్లుగా మార్చామన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోనిలో మాత్రమే ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయన్నారు. 433 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారని గుర్తు చేశారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు జిల్లాలో ప్రభుత్వం జారీచేసిన ఆంక్షలు కొనసాగుతాయన్నారు. మంత్రాలయం సీఐ కృష్ణయ్య, ఎస్ఐ వేణుగోపాల్, ఎక్సైజ్ సీఐ రామ్మోహన్ తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. -
ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కేసులే..
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పెలియన్ రైడర్‌కు హెల్మెట్ లేకున్నా, వాహనాలకు సైడ్ మిర్రర్లు లేకున్నా ఈ–చలాన్లు జారీ చేస్తున్న వీరు.. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న లెర్నింగ్ లైసెన్స్(ఎల్ఎల్) వ్యక్తులపై దృష్టి సారించారు. ఎల్ఎల్ చేతికి వచ్చిన వెంటనే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ అన్నట్లుగా ఊహించుకుంటూ సరిగా డ్రైవింగ్ రాకుండానే రోడ్లెక్కి ప్రమాదాలకు కారణం అవుతున్నట్లుగా సైబరాబాద్ పోలీసుల అధ్యయనంతో తేలింది. వీరు చాలా వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో మోటారు వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా మూడు రోజులుగా ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం.. ప్రతిరోజూ వీరిపై నిఘా ఉంచి వారి ఎల్ఎల్ తీసుకొని నిబంధన ప్రకారం రద్దు కోసం ఆర్టీఏ అధికారులకు పంపిస్తాం. ‘లెర్నింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడూ అతడితో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వాహనం ముందు, వెనక భాగంలో ఎల్ అనే ప్లేట్‌ను కూడా పెట్టుకోవడం లేదు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కూడా వాడటం లేదు. నేర్చుకుందామని రోడ్లపైకి వచ్చి నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. ఇలా వివిధ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అందుకే లెర్నింగ్ లైసెన్స్ వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. – విజయ్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
సెల్‌ఫోన్‌తో క్లిక్.. ఫేస్బుక్లో పోస్ట్
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ వేళ ట్రాఫిక్ నియమ, నిబంధనలను అతిక్రమిస్తూ యథేచ్ఛగా నగర రహదారులు, కాలనీల్లో రయ్యురయ్యమంటూ దూసుకెళుతున్న వాహన చోదకులను సిటిజన్లు సెల్ఫోన్లతో క్లిక్‌మనిపిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు నెలవారీగా మూడు వేల వరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఉల్లంఘనల ఫొటోలను సైబరాబాద్ (10.309), రాచకొండ (703) ఫేస్బుక్, ట్విట్టర్లకు పోస్టు చేస్తే... గత 40 రోజుల నుంచి ఏకంగా 11,012 ఫిర్యాదులు రావడం పోలీసులకే ఆశ్చర్యం కలిగించింది. ఏ ప్రాంతం, ఏ సమయం తదితర వివరాలతో ఆ ఫొటోలను నిక్షిప్తం చేస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అది ఏ ఉల్లంఘన కింద వస్తుందో ఎంత జరిమానా విధించారనే విషయంతో కూడిన ఈ–చలానా ఐడీ వివరాల్ని సదరు ఫిర్యాదుదారుడికి పంపిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలుఅతిక్రమించేవారి ఫొటోలు తీసి మరీ పోస్టు చేసేస్తున్నారు. సెల్‌ఫోన్‌తో క్లిక్.. ఫేస్బుక్లో పోస్ట్ రహదారులపై ప్రయాణించేటప్పుడు మరో వాహనదారుడెవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే వెంటనే స్పందిస్తున్నారు. సెల్‌ఫోన్‌తో దానిని చిత్రీకరించి సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ విభాగానికి పంపుతున్నారు. ఇందుకు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్ని వినియోగిస్తున్నారు. చిత్రంతోపాటు ఉల్లంఘనకు సంబంధించిన వివరాల్ని నమోదు చేస్తే చాలు పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. ఫిర్యాదుదారులకు సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ ఈ–చలానా విభాగం నుంచి తిరుగు సమాధానం వెళ్తోంది. ఏ ఉల్లంఘనకు ఎంత జరిమానా విధించారనే విషయంతో కూడిన ఈ–చలానా ఐడీ వివరాల్ని తెలియజేస్తున్నారు. కేసు నమోదు చేసిన సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే అందుకు గల కారణాన్నీ వివరిస్తున్నారు. ఇలా చేస్తుండటం వల్ల తమ ఫిర్యాదుకు స్పందన ఉంటోందనే నమ్మకాన్ని వారికి కల్పిస్తున్నారు. దీనికితోడు స్వయంగా పోలీసులే ఉల్లంఘనలకు పాల్పడిన చిత్రాల్ని పోస్ట్ చేసినా జరిమానాలు విధిస్తున్నారు. లాక్డౌన్ వేళ సిటిజన్లు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసి ఆయా ట్రాఫిక్ విభాగాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
బండికి మిర్రర్ లేకపోతే ఈ–చలాన్
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నిత్యావసరాలతో పాటు వివిధ పనుల కోసం రోడ్డెక్కుతున్న వాహనదారులకు ‘సైడ్ మిర్రర్’లు వర్రీ కలిగిస్తున్నాయి. సైడ్‌మిర్రర్ లేనివాహనాలకు పోలీసులు ఈ–చలాన్ విధిస్తుండటమే ఈ ఆందోళనకు కారణం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో వాహనదారుల్లో కలవరం మొదలైంది. మోటార్ వెహికల్ యాక్ట్ 177 సెక్షన్ కింద సైడ్ మిర్రర్ లేకుంటే వాహనాలకు విధిస్తున్న ఈ–చలాన్‌పై నగరవాసుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైక్‌లకు సైడ్ మిర్రర్లు ఉండటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనాలు కనిపించి జాగ్రత్తగా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుందని, ఈ చలాన్లు విధించడం మంచిదే అని కొంతమంది పోలీసుల తీరును సమర్థిస్తున్నారు. తొలుత పూర్తిస్థాయిలో వాహనదారులకు అవగాహన కలిగించాకా ఈ–చలాన్లు విధిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మణికొండకు చెందిన వ్యాపారి రామకృష్ణ వ్యక్తం చేశారు. ప్రతిసారి రూ.100ల జరిమానా, రూ.35ల యూజర్ చార్జీలు కలిపి రూ.135లు చెల్లించాల్సి వస్తోందన్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించడంలో భాగంగానే సైడ్ మిర్రర్లకు ఈ–చలాన్లు విధిస్తున్నామని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. -
పది రోజుల్లో 10 వేలకు పైగా వెహికిల్స్ సీజ్
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉదయం వేళ కల్పించిన వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓపక్క చెక్‌పోస్టులు, మరోపక్క పికెట్ల వద్ద వాహనచోదకుల్ని ఆపి... ఆకారణంగా బయటకు వచ్చిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా గడిచిన పది రోజుల్లో 10 వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. మూడు పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ (టీసీసీసీ) సిబ్బంది వివిధ జంక్షన్లు, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఇలాంటి ఉల్లంఘనుల్ని గుర్తించి ఈ–చలాన్లు జారీ చేస్తుండగా క్షేత్రస్థాయి అధికారులు ఆయా వాహనాలను ఆపి స్వాధీనం చేసుకుంటున్నారు. లాక్డౌన్ గత నెల 23న అమలులోకి రాగా.. అప్పటి నుంచి శుక్రవారం వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు మొత్తం 11,012 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యధికం ద్విచక్ర వాహనాలు కావడంతో యువకులే అకారణంగా రోడ్ల పైకి వస్తున్నట్లు నిర్ధారణ అవుతోందని చెప్తున్నారు. మరోపక్క ఫిజికల్ డిస్టెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం లాక్డౌన్ ముగిసే వరకు ద్విచక్ర వాహనంపై ఒకరు, తేలికపాటి వాహనంగా పిలిచే కారులో గరిష్టంగా ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనేక మంది ఈ ఉత్తర్వుల్నీ ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు సంచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ తరహా వాహనచోదకులపై 9122 కేసులు నమోదు చేశారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులకు ఉల్లంఘించడం సహా వివిధ రకాలైన ఉల్లంఘనలకు పాల్పడిన వారినీ పోలీసులు నేరుగా, టీసీసీసీ ద్వారా గుర్తించి ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. ఇలా జారీ చేసిన కాంటాక్ట్, నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్ మెంట్ చలాన్ల సంఖ్య శుక్రవారం నాటికి మూడు పోలీసు కమిషనరేట్లలో కలిపి 333,932కు చేరింది. లాక్డౌన్ వైలేషన్స్‌కు పాల్పడిన వాహన చోదకులకు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 కింద జరిమానా విధిస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి రూ.600 జరిమానా పడుతోంది. అయితే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రం ఐపీసీలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రధానంగా సెక్షన్ 188 (ప్రభుత్వ ఆంక్షల్ని ఉల్లంఘించడం), సెక్షన్ 270 (ప్రాణాంతకమైన వ్యాధి మరొకరికి సోకేలా ప్రవర్తించడం), సెక్షన్ సెక్షన్ 271 (క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించడం) తదితరాల కింద రిజిస్టర్ చేస్తున్నారు. ఇలాంటి వారిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నా.. శాంతిభద్రతల విభాగానికి అప్పగిస్తున్నారు. ఈ తరహాకు చెందిన కేసులు ఇప్పటి వరకు మూడు కమిషనరేట్లలో కలిపి 328 నమోదు చేశారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత వీరికి నోటీసులు జారీ చేసి, న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేయనున్నారు. వీరిపై కోర్టులో నేరం నిరూపణ అయితే గరిష్టంగా రెండేళ్ల వరకు శిక్ష పడేందుకు ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా పోలీసులు ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తుంటారు. ప్రస్తుతం లాక్డౌన్ డేస్‌లో సాధారణ రోజులకంటే ఎక్కువగానే కేసులు నమోదు చేయడం గమనార్హం. -
పరిధి దాటితే పట్టేస్తుంది!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్డౌన్ ప్రభావంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి తాము నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి అవకావశం ఇచ్చింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఆధార్ కార్డులోని చిరునామాను ప్రామాణికంగా తీసుకుంటూ 3 కిమీ నిబంధన అమలు చేయాలని భావించారు. అయితే అనేక మంది ఆధార్ కార్డుల్లోని చిరునామాలు అప్డేట్ కాకపోవడంతో ఇది సాధ్యం కాలేదు. ఇలా నిర్దేశించిన పరిధిని దాటి తమ వాహనాల్లో సంచరించే వారికి నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) సిస్టమ్ ద్వారా చెక్ చెప్తున్నారు. ఈ టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) ద్వారా ట్రాఫిక్ కెమెరాలకు ఏర్పాటై ఉంది. సిటీలోని 250 జంక్షన్లలోని ట్రాఫిక్ కెమెరాల్లో ఇది అందుబాటులో ఉంది. ఏఎన్పీఆర్ సిస్టమ్ పూర్తి సాఫ్ట్వేర్ ఆధారితంగా పని చేసే పరిజ్ఞానం. దీన్ని బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు వినియోగించడానికి దీని ప్రోగ్రామింగ్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇలా పని చేస్తుంది, పట్టుకుంటుంది... ♦ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పగటి వేళల్లో బయటకు వచ్చిన వాళ్లు తాము నివసించే ప్రాంతం నుంచి గరిష్టంగా 3 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సంచరించాలి. ♦ దీని ప్రకారం చూస్తే ఆ వ్యక్తి రెండు ట్రాఫిక్ జంక్షన్లను దాటి వెళ్ళే అవసరం ఉండదు. ♦ ఓ వాహనం మొదటి జంక్షన్ మీదుగా ప్రయాణించినప్పుడు అక్కడ ఉండే ట్రాఫిక్ సీసీ కెమెరా ఏఎన్పీఆర్ టెక్నాలజీ ద్వారా దాని నెంబర్‌కు రీడ్ చేస్తుంది. ♦ అప్పటి నుంచి ఆ వాహనం ఆ రోజు మొత్తం ఎన్ని జంక్షన్లు దాటింది అనే అంశాన్నీ ఈ టెక్నాలజీతో కూడిన కెమెరాలు పరిశీలిస్తూనే ఉంటాయి. ♦ ఇలా నిర్దేశిత మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఆ వాహనం సంచరించిన వెంటనే తక్షణం ఆ విషయాన్ని గుర్తిస్తూ సర్వర్ ఈ–చలాన్ జనరేట్ చేస్తుంది. ♦ ఆర్టీఏ డేటాబేస్‌లో ఉన్న వాహన యజమాని చిరునామా ఆధారంగా ఈ ఈ–చలాన్ బట్వాడా అవుతుంది. వాహన యజమానికి ఎస్సెమ్మెస్ రూపంలోనూ సందేశం వస్తుంది. ♦ ఇలాంటి వైలేషన్స్‌కు పాల్పడిన వాహన చోదకులకు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 కింద జరిమానా విధిస్తున్నారు. ♦ దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి రూ.600 జరిమానా పడుతోంది. రెండోసారి కనిపిస్తే వాహనం సీజ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ఆకతాయి చేసే ఉల్లంఘన కారణంగా నిజంగా అవసరం ఉన్న వ్యక్తి ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. అలా అని ప్రతి వాహనచోదకుడినీ పోలీసులు ఆపి వారి ఆధార్‌లోని చిరునామా అప్డేట్ అయిందా? లేదా అనేది గుర్తించడం కష్టసాధ్యం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారిపై ఏఎన్పీఆర్ టెక్నాలజీ ద్వారా నిఘా ఉంచుతున్నాం. బుధవారం నుంచి మొదలైన ఈ విధానం ద్వారా రెండు రోజుల్లో 56 మందిని గుర్తించి చలాన్లు జారీ చేశాం. ఇప్పటి వరకు రెండోసారి ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వాళ్ళు లేరు. అలా ఎవరైనా కనిపిస్తే ఈ–చలాన్ జారీ చేయడంతో పాటు తక్షణం ఆ విషయాన్ని ఆ వాహనం సంచరిస్తున్న ప్రాంతంలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇస్తాం. వాళ్ళు వాహనం పట్టుకుని సీజ్ చేస్తారు. లాక్డౌన్ కాలం ముగిసిన తర్వాతే, ఈ–చలాన్లు చెల్లింపు క్లియర్ అయ్యాకే దాన్ని తిరిగి ఇస్తాం. – నగర ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారి -
ఉల్లంఘనులు 20,080
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఎందుకంటే కరోనా ప్రభావంతో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లకు మంగళం పాడడంతో రోడ్లపైనే ఉండి కెమెరాలు చేతిలో పట్టుకొని ట్రాఫిక్ ఉల్లంఘనులపై దృష్టి సారించారు. ఫలితంగా శనివారం ఒక్కరోజే 22,080 ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఈ చలాన్లు జారీ చేశారు. సాధారణ రోజుల్లో అయితే 12,000 నుంచి 13,000 వరకు ఉంటే శనివారం మాత్రం అమాంతంగా ఏడు వేలకుపైగా ఈ చలాన్లు పెరిగి 20,000 దాటి రికార్డును సృష్టించాయి. రాంగ్‌రూట్ డ్రైవింగ్‌లే అధికం మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్లలోని పది ట్రాఫిక్ ఠాణాల్లో రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కెమెరాలు చేతిలో పట్టుకొని విధులు నిర్వహించారు. ఇలా ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కిన ఉల్లంఘనల్లో అత్యధికంగా రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, వితవుట్ హెల్మెట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ లేకపోవడంతో ఫొటోలు క్లిక్ మనిపించి ఈ చలాన్ వెబ్సైట్లో ఫొటోతో సహా ఉల్లంఘన ప్రాంతాన్ని కూడా నిక్షిప్తం చేశారు. సంబంధిత వాహన యజమాని సెల్‌కు సైతం ఎస్ఎంఎస్లు పంపారు. అయితే ఎక్కడా వాహనాలను ఆపి తనిఖీ చేయక పోవడంతో డ్రైవింగ్ లైసెన్స్ లేని జరిమానాలు నమోదు కాలేదు. అయితే సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం 2,497 ఈ చలాన్లను జారీ చేసిందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉల్లంఘనుల్లో 70 శాతం వరకు ద్విచక్ర వాహనదారులే ఉన్నా రని అధికారులు తెలిపారు. -
ఉల్లంఘనలకు కేరాఫ్‌గా ‘రెంటల్’ బైక్స్
నగరంలో ‘రెంటల్ బైక్స్’ వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ వాహనాలపై షికార్లు కొడుతున్నారు. భారీగా ఉల్లంఘనలకూ పాల్పడుతున్నారు. యాప్‌ల ద్వారా బుకింగ్ చేయడం...బైకు వారి సొంతం కాకపోవడం...పోలీసుల భయం లేకపోవడం..జరిమానా కట్టే బాధ ఉండకపోవడంతో అద్దె బైకులపై మైనర్లూ హల్చల్ చేస్తున్నారు. ఇష్టంవచ్చినట్లు డ్రైవ్ చేస్తూ..దూసుకుపోతూ ఇతర వాహనచోదకులకు నరకం చూపిస్తున్నారు. మరోవైపు హల్చల్ రైడర్ల కారణంగా ఆయా రెంటల్ సంస్థలు నెలకు రూ.లక్షల్లో జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఇక ఈ వాహనాలు భద్రతా పరంగానూ సంక్షిష్టతను సృష్టించేఅవకాశం ఉందని నిపుణులువ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఒకచోట నుంచి మరోచోటుకు ప్రయాణించడానికి ఆటో, బస్సు, ట్యాక్సీ, ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో వీటికి తోడు రెంటల్ బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఎంత ఉపయోగం ఉంటోందో.. దానికి రెట్టింపు స్థాయిలో ఇబ్బందులు ఉంటున్నాయని ట్రాఫిక్ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కోకొల్లలుగా ఉల్లంఘనలకు పాల్పడటం ఒక ఎత్తయితే.. భద్రత పరంగానూ ఎన్నో సవాళ్ళు సృష్టించే ఆస్కారం ఉండటం మరో ఎత్తని వ్యాఖ్యానిస్తున్నారు. అంతా యాప్ ఆధారంగానే... సిటీలో కొన్ని సంస్థలకు చెందిన రెంటల్ బైక్స్ వేల సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటిని బుక్ చేసుకోవడం, వినియోగించడం అంతా స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకునే వాటి యాప్స్, బ్లూటూత్ పరిజ్ఞానం ఆధారంగా జరుగుతోంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రాథమికంగా డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు, దాని ఫొటోతో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన సెల్ఫీనీ యాప్‌లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు సరి చూసిన తర్వాతే ఆ యాప్ నిర్వాహకులు వాహనం బుక్ చేసుకోవడానికి, వినియోగించడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ వాహనాలను వినియోగించే వాహనచోదకుల సౌకర్యార్థం వాటి సీటు కింద డిక్కీల్లో హెల్మెట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. బుకింగ్‌ను అంగీకరించే ముందే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ వాడాలని, అధికారిక పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాన్ని పార్క్ చేయాలని సూచిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాక్టికల్‌గానే ఇబ్బందులు వస్తున్నాయి. ఆ మొబైల్ చేతిలో ఉండే చాలు... మోటారు వాహన చట్టం ప్రకారం మైనర్లకు వాహనం ఇవ్వడం, వాళ్ళు దాన్ని నడపటం నేరం. ఇలా చేస్తూ ఎవరైనా చిక్కితే ఆ మైనర్‌తో పాటు వాహన యజమానీ బాధ్యుడవుతాడు. ఇతడిని జువైనల్‌హోమ్‌కు అతడికి జైలుకు తరలించేందుకు ఆస్కారం ఉంది. గతంలో ఇలాంటి కేసులు నగరంలో వెలుగు చూశాయి. అయితే రెంటల్ బైక్స్ విషయానికి వచ్చేసరికి మైనర్లు వీటిని వాడకుండా కట్టడి చేయడానికి ఆస్కారం ఉండట్లేదు. అప్పటికే ఆయా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుని, రెంటల్ బైక్స్ వినియోగిస్తూ వారి మొబైల్ చేతిలో ఉండే చాలు... మైనర్లు సైతం ఈ బైక్స్ బుక్ చేసుకుని చక్కర్లు కొట్టేయచ్చు. ఓ వాహనాన్ని బుక్ చేసుకుంటున్న సమయంలో సదరు వినియోగదారులు యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్ యజమానేనా? వేరే వ్యక్తా? మైనరా? అనేది తెలుసుకునే పరిజ్ఞానం ఆయా సంస్థల వద్ద ఉండట్లేదు. ఈ విషయంలో మైనర్‌కు వాహనం ఇచ్చిన సంస్థది తప్పవుతుందా? లేక సదరు మైనర్ యాత్తో కూడిన మొబైల్ ఇచ్చిన వ్యక్తిది తప్పవుతుందా? అనేది పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎడాపెడా దూసుకుపోతూ ఫీట్లు... ఈ కారణంగానే అనేక మంది మైనర్లు సైతం ఈ రెంటల్ బైక్స్‌పై ఎడాపెడా దూసుకుపోతున్నారు. వీటిని వినియోగిస్తున్న మేజర్లు సైతం చేస్తున్న ఫీట్లు అన్నీఇన్నీ కావు. నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్ తదితర మార్గాల్లో ఈ రెంటల్ బైక్స్ రైడర్లు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ రెంటల్ బైక్ డిక్కీలో హెల్మెట్ ఉండాల్సి ఉన్నా.. అనేక వాటిలో మాయమయ్యాయి. దీంతో వీటిని బుక్ చేసుకున్న వినియోగదారులు హెల్మెట్లు లేకుండానే దూసుకుపోతున్నారు. దీనికి తోడు సొంత వాహనం కాకపోవడంతో అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగ్, అక్రమ పార్కింగ్, రద్దీ రోడ్లలోనూ వీటిని వదిలేయడం తదితర ఉల్లంఘ«నలకు ఈ వాహనాలు కేరాఫ్ అడ్రస్‌లుగా మారుతున్నాయి. రహదారుల్లో వీరు చేస్తున్న విన్యాసాల కారణంగా తమ పనులపై వెళ్ళే సాధారణ వాహనచోదకులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. వీరి వ్యవహారంపై ఫిర్యాదు చేయాలన్నా ఎవరి చెప్పాలో అర్థం కాక మిన్నకుండిపోతున్నారు. నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కావడంతో... ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పోలీసులు నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలు చేస్తున్నారు. వీటి ప్రకారం సాధారణంగా రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్‌లు వాహనచోదకుల్ని ఆపి చలాన్లు విధించరు. కేవలం పెండింగ్ చలాన్లు ఉన్న వాహనచోదకుల్ని గుర్తించడానికి, డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలకు మాత్రమే వాహనాలను ఆపుతున్నారు. మిగిలిన సందర్భాల్లో కేవలం ఉల్లంఘనుల ఫొటో తీసి ఈ–చలాన్ మాత్రమే పంపిస్తున్నారు. ఈ కారణంగానే రెంటల్ బైక్స్‌పై ఫీట్లు చేస్తున్న, ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు ఆపట్లేదు. కేవలం ఆయా ఉల్లంఘనల్ని ఫొటోలు తీసి ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామా ఆధారంగా సదరు బైక్స్‌ను నిర్వహిస్తున్న సంస్థలకు పంపిస్తున్నారు. ఆ నిర్వాహకులు జరిమానాలు రూ.లక్షల్లో చెల్లిస్తున్నా బైక్స్ వినియోగిస్తున్న ఉల్లంఘనులకు మాత్రం చెక్ పడట్లేదు. ఈ బైక్ యాప్స్‌తో కూడిన ఫోన్లు అసాంఘిక శక్తుల చేతిలో పడి, వాళ్ళు ఆ వాహనాలు బుక్ చేసుకుని వినియోగించగలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ‘విధిస్తున్నాం’ ఇటీవల కాలంలో నగరంలో పెరిగిపోయిన రెంటల్ బైక్స్ కారణంగా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వీటిని వినియోగిస్తున్న యువకులు, మైనర్లు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాల్లో అనునిత్యం ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికి నిబంధనల ప్రకారం ఈ–చలాన్లు విధిస్తున్నాం. ఇటీవలే ఓ సంస్థకు చెందిన ప్రతినిధులు నేరుగా వచ్చి రూ.3 లక్షల జరిమానాలు క్లియర్ చేసి వెళ్ళారు. క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల దృష్టికి తీవ్రమైన ఉల్లంఘనలు వస్తే వెంటనేవాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆయా సంస్థలకుసమాచారం ఇచ్చి అప్పగిస్తున్నారు. ఈ కేసుల్లోనూ జరిమానా విధిస్తున్నారు. ఈ రెంటల్ బైక్స్వినియోగిస్తున్న ఆయతాయిల కారణంగాసాధారణ వాహనచోదకులు ఇబ్బందులుఎదుర్కొవాల్సి వస్తోంది. – సిటీ ట్రాఫిక్ పోలీసులు -
‘ప్లేట్’ ఫిరాయించొద్దు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చోదకులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్‌లో మార్పు చేర్పులు చేయవద్దని కొత్వాల్ అంజనీకుమార్ బుధవారం ట్వీట్ చేశారు. సక్రమంగా లేని నంబర్ ప్లేట్లతో కూడిన వాహనాలను ఎక్కువగా నేరగాళ్లు వినియోగిస్తున్న ఆనవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ తరహా వాహనాలు వినియోగిస్తూ అనేక మంది దాదాపు 2 వేల స్నాచింగ్స్ చేశారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే నగరంలో వాహనాల నంబర్ ప్లేట్స్‌పై ప్రత్యేక డ్రైవ్స్ చేస్తున్నామని మంగళవారం ఒక్క రోజే 384 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ తరహా నంబర్ ప్లేట్లను గమనిస్తే 94906 16555కు వాట్సాప్ చేయాలని నగర వాసులకు కొత్వాల్ సూచించారు. (కెమెరాకు చిక్కితే చెక్ పడుద్ది) Improper number plate on Bike could be an indicator that the rider is an offender of snatching. We have records of 2000 plus offenders who use bike to commit chain/cell snatching . Yesterday we booked 384 cases against those using improper number plates. Pl send pic at 9490616555 — Anjani Kumar, IPS (@CPHydCity) March 11, 2020 -
ఒకే నంబర్‌తో రెండు బైక్‌లు..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): రోడ్డుపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే క్లిక్.. రాంగ్ పార్కింగ్ చేస్తే క్లిక్.. రికార్డులు లేకుండా వాహనం నడిపితే క్లిక్.. ఇలా క్లిక్ క్లిక్.క్లిక్ మనిపిస్తున్నారు మన పోలీసులు. అంత వరకూ బాగానే ఉంది. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే వెనుక నుంచి ఫొటోలు తీయడంలో మన పోలీసులు దిట్ట. అందులో సందేహమే లేదు. ఇక నేరుగా మేటర్లోకి వచ్చేద్దాం.. నగరంలోని ఆరిలోవ ప్రాంతానికి చెందిన దూళి ప్రభాకర్ అనే వ్యక్తికి పల్సర్ బైక్ ఉంది. దాని నెంబరు ఏపీ 31 డీజే 7499. ఇటీవల కాలంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు మద్దిలపాలెం, జగదాంబ జంక్షన్ వద్ద రెండు సార్లు ఫైన్ వేశారు. రూ.135 చొప్పున. ఇదిలా ఉండగా ఇదే నెంబరుతో భీమిలి నియోజకవర్గం తగరపువలసలో మరో వ్యక్తి సీడీ 100 వాహనాన్ని నడుపుతున్నాడు. దానిపై ఐదారు కేసులు నమోదు చేశారు. తగరపువలస మార్కెట్లో అడ్డదిడ్డంగా ఆ వాహనాన్ని నిలిపినందుకు, హెల్మ్‌ట్ లేకుండా వాహనం నడిపినందుకు ఆ ప్రాంత పోలీసులు ఇ–చలనాలు పంపారు. ఆ ఇ–చలానాలు నేరుగా ఒరిజినల్ వాహనదారుడు(పల్సర్ వాహన వ్యక్తి)కి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను రెండు సార్లే ఫైన్ కట్టాల్సి ఉండగా..ఆరేడు కేసులకు సంబంధించి ఫైన్ కట్టాల్సి ఉన్నట్టు ఇ–చలానాలు పంపడమేంటని ఒరిజనల్ ద్విచక్రవాహనదారుడు వాపోతున్నాడు. ఈ విషయమై ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని లబోదిబోమంటున్నాడు. ఆ వ్యక్తి ప్రమాదం చేస్తే.. కేసులు సంగతి పక్కనపెడితే..నా బండి నెంబరుతో తగరపువలస పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న ఆ వ్యక్తి ఎవరినైనా ఢీకొట్టినా..వాహనంతో గాయపరిచినా..ఆ కేసులు తనకు చుట్టుకుంటాయనే వచ్చేస్తాయన్న భయం పట్టుకుందని సాక్షి వద్ద వాపోయారు. పోలీసు పెద్దలు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి..తన బండి నెంబరుతో వాహనం నడుపుతున్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నాడు. తన బండి నెంబరుపై నమోదైన(నావి(జగదాంబ జంక్షన్, మద్దిలపాలెంలో నమోదైన వాటికే ఫైన్లు వసూలు చేయాలని విన్నవించుకుంటున్నాడు. ఒకే నంబర్‌తో రెండు వాహనాలు ఉన్నట్టు ఫొటోల్లో కనిపిస్తున్నా ఆ దిశగా పోలీసులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. నమోదైన కేసులివే.. ♦ సెప్టెంబర్ 12..2019న హెల్మెట్ లేకుండా ఫైన్ రూ.135 ♦ అక్టోబర్ 25, 2019న హెల్మెట్ లేకుండా తగరపువలస జాతీయ రహదారిపైన, మార్కెట్ వద్ద కేసు నమోదైంది ♦ నవంబర్ 29, 2019న తగరపువలస మార్కెట్ వద్ద రాంగ్ పార్కింగ్ చేస్తూ కేసు నమోదు ♦ జనవరి ఒకటి 2020న మద్దిలపాలెంలో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ(ఒరిజనల్ వాహనదారుడు) కేసు నమోదు ♦ జనవరి 28, 2020న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి తగరపువలసలో రాంగ్ పార్కింగ్ చేస్తూ కేసు నమోదు. -
కొత్తగా.. పక్కాగా..
ఈ–చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ అమలులో సమస్యలు, అక్రమాలకు చెక్ పెట్టాలని పోలీస్ బాస్ భాస్కర్ భూషణ్ నిర్ణయించారు. కాంటాక్ట్ లెస్ ఈ–చలాన్ అమలు చేయాలని, బాడీవార్న్ కెమెరాలు ధరించి డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ) పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసు అధికారులు, సిబ్బంది అమలుకు చర్యలు ప్రారంభించారు. నెల్లూరు(క్రైమ్): మోటార్‌వాహన చట్టాల అమలుకు పోలీసులు ఒకప్పుడు ప్రత్యక్షంగా జరిమానాలు విధించేవారు. వాహనాలు నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేకపోయినా అప్పుడుకప్పుడే జరిమానా విధించి నగదు వసూలు చేసేవారు. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ–చలాన్లు అమల్లోకి తీసుకువచ్చారు. జిల్లాలో 2017 నుంచి ఈ విధానం అమల్లో ఉంది. వాహనం రాంగ్ పార్కింగ్ చేసినా, సెల్‌ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, పత్రాల్లేని వారికి ఈ చలాన్ విధిస్తున్నారు. వివరాలు వాహన యజమానికి ఎస్ఎంఎస్ రూపంలో పంపుతున్నారు. దీంతో వాహనదారులు ఏపీ ఆన్లైన్, మీ–సేవ తదితరాల్లో జరిమానా చెల్లిస్తున్నారు. ఇబ్బందుల కారణంగా.. ఈ–చలాన్ అమలు సందర్భంలో పోలీసు అధికారులు కొందరు వాహనదారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ఎందుకు ఫైన్ విధించారంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీస్ సిబ్బంది వారికి చెప్పే ప్రయత్నం చేసినా వినడంలేదు. మరికొందరు తమకున్న పలుకుబడిని ఉపయోగించి వాహనాలు విడిచిపెట్టాలని, ఈ–చలాన్‌ను తీసివేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొందరు పోలీసులు అవినీతికి పాల్పడుతూ అందినకాడికి జేబులు నింపుకొంటున్నారు. వాహనదారులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చలాన్ల పేరిట గంటల తరబడి నిలిపివేస్తున్నారు. వీటన్నింటిని పరిశీలించిన ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ–చలాన్ పే రిట వాహనాలను నిలుపరాదని, కాంటాక్ట్ లెస్ ఈ–చలాన్ సిస్టంను అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వాహనదారుడు నిబంధనలు ఉల్లంఘించిన వైనాన్ని ఫొటో తీసి ఈ–చలాన్ పంపాలని సూచించారు. దీంతో పోలీస్ అధికారులు, సిబ్బంది ఆ దిశగా చర్యలు చేపట్టారు. బాడీవార్న్ కెమెరాలు ధరించి.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని భావించి వాటిని కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్‌ను విస్తృతంగా నిర్వహిస్తోంది. జిల్లాలో ప్రతిరోజూ డీడీ నిర్వహిస్తూ మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పరీక్షల్లో అధికశాతం మద్యం సేవించినట్లుగా నిర్ధారణ అయితే కోర్టు వారికి జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తోంది. నామమాత్రంగా ఆల్కాహాల్ శాతం ఉంటే జరిమానా వేస్తున్నారు. ఈ ప్రక్రియ కొందరు ఖాకీలకు కల్పతరువుగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులను బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. రూ.వేలల్లో నగదు తీసుకుని కేసుల్లేకుండా పంపివేస్తున్నారు. కొందరు సిబ్బంది చేతివాటంపై ఎస్పీకి ఫిర్యాదులు అందడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మార్పులు తీసుకువస్తున్నారు. ఇకపై పరీక్షల్లో పాల్గొనే సిబ్బంది విధిగా బాడీవార్న్ కెమెరాలు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల ప్రారంభం నుంచి ముగిసే వరకు కెమెరా ధరించడం ద్వారా ప్రతి విషయం రికార్డవుతుంది. కమాండ్ కంట్రోల్ నుంచి లైవ్ చూడవచ్చు. దీని ద్వారా అవినీతిని నియంత్రిచవచ్చని, మద్యం సేవించి పరీక్షల్లో పట్టుబడిన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేకుండా పోతుందని పోలీస్ బాస్ భావిస్తున్నారు. త్వరలో దీనిని అమల్లోకి తీసుకురానున్నారు. -
స్పీడ్ లిమిట్‌లోనే ఉన్నా... భారీగా చలాన్లు..!
న్యూఢిల్లీ : అనుమతించిన స్పీడ్‌లోనే వాహనాలు ప్రయాణించినప్పటికీ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధించారు. వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వేసిన చలాన్లను విత్‌డ్రా చేసేందుకు నిర్ణయించారు. వివరాలు.. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న 24వ జాతీయ రహదారిపై ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో దాదాపు ఒకటిన్నర లక్షల చలాన్లు విధించారు. వీటిలో అధిక భాగం ఓవర్‌స్పీడ్‌కు సంబంధించినవే. అయితే, ఉన్నఫళంగా చలాన్లు విత్‌డ్రా చేస్తామనడానికి కారణాలేంటనే ప్రశ్నకు ట్రాఫిక్ ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. జాతీయ రహదారులపై గంటకు 70 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించాలి. ఈ మేరకు ప్రజా పనుల విభాగం వేగం 70 దాటితే శిక్షార్హులు అనే బోర్డులు కూడా పెట్టాయి. అయితే, 24వ జాతీయ రహదారిపై నిజాముద్దీన్ బ్రిడ్జి, ఘాజీపూర్ మధ్య 60 కి.మీ వేగంతో వెళ్లిన వాహనాలకు సైతం చలాన్లు విధించారు. దాంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే చలాన్లు వెనక్కు తీసుకుని ఉండొచ్చు’ అని అన్నారు. ఇదిలాఉండగా.. ఓవర్‌స్పీడ్ చలాన్లను ఇప్పటికే చాలామంది చెల్లించారని.. మరి ఆ సొమ్మునంతా వారికి తిరిగి ఇస్తారా అనే ప్రశ్నకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల నుంచి సమాధానం కరువైంది. అక్రమంగా ఫైన్లు వేయడంతో కోర్టుకు వెళ్తామన్న పలువురి హెచ్చరికల నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక విమర్శల నుంచి తప్పించుకోవడానకి 60 కి.మీ వేగం దాటితే శిక్షార్హులు అనే సూచిక బోర్డులు పెట్టాలని ట్రాఫిక్ అధికారులు ప్రజా పనుల విభాగాన్ని కోరడం గమనార్హం. -
‘అందుకే కారులో హెల్మెట్ పెట్టుకుంటున్నా’
లక్నో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు భారీ జరిమానాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక తప్పిదాల కారణంగా నిబంధనలు పాటించిన వారికి సైతం ట్రాఫిక్ పోలీసులు చలానా విధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన పీయూష్ వర్ష్నే అనే వ్యక్తికి ఈ-చలాన్ ద్వారా రూ. 500 జరిమానా విధించారు. అయితే తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ విధమైన చలాన్ రావడంతో అతడు కంగుతిన్నాడు. ఇక అప్పటి నుంచి కారులో కూడా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్నాడు. ఈ విషయం గురించి పీయూష్ మాట్లాడుతూ...‘అసలే పెరిగిన జరిమానాలతో భయంభయంగా గడుపుతున్నాం. మళ్లీ చలాన్ వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే కారులో వెళ్తున్నపుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నాను. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా నా కారు నంబరు పేరిట గతంలో చలానా వచ్చింది. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నా’ అని పేర్కొన్నాడు. కాగా ఈ విషయంపై స్పందించిన ట్రాఫిక్ ఎస్పీ.....‘డేటా తప్పిదాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కారు నంబరు ఆధారంగా చలాన్‌ను వెరిఫై చేసి ఒకవేళ నిజంగా హెల్మెట్ లేని కారణంగానే చలాన్ వెళ్లిందని తేలితే దానిని రద్దు చేస్తాం. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడతాం’ అని వివరణ ఇచ్చారు. కాగా భారీ జరిమానాల కారణంగా పలువురు వాహనదారులు మోటార్ వాహన సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. చదవండి: ట్రాఫిక్ జరిమానాల ద్వారా రూ.72 లక్షలు -
ఒక్క నెల.. 4.8 కోట్లు..
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు.. ఖాళీగా కనిపిస్తే చాలు వాహనదారులు రయ్యిమంటూ దూసుకుపోతు న్నారు. జామ్.. జామ్.. అంటూ సాగిపోతున్నారు. కానీ రెండు మూడ్రోజులకు ఈ–చలాన్ వచ్చి చుక్కలు కనిపించేలా చేస్తుంది. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 158 కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నవారిని లేజర్‌గన్ స్పీడ్ కెమెరాల ద్వారా క్లిక్‌మనిపించి ఇంటికే చలాన్లు పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు చలాన్ల జారీని పరిశీలిస్తే.. ప్రతి నెలా రూ.4.8 కోట్లు ట్రాఫిక్ పోలీసు విభాగానికి వాహన దారులు చెల్లిస్తున్నారు. ఇరు కమిషనరేట్ల పోలీసులు కలసి తొమ్మిది లేజర్‌గన్ కెమెరాల ద్వారా వాహనదారుల అధిక వేగాన్ని నిర్ధారిస్తున్నారు. వేగం తగ్గించినా మారని తీరు... ఓఆర్ఆర్పై వాహనాల గరిష్ట వేగాన్ని 100 కిలో మీటర్లకు తగ్గించినా వాహనదారుల్లో స్పీడ్ జోష్ మాత్రం తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు తగ్గడంలేదు. ఈ ఏడాది జరిగిన 82 రోడ్డు ప్రమాదాల్లో 33 మంది మృతి చెందారు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. డ్రంకన్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా... ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం కొన్ని సందర్భాల్లో డ్రంకన్ డ్రైవ్ అని తేలడంతో సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 1,836 వరకు కేసులు నమోదు చేశారు. వీరిలో 430 మందికి ఒకటి నుంచి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడింది. ఇతరులకు న్యాయస్థానం రూ.45 లక్షల వరకు జరిమానా విధించింది. అటు లేజర్ గన్ కెమరాలు, ఇటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో ఓఆర్ఆర్ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చడంపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెబుతున్నారు. ఆటోమేటిక్‌తో ఈ–చలాన్.. ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు తాము ఎంచుకున్న ప్రాంతాల్లో లేజర్ గన్ కెమెరాతో వాహనదారుల స్పీడ్‌ను గమనిస్తున్నారు. ఇకపై ఈ వెతలు తీరున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్పై ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ కెమెరా రాడార్ల సాయంతో వాహనాల వేగాన్ని గుర్తించి చలాన్ జనరేట్ చేయనుంది. ఈ లేజర్ గన్ కెమెరా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సందర్శించి పనితీరు తెలుసుకున్నారు. ఇది విజయవంతమైతే ఓఆర్ఆర్ అంతటా ఇదే విధానాన్ని అనుసరించనున్నారు. ఓఆర్ఆర్ విస్తీర్ణం : 158 కిలోమీటర్లు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 2,31,795 సైబరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులు : 1,569 జరిమానా : రూ.23,92,75,225 రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 96,628 జరిమానా : రూ.9,97,90,880 7 నెలల కాలంలో వాహనదారులకు అందిన ఈ–చలాన్ల మొత్తం : రూ. 34కోట్లు -
చలాన్‌తోనే సరిపెడుతున్నారు..
సాక్షి,సిటీబ్యూరో: అనుమతి లేని సమయంలో నగరంలోని రహదారుల పైకి దూసుకువస్తున్న భారీ వాహనాలు, డీసీఎంల కారణంగా 10 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇలా వస్తున్న వాహనాలకు చలాన్ విధించడం మినహా కఠిన చర్యలు తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. వీటి కారణంగానే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదన్నారు. అనుమతి పొందిన వాటి మినహా నగరంలో భారీ వాహనాలు, లారీలు, డీసీఎంల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యలోనే ఇవి నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అయినా ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడుపడితే అప్పుడు దూసుకొచ్చేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ‘నో–ఎంట్రీ’ కేసులు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఏటా 30 వేల నుంచి 50 వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అనుమతి లేని వేళల్లో నగరంలోని ప్రవేశించి ఓసారి చలాన్ వేయించుకుంటున్నారు. దీనిని చూపిస్తూ ఆ రోజంతా సిటీలో స్వైర విహారం చేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతి జంక్షన్‌లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయట్లేదు. మరోపక్క ఇలాంటి ‘నో–ఎంట్రీ వాహనాలను’ స్వాధీనం చేసుకునే ఆస్కారం సైతం పోలీసులకు ఉంది. అయితే దీని వెనుక పెద్ద ప్రహసనమే ఉంటోంది. రహదారిలో ఓ ప్రాంతంలో ఇలాంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడే ఉంచడం సాధ్యం కాదు. దాని డ్రైవర్‌ను పంపేసినా మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ పోలీసు స్టేషన్, లేదా గోషామహల్ స్టేడియానికి తరలించాలి. అనంతరం సదరు డ్రైవర్/యజమాని జరిమానా చెల్లించి వచ్చి తీసుకువెళ్ళే వరకు దాన్ని భద్రపరచాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి అనుమతి లేని సమయంలో వచ్చిన భారీ వాహనంలో నిత్యావసర, అత్యవసర, సున్నిత వస్తువులు ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. ఇవన్నీ ఆయా వాహనాల డ్రైవర్లకు కలిసి వస్తుండటంతో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇలా నో–ఎంట్రీ సమయంలో వస్తున్న భారీ వాహనాల్లో డీసీఎంలే ఎక్కువ... ప్రమాదాల్లోనూ వీటిది పెద్ద స్థానమే. మరోపక్క రాత్రి అయిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులతో నిండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా నడిచే ఈ వాహనాలు, అడ్డగోలుగా పార్కింగ్స్, భయానకమైన శబ్ధాలు చేసే హారన్లు తోటి వాహనచోదకులతో పాటు నగరవాసులకూ నరకాన్ని చూపిస్తున్నాయి. రాత్రి 10 గంటల లోపు ప్రైవేట్ బస్సులు సిటీలోకి రావడానికి అనుమతి లేదు. అలాగే రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు బేఖాతరు చేయడం, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్ చేయడం పరిపాటిగా మారింది. వీటి సమస్య తీరాలంటే ప్రయాణికులను ఎక్కించుకోవడానికి, దింపడానికి ఈ వాహనాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుస్టేషన్ల వారీగా గుర్తించి ఏర్పాట్లు చేస్తేనే ఈ బస్సుల హడావుడికి చెక్ చెప్పవచ్చు. -
నోరూల్స్ అంటున్న వాహనదారులు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అంతే వేగంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలని నిబంధనలను లెక్కచేయడంలేదు. అతివేగం నియంత్రణకు పోలీసులు ఈ చలాన్ ద్వారా జరిమానా విధిస్తున్నా ఉల్లంఘనలు మాత్రం తగ్గడంలేదు. ఒకవైపు జరిమానా చెల్లిస్తూనే మరోవైపు ‘నో రూల్స్’ అంటూ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ట్రాపిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నా అవకాశం దొరికితే చాలు రూల్స్ అతిక్రమిస్తున్నారు. తమను ఎవరూ చూడడం లేదని అనుకుంటూన్నారు. కానీ నిఘా నేత్రాలు ఉల్లంఘనలను కెమెరాల్లో బంధిస్తున్నాయి. దీంతో ప్రతినెలా జరిమానా వీపరితీంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 8 నెలల్లోనే రూ.10,27,09,200 జరిమాన వసూలవడమే ఇందుకు నిదర్శనం. కేసుల రకాలు కేసులు జరిమానాలు(రూ.) రాంగ్‌రూట్ డ్రైవింగ్/ జిగ్‌జాగ్ డ్రైవింగ్ 29,142 89,48,200 ఒవర్లోడు కేసులు 23 10,800 సెల్ఫొన్ డ్రైవింగ్ కేసులు 650 6,50,000 మైనర్ డ్రైవింగ్ కేసులు 128 64,300 ట్రిపుల్ రైడింగ్ కేసులు 2,340 2,88,000 నంబర్‌ప్లేట్ మార్పు కేసులు 1,326 3,17,900 ఈ చలాన్‌తో జరిమానాల వేగం... రాష్ట్ర వ్యాప్తంగా పలు దశల్లో ఈచలాన్లు అమలు చేశారు. మొదట హైదారాబాద్‌లో అమలు చేయగా అక్కడ విజయవంతం కావడంతో 2018, డిసెంబర్ 23 నుంచి కరీంనగర్లో ఈ చలాన్ విధానం ప్రారంభించారు. గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని అక్కడిక్కడే పట్టుకుని జరిమానా నేరుగా వసూలు చేసేవారు. దీనితో ఇటు వాహనాదారులు, అటు పోలీసులు కూడా ఇబ్బంది పడేవారు. కొన్నిసార్లు వాహనదారుడి వద్ద నగదు లేకపోవడంతో వాహనాన్ని పట్టుకుని రావడం, వాటిని భద్రపరచడం పోలీసులు తలకుమించి భారంగా మారేది. జరిమానాల విషయంలో కూడా పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీటన్నంటికీ చెక్ పెడుతూ ఈ చలాన్ అమలు చేయడం ప్రారంభించారు. ఈపద్ధతితో అక్కడిక్కడే జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, వాహనాలను వాహనాదారులు తీసుకుని వెళ్లడం చేయడం వల్ల వాహనాదారులు వీలు చూసుకుని ఆన్లైన్లో జరిమానాలు చెల్లిస్తున్నారు. ఉల్లంఘనలే.. ఉల్లంఘనలు.. కరీంనగర్లో ట్రాఫిక్స్ రూల్స్ ఉల్లంఘనలు వీపరితంగా పెరిగిపోయాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కరీంనగర్లో అత్యధికంగా రాంగ్‌రూట్ డ్రైవింగ్ , జిగ్‌జాగ్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ చలాన్ పద్ధతి అమలు చేసిన నాటి నుంచి 2019, జులై 31 వరకు 29,142 కేసులు నమోదు కాగా జరిమానాల రూపంలో భారీగా రూ.89.49 లక్షల జరిమానాల చెల్లించారు. తర్వాత స్థానం ట్రిపుల్ రైడింగ్ కేసులు ఉన్నాయి. ఇవి 2,340 కేసులు నమోదు కాగా రూ.28.08 లక్షల జరిమానా చెల్లించారు. హెల్మెట్ లేకుండా నమోదు అవుతున్నా కేసులు కూడా అధికంగా ఉంటున్నాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. సరాసరి రోజుకు సుమారు 150 వరకూ నో హెల్మెట్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు పరిధిలో 2018 డిసెంబర్ నుంచి 2019 జులై వరకూ 2,104 కేసులు నమోదు కాగా వీటిలో 966 జరిమానాలు విధించారు. 1,085 మందికి జైలు శిక్ష అమలు చేశారు. వీటిని బట్టి వాహనాలు ఇష్టారాజ్యంగా నడుపుతూ జరిమానాలు చెల్లించడానికి ఇబ్బందులు పడడం లేదని తెలుస్తోంది. నిబంధనలు ఎలా ఉన్నా జరిమానాలు చెల్లిసున్నాం కదా అన్న ధోరణి పెరిగిపోతోందని నిపుణులు పేర్కొంటున్నారు. పెరిగిన మైనర్ డ్రైవింగ్.. హైదారాబాద్ తర్వాత అత్యధిక మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు అవుతోంది కూడా కరీంనగర్‌లోనే. హైస్కూల్ స్థాయిలో వాహనాలు నడుపు తూ పోలీసులకు చిక్కుతున్నారు. దీనికి పోలీసు లు కేసులు నమోదు చేస్తే వారి భవిష్యత్ నాశమ వుతుందనే వదిలేస్తున్నారు. అయితే ఇదే అలుసుగా వాహనాలపై మైనర్లు దూసుకుపోతు న్నా రు. నగరంలో మైనర్లు అధిక వేగంతో దూసు కుని పోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు నగరంలో చాలా మంది ట్రాపిక్ నియమాలను పాటించకుండా వెళ్తున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్లడం, రాంగ్రూట్లో వెళ్లడం, నో పార్కింగ్ ప్రాంతాలు వాహనాలు నిలపడం చెస్తున్నారు. ఇలాంటి ఘటనలను ట్రాపిక్ పోలీసులు కెమోరాల్లో బంధించి వాహనాల నంబర్ ప్లేట్లు కనిపించేలా ఫొటోలు తీస్తున్నారు. తర్వాత వాటిని ఈ చలాన్‌కు జతపరుస్తారు. వారం రోజుల వ్యవధిలోనే ఉల్లంఘించిన ట్రాపిక్ నియమ నిబంధనలు పేర్కొంటూ ఇంటికి రశీదు పంపతున్నారు. నెల రోజులోపు జరిమానా చెల్లించకుంటే వాహనం పట్టుబడినప్పుడు సీజ్ చేస్తున్నారు. అనంతరం జరిమానాలు చెల్లించి వాహనాన్ని తీసుకుని వెళ్లాలి. నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించడంతోపాటు ఎలాంటి జరిమానాలు లేకుండా సాఫిగా వెళ్లొచ్చు. ఇతరులకు కూడా ఇబ్బంది లేకుండా భద్రంగా ఇంటికి చేరుకోవచ్చు. వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. నిబంధనలు పాటించని వాహనాదారుల, ట్రాపిక్ ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తాం. – తిరుమల్, ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, కరీంనగర్ -
ఒక బైక్.. 42 చలానాలు
ఖైరతాబాద్: ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 42 చలానాలు ఉండటాన్ని గుర్తించిన సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. మంగళవారం ఐమాక్స్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేస్తుండగా ఓల్డ్‌సిటీకి చెందిన రాము అనే వ్యక్తికి చెందిన బైక్ (టీఎస్07ఈఎ2559) చలానాలు చెక్ చేయగా ఏకంగా 42 ఉన్నట్లు గుర్తించారు. దీనికి జరిమానా మొత్తం రూ.10,046 ఉన్నట్లు తేలడంతో వాహనాన్ని సీజ్ చేశారు. యజమాని మొత్తం చలానాలు చెల్లించిన అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. -
ప్రమాదాల జోరుకు కళ్లెం..!
ప్రమాదాల జోరుకు కళ్లెం వేసేందుకు పోలీస్ శాఖ ‘స్పీడ్‌గన్’లను ఎక్కుపెట్టింది. జాతీయ, ప్రధాన రోడ్లలో వేగంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి ఇ–చలానాలతో ఆర్థిక భారం వేయనుంది. మార్పురాకుంటే వాహనదారుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనుంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలను తగ్గించేందుకు, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్డు నిబంధనలను కఠినతరం చేసింది. సాక్షి, విజయనగరం టౌన్ : అతివేగం ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రాణాలు తీస్తోంది. పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అపరాధ రుసుం వసూలు చేస్తున్నా చాలామంది వాహనచోదకుల్లో మార్పురావడం లేదు. రోడ్డు నిబంధనలు పాటించడం లేదు. ప్రమాదాలకు కారణమవుతూ ఎదుటివారి ప్రాణాలను హరిస్తున్నారు. దీనిని నివారించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. అతివేగంగా వాహనాలు నడిపే వారికి కళ్లెంవేసే చర్యలు చేపట్టింది. స్పీడ్ గన్‌తో వాహన వేగాన్ని లెక్కించి మితిమీరితే కొరడా ఝుళిపించనుంది. ఇటీవల పోలీస్ అధికారులు జిల్లాకు నాలుగు స్పీడ్ కంట్రోల్ లేజర్ గన్స్‌ను తెప్పించారు. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, రద్దీ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అతివేగంగా వచ్చే వాహనాల ఫొటో తీసి డాప్లర్ సిద్ధా్దంతం ఆధారంగా స్పీడ్ లేజర్ గన్ పరికరంతో వేగాన్ని లెక్కిస్తారు. పరిమితికి మించి వేగం ఉంటే ఇ–చలానా ద్వారా ఇంటివద్దకే జరిమానా రసీదులు పంపిస్తారు. గాలిలో కలుస్తున్న ప్రాణాలు అతివేగంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై ప్రయాణించే వాహనచోదకులు, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 454 ప్రమాదాలు సంభవించారు. ఇందులో 157 మంది వరకు మృత్యువాత పడ్డారు. 758 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందులో టూ వీలర్స్ ప్రయాణికులు 179 మంది ఉంటే ఆటోల్లో ప్రయాణించేవారు 77 మంది, కారులు, జీపుల్లో ప్రయాణించేవారు 85 మంది, బస్సుల ద్వారా 30మంది, ట్రక్లు, ట్రాక్టర్స్ ద్వారా 96 మంది, ఇతర వాహనాల వల్ల 17 మంది వరకు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. వీటిని నివారించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లాలో ఉన్న ప్రధాన హైవేలను, ప్రమాదకర స్థలాలను గుర్తించింది. భోగాపురం హైవే, విశాఖ హైవే, గజపతినగరం హైవే, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఈ గన్లను ఏర్పాటు చేసింది. ఎక్కువగా ప్రమాదాలు హైవేలపైన జరుగుతుండడంతో వాటిపైన దృష్టిసారించింది. పట్టణంలో స్పోర్ట్స్ బైక్‌లు వాడే విద్యార్థులు, రైడర్లతో ప్రయాణికులు భయపడుతున్నారు. వారిని గుర్తించేందుకు లేజర్‌గన్‌ను ఏర్పాటుచేశారు. అటువంటి వారికి చలానాతో పాటు శిక్ష కూడా వేసే అవకాశాలున్నాయని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. స్పీడ్‌కి బ్రేక్... స్పీడ్ గన్‌తో వాహనాలు మితిమీరిన వేగానికి చెక్ పడే అవకాశం ఉంది. కేవలం 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలని బోర్డులు చూపిస్తున్నా వంద కిలోమీటర్ల స్పీడ్‌లో వాహనాలు నడుపుతారు. జాతీయరహదారులపై అయితే కార్లు, లారీలు అతివేగంతో వెళ్తే స్పీడ్‌గన్‌తో దాన్ని వేగాన్ని లెక్కించి ఇ–చలాన్ ద్వారా ఇంటివద్దకే జరీమానాలు పంపుతారు. 14 కంటే ఎక్కువ జరీమానాలు పడిన వ్యక్తులు డబ్బులు చెల్లించకుంటే పోలీసులు సంబంధిత వాహన యజమానులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. జరిమానా మొత్తంతో పాటు పెనాల్టీ కడితేనే వదిలిపెడతారు. నిబంధనలు పాటించాలి వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. ఏ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలనే విషయం సైన్ బోర్డులపై ఉంటుంది. ఆ వేగానికి మించి వెళ్తే స్పీడ్గన్ల ద్వారా ఇ–చలానా రూపంలో జరిమానాలు విధిస్తాం. మితిమీరిన వేగం ప్రమాద కరం. దీనివల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదముంది. వాహన పత్రాలు, లైసెన్సులు లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేయవద్దు. ప్రస్తుతం జాతీయరహదారిపై స్పీడ్గన్లు ఏర్పాటుచేశాం. – బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం -
ఇక ఇంటికే ఈ– చలాన్
సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్) : నిబంధనలకు నీళ్లుదులుతూ ఇష్టారాజ్యంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారుల నుంచి పోలీసులు నేరుగా జరిమానా వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలికారు. నూతన విధానంతో నేరుగా ఈ చలాన్ ఇంటికి పంపించి జరిమానను మీసేవలో కట్టిస్తున్నారు. ఈ చలాన్ విధానంతో ట్రాఫిక్ నియంత్రణ సులువు అవుతుంది.రోడ్లపై ఇష్టానూసారంగా ప్రయాణించి పోలీసు వద్ద ఉన్న కెమెరాలకు చిక్కితే వారం రోజుల్లో నేరుగా ఈ చలాన్ ఇంటికి వస్తుంది. ఆర్ సర్వర్ అనుసంధానం చేసిన పోలీస్ అప్లికేషన్ సిబ్బంది తీసిన వాహనం ఫోటోను ఆప్‌లోడ్ చేయగానే వాహనదారుడి వివరాలన్ని డిస్ప్లే అవుతాయి. అనంతరం వారం రోజుల్లో ఈ చలాన్ నిబంధనలు ఆతిక్రమించిన వాహనదారుడి ఇంటికి ఈ –చలాన్ వెళ్తుంది.ఫలితంగా జరిమాన చెల్లించాల్సి ఉంటుంది. పెరుగుతున్న హెల్మెట్ వాడకం.. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించకపోవడంతోనే ప్రాణ నష్టం జరుగుతుంది. రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన పలువురు హెల్మెట్ ధరించక చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనలు చాల ఉన్నాయి. పోలీసులు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గతంలో అనేక సార్లు రోడ్డు భద్రత–హెల్మెట్ వాడకంపై అవగహన కార్యక్రమాలు నిర్వహించిన పెద్దగా వాహనదారుల్లో మార్పు రాలేదు, అయితే గత నెల రోజుల నుంచి ఈ చలాన్ విధానంపై ప్రజలకు అవగహన కల్పించి నిబంధనలు పాటించని వాహనదారులకు ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా పోలీసులు తమకు కేటాయించిన ట్యాబ్‌ల ద్వారా సదరు వాహనం దారుడికి ఈ–చలాన్ విధిస్తున్నారు. నేరుగా ఇంటికి జరిమాన వస్తుండడంతో తప్పిని సరిగా జరిమాన కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో భద్రతతో పాటు ఫైన్ నుంచి తప్పించుకోవడం కోసం హెల్మెట్ వాడకంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని గ్రహించిన వాహనదారులు స్వచ్చందగానే హెల్మెట్ వాడుతున్నారు.కాగ గ్రామంలో పోలాల వద్దకు పోయే సందర్భాలలో ఫైన్లు విధించవద్దని వాహనదారులు కొరుతున్నారు. మద్యం తాగి నడిపితే ఇక ‘అంతే’ హెల్మెట్ వాడకంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తుడడంతో మందు బాబాలు బెంబేలెత్తిపోతున్నారు.మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కితే భారీగా జరిమానతో పాటు కొన్ని సందర్భాలలో కోర్టులు జైల్ శిక్ష విధిస్తున్నాయి.దీంతో వాహనదారుల్లో క్రమేపి మార్పు వస్తుందని పోలీసులు చేప్తున్నారు. వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలతో పాటు జరిమానల బారి నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రజల రక్షణ కోసమే నిబంధనలు... ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి.రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి.ప్రమాదాలు నివారించేందుకే కృషి చేస్తున్నాం.ప్రజలు భారంగా బావించద్దు.మైనర్లకు సైతం వాహనాలు ఇవ్వద్దు.మైనర్ల వాహనాలు ఇవ్వడం ద్వారా ప్రమాదాలను కొనితెచ్చుకున్నవారు అవుతారు.పోలీసులకు ప్రజలు సహకరించాలి. –రాజు ఎస్ఐ రామారెడ్డి హెల్మెట్ వాడకంఎంతో మేలు ద్విచక్రవాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి.దీని వల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకు రక్షణగా కల్పిస్తుంది.ఊరిలో మాత్రం మినహాయింపు ఇవ్వాలి. –తుపాకుల రాజేందర్‌గౌడ్,రామారెడ్డి. -
‘సేఫ్’ సర్టిఫికెట్
సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ ధరించలేదని వాహనదారుడికి జరిమానా, సీటు బెల్ట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు ఫైన్, సిగ్నల్ జంపింగ్ చేశాడని మరో వాహనదారుడికి ఈ–చలాన్...ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులపై చర్యలు తీసుకుంటున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనులను శిక్షించినట్లుగానే...ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులనూ గుర్తించి ‘సర్టిఫికెట్ ఆఫ్ సేఫ్ డ్రైవింగ్’ పేరుతో స్టిక్కర్ ఇచ్చి ప్రశంసిస్తున్నారు. అబుదాబీలో అమలులో ఉన్న ఈ విధానాన్ని ‘పట్రోల్ ఫర్ హ్యపీ డ్రైవింగ్’ పేరుతో దేశంలోనే తొలిసారిగా గురువారం చింతల్‌కుంట ఎక్స్‌రోడ్డులో సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డుపై వస్తున్న కొన్ని వాహనాలను తనిఖీ చేసిన సీపీ ఈ–చలాన్లో జరిమానాలు లేని కారు డ్రైవింగ్ చేస్తున్న లేడీ డాక్టర్ రిచా, సీనియర్ సిటిజన్ గోపాల కే సురేఖతో పాటు మరికొందరి వాహనాలకు ‘సేఫ్ డ్రైవర్ స్టిక్కర్స్’ను అతికించారు. అనంతరం వారిని సర్టిఫికెట్తో సన్మానించారు. చట్టాన్ని గౌరవిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఎదుటివారికి ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్ చేస్తున్న వారిని ప్రోత్సహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఈ ఆరు నెలల్లో మరో నాలుగువేల వాహనాలు, వచ్చే ఏడాది ఎనిమిది వేల వాహనచోదకులను గుర్తించి సర్టిఫికెట్లతో సత్కరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రోజుకు 24 వాహనాల చొప్పున ఆరు నెలల్లో నాలుగువేల మంది వాహనచోదకులను గుర్తించి ‘పట్రోల్ ఫర్ హ్యపీ డ్రైవింగ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. అబుదాబీలో 2016 అక్టోబర్ నుంచి ఈ విధానం అమలు చేస్తుండటంతో అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ట్రాఫిక్ నియమాలు పాటించే అలవాటు పెరిగిందన్నారు. ఆ తరహా మార్పు త్వరలో రాచకొండ పరిధిలోని వాహనదారుల్లో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూ సేఫ్ డ్రైవర్ల గుర్తింపు... ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఇకపై ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్న మర్యాద వాహనచోదకులను కూడా గుర్తించనున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి, ఎల్బీనగర్, భువనగిరి జోన్లలో ప్రతిరోజూ కొన్ని వాహనాలను గుర్తించి సేఫ్ డ్రైవర్ స్టిక్కర్స్‌తో పాటు ప్రశంసాపత్రాలను అందించనున్నారు. తద్వారా వారు ట్రాఫిక్ నియమాలను పాటించడంతో పాటు ఇతరులను చైతన్యం చేయడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన వాహనచోదకుడు ఆరు నెలల పాటు మళ్లీ ట్రాఫిక్ నియమాలు తూచతప్పకుండా పాటిస్తే రివార్డుతో సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అన్ని జోన్ల ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘కమ్యూనికేషన్’ కష్టాలు
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్ర నంబర్ ప్లేట్ ఉన్న ఓ వాహనానికి రూ.రెండు లక్షల వరకు ఈ–చలాన్ల రూపంలో జరిమానా పడింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కెమెరాతో పాటు ఆయా ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ఈ వాహనానికి దఫాలవారీగా భారీ మొత్తంలో జరిమానా విధించారు. అయితే సదరు వాహన యజమాని ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ♦ తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) నంబర్ గల ఓ వాహనం దాదాపు ఏడాదిన్నరగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే తిరుగుతోంది. సదరు వాహనం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తుండటంతో దఫాలవారీగా లక్షన్నర వరకు ఈ–చలాన్లు జారీ అయ్యాయి. ♦ ఈ రెండు కేసుల్లోనే కాకుండా పలు ఇతర రాష్ట్ర వాహనాలు, టీఆర్ నంబర్ గల వాహనాల వివరాలు తెలంగాణ రాష్ట్ర ఆర్టీఏ డాటాబేస్‌లో అందుబాటులో లేకపోవడంతో కేవలం ఈ–చలాన్లను వెబ్సైట్లో ఆప్‌లోడ్ చేయడం వరకే పరిమితమవుతోంది. అయితే సదరు వాహనదారుల చిరునామాతో పాటు సెల్‌నంబర్లు లేకపోవడంతో వారికి సమాచారం అదించడం తలనొప్పిగా మారుతోంది. వారికి పోస్ట్ చేద్దామంటే చిరునామా లేకపోవడం, సంక్షిప్త సమాచారం పంపేందుకు సెల్ నంబర్ లేకపోవడంతో ‘కమ్యూనికేషన్’ కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే సదరు వాహనదారులు కూడా ఈ–చలాన్ వెబ్సైట్లో ఈ–చలాన్లను చెక్ చేసుకోకపోవడంతో జరిమానాలు పేరుకుపోతున్నాయి. 2014 తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వాహనాల సమాచారం కూడా డాటాబేస్‌లో లేకపోవడంతో పొరుగు రాష్ట్ర వాహనాల బాధలు రెట్టింపయ్యాయి. నగరంలో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్...తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు ఈ–చలాన్ విధించడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. అయితే స్పాట్ చలాన్ డ్రైవ్‌లో దొరికిన సమయంలో ఈ వాహనదారుల జాతకం బయటపడి చిరునామా, సెల్‌నంబర్లు దొరుకుతున్నాయి. టీఆర్ నంబర్లతో పరేషాన్... నగరంలో కొత్త వాహనాల కొనుగోలు పెరిగిపోవడంతో పాటు వాహనదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్)తోనే ఎక్కువ కాలం వెళ్లదీస్తున్నారు. నెలరోజుల్లోగా శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉన్నా పట్టించుకోకుండా టీఆర్ నంబర్‌తోనే వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ నిఘానేత్రాలకు చిక్కుతున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద సీసీటీవీ కెమెరాలకు చిక్కిన సిగ్నల్ జంపింగ్ కేసుల్లోనూ టీఆర్ నంబర్ వాహనాల సంఖ్య వేలల్లోనే ఉంది. అయితే టీఆర్ వాహనాల వివరాలు డాటాబేస్‌లో లేకపోవడంతో వారికి పోస్టు, ఎస్ఎంఎస్లు పంపడం వీలుకావడం లేదు. కేవలం ఈ–చలాన్ వెబ్సైట్లో జరిమానా వివరాలను ట్రాఫిక్ పోలీసులు నిక్షిప్తం చేస్తున్నారు. సదరు వాహనదారులు ఈ–చలాన్లు తనిఖీ చేసుకోకపోవడంతో రికవరీ సాధ్యం కావడం లేదు. తరచు తనిఖీ చేసుకోవాలి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇతర రాష్ట్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. టీఆర్ వాహనాలదీ కూడా అదే పరిస్థితి. అయితే వీరి వివరాలు ఆర్టీఏ డాటాబేస్‌లో లేకపోవడంతో ఈ–చలాన్లు పోస్టు చేయడం, ఎస్ఎంఎస్ పంపడం సాధ్యపడటం లేదు. ఈ–చలాన్ వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తున్న ఈ–చలాన్లను వాహనదారులు తనిఖీ చేసుకుని క్లియర్ చేయాలి. వాహనం పట్టుబడితే సీజ్ చేస్తాం. అవసరమైతే వాహనదారుడిని జైలుకు పంపిస్తాం.– ఎస్.విజయ్ కుమార్,సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
క్యాబ్‌పై 104 చలాన్లు
గచ్చిబౌలి: 104 చలానాలు పెండింగ్ ఉన్న ఓ క్యాబ్‌నుగచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ రఘు కుమార్ మంగళవారం ఉదయం గచ్చిబౌలి ఓఆర్ఆర్పై నో పార్కింగ్‌లో పార్క్ చేసిన క్యాబ్(టీఎస్07యుఎ0202)కు రూ. 200 చలాన్ విధించారు. ఈ సందర్భంగా ట్యాబ్‌లో పరిశీలించగా సదరు వాహనపై 104 చలానాలు ఉన్నట్లు తేలింది. రూ. 17,805 చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించిన ఎస్ఐ క్యాబ్‌ను సీజ్ చేశారు. చలానాలు చెల్లించిన తరువాత కారు విడుదల చేస్తామని డ్రైవర్ రమేష్ గౌడ్‌కు సూచించారు. -
‘ప్లేటు’ మారిందో..వాత పడిందే!
సాక్షి,సిటీబ్యూరో: నగర రోడ్లపై తిరిగే లక్షలాది వాహనాలు.. ప్రతిదానికి నంబర్ ప్లేట్ ఉంటుంది. కానీ అవేవీ ఒకే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండవు. ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలతో ఉంటాయి. అంతేనా.. అంకెలు కూడా చెప్పలేనన్ని వంకర్లతో గుర్తించలేనంతగా ఉంటాయి. ఇటీవల కాలంలో నగరంలోని అనేక వాహనాలకు ఈ తరహా రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లే అధికమైపోయాయి. దీనికి చెక్ పెట్టేందుకు ‘స్పెషల్ డ్రైవ్’ చేపట్టాలని నగర ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించి భారీగా కేసులు సైతం నమోదు చేశారు. ఈ చర్యలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ దృష్టిపెట్టి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం డీసీపీ ఎల్ఎస్ చౌహాన్‌తో కలిసి విస్తృత స్థాయి సమీక్ష సైతం నిర్వహించారు. నంబర్ ప్లేట్లో ఉండే అక్షరాలు, అంకెల ఆకారం, పరిమాణం కచ్చితంగా మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్)లో నిర్దేశించిన ప్రకారమే ఉండాలి. కానీ ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో ఈ–చలాన్ తప్పించుకోవడం కోసం ట్రాఫిక్ కెమెరాల కళ్లు కప్పడానికి కొందరు వీటిని ఫ్యాన్సీగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో తప్పుడు నంబర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాల్ విసురుతున్న ‘ఉల్లంఘనులు’ నేరాలు చేయడానికి వాహనాలు వాడే వారు సైతం సక్రమంగా లేని నంబర్ ప్లేట్లు వినియోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనివల్ల ఉల్లంఘనులు తప్పించుకవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో భద్రతా పరమైన ఇబ్బందులూ తలెత్తుతాయని చెబుతున్నారు. ఈ అంశాలతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌పై ‘పోలీసు, ప్రభుత్వ వాహనం, కార్పొరేటర్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ’ ఇలా ఎలాంటి అక్షరాలు, అంశాలు రాయడం కూడా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్ 50, 51 ఉల్లంఘించడమేనని అధికారులు వివరిస్తున్నారు. తప్పుడు నంబర్ ప్లేట్స్ కలిగి ఉండటం, వాటిలో అంకెలు, అక్షరాల్లో మార్పులు చేయడం వంటి చర్యలకు ఉద్దేశ పూర్వకంగా పాల్పడినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమ నంబర్ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందంటున్నారు. అనేక చోరీ వాహనాలు సైతం స్వేచ్ఛగా నగరంలో తిరుగుతున్నాయని వివరిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు, నేరగాళ్లను గమనించిన ప్రజలు సైతం స్పందించాలని ట్రాఫిక్ అధికారులు కోరుతున్నారు. వాటిని ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసు ఫేస్బుక్, ట్విటర్లతో పాటు హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నంబర్ స్పష్టంగా కనిపించేలా ఫొటో ఉండటంతో పాటు తేదీ, సమయం, ప్రదేశం కచ్చితంగా స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఇవే.. ♦ ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ♦ కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపు రంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ♦ నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం. ♦ ఎవరైనా బోగస్ నంబర్ ప్లేటు వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఆర్టీఏ అధికా>రుల సహాయంతో డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేస్తారు. ♦ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200 ఇంటూ 100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్ కార్లకు 340 ఇంటూ 200 మిల్లీ మీటర్లు లేదా 500 ఇంటూ 120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340 ఇంటూ 200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి. నంబర్ ప్లేట్ ఉల్లంఘనకుసంబంధించి 2017 నుంచినమోదు చేసిన కేసులు ఇవీ.. 2017 36,632 2018 71,324 2019 17,486 (మార్చి) -
పల్లెల్లో.. హెల్మెట్లు
శంకరపట్నం: హెల్మెట్ కొనాలంటే పట్టణాలకు పరుగులు తీయాల్సిన పని లేదు. జాతీయ రహదారి వెళ్లే పల్లెల్లోనూ లభ్యమవుతున్నాయి.శంకరపట్నం మండలంలో హెల్మెట్ విక్రయాలు ఊపందుకున్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ చట్టం అమలుకావడంతో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో మాదిరిగా వాహనాలు తనిఖీచేసి కేసులు పెట్టేవారు. ఇప్పుడు ఈ పెట్టి కేసులు పెడుతుండడంతో ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించకుంటే ఫోటోతీసి అప్లోడ్ చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి సీటుబెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే సీసీ కెమెరల్లో నమోదవుతున్న పుటేజీల ఆధారంగా కేసులు నమోదుచేస్తున్నారు. ఈ చలాన్ విధానం అమల్లోకి రావడంతో పోలీసులు జాతీయరహాదారిపై రోజుకో ప్రాంతంలో నిఘా పెంచుతున్నారు. మండలంలోని కేశవపట్నంలోనే మూడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపక్కన విక్రయిస్తున్నారు. ఒక్కో హెల్మెట్ రూ.300నుంచి రూ.1000 వరకు ధరల్లో లభ్యమవుతున్నాయి. హెల్మెట్ ధరించండి కరీంనగర్– వరంగల్ జాతీయ రహాదారి ని త్యం రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకల తో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయకుంటే ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే సురక్షతంగా గమ్యానికి చేరుకుంటారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ఈ పెట్టి కేసులు నమోదు చేస్తున్నాం. – సత్యనారాయణ, ఎస్సై -
పోలీసు ఉల్లంఘనలపై.. ప్రత్యేక నజర్
నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా మాత్రమే పడుతోంది. ఇదే పని పోలీసులు చేస్తే వారికి ఫైన్‌తో పాటు ఎటాచ్మెంట్లు కూడా తప్పట్లేదు. 2017లోప్రారంభించిన ఈ విధానాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 310 మంది పోలీసు సిబ్బంది, అధికారుల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–చలాన్లు జారీ అయ్యాయి. వీరిలో కొందరికి ఉన్నతాధికారులు చార్జ్ మెమోలుజారీ చేయగా.. దాదాపు అందరినీ తాత్కాలిక ప్రాతిపదికన సీఏఆర్ హెడ్–క్వార్టర్స్కుఎటాచ్ చేశారు. సాక్షి, సిటీబ్యూరో: నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా మాత్రమే పడుతోంది. ఇదే పని పోలీసులు చేస్తే వారికి ఫైన్‌తో పాటు ఎటాచ్మెంట్లు కూడా తప్పట్లేదు. 2017లో ప్రారంభించిన ఈ విధానాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 310 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉల్లంఘనలకు సంబంధించి ఈ–చలాన్లు జారీ అయ్యారు. వీరిలో కొందరికి ఉన్నతాధికారులు చార్జ్‌మెమోలు జారీ చేయగా.. దాదాపు అందరినీ తాత్కాలిక ప్రాతిపదికన సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు. మరోపక్క పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. గడిచిన 25 నెలలకు సంబంధించిన ‘పోలీసు డేటా’ను ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ ఇటీవల విడుదల చేశారు. అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే... రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలు ఉన్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్లోకి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనచోదకుడూ కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని సీపీ స్పష్టం చేశారు. లేని పక్షంలో సదరు వాహనాలను లోపలకు అనుమతించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ 2017లో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాంలో ఉంటే సీరియస్... నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అత్యధిక శాతం వీరు యూనిఫాంలోనే ఉంటున్నారు. ఈ సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వ వాహనాలూ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వీరిలో మార్పు తెచ్చేందుకు పలుమార్లు కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టిన అధికారులు 2017 నుంచి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. పక్కా ఆధారాలతో... పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనేక రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా క్షేత్రస్థాయి విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న, పత్రికల్లో వస్తున్న ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అనేక మంది ప్రజలు పోలీసు అధికారిక ట్విటర్, వాట్సాప్, ఫేస్బుక్, హెల్ప్‌లైన్ నెం.9010203626, ఈ–మెయిల్ ద్వారానూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ముందు ఫైన్... ఆపై చర్యలు... ఇలా వివిధ మార్గాల్లో సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్థారించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసుల నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. దీనిపై నిర్ణీత గడువులోగా సంజాయిషీ ఇవ్వకపోయినా, సంతృప్తికరంగా లేకపోయినా తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరోపక్క పోలీసు సిబ్బంది/అధికారులకు చెందిన వ్యక్తిగత, అధికారిక వాహనాలపై ఎలాంటి జరిమానాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. మిగిలిన విభాగాల మాటేమిటి? ఇతర ఉల్లంఘనలతో పాటు మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కుతున్న వారిలో ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మందే ఉంటున్నారు. ఉల్లంఘనలపై పోలీసుల విషయంలో ఇంత సీరియస్‌గా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ఉల్లంఘనుల పైనా సీరియస్‌గా స్పందించకున్నా.. కనీసం మద్యం తాగి వాహనం నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి తీవ్రమైన వాటినైనా తీవ్రంగా పరిగణించాల్సి ఉంది. ఈ తరహా ఉల్లంఘనలు చేస్తూ చిక్కిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించడం, ఆయా జాబితాలను వారి కార్యాలయాలకు పంపి తదుపరి చర్యలు తీసుకునేలా చేస్తే నగరంలో ఏటా వేల సంఖ్యలో ఉల్లంఘనలు తగ్గే అవకాశం ఉంది. -
ప్రమాదాల నుంచి కాపాడేందుకే ఈ–చలాన్
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడేందుకే ఈ–చలాన్ ప్రారంభించినట్లు ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. శుక్రవారం మెదక్‌లోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద గల ప్రధాన రహదారి చౌరస్తాలో ఈ–చలాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో శుక్రవారం నుండి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు, ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఈ–చలాన్ అనే కొత్త వ్యవస్థ ద్వారా జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రజలను ప్రమాదాల నుండి కాపాడేందుకు, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఈ–చలాన్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ–చలాన్ ద్వారా రెండు పద్ధతుల్లో జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. కాంటాక్ట్ పద్ధతి, రెండోవది ట్రాఫిక్ నిబందనలు అతిక్రమించిన వారి ఫొటోలను ట్యాబ్‌లో తీసి ఈ టికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మూడుసార్లకు మించినట్లయితే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాన్ని గుర్తించి, వాహనదారుడికి సంబంధించిన ఏదైనా గేట్వేస్ ద్వారా చెల్లించిన తరువాతే వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ–చలాన్లు చెల్లించని వారికి స్పీడ్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఆ వాహనదారులు ఫైన్ చెల్లించకుంటే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామన్నారు. ఈ టికెట్లో చూపించిన జరిమానాను ఏడు రోజుల్లో మీసేవ, ఈ సేవల ద్వారా చెల్లించాలని చెప్పారు. వాహనదారుడు మూడుసార్లు చెల్లించనట్లయితే 4వ సారి వాహనం సీజ్ చేస్తామన్నారు. ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో నాన్ కాంటాక్ట్ పద్ధతిలోనే ఈ–చలాన్ విధించనున్నట్లు చెప్పారు. ఈ–చలాన్ ద్వారా విధించిన టికెట్‌ను డైరెక్ట్ ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, ఎస్బీ సీఐ మల్లికార్జున్‌రెడ్డి, ఐటీకోర్ సీఐ గోవర్ధన్‌గిరి, డీసీఆర్బీ సీఐ చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో చలాన్ పుస్తకాలకు స్వస్తి
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై వాహనాలను ఆపి తమ చేతిలో ఉన్న పుస్తకంలో రాసి చలాన్ జారీ చేయడం... అది కట్టించుకునే నెపంతో ‘చేతివాటం’ చూపించడం... కొన్ని సందర్భాల్లో ఘర్షణలకు తావివ్వడం... ఇకపై ఇలాంటి సీన్లు రాష్ట్రంలో ఎక్కడా కనిపించవు. ప్రస్తుతం రాజధానికి మాత్రమే పరిమితమైన నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేపట్టిన పోలీసు విభాగం ఇప్పటికే 18 యూనిట్లలో (జిల్లా, కమిషనరేట్) దీనిని అమలులోకి తీసుకొచ్చింది. గరిష్టంగా వారం రోజుల్లో మిగిలిన తొమ్మిదింటిలోనూ అమలు చేయనున్నారు. ఈ క్రతువు పూర్తయితే పూర్తిస్థాయి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుంది. వివాదాలు, ఘర్షణలకు తావు లేకుండా... ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలులో ఉండేవి. ఇందులో భాగంగా చలాన్ పుస్తకాలు పట్టుకుని రంగంలోకి దిగే ట్రాఫిక్/శాంతిభద్రతల విభాగం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వారికి చలాన్లు విధించడంతో పాటు జరిమానా వసూలు చేసేవారు. దీనివల్ల వాహనచోదకులతో తరచు ఘర్షణలు, వివాదాలు చోటు చేసుకునేవి. వీటికి తోడు పోలీసులు సైతం చేతివాటం ప్రదర్శించడంతో అవినీతికీ ఆస్కారం ఉండేది. 2014లో నగర పోలీసు కమిషనర్‌గా నియమితులైన ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఆయన చొరవతో 2015 జనవరి 20 నుంచి హైదరాబాద్‌లో ఇది అమలులోకి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో సైబరాబాద్, రాచకొండ పోలీసులు అమలులోకి తీసుకువచ్చారు. 2016 నవంబర్ నుంచి రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేందర్‌రెడ్డి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. సన్నాహాలు తుదిదశకు చేరిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆ హడావుడి పూర్తి కావడంతో శరవేగంగా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పీడీఏలతో పని లేకుండా... నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానంలో సాధారణంగా ఏ పోలీసు అధికారి రోడ్డుపై వాహనాలను ఆపరు. కొన్ని సందర్భాల్లో ఉల్లంఘనులకు టికెట్ ద్వారా చలాన్ జారీ చేసినా డబ్బు మాత్రం కట్టించుకోరు. తమ దృష్టికి వచ్చిన ఉల్లం«ఘనలను ఫొటోలో బంధించి ఆయా జిల్లాలు, కమిషనరేట్ల లోని కంట్రోల్రూమ్స్కు అప్లోడ్ చేస్తారు. రహదారుల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారానూ కంట్రోల్ రూమ్ అధికారులు ఉల్లంఘనుల ఫొటోలు క్యాప్చర్ చేస్తారు. అక్కడి సిబ్బంది ఆ వాహనం నంబర్ ఆధారంగా ఆర్టీఏ కార్యాలయంలో నమోదైన చిరునామా ఆధారంగా వాహనచోదకుడికి ఈ–చలాన్ జారీ చేసి పోస్టులో పంపిస్తారు. ఈ మొత్తాన్ని ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలు, కొన్ని బ్యాంకులు, ఆన్‌లైన్‌తో పాటు నిర్దేశించిన మార్గాల్లో వాహనచోదకుడే స్వయంగా చెల్లించాలి. చిరునామా తప్పుగా ఉండటం, మారిపోవడం తదితర కారణాలతో ఈ–చలాన్ వాహనచోదకుడికి అందకపోతే... పెండింగ్‌లో ఉన్న వాటిని (www.echallan.org) వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు. పెండింగ్ చలాన్లు ఉన్న వారిని తనిఖీ చేయడానికి ఒకప్పుడు పీడీఏ మిషన్లు అవసరం ఉండేది. ఇవి పెండింగ్ డేటాబేస్‌తో అనుసంధానమై ఉండేవి. తాజాగా ఈ డేటాబేస్‌ను ‘టీఎస్ కాప్’ యాప్‌తో అనుసంధానించారు. ఫలితంగా పోలీసులు తమ స్మార్ట్‌ఫోన్ ట్యాబ్ ద్వారానే ఫొటోలు తీసి అప్లోడ్ చేయడం, పెండింగ్‌వి తనిఖీ చేయడం సాధ్యమవుతోంది. రాష్ట్రం మొత్తం ఒకే డేటాబేస్... హైదరాబాద్‌లో అమలులో ఉన్న విధానాలు నేపథ్యంలో ఇక్కడ వాహనం జాగ్రత్తగా నడిపే వ్యక్తి వేరే జిల్లాకు వెళితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అక్కడ ఈ–చలాన్ విధానం లేకపోవడం, ఉన్నా ఆ వివరాలు అక్కడి పోలీసులకు తెలియకపోవడమే దీనికి కారణం. అయితే తాజాగా రాష్ట్ర పోలీసులు విభాగం రాష్ట స్థాయిలో ఒకే డేటాబేస్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 27 పోలీసు యూనిట్లూ అనుసంధానించి ఉంటాయి. ఫలితంగా రాష్ట్రంలో ఎక్కడ ఉల్లంఘనకు పాల్పడినా చిక్కడం, జరిమానా చెల్లించడం తప్పనిసరిగా మారుతోంది. దీంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కీలక కారకంగా ఉన్న మద్యం తాగి వాహనాలు నడపడాన్నీ నిరోధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు తప్పనిసరి చేయడంతో పాటు హైదరాబాద్‌లో అమలులో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను (ఎస్ఓపీ) అన్నింటిలోనూ అమలు చేయనున్నారు. వీటి ప్రకారం ఇకపై ఈ ఉల్లంఘనకు పాల్పడి చిక్కిన వారు కచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిందే. -
ఇక.. ఈ–చలాన్
మహబూబ్‌నగర్ క్రైం : మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు నోటీసును రాసే విధానంలో కాకుండా ఆన్లైన్లో అందించనున్నారు. అంతేకాకుండా జరిమానాను సైతం నగదు రూపంలోస్వీకరించే విధానానికి స్వస్తి పలుకుతూ మీ–సేవ, ఈ–సేవ కేంద్రాలతో పా టు పేమెంట్ గేట్‌వేల ద్వారా చెల్లింపునకు వెసలుబాటు కల్పించారు. అంతేకాకుండా వాహనదారులు తమ పేరిట ఉన్న చలాన్లు, చెల్లించిన జరిమానా ను ఆన్లైన్లో చూసుకునే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకాలం ట్రాఫిక్ పోలీసులపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టేలా క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు వెల్లడించారు. క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను భౌతికంగా ఆపి చలానా విధించి అక్కడిక్కడే డబ్బు కట్టించేవారు. ఈ ప్రక్రియలో కింది స్థా యి సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చేవి. పారదర్శకత లోపించడం ద్వారా ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై మచ్చ పడుతోంది. దీంతో ఈ విధానానికి స్వస్తి చెప్పిన మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై పోలీసులు జరిమానాను నగదు రూపంలో వసూలు చేయకుండా నేరుగా వాహనదారుడు పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించగల విధానాన్ని ప్రవేశపెట్టారు. నిబంధనలు ఉల్లంగించిన వారికి పోలీసులు ఈ–టికెట్ జారీ చేసి జరిమానా చెల్లించేందుకు ఏడు రోజుల గడువు ఇస్తారు. ఇలా జారీ చేసిన ఈ–టికెట్లు మించినట్లయితే రిజిస్ట్రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వావానాన్ని స్వాధీనం చేసుకుని జరిమానా విధించిన తర్వాతే విడుదల చేస్తారు. ఇంటికే ఈ–చలాన్ ట్రాఫిక్ కమాండ్ సెంటర్ పరిధిలో ట్రాఫిక్ నియమాలను అతిక్రమించే వారిని ట్రాఫిక్ పోలీసులు కెమెరాలతో వీడియో, ఫొటోలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సర్వర్‌లో భద్రపరుస్తారు. అనంతరం తగిన సాక్ష్యాధారాలతో ఈ–చలాన్‌ను వాహనదారుడి ఇంటికి పంపిస్తారు. అంతేకాకుండా పెండింగ్ చలాన్ల వివరాలను వెబ్సైట్లలోకి వెళ్లి తెలుసుకునే వెసలుబాటు కల్పించారు. ఆ తర్వాత జరిమానాను వాహనదారులు ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లో చెల్లించే అవకాశం ఇస్తున్నారు. అంతేకాకుండా వాహనదారులు చెల్లించిన జరిమానా వివరాలను వెంటనే డేటాబేస్‌లో ఆప్డేట్ చేస్తారు. లీగల్ నోటీసు నిబంధనలు ఉల్లంఘించే వారికి ఎప్పటికప్పుడు ఈ–చలా న్లు జారీ చేయనున్నారు. ఆ వెంటనే ఏడు రోజుల్లోగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలా కట్టకుండా పెండింగ్ చలాన్లు పేరుకుపోయిన వారి పేరిట స్పీడ్‌పోస్టులో లీగల్ నోటీసులు పంపిస్తారు. అయినప్పటికీ స్పందించకపోతే న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేయనున్నారు. సాక్షాధారాలతో సహా ఇంటికే జరిమానా పత్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగంగా జిల్లాలో ఈ–చలాన్ పద్ధతి ప్రవేశపెట్టాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి బాధ్యులను గుర్తించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు ప్రత్యక్షంగా తనిఖీ చేస్తూ, జరిమానా విధిస్తున్న పద్ధతికి స్వస్తి పలికి.. కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించేలా వాహన యజమాని ఇంటికే జరిమానా పత్రం పంపిస్తాం. తపాలా, మొబైల్‌ఫోన్, పోలీసు వెబ్సైట్ల ద్వారా ఈ–చలాన్ జరిమానా వివరాలు తెలుసుకుని చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అమల్లో ఉండి సత్ఫలితాలు ఇస్తున్న ఈ విధానాన్ని మరికొన్ని జిల్లాల్లోనూ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పాలమూరులో కూడా ప్రవేశపెట్టాం. – వెంకటేశ్వర్లు, ఏఎస్పీ -
బాప్రే చలాన్ నెం.136
సాక్షి, సిటీబ్యూరో: మీరు బైక్‌పై తిరుగుతున్నారా.. ఎప్పుడన్నా హెల్మెట్ పెట్టుకోవడం మరిచిపోయారా..! ఎవరు చూస్తార్లే.. అని డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడుతున్నారా..! అయితే, ఒక్కసారి ‘ఈ–చలాన్’ చెక్ చేసుకోండి. మీ వాహనంపై ఎన్ని చలాన్లు జారీ అయ్యాయో చూసుకోండి. లేదంటే నగరంలో ఏదో ఒకచోట పోలీసులు మీ బండిని స్వాధీనం చేసుకుంటారు. ఆపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేస్తారు. దాంతో మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిదే. పోలీసులు లేని ప్రాంతంలో హెల్మెట్ లేకుండా తిరిగినా.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసినా సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ చలాన్లు జారీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి గురువారం ట్రాఫిక్ పోలీసుల కంటబడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుతున్న ఓ వ్యక్తిని ఆపితే ఏకంగా 136 ఈ చలాన్లు ఉన్నట్టు తేలింది. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు గురువారం సాయంత్రం హిమాయత్‌నగర్ ‘వై జంక్షన్’ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో అటుగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వచ్చిన వ్యక్తిని ఆపారు. ఈ ఉల్లంఘనపై చలాన్ జారీ చేస్తూనే.. సదరు బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్లు తెలుసుకోవడానికి ‘పీడీఏ మిషన్’లో బండి నెంబర్ (టీఎస్10ఈడీ9176) నమోదు చేశారు. మిషన్ నుంచి వచ్చిన ప్రింట్ ఔట్ చూసి పోలీసులకే కళ్లు తిరిగాయి. ఆ ద్విచక్ర వాహనంపై 28 నెలల్లో 136 సార్లు జారీ అయిన ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. చెల్లించాల్సిన పెనాల్టీ మొత్తం రూ.31,590కి చేరినట్లు అందులో ఉంది. వీటిలో జరిమానాల మొత్తం రూ.26,900 కాగా.. సర్వీస్ చార్జి మరో రూ.4690 ఉంది. ఆ ద్విచక్ర వాహనం కేకే ప్రకాష్ పేరుపై రిజిస్ట్రర్ అయింది. 2016 జూన్ 9న తొలిసారిగా హెల్మెట్ లేకుండా సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయడంతో రూ.1100 చలాన్ జారీ చేశారు. అప్పటి నుంచి గురువారం వరకు మొత్తం 136 ఈ–చలాన్లు జారీ అయ్యాయి. వీటిలో కేవలం ఆరు మాత్రం సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు సంబంధించినవి కాగా.. మిగతా 127 హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల జారీ చేసినవి. మిగిలినవి నో పార్కింగ్ ఏరియాలో వాహనం నిలిపిన ఉల్లంఘనకు సంబంధించినవి. ఈ పెండింగ్ చలాన్లలో కేవలం ఒక్కటి మాత్రమే సైబరాబాద్ పోలీసులు జారీ చేయగా మిగిలినవన్నీ సిటీకి సంబంధించినవే. క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల నుంచి స్పాట్లో జరిమానా వసూలు చేయట్లేదు. కేవలం ఈ–చలాన్ మాత్రమే జారీ చేస్తూ ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, ఆన్లైన్లో వీటిని చెల్లించే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ వాహన చోదకుడు హెల్మెట్నే కాదు.. ఈ–చలాన్ల చెల్లింపునూ మర్చిపోవడంతో పెండింగ్ జాబితా చాంతాడంత అయింది. ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ముందు అతగాడికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ సైతం ఇవ్వనున్నారు. -
ఫైన్ పడుద్ది !
వరంగల్ క్రైం: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వాహనదారులు ఇకపై గీత దాటితే.. ఫైన్ పడుద్ది. హైదరాబాద్ తరహాలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఇకపై తూచ తప్పకుండా పాటిం చా ల్సిందే. సిగ్నల్ జంప్‌లు, త్రిబుల్ రైడింగులు, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లకు ఇక కాలం చెల్లనుంది. వాహనదారులకు తెలియకుండానే జరిమానా నోటీస్ ఇంటికి అందే విధానాన్ని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ శుక్రవారం సాయంత్రం కమిషనరేట్‌లో ప్రారంభించారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే సిబ్బంది విధుల్లో మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ–చాలన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన ప్రకటించారు. సమావేశంలో కమిషనర్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ట్రాఫిక్ విభాగాన్ని మరింత ఆధునీకరించడం కోసం డిజిటలైజేషన్ దిశగా ముందుకు సాగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రాఫిక్ విధులను మరితం సులభతరం కోసం, ప్రజల్లో ట్రాఫిక్ పోలీసుల పట్ల నమ్మకం పెంచేందుకు , వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేందుకు ఈ–చాలన్ విధానంను కమిషనరేట్‌లో అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నగదు రహిత జరిమానాలు.. ట్రాఫిక్ విభాగంలో ఇంతవరకు అధికారులు వాహనాలను అపి చాలన్ రాసే విధానానికి స్వస్తి పలికినట్లు సీపీ డాక్టర్ రవీందర్ ప్రకటించారు. అధికారులు వాహనాలను తనిఖీ చేసే క్రమంలో వాహనదారుల నుంచి ఎలాంటి వసూళ్లు చేయరని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన విధానాన్ని బట్టి జరిమానా విధిస్తారని ఆయన వెల్లడించారు. ఇందులో వాహనదారులు వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని, వారం రోజుల్లో ఆన్లైన్, మీసేవ, ఈసేవ, పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించవచ్చని సీపీ పేర్కొన్నారు. ఎవరైనా, ఎక్కడైన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అధికారులు ఫొటో తీసి వాహనదారుడు ఏ విధమైన ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడింది ఆన్లైన్లో నమోదు చేసి జరిమానకు సంబంధించిన రశీదు పంపిస్తారని ఆయన తెలిపారు. దీంతోపాటు ఆ వాహనదారుడి వివరాలు రోడ్డు రవాణా శాఖకు అనుసంధానం చేస్తారని వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఎక్కడ ఉల్లంఘించారు, సమయం, తేదీ, జరిమానా ఎంత, జరిమాన విధించిన అధికారి తదితర వివరాలు డ్రైవర్‌తోపాటు ఓనర్‌కు మెస్సేజ్ రూపంలో సమాచారం అందుతుందని ఆయన వివరించారు. ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ట్రాఫిక్ నిబంధనల విషయంలో వాహనదారులతోపాటు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సీపీ డాక్టర్ రవీందర్ కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ–చాలన్ విధానం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి వెళ్లాలనేది తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో ఈ–చాలన్ విధానం అమలవుతోందని, ఆ తర్వాత కమిషనరేట్ మొత్తం అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ–చాలన్ ఏ విధంగా పనిచేస్తుందో కమిషనర్ వివరించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్సైలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ, ట్రాఫిక్ ఇన్చార్జి డీసీపీ బిల్లా అశోక్‌కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మజీద్, ఇన్స్పెక్టర్లు అంబటి నర్సయ్య, కిషోర్‌కుమార్, హనన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తస్మాత్ జాగ్రత్త
మేం కారులో, బైక్‌లో స్పీడుగా వెళుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. హెల్మెట్ లేకున్నా ఎవరూ అడగడం లేదు. మందు తాగి వాహనాన్ని నడుపుతున్నా ఏ అధికారీ తనిఖీ చేయడం లేదని అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్లే. ఇటీవల జాతీయ రహదారిపై రవాణా అధికారులు తనిఖీల స్పీడును పెంచారు. రోజుకో ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఇళ్లకు ఈ–చలానాలు పంపిస్తున్నారు. నెల్లూరు(టౌన్): వాహనచోదకులు నిబంధనలు అతిక్రమిస్తే వాళ్లకు తెలియకుండానే తనిఖీలకు సంబంధించిన ఈ–చలానాలను రవాణాశాఖ అధికారులు ఆయా వాహనదారుల ఇళ్లకు పంపిస్తున్నారు. ఇవేంటని పరిశీలించిన వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. రహదారి మధ్యలో ఎవరూ ఆపి తనిఖీలు చేయలేదు గదా.. ఈ చలానాలు ఏంటని రవాణా కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. తీరా మీరు పలాన సమయంలో నిబంధనలు అతిక్రమించారని, అందుకు ఫైన్ చెల్లించాలనిఅధికారులు చెబుతుండటంతో అవాక్కువుతున్నారు. గతంలో పెద్ద నగరాలకే పరిమితమైన ఈ–చలానా పద్ధతి జిల్లాలో కూడా అవలంబిస్తున్నారు. జిల్లాలో 176 కిలో మీటర్ల జాతీయ రహదారి జిల్లాలో 176 కిలో మీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు రహదారి నిబంధనలు అతిక్రిమించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అతి వేగం, మద్యం తాగి వాహనం నడపడం, సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా బైక్ నడపటం, ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం తదితర కారణాల వల్లే అధిక సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తనిఖీలు ముమ్మరం జాతీయ, రాష్ట్ర రహదారులపై రవాణాశాఖ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. రోజూ కావలి నుంచి తడ వరకు ఉన్న జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు రెండు స్పీడు లేజర్గన్లను కొనుగోలు చేశారు. రవాణాశాఖకు ఒకటి, పోలీసు శాఖకు మరొక స్పీడు లేజర్ గన్ను కేటాయించారు. అదేవిధంగా 30 బ్రీత్ ఎన్లైజర్లను కొనుగోలు చేశారు. 24 పోలీసు శాఖకు కేటాయించగా, ఆరు బ్రీత్ ఎన్లైజర్లును రవాణాశాఖకు కేటాయించారు. రహదారిపై వాహన స్పీడును లేజర్ గన్‌తో పరిశీలిస్తున్నారు. తనిఖీలు నిర్వహించే ప్రాంతాన్ని బట్టి వేగాన్ని నిర్ణయిస్తారు. స్పీడు లేజర్గన్లో వాహన నంబరు నమోదవుతుంది. ఆ నంబరు ఆధారంగా వాహనదారుడు వివరాలు తెలస్తాయి. నిర్దేశించిన వేగం కంటే వాహనం ఎక్కువ వేగం వెళుతుందని స్పీడు లేజర్గన్లో నమోదవుతుంది. మద్యం సేవించి వాహనాన్ని నడిపితే కోర్టుకు ప్రాసిక్యూట్ పెడుతున్నారు. కోర్టు కొన్ని రోజుల పాటు జైలు శిక్ష విధించిన పరిస్థితి ఉంది. చలానా ఇంటికే.. నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఇళ్లకు రవాణా అధికారులు ఈ–చలనాలు పంపిస్తున్నారు. నిర్దేశిత వేగం కంటే అధిక వేగంగా వెళితే రూ.1,400లు ఫైన్ విధిస్తున్నారు. ఉదాహరణకు జాతీయ రహదారిపై అక్షర స్కూల్ సమీపంలో వాహన వేగం 90 కి.మీ. నిర్దేశించారు. అంతకన్న వేగంగా వెళితే ఫైన్ విధిస్తారు. రద్దీని పరిగణనలోకి తీసుకుని వేగాన్ని నిర్ణయిస్తారు. అదేవిధంగా హెల్మెట్ లేక పోయినా, సీటు బెల్టు ధరించకున్నా ఫైన్‌ను ఈ–చలానా రూపంలో పంపిస్తున్నారు. ఈ–చలానా రూపంలో వచ్చిన ఫైన్‌ను వారం రోజుల్లో రవాణా కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైన్ చెల్లించకుండా పదే పదే తప్పు చేసినట్లయితే వాహనాన్ని సీజ్ చేస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన కేసులు వివరాలను ఒక సారి పరిశీలిస్తే... ఓవర్ స్పీడుకు సంబంధించి 814 కేసులు, హెల్మ్‌ట్ లేకుండా బైక్ నడపటం 560, మద్యం తాగి వాహనాన్ని డ్రైవింగ్ చేసినందుకు 648 కేసుల వరకు ఉన్నాయి. వీరందరికీ అతి వేగం, హెల్మెట్ లేకుండా బైకు నడపటం వంటి వాటికి ఈ–చలనా రూపంలో ఫైన్ విధించారు. మద్యం తాగి వాహనాన్ని నడిపిన కేసులో వాహనదారులను కోర్టుకు ప్రాసిక్యూట్ చేశారు. నిబంధనలు పాటించాల్సిందే ప్రతి వాహనదారుడూ రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తునే ఉన్నాం. ఇప్పుడు వాహనాన్ని ఆపి తనిఖీ చేయకుండా స్పీడు లేజర్ గన్, బ్రీత్ ఎన్లైజర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు అతిక్రమించినట్లయితే వారి ఇళ్లకు ఈ–చలానాలను పంపిస్తున్నాం. –ఎన్.శివరాంప్రసాద్, ఉప రవాణాశాఖ కమిషనర్ -
భాగ్యనగర వాహనదారులకు హెచ్చరిక!
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. 2015–17 మధ్య జారీ అయిన ఈ–చలాన్లలో 34,03 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ మూడేళ్ల కాలంలో మొత్తం 95.71 లక్షల చలాన్లు జారీ కాగా... వీటిలో 32.57 లక్షల చలాన్లకు సంబంధించిన జరినామాను వాహనచోదకులు చెల్లించలేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులపై ‘సాంకేతిక’ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. మరోపక్క మూడు చలాన్లకు మించి పెండింగ్‌లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ హెచ్చరించారు. నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్... గతంలో ట్రాఫిక్ పోలీసులు రహదారులపై ట్రాఫిక్ నిర్వహణను కూడా పక్కన పెట్టి జరిమానాలు విధించడం, వసూలు చేయడంపై దృష్టి పెట్టేవారు. నేరుగా వాహనచోదకుడితో సంబంధం ఉండి ఇలా ఈ–చలాన్లు జారీ చేయడాన్ని కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటారు. అయితే ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతోంది. క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్ పోలీసులు నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా పోలీసుస్టేషన్ నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అప్లోడ్ చేస్తారు. అక్కడి అధికారులు ఈ ఫొటోల ఆధారంగా వాహనచోదకులకు పోస్టు ద్వారా ఈ–చలాన్లు పంపిస్తున్నారు. ఆర్టీఏలో పక్కాగా లేని చిరునామాలు.. ఈ ఈ–చలాన్లను ట్రాఫిక్ విభాగం అధికారులు ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. ఆ డేటాబేస్‌తో అనుసంధానం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు తమ కంప్యూటర్లో ఓ ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్ ఎంటర్ చేస్తే... ఆటోమేటిక్‌గా ఆర్డీఏ డేటాబేస్ నుంచి సదరు వాహనం చిరునామా గుర్తించే సర్వర్ ఆ చిరునామాతో ఈ–చలాన్ జారీ చేస్తుంది. దీనిని పోస్టు ద్వారా బట్వాడా చేయిస్తారు. అయితే ప్రస్తుతం ఆర్టీఏ డేటాబేస్‌లో దాదాపు 50 శాతం వాహనదారుల చిరునామాలు అప్డేట్ కాలేదు. వాహనం ఖరీదు చేసినప్పుడు దాని యజమాని ఉన్న చిరునామానే రిజిస్ట్రేషన్ సమయంలో రికార్డుల్లో పొందుçపరుస్తున్నారు. ప్రస్తుతం యజమాని మరో చిరునామాలో నివసిస్తున్నా ఆర్టీఏ రికార్డుల్లో పాత చిరునామానే కొనసాగుతోంది. దీంతో ఈ చలాన్లు వాహన యజమానికి డెలివరీ కాకపోవడంతో తమ వాహనంపై చలాన్ జారీ అయిందనే విషయం దాని యజమానికి తెలియట్లేదు. తెలిసిన వారూ చెల్లించట్లేదు... ఓ పక్క ఓ వాహనంపై జారీ అయిన ఈ–చలాన్లు దాని యజమానికి చేరని కారణంగా చెల్లించని వారు కొందరైతే... మరికొందరు తెలిసీ పట్టించుకోవడం లేదని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. గతంలో మెగా లోక్ అదాలత్‌లు నిర్వహించిన ప్రతిసారీ ట్రాఫిక్ పోలీసులు భారీగా ప్రచారం నిర్వహించడమేగాక 50 శాతం వరకు రాయితీలు ప్రకటించేవారు. దీంతో పలువురు వాహనచోదకులు లోక్ అదాలత్ జరిగినప్పుడే చెల్లిద్దామనే ఉద్దేశంతో ఉండిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ అధికారులు గత ఏడాది నుంచి ఈ అదాలత్లకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ విషయంపై ప్రజలకు పూర్తి అవగాహన లేకపోవడంతో కొంత వరకు చెల్లింపులు ఆగుతున్నాయి. బయటి రాష్ట్రా లు, జిల్లాలకు చెందిన వాహనాలకు విధిస్తున్న ఈ–చలాన్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. అప్పుడప్పుడో, కేవలం ఒకసారి మాత్రమే వచ్చిపోయే ఈ వాహనచోదకులకు ఈ చలాన్లు అందట్లేదు.. అందినా వారు పట్టించుకోవట్లేదు. భారీగా పెరిగిపోయిన పెండెన్సీ.. ఈ నేపథ్యంలో ఈ–చలాన్లు పెండెన్సీ భారీగా పెరిగిపోయింది. 2015–17 మధ్య నగర ట్రాఫిక్ విభాగం అధికారులు 101 ఉల్లంఘనలకు సంబ ంధించి వాహనచోదకులకు 95,71,466 చలాన్లు జారీ చేశారు. ఈ–సేవ, మీ–సేవ, కాంపౌండింగ్ బూత్, ఆన్లైన్, నిర్దేశిత బ్యాంకుల ద్వారా ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించే ఆస్కారం కల్పించినా ఉల్లంఘనులు 63,13,656 చలాన్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన 32,57,810 చలాన్లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు భారీ మొత్తం పెండింగ్‌లో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి వాహనచోదకుల కోసం ప్రత్యేకంగా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) విధానంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నగర ట్రాఫిక్ విభా గం అధికారులు భావిస్తున్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఇది సేవలు అందించనుంది. దీనికి కేటాయించే ప్రత్యేక నెంబర్‌కు ఫోన్ చేసే వాహనచోదకుడు తమ భాషను ఎంచు కుని, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు... దానిపై పెండింగ్‌లో ఉన్న చలాన్లు, ఎంత మొత్తం అనే వివరాలు కంప్యూటరే వివరించనుంది. కఠిన చర్యలు తీసుకుంటాం పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నాం. నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ చేతిలో ఉండే పీడీఏ మిషన్లతో అనునిత్యం వాహనాలను ఆపి పెండింగ్ చలాన్లు ఉన్నాయా? అనేది తనిఖీ చేస్తున్నారు. మూడు చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న వారు చిక్కితే వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకుని జరిమానా చెల్లించి వచ్చిన తర్వాత ఇస్తున్నాం. అలానే పది కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నాం. ఈ ఉల్లంఘనులకు న్యాయస్థానాలు భారీ జరిమానా విధిస్తున్నాయి. – అనిల్‌కుమార్, అదనపు సీపీ (ట్రాఫిక్) -
తప్పు ఒప్పుకున్న నటుడు.. ప్రశంసలు!
సాక్షి, ముంబై: సెలబ్రిటీలు చిన్న తప్పుచేసినా ఒప్పుకునేందుకు వారికి ధైర్యం చాలదు. ఎందుకంటే వారి పేరు, పరువు, పత్రిష్టలు అంటూ ఆలోచిస్తారు. కానీ బాలీవుడ్ నటుడు కునాల్ కేము తాను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన అంగీకరిస్తూ అందరికీ తెలిసేలా చేశాడు. తనకు బైక్స్ అంటే ఇష్టమని, కానీ కొన్ని సందర్భాల్లో హెల్మెట్ లేకుండా వెళ్తుంటానని, అలాంటి సందర్భంలో తీసిందే ఈ ఫొటో అంటూ కునాల్ ఓ ట్వీట్ చేశాడు. దగ్గర్లో ఉన్న ఇంటికి వెళ్లినా, లేక వేరే ప్రాంతానికి వెళ్తున్నామా అన్న దాంతో సంబంధం లేకుంగా కచ్చితంగా హెల్మెట్ ధరించాలంటూ పోస్ట్ చేయగా ముంబై పోలీసులు స్పందించారు. 'నీకు బైక్స్ అంటే ఇష్టం. మాకు ప్రజల భద్రతంటే ఇష్టము. మీ తప్పు ఒప్పుకోవడం ప్రమాదాలను నివారించదు కదా. మీకు రూ.500 ఈ- చలానా జారీ చేశాం. ఇంటికి త్వరలోనే వస్తుందంటూ' ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ఈ చలానా నెంబర్ వివరాలు వెల్లడించారు. అనిల్ కశ్యప్ అనే నెటిజన్ కునాల్ హెల్మెట్ లేకుండా వెళ్తున్న ఫొటోలను పోస్ట్ చేసి ఇతడికి చలానా కోరుకుంటున్నాడని ట్వీట్ చేయడంతో వార్తల్లో కెక్కాడు నటుడు. తప్పు ఒప్పుకుని, తాను మరోసారి తప్పుచేయనని ట్వీట్ చేసినందుకు నెటిజన్లు నటుడిని ప్రశంసించారు. అసలు ఎప్పుడో జరిగిన ఘటనకు ఇప్పుడు ఫైన్ వేస్తారా అని కొందరు ప్రశ్నించగా.. బైక్‌పై నెంబర్ ఎలా ఉందో పోలీసులు పట్టించుకుంటారా లేదా అని మరికొందరు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. I have seen this picture out there and honestly it’s very embarrassing given I love bikes and ride regularly and always with a helmet and some more gear but whether it’s a long ride or just next door a helmet should always be worn.apologies I don’t want to set the wrong example! pic.twitter.com/s8mDnmbTsv — kunal kemmu (@kunalkemmu) March 21, 2018 .@anilmanu1991 brought to our notice by your tweet, an e-challan Number MTPCHC1800225825 has been issued to the concerned pic.twitter.com/r1ui4krsQ9 — Mumbai Police (@MumbaiPolice) March 21, 2018 -
యాప్‌కీ కహానీ...
రవి ఎస్బీఐ చెక్‌బుక్ కోసం బ్యాంకుకు వెళ్లాడు. పార్కింగ్ స్థలం లేకపోవడంతో బైక్‌ను రోడ్డుపైనే ఆపాడు. పని అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత రోజూవారీ కార్యకలాపాల్లో బిజీ అయ్యాడు. ఒకరోజు రోడ్డుపై బైక్‌లో వెళ్తుంటే రవిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. డాక్యుమెంట్లు అడిగారు. చూపించాడు. అయితే హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో వారు జరిమానా వేసి పంపించారు. దాన్ని కట్టేదామని ఈ–సేవకు వెళ్లాడు. అక్కడ రవి షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని బైక్‌పై రెండు చలానాలు ఉన్నాయి. ఒకటేమో హెల్మెట్ది అయితే. మరొకటేమో పార్కింగ్‌కు సంబంధించినది. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే మన వాహనంపై చలానాలు ఏమైనా ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ‘తెలంగాణ ఇ–చలాన్’ అనే యాప్ అందుబాటులో ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆవిష్కరించింది. ఈ యాప్‌ను గూగూల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు ♦ వెహికల్ నంబర్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ సాయంతో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ♦ ట్రాఫిక్ పెండిగ్ చలానాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవచ్చు. ఉంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పొందొచ్చు. ♦ చలానా మొత్తాన్ని యాప్ ద్వారా చెల్లించొచ్చు. -
గీత దాటితే..ఇంటికే ఈ చలానా
ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీసుల ప్రత్యేక దృష్టి అమలులోకి ఈ చలానా విధానం రెండున్నర నెలల వ్యవధిలో 10,077 కేసులు నెల్లూరు(క్రైమ్): ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారు భారీ జరిమానాలు చెల్లించకతప్పని పరిస్థితి నెలకొంది. నెల్లూరుతో పాటు ప్రధాన పట్టణాల్లో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎస్పీ విశాల్‌గున్నీ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మెట్రో సిటీలకే పరిమితమైన ఈ చలానా విధానాన్ని తొలిసారిగా మే 6వ తేదీన నెల్లూరులో, జూన్ ఒకటిన కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట అమలులోకి తెచ్చారు. నగర, పట్టణాల్లోని ప్రధాన కూడళల్లో శాంతిభద్రతల అధికారులు, ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బృందం సభ్యులు పర్యటిస్తూ ఉల్లంఘనను ట్యాబ్(మల్టీపర్పస్ డివైజ్)లు, డిజిటల్ కెమెరాల్లో చిత్రీకరించి రెండు విభాగాల్లో ఈ–చలానా ద్వారా వాహనచోదకులకు జరిమానాలు విధిస్తున్నారు. భారీగా జరిమానాలు ఈచలానాతో వాహనదారుడు భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తోంది. గతంలో నోపార్కింగ్, పొల్యూషన్, సెల్‌ఫోను డ్రె వింగ్, రిజిస్ట్రేషన్ లేని, ఇన్సూరెన్స్లేని వారికి రూ. 100 నుంచి రూ. 500లోపు ఫైన్ విధించేవారు. ఇప్పుడు ఆపరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం నిర్దేశించిన జరిమానాలు విధిగా మీసేవ కేంద్రాల్లో చెల్లిస్తున్నారు. నోపార్కింగ్కు రూ.100, ఇన్సూరెన్స్‌కు రూ. 1,000, రిజిస్ట్రేషన్ లేకపోతే రూ. 2వేల నుంచి రూ.5వేల వరకు, సెల్‌ఫోను డ్రైవింగ్‌కు రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి వస్తోంది. జరిమానాలతో పాటూ యూజర్ ఛార్జీలను సైతం వాహనదారుడే చెల్లించాలి. కొందరు వాహనదారులకు తనిఖీల సమయంలోనే ఈచలానా బిల్లు చేతికి ఇస్తుండగా, డిజిటల్ కెమెరాల్లో పట్టుబడిన వారికి ఇళ్లకు ఈ చలానా పంపుతున్నారు. భారీగా కేసుల నమోదు ఈ చలానా విధానం అమలులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 10,077కేసులు నమోదయ్యాయి. అందులో ట్యాబ్(మల్టీపర్పస్ డివైజ్)ల ద్వారా 6,887, కెమెరాల ద్వారా 3,189 కేసులను నమోదు చేసి రూ 42,75,200 జరిమానా విధించారు. చల్లానా ఉల్లంఘునులపైనా చర్యలు జిల్లాలో ఇప్పటి వరకు 10,077కేసులు నమోదు కాగా అందులో 3,9098 కేసుల్లో వాహనదారులు మీసేవ కేంద్రాల్లో జరిమానా చెల్లించారు. 6,618 కేసుల్లో చలానాలు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. చలానాలు కట్టకపోతే ఏమి కాదన్న భ్రమలో వాహనదారులు ఉన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. వాహన తనిఖీల సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్‌ను ట్యాబ్‌లో కొట్టిచూస్తే ఎన్ని చలానాలు చెల్లించాల్సి ఉందో తెలుస్తోందనీ, మూడు చలానాలు చెల్లించకపోతే వాహనదారునిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పించుకు తిరగడం మాని చలానాలు చెల్లిస్తేనే మంచిదని అధికారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన...... ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై ఈచలానా విధించడంతోనే అధికారులు సరిపెట్టుకోవడం లేదు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, ఈచలానాపై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. నిబంధనలు పక్కాగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. -
ఈ-చలాన్లతో రిజిస్ట్రేషన్ చెల్లింపులు
► 15న ప్రారంభించేందుకు కసరత్తు ► ఎస్‌బీహెచ్‌తో రిజిస్ట్రేషన్ల శాఖ ఎంవోయూ సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపునకు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత చలానా పద్ధతికి స్వస్తి పలికి, ఇకపై ఈ-చలాన్ల ద్వారానే చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రకాల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం సొమ్ము చెల్లింపులో వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలను నివారించే దిశగా రిజిస్ట్రేషన్ల శాఖ ఈ-చలాన్ల ప్రక్రియ రూపొందించింది. దీని అమలుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)తో ఇప్పటికే శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 15న ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లందరికీ దశలవారీగా శిక్షణ ఇస్తున్నామన్నారు. తొలి దశలో హైదరాబాద్‌లో శిక్ష ణ పొందిన సబ్ రిజిస్ట్రార్లు... జిల్లాల్లో మిగిలిన సబ్రిజిస్ట్రార్లకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆన్లైన్ పేమెంట్స్‌కు ఎస్ఎస్ఎల్ బ్యాంకుల తో ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేందుకు అవసరమైన సెక్యూరిటీ సాకెట్ లేయర్ (ఎస్ఎస్ఎల్) సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ శాఖకు లభించింది. దీంతో ఎస్బీహెచ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా సొమ్ము చెల్లింపు, స్వీకరణ సేవలను వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న బ్యాంకు శాఖలో మాత్రమే వినియోగదారులు చలానాలు చెల్లించవలసి వచ్చేది. ఈ-చలాన్ల ప్రక్రియ అందుబాట్లోకి రావడంతో ఇకపై బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేకుండానే ఆన్లైన్లో లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 950 ఎస్బీహెచ్ బ్యాంకు శాఖల్లో ఎక్కడైనా స్టాంప్ డ్యూటీ చెల్లించవచ్చు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ పేరిట ఒకే ఖాతా నంబరుకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల సొమ్ము జమయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిద్వారా వినియోగదారుల చెల్లించిన సొమ్ము నేరుగా రిజిస్ట్రేషన ్ల శాఖకు చేరుతుంది. దొంగ చలాన్లకు చెక్... బ్యాంకులో లేదా ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా స్టాంప్ డ్యూటీ చెల్లించిన వినియోగదారులకు రశీదుతో పాటు 12 అంకెల కోడ్ నంబరును బ్యాంకు అందిస్తుంది. ర శీదు, బ్యాంక్ ఇచ్చిన కోడ్ నంబరును సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తే సరిపోతుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపు వివరాలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న డాక్యుమెంట్‌పై ముద్రించేలా అధికారులు చర ్యలు చేపట్టారు. దీంతో దొంగ చలాన్లను అరికట్టడంతో పాటు తాము చెల్లించిన మొత్తానికి వినియోగదారులకు భరోసాను కల్పించినట్లవుతుందని శాఖ భావిస్తోంది.