
ఆన్‌లైన్ జరిమానా వివరాలు
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలో విద్యానగర్‌కు చెందిన యూసుఫ్ హుస్సేన్ మహ్మద్‌కు చెందిన ఏపీ 13 ఇ 2646 నంబర్ గల సీడీ 100 బైక్‌కి హైదరాబాద్‌లో పోలీసులు జరిమానా విధించారు. స్థానిక అవసరాలకు మినహా బయటకు తీసుకెళ్లే అవసరం లేదని వాపోతున్నాడు. ఈనెల 12న ఉదయం 11.07 గంటలకు ఇదే నంబర్ గల వాహనం కుషాయిగూడ పీఎస్ పరిధిలోని ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్డులో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు ఆన్‌లైన్ జరిమానా రూ.1135 విధించారు. సమాచారం యూసుఫ్ సెల్‌ఫోన్‌కు వచ్చింది. ఆన్‌లైన్‌లో వాహన ఫొటోను పరిశీలించగా అదిగ్లామర్ వాహనంగా నిర్ధారించారు. ఇలాంటి వారిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని యూసుఫ్ పోలీసులను కోరుతున్నాడు.