RAJANNA
-
రూ.6,929 కోట్లతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రూ.6,929 కోట్ల వ్యయంతో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. సీఎం వైఎస్ జగన్ గతేడాది కంటే.. ఈ ఏడాది ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.784 కోట్లు అధికంగా కేటాయించారని వివరించారు. ఈ నిధులను సద్వినియోగం చేస్తూ.. గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని సమీక్షించారు. అన్ని రంగాల్లోనూ గిరిజనులు అభివృద్ధి సాధించాలన్నదే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే గతేడాది కంటే ఈ ఏడాది అధిక నిధులను కేటాయించారని చెప్పారు. 2022–23లో ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.6,144.90 కోట్లు మంజూరు చేయగా.. ఈ ఏడాది రూ.6,929.09 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ నిధులను పూర్తిగా గిరిజన సంక్షేమానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిధుల సద్వినియోగంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేలకు రహదారులు, తాగునీటి సరఫరా, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుçపరచాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ జె.వెంకటమురళి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. జీసీసీ సేవల విస్తృతానికి కొత్త వెబ్సైట్ గిరిజనులు, వినియోగదారులు, ఉద్యోగులకు అవసరమైన శీఘ్ర సేవలు, సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నూతన వెబ్సైట్ దోహదపడుతుందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ నూతన వెబ్‌సైట్‌ను రాజన్నదొర ప్రారంభించారు. సీఎం జగన్ సారథ్యంలో నాలుగేళ్లలో గిరిజన సాధికారత సాధనలో జీసీసీ అనూహ్యమైన, మంచి ఫలాలను గిరిజనులకు అందించిందని వివరించారు. గిరిజనులకు డీఆర్ డిపోల ద్వారా రేషన్ సరుకుల సరఫరా, పెట్రోల్ బంకుల ఏర్పాటు, వివిధ రాష్ట్రాల్లో రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు, వన్‌ధన్ వికాస కేంద్రాల ఏర్పాటు, అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో జీసీసీ చేస్తున్న కార్యక్రమాలను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ వెబ్సైట్ విశేషంగా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జీసీసీ అందిస్తున్న సేవలు, ఖర్చు చేస్తున్న నిధులు, ప్రణాళికలు, ఫలితాలు వంటి వివరాలు అన్నీ గణాంకాలతో సహా నూతన వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. జీసీసీ సహజ ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ షాపింగ్‌తో పాటు సోషల్ మీడియా వేదికలను ఈ నూతన వెబ్‌సైట్‌తో అనుసంధానించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జీసీసీ ప్రధాన కార్యాలయం సహా ప్రాంతీయ కార్యాలయాలు, ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచడంతో పాటు, పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యల్లో భాగంగా జీసీసీ సిబ్బంది బదిలీలు, ఉత్తర్వుల వివరాలతో పాటు టెండర్లు, నోటీసులు, ప్రకటనలు సమగ్రంగా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దాండే, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.మురళి, జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దుబాయి నుంచి వచ్చి.. భార్య ప్రియుడిపై.. పక్కా ప్లాన్‌తో రాత్రికి రాత్రే..
కరీంనగర్: భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలుసుకున్న భర్త దుబాయి నుంచి వచ్చి యువకుడిని హత్య చేశాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో సంచలనం సృష్టించింది. గ్రామస్తులు, చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన పడిగెల నరేశ్(27) అదే గ్రామానికి చెందిన వివాహిత(32)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వివాహిత బావ కుమారుడు లక్ష్మణ్ దుబాయ్‌లో ఉంటున్న ఆమె భర్త మల్లేశంకు తెలిపాడు. ఈనెల 3వ తేదీన గల్ఫ్ నుంచి వచ్చిన మల్లేశం ఇంటికిరాకుండా ఎక్కడో తలదాచుకున్నాడు. నరేశ్‌ను చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం రాత్రి నరేశ్ సదరు వివాహిత ఇంట్లోకి వెళ్లడం గమనించిన బావ కొడుకు లక్ష్మణ్ ఆమె భర్త మల్లేశంకు సమాచారం అందించాడు. మల్లేశం మాస్కులు ధరించి బైక్‌పై ఇంటికి చేరుకుని.. భార్యతో ఇంట్లో ఉన్న యువకుడిపై కత్తితో దాడి చేశాడు. మంచం పై నుంచి కింద పడ్డ నరేశ్‌పై పదే..పదే కత్తితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే హత్యకు పాల్పడ్డ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ కిరణ్‌కుమార, పలువురు ఎస్సైలు బుధవారం అర్ధరాత్రి ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మల్లేశం కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. హత్య జరిగేందుకు మరో నలుగురు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ వివరించారు. సాయంత్రం విందు.. అర్ధరాత్రి హత్య.. పడిగెల నరేశ్‌కు అదే గ్రామానికి చెందిన వివాహితతో ఐదేళ్ల క్రితమే వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే సమయంలో వివాహిత కుటుంబ సభ్యులకు, యువకుడి మధ్య గొడవలు జరుగడంతో నరేశ్ దుబాయి వెళ్లాడు. అక్కడే ఐదేళ్లపాటు ఉన్నాడు. గత ఆగస్టు 29న ఇంటికొచ్చిన నరేశ్ తిరిగి సదరు వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇది గమనించిన వివాహిత భర్త అన్నలతోపాటు వారి కుమారుడు ఈ విషయాన్ని గల్ఫ్‌లో ఉంటున్న మల్లేశంకు తెలిపారు. ఈనెల 3న దుబాయి నుంచి ఇండియా వచ్చిన మల్లేశం బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం వివాహిత కుటుంబ సభ్యులు బుధవారం యువకుడి ఇంట్లోనే విందు చేసుకున్నారు. తర్వాత యథావిధిగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. బంధువుల ఇంట్లో తలదాచుకున్న మల్లేశంను అదే సమయంలో స్వగ్రామానికి పిలిపించుకున్నారు. ఇది తెలియని యువకుడు రాత్రి అందరూ పడుకున్న సమయంలో వివాహిత వద్దకు వెళ్లాడు. గమనించిన లక్ష్మణ్ తన చిన్నాన్న మల్లేశంకు ఫోన్ చేయడంతో బైక్‌పై వచ్చి యువకుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు.. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లేశం పరారీకాగా.. అనుమానం ఉన్న ముగ్గురితోపాటు వివాహితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు సహకరించిన వారి వివరాలను కాల్‌డాటా ఆధారంగా సేకరిస్తున్నట్లు సమాచారం. వారం క్రితమే హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. పోలీసుల లుక్ఔట్ నోటీసు.. యువకుని హత్యలో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మల్లేశ దుబాయి నుంచి ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. హత్య చేసేందుకు ముందుగానే తిరిగి దుబాయి వెళ్లేందుకు సిద్ధమై.. రాత్రి 11 గంటల ప్రాంతంలో హత్యచేసి ఎయిర్‌పోర్టుకు అదే రాత్రి వెళ్లిపోయాడన్న ప్రచారంతో పోలీసులు లుక్ఔట్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. -
పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేతలు!
సిరిసిల్ల: సీపీఐ (ఎంఎల్) జనశక్తి పార్టీ అగ్రనేతలు కూర రాజన్న అలియాస్ రాజేందర్, కూర దేవేందర్ అలియాస్ అమర్, వెంకటేశ్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు విమలక్క, కొమురన్న, సంతోష్ గురువారం ప్రకటించారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తున్న రాజన్న, అతనితోపాటు ఉన్న వెంకటేశ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అమర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 12 రకాల అనారోగ్య సమస్యలతో ఉన్న కూర రాజన్నతోపాటు అతని సహాయకుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురికి సంబంధించిన ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. పోలీసులు వెంటనే వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి, ఏమైనా కేసులుంటే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. కాగా, కూర రాజన్న, అమర్, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం సమీపంలోని ఒక తోటలో విచారిస్తున్నట్లు తెలిసింది. -
Baby Annie Photos: హీరోయిన్గా మారిన 'రాజన్న' చిన్నారి ఆని (ఫోటోలు)
-
తెలంగాణ పుట్టుకను అవమానించింది మోదీ కాదా?: కేటీఆర్
సాక్షి, కరీంనగర్(సిరిసిల్ల) బీజేపీ దుర్నీతిని ప్రజల్లో ఎండగట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్ మిల్‌ను మంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను కేంద్రం ఓ శతృ దేశంలా చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణ పుట్టుకను అవమానించింది మోదీ కాదా అని ప్రశ్నించారు. శంలో వాళ్ల పార్టీ మాత్రమే బతకాలి మిగతా వాళ్లును చంపేయాలి అనే విధంగా వాళ్ల చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజన్ అంటే మోదీ అదానీ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ‘సీఎంను పట్టుకుని బ్రోకర్ అని బండి సంజయ్ అంటున్నాడు.. అదానీకి మోదీ బ్రోకర్ అని నేను అనగలను కానీ అలా అనను.. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది’అని వ్యాఖ్యానించారు. -
నాలుగేళ్ల చిన్నారిపై కుక్కల దాడి
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలకేంద్రంలో శుక్రవారం నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారికి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కోనరావుపేటకు చెందిన బొల్లె ఇసాక్–రూప దంపతుల కూతురు చరిష్మా(4) ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో తలపై తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందించారు. చిన్నారి ప్రస్తుతం క్షేమంగా ఉంది. వేతనాలు పెంచేలా కృషి చేయండి ముస్తాబాద్(సిరిసిల్ల): వేతనాలు పెంచి, రెగ్యులర్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ బీఎంఎస్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ మాట్లాడుతూ ఏళ్లుగా పారిశుధ్య కార్మికులు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి, రెగ్యులర్ చేయాలని కోరారు. జల్లి లక్ష్మణ్, పోష రాములు, రాములు తదితరులు ఉన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు, కార్యకర్తలు పోరాడాలని బీజేపీ అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్‌రెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో శుక్రవారం ప్రజాగోస కార్నర్ సమావేశం జరిగింది. సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శక్తి కేంద్రం ఇన్చార్జి యాదగిరి, నాయకులు శ్రీకాంత్, రవీందర్, రజిత, ప్రశాంత్, రవి, నరేశ్, రమేశ్, సాయి, సుధాకర్, నవీన్ పాల్గొన్నారు. నేడు విధుల్లో చేరనున్న డీఈవో రమేశ్‌కుమార్ సిరిసిల్లఎడ్యుకేషన్: మెదక్ జిల్లా డీఈఓగా పనిచేస్తున్న ఎ.రమేశ్‌కుమార్‌ను సిరిసిల్ల జిల్లా విద్యాధికారిగా బదిలీ అయ్యారు. ఆదర్శ పాఠశాలల అసిస్టెంట్ డైరక్టర్ ఉన్న రమేశ్‌కుమార్ ఇప్పటి వరకు మెదక్ జిల్లా విద్యాధికారిగా పనిచేశారు. ఇప్పటి వరకు డీఈగా పని చేసిన రాధాకిషన్ మెదక్ జిల్లా విద్యాధికారిగా బదిలీ అయ్యారు. డీఈవోగా రమేశ్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
కమిషనర్‌కు ఉద్యోగుల జాబితా
వేములవాడ: రాజన్న ఆలయంలో పనిచేస్తూ విజిలెన్స్ కేసులు, అవినీతి అక్రమాలు ఎదుర్కొంటున్న, క్రమశిక్షణారాహిత్యానికి గురైన 35 మంది ఆలయ ఉద్యోగుల జాబితాను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపించినట్లు ఆలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈనెల 18న కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ ఉద్యోగులు బదిలీపై వెళ్లిన ఉద్యోగులు, రిటైర్మెంట్లతో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయాలని కోరారు. సుదర్ఘీకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారితోపాటు విజిలెన్స్ కేసులు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు, క్రమశిక్షణారాహిత్యానికి గురైన వారి జాబితాను సిద్ధం చేసి ఇవ్వాలంటూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వేములవాడ రాజన్న ఆలయం నుంచి నలుగురు ఏఈవోలు, 14 మంది పర్యవేక్షకులు, 17 మంది సీనియర్ అసిస్టెంట్ల జాబితాను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపించినట్లు తెలిసింది. ఆమేరకు బదిలీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఆలయ ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. చాలా కాలంగా ఇక్కడే పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు వివిధ కేసులు, సస్పెన్షన్లకు గురైన ఉద్యోగుల్లో మరింత ఆందోళన పెరిగింది. -
శనివారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2023
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఎత్తుకున్నప్పటి నుంచి నేటి వరకు జిల్లాపై ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శిస్తున్నారు. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలకు గాను, 12 చొప్పున అసెంబ్లీ స్థానాలు సాధించి బలాన్ని చాటుకుంది. ఇప్పుడు కూడా పూర్వపు తరహాలోనే మెజారిటీ స్థానాలను కై వసం చేసుకోవాలని పార్టీ స్పష్టమైన ఆదేశాలు పంపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రులు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా వారంలో కనీసం ఆరురోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేలు అత్యవసరమైతే తప్ప.. ఇకపై నుంచి చీటికి మాటికి రాజధానికి రావాల్సిన అవసరం లేదని, నియోజకవర్గపు సమస్యలపై దృష్టి సారించాలని స్పష్టంచేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన దరిమిలా.. ఈ మేరకు అందరు ఎమ్మెల్యేలకు సీఎం, పార్టీ అధిష్టానం నుంచి సందేశం అందినట్లు సమాచారం. ఎమ్మెల్యేలపై నిరంతర నిఘా..! పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? స్థానికంగా ప్రజలకు ఎన్నిరోజులు అందుబాటులో ఉంటున్నారు? హైదరాబాద్‌లో ఎన్నిరోజులు ఉంటున్నారు? అన్న విషయాలపై నిరంతరం సమాచారం తెప్పించుకుంటున్నారు. వీటి ఆధారంగా వాటి పనితీరును ఆయన బేరీజు వేస్తున్నారని తెలిసింది. ఇటీవల సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ కూడా ఉమ్మడి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. గతవారం కొండగట్టు మాస్టర్ ప్లాన్ సందర్భంగా స్మితా సభర్వాల్ ఒకరోజు ముందే వచ్చారు. తాజాగా కరీంనగర్లో జరుగుతున్న తీగలవంతెన, ఎంఆర్ఎఫ్, స్మార్ట్‌సిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటలిజెన్స్, పార్టీ, ఇతర వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సీఎంవోకు రిపోర్టు అందుతూనే ఉంది. అందుకు అనుగుణంగా సీఎం నుంచి తగిన సూచనలు, సలహాలు వస్తూనే ఉన్నాయి. అన్ని పార్టీలు వస్తున్న క్రమంలో..! రాష్ట్రంలో పాత కరీంనగర్‌కు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, బీఎస్పీ, వైఎస్సార్ టీపీ తదితర పార్టీలన్నీ కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. తాజాగా వీటికి తోడుగా ఎంఐఎం కూడా చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం చేసిన పనులను ఎప్పటికప్పుడు ప్రజల కు వివరిస్తూ.. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సీఎం నుంచి సీనియర్ లీడర్ల ద్వారా ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యర్థి పార్టీల సంఖ్య, రాజకీయ పోటీ పెరుగుతున్న దరిమిలా.. నిరంతరం ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించినట్లు సమాచారం. -
ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో నెరవేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. హైదరాబాద్ నుంచి ఆమె శుక్రవారం సాయంత్రం మున్సిపల్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు, కంటివెలుగు, జీవో 58, 76 ప్రకారం క్రమబద్ధీకరణలు, పోడుభూములకు పట్టాల పంపిణీ, ఆయిల్‌పామ్ సాగుపై శాంతికుమార్ మాట్లాడారు. జిల్లాలోని అంశాలపై కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అమలుచేయాల్సిన అంశాలపై శాఖలవారీగా సమీక్షించారు. వేగంగా ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగాలన్నారు. అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, డీటీవో బాలమణి, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, జిల్లా ఉద్యానవన అధికారి జ్యోతి, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు పాల్గొన్నారు. -
మా భూములు మాగ్గావాలె..
ముస్తాబాద్(సిరిసిల్ల): మల్లన్నసాగర్ కెనాల్‌కు అవసరమైన భూములను తమకు తెలియకుండానే సేకరించడం సరికాదని ముస్తాబాద్ మండలం నామాపూర్ రైతులు పేర్కొన్నారు. తహసీల్దార్ మునీందర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతులు ఆర్డీవో శ్రీనివాస్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీకోడు నుంచి నామాపూర్‌కు వచ్చే మల్లన్నసాగర్ సబ్‌కెనాల్ ద్వారా ఇక్కడి రైతులకు ఉపయోగం లేదన్నారు. కెనాల్ కోసం నిర్వహించిన గ్రామసభల్లో ఇదే విషయం చెప్పామన్నారు. ఇప్పుడు తమ భూములకు చెక్కులు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అంగీకారం లేకుండా భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కెనాల్లో భూములు కోల్పోతున్న తమకు మరో ఆధారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం వద్దంటూ చెక్కులను తీసుకోలేదు. భూములకు బదులు మరోచోట ప్రభుత్వ భూములు కేటాయించాలని కోరారు. ఈవిషయంలో మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతులు డాకూరి నాగరాజు, రాజేశం, చెర్ల మల్లేశం, గూడ రాజిరెడ్డి, వెల్ముల రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. -
రేషన్‌డీలర్లకు గౌరవవేతనం ఇవ్వాలి
సిరిసిల్ల: రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ప్రకటించాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్‌కు రాష్ట్ర రేషన్ డీలర్లు శుక్రవారం వినతిపత్రం అందించారు. కరీంనగర్‌లోని ఆఫీస్‌లో రవీందర్‌సింగ్‌ను కలిసి ఈమేరకు రేషన్‌డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు వినతిపత్రం అందించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి రేషన్‌డీలర్ల సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రవీందర్‌సింగ్ తెలిపారు. త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు. రేషన్‌డీలర్ల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మండ్లు, ఉపాధ్యక్షుడు సావనపల్లి రాజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతరాజు రమేశ్, వెంకటేశ్వర్లు, రేషన్‌డీలర్ల సంఘం నాయకులు ఆకునూరి బాలరాజు, వావిలాల ఆనందం, నర్సయ్య, రాజు, గాజుల శ్రీనివాస్, బందం మధు, తాటి వెంకన్న పాల్గొన్నారు. -
నట్టల నివారణమందు పంపిణీ
చందుర్తి(వేములవాడ): నట్టల నివారణ మందును మూగజీవాల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాస్ కోరారు. చందుర్తి మండలం లింగంపేట, కట్టలింగంపేటల్లో శుక్రవారం నట్టల నివారణ మందును శుక్రవారం పంపిణీ చేశారు. 1635 గొర్రెలకు, 690 మేకలకు నట్టల నివారణ మందును తాగించారు. పశువైద్యాధికారి నితిన్‌కుమార్, వైద్యసిబ్బంది బాలకృష్ణ పాల్గొన్నారు. డీసీఎం వ్యాన్ బోల్తా వేములవాడరూరల్: వేములవాడ మండలం ఫాజుల్‌నగర్ శివారులో కూల్‌డ్రింక్స్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తాపడింది. వేములవాడ నుంచి కొండగట్టుకు కూల్‌డ్రింక్స్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. వ్యాన్ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేవు. -
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాస్
వేములవాడ: వేములవాడ వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం అధ్యక్షుడిగా బుస్స శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికల అఽధికారిగా ఎన్నంపల్లి గంగాధర్ వ్యవహరించారు. ఐదేళ్లపాటు బుస్స శ్రీనివాస్ అధ్యక్షుడిగా కొనసాగుతారని ప్రకటించారు. ఆమేరకు శుక్రవారం నిత్యాదానసత్రంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు సమావేశమయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న బుస్స శ్రీనివాస్ దంపతులను సన్మానించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నా కృష్ణ, పట్టణాధ్యక్షుడు రేణికింది అశోక్, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు కట్కం జనార్దన్, చకినాల అశోక్, చేపూ రి నాగరాజు, రమేశ్, కొండూరి సత్యనారాయణ, దై త కుమార్, వేణు, బుస్స బుచ్చిబాబు పాల్గొన్నారు. -
అంజన్నకే శఠగోపం
కొండగట్టు(చొప్పదండి): ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన, ఏళ్లచరిత్రగల కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వేకువజామున చోరీ జరిదింది. చోరీ చిన్నదే అయినా.. ఆలయ చరిత్రలో తొలిసారి కావడం కలకలం రేపుతోంది. అధికార యంత్రాంగం దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. సీఎం కేసీఆర్ ఇటీవల ఆలయాన్ని సందర్శించి అభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. అయితే, కొద్దిరోజుల తేడాతోనే దొంగలు చోరీకి పాల్పడడం విస్మయం కలిగిస్తోంది. దొంగతనం జరిగింది ఇలా.. శుక్రవారం వేకువజామున 1.10 గంటల ప్రాంతంలో ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు ఆలయంలోకి చొరబడ్డారు. 2.20గంటల వరకు తమ పనికానిచ్చేశారు. తొలుత ఆలయం వెనకాల ద్వారాల తాళాలు పగుల గొట్టారు. అనంతరం అంతరాలయంలోకి వెళ్లే దారికి అడ్డుగా ఉన్న తలుపుల పట్టీలు తొలగించి లోనికి ప్రవేశించారు. గర్భాయంలోని స్వామివారి కిరీటం, మకర తోర ణం, శ్రీరామ రక్షగొడుగులు, మకర తోరణ స్తంభం, రెండు శఠగోపాలు, కవచం, అంతారాలయ తోరణాలు, ,శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయలోని మరోరెండు శఠగోపాలు, మరికొన్ని వస్తువులను అపహరించారు. ఆలయంలోని హనుమాన్ విగ్రహంపై గల శంఖుచక్రం, బంగారు శ్రీరామ రక్ష తోకవారం, పదుకలు, ఉత్సవమూర్తి, అంతరాలయంలని తోరణం, శ్రీలక్ష్మీఅమ్మవారి ఆలయంలోని వెండి తోరణం, పాదుకలు, శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని శ్రీరామ పట్టాభిషేకం వస్తువుల జోలికి వెళ్లలేదు. మొత్తంగా 15కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని, వీటి విలువ సుమారు రూ.9లక్షల విలువ ఉంటాయని ఈవో వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం.. ఆలయానికి పటిష్టమైన భద్రత లేదు. ఉన్న ఒక అధికారి కూడా రాత్రి సమయాల్లో అందుబాటులో ఉండడంలేదు. దీంతో సిబ్బంది తమకు ఇష్టమైనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. భక్తులు నిత్యం గర్భాలయంలోకి రావడం, వారితోనే అధికారులు, అర్చకులు పనులు చేయించుకోవడం, అధికారులు, సిబ్బంది చేయాల్సిన విధులను సెక్యూరటీ గార్డులు, ఇతర వ్యక్తులతో చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈవో, ఆలయ సూపరింటెండెంట్ పర్యవేక్షణ లోపం ఇందుకు కారణమని అంటున్నారు. మొత్తంగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడం పెద్దలోపంగా కనిపిస్తోంది. 12మందితో సెక్యూరిటీ.. ఆలయంలో భద్రతా చర్యలు చేపట్టేందుకు 12 హోంగార్డులు ఉన్నారు. వీరు ఉదయం 6గంటల – 6 గంటల వరకు ఆరుగురి చొప్పున విధులు నిర్వర్తిస్తారు. రాత్రివేళలో నలుగురు హోంగార్డులు విధుల్లో ఉంటారు. రోజూ మాదిరిగానే రాత్రి వరకు ఓ హోంగార్డు విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత తన గదికి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ముగ్గురు దొంగలు ఆలయంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయాన్నే ఆలయాన్ని శుభ్రపరచడానికి వెళ్లిన స్వీపర్లు.. గర్భాయంలో కోతులు ఉండటం, సామగ్రి చెల్లాచెదురుగా పడిఉండడాన్ని గమనించారు. వెంటనే ఆలయ ఉపప్రధాన అర్చకుడు చిరంజీవస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆలయ ఈవో వెంకటేశ్‌కు సమాచారం అందించారు. ఆలయ ఈవో ఘటపై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన డాగ్‌స్క్వాడ్.. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆలయానికి చేరుకున్నారు. భేతాళస్వామి ఆలయ పరిసరాల్లో డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. నిత్యం స్వామి వారికి వినియోగించే సాగర్ గెస్ట్‌హౌస్ సమీపంలో హనుమాన్ కవచానికి సంబంధించిన ఓ ఫ్రేమ్‌ను వారికి దొరికింది. ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం, సైబర్ టీం ఆల య పరిసరాల్లో అణువణువూ క్షుణ్ణంగా పరిశీ లిస్తోంది. భక్తుల కోరికలు తీర్చే అంజన్న ఆలయంలోనో దొంగతనం జరగడం బాధాకరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తామన్న సమయంలో ఇలా దొంగతనం జరగడం విషాదకరమన్నారు. 10 బృందాలతో గాలింపు డీఎస్పీ ప్రకాశ్ నేతృత్వంలో 10 పోలీసు బృందాలు దొంగల కోసం గాలిస్తున్నాయి. ఇందులో నలుగురు సీఐలు, 15 మంది ఏఎస్సైలు ఉన్నారు. జగిత్యాలక్రైం/కొండగట్టు(చొప్పదండి): విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దోపిడీలో పాల్గొన్న దొంగలు ఉత్తరభారతీయులు లేదా పొరుగు రాష్ట్రంవారు అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైన వీడియోల ఆధారంగా.. పోలీసులు ఈ మేరకు నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. ఆలయం వెనక భాగాన ఉన్న భేతాళుడి గుడి నుంచి దొంగలు తలుపులు బద్దలు కొట్టినట్లు గుర్తించారు. చూసేవారికి అనుమానం రాకుండా సెక్యూరిటీ గార్డులను తలపించేలా డ్రెస్సింగు వేసుకుని, చేతిలో లాఠీలు పట్టుకున్నారు. సీసీ కెమెరాల్లో ముఖాలు కనబడకుండా తలలకు మంకీ క్యాపులు ధరించి, ఒంటిని పసుపురంగు శాలువాలతో కప్పుకున్నారు. తలుపులు బద్దలు కొట్టేందుకు వీలుగా ఉండే రెంచ్‌లు, ఇతర పనిముట్లను శాలువాల చాటును లోనికి తీసుకువచ్చారు. వీరి కదలికలు ఆహార్యం, ఆకారాలను బట్టి వీరు ఉత్తరభారతీయులుగా అనుమానిస్తున్నారు. వారంరోజులుగా జిల్లాలో వరుసగా జరుగుతున్న ఆలయాల చోరీలకు, వీటికి ఏదైనా లింకుందా లేదా? అన్న విషయాలను సైతం పోల్చిచూస్తున్నారు. రాత్రిపూట వెండి తాపడాలను పనిముట్లతో తొలచుకుపోయినా ఎలాంటి చడీచప్పుడు రాకుండా జాగ్రత్తపడ్డారంటే వీరంతా పక్కా ప్రొఫెషనల్ గ్యాంగ్ అన్న నిర్ధరణకు వచ్చారు. వీరికి సంబంధించిన కీలక సమాచారం కూడా పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. వీరు మహారాష్ట్రవైపు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులపై చర్యలు..! ఈ క్రమంలో ఆలయానికి రాత్రిపూట భద్రత కల్పించిన పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు విధుల్లో అలసత్వం వహించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగలను గుర్తించిన పోలీసులు? ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పోలీసులు ఎట్టకేలకు గుర్తించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సీసీపుటేజీల్లో రికార్డుల ప్రకారం దొంగలను పోలీసులు గుర్తించి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా వారి ఉన్న ఆచూకి కూడా కనుగొన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వీరి అరెస్టును పోలీసులు ధ్రువీకరిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమైన కదలికలు సెక్యూరిటీ గార్డులు, భక్తుల్లా డ్రెస్సింగ్ చోరీ అనంతరం మహారాష్ట్ర వైపు ప్రయాణం? పోలీసుల వద్ద కీలక సమాచారం ఆలయంలో దొంగతనం జరగడం చాలా బాధాకరం. ప్రాయశ్చిత్తం కోసం హోమం, మూడు దేవతలకు 11లీటర్ల పాలతో అభిషేకం, 1008 నామాలతో పూజలు నిర్వహించాం. ఆ తర్వాతనే భక్తులకు అనుమతించాం. – జితేంద్రప్రసాద్, అర్చకుడు, కొండగట్టు ఆలయం -
కొండచిలువల కలకలం
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలంలోని మామిడిపల్లిలో శుక్రవారం రెండు భారీ కొండచిలువ కలకలం సృష్టించాయి. మామిడిపల్లి శివారులోని చిన్నన్న –పెద్దన్న చెరువు వద్ద గల చెట్లపై రెండు కొండచిలువలు శుక్రవారం రైతులకు కనిపించాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా గొర్లు, మేకలు మేతకోసం వస్తుంటాయి. చెట్లపై కనిపించడంతో గొర్లకాపరులు ఆందోళన చెందారు. మేకల మందపై దాడి చేసేందుకే వచ్చినట్లు కాపరులు భావిస్తున్నారు. అటువైపు వెళ్లే కాపరులు, ఉపాధిహామీ కూలీలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. బాల్యమిత్రుని భార్య వైద్యానికి ఆర్థిక సహాయం చందుర్తి(వేములవాడ): క్యాన్సర్‌తో బాధపడుతున్న బాల్య మిత్రుని భార్య వైద్యానికి పదోతరగతికి చెందిన మిత్రులు ఆర్థిక సహాయాన్ని అందించి శుక్రవారం అండగా నిలిచారు. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన మ్యాదరి లక్ష్మణ్ భార్య విజయ క్యాన్సర్‌తో బాధపడుతోందన్న విషయం తెలుసుకున్న పదోతరగతి వరకు కలిసి చదువుకున్న మిత్రులు తమ వంతు సహాయంగా రూ.20వేల నగదు అందజేశారు. 1989–90 విద్యా సంవత్సరంలో చందుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న మోతె రాములు, ఈగ శ్రీనివాస్, బీరెల్లి రామారావు, తాటికొండ కృష్ణహరి కలిసి రూ.20వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. పెనంమడుగు షట్టర్లు అపహరణ పోలీసులకు ఫిర్యాదు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం శివారులోని పెనంమడుగు నుంచి ఆయకట్టు భూములకు వచ్చే సాగునీటి కాలువ తూము షెట్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం అటువైపు వెళ్లిన రైతులు గమనించి నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏఈ వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సింగారం గ్రామంలోని ఆయకట్టు భూముల కు సాగునీరందించే కాలువ రెండు షట్టర్లను ఎత్తుకెళ్లడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నా రు. వెంటనే పోలీసులు దొంగలను పట్టుకొని, షె ట్టర్లను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. పో లీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మాటలు కలిపి.. బంగారు చైన్ అపహరణ
సిరిసిల్లక్రైం: తన స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్న వృద్ధురాలితో మాటలు కలిపి తన బైక్‌పై ఊరిలో దిగపెడాతనని తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడి ఆమె మొడలోని రెండు తులాల బంగారు చైన్‌తోపాటు ఇంటిలోని నగదును ఎత్తుకెళ్లాడు ఓ ప్రబుద్ధుడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఉపేందర్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన అల్లెపు కృష్ణ తొమ్మిదేళ్లుగా దొంగతనాలు చేస్తూ చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఈనెల 23వ తేదీన నేరెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒంటరిగా ఉన్న తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌కు చెందిన ఏనుగు కమలమ్మను గమనించాడు. ఆమెతో మాటలు కలిపి.. వృద్ధురాలి కొడుకు తనకు పరిచయమని నమ్మించాడు. ఇంటి వద్ద దించుతానని తన బైక్‌పై ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి పింఛన్ పెంచుతానని నమ్మించాడు. ఆధార్‌కార్డు, బ్యాంకుఖాతా కోసం వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లగా.. వెనుకనే వచ్చిన కృష్ణ ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కొన్నాడు. అంతేకాకుండా ఇంట్లో దాచి ఉంచిన రూ.10వేల నగదు తీసుకుని వెళ్తుండగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించి కమలమ్మను నెట్టివేశాడు. అంతేకాకుండా ఎవరితోనైన చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు తంగళ్లపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న కృష్ణ వివరాలు సేకరించి శుక్రవారం బద్దెనపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద పట్టుకొని, రిమాండ్‌కు తరలించారు. దొంగలించిన బంగారు చైన్‌ను ముత్తూట్ ఫైనాన్స్‌లో కుదువపెట్టగా.. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
అర్హులకు రేషన్‌కార్డులు ఇవ్వాలి
సిరిసిల్లటౌన్: జిల్లాలోని అర్హులకు రేషన్‌కార్డులు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు. చాలా మంది అర్హులు కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. 2017 నుంచి రేషన్‌కార్డులు అందించకుండా సర్కారు తాత్సారం చేయడం దారుణమని పేర్కొన్నారు. పంతం రవి, సోము నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇసుక వాహనాలు పట్టివేత ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ముస్తాబాద్‌లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామని ఆర్ఐ శ్యామ్ తెలిపారు. మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న గండిలచ్చపేట, ముస్తాబాద్‌కు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇసుక వాహనం పట్టివేతఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మానేరువాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించామని ఎస్సై తెలిపారు. నారాయణపూర్‌కు చెందిన శివరాత్రి మహేశ్ అనే ట్రాక్టర్ యజమానితోపాటు డ్రైవర్ రాజన్నపేటకు చెందిన శివరాత్రి నర్సింలుపై కేసులు నమోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఖరీదైన వైద్యం అందక కూలీ మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన దినసరి కూలి బెస్త పద్మయ్య(50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రులు తిరిగిన రోగం నయంకాలేదు. ఖరీదైన వైద్యం అందక ఇంటి వద్దనే ఉండగా.. పరిస్థితి విషమించి శుక్రవారం ప్రాణాలు వదిలాడు. పద్మయ్య భార్య పద్మ పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. కూతురు స్వర్ణలత పెళ్లి చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పద్మయ్య ఏడాది క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎవరూ లేకపోవడంతో తిండి సరిగ్గా దొరక్క ఆరోగ్యం క్షీణించి మరణించాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దహన సంస్కారాల నిర్వహణకు సర్పంచ్ కొండపురం బాల్‌రెడ్డి రూ.5వేలు, మానుక కిషన్ రూ.2వేలు, మరి కొందరు సాయం చేశారు. -
ఎస్పీని కలిసిన కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు శుక్రవారం కలిసి సన్మానించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ప్రతినిధులు ముస్కు మల్లారెడ్డి, బొడ్డు నారాయణ, బి.మదన్ పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్‌గా కస్తూర్భా విద్యార్థినులు సిరిసిల్లఎడ్యుకేషన్: రాజస్థాన్‌లోని రోహత్ జిల్లా పాలి గ్రామంలో జరిగిన 18వ నేషనల్ జంబూరికి వెళ్లిన కేజీబీవీ విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించడంతో ఓవరల్ చాంపియన్‌గా నిలిపారు. విద్యార్థులను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ శుక్రవారం అభినందించారు. వీర్నపల్లి, రుద్రంగి కేజీబీవీల నుంచి నలుగురి చొప్పున ఈ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమంలో భాగంగా ఫోక్‌డ్యాన్స్, మార్చ్ఫాస్ట్, కలర్పార్టీ, ట్రెక్కింగ్ వంటి పోటీల్లో పాల్గొన్నారు. ఎస్ఎస్ఏ కో–ఆర్డినేటర్ పద్మజ, డిస్ట్రిక్ట్ గైడ్ ఆర్గనైజింగ్ కమిషనర్ నీలిమ, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ సురేశ్, గైడ్ టీచర్ స్రవంతి, కేజీబీవీ విద్యార్థినులు పాల్గొన్నారు. -
జోరుగా కలప అక్రమ రవాణా
చందుర్తి(వేములవాడ): అటవీ ప్రాంతం నుంచి టేకు కలప అక్రమంగా రవాణా జోరుగా సాగుతోంది. చందుర్తి అటవీ ప్రాంతం నుంచి కలపను ట్రాక్టర్లో తరలిస్తున్న పట్టించుకునేవారు లేరు. చందుర్తి మండలం తిమ్మాపూర్ శివారు నుంచి శుక్రవారం టేకు దుంగలను ట్రాక్టర్లో తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది గ్రామంలో ఉన్నారనే సమాచారంతో ట్రాక్టర్‌ను దారిమళ్లించారని తెలిసింది. ఇలా నిత్యం టేకు కలప తరలిపోతోందని మండలంలోని అటవీ గ్రామాల వారు చర్చించుకుంటున్నారు. అటవీశాఖలో పనిచేస్తున్న సిబ్బందిని కొందరు స్మగ్లర్లు మచ్చిక చేసుకుని విలువైన టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిమ్మాపూర్‌లో టేకు కలపను పట్టుకున్నారన్న గ్రామస్తుల సమాచారంతో సంబంధిత బీట్ అధికారి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఎఫ్ఆర్ఓ ఖలీలొద్దీన్ను వివరణ కోరగా తమకు సమాచారం లేదన్నారు. -
పెళ్లింట విషాదం..
నిర్మల్/కడెం: పెళ్లిపందిరి ఇంకా పచ్చగానే ఉంది. పెళ్లికూతురు కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లి సంబురం తీరనేలేదు. ఇంతలోనే.. ఆ పచ్చటిపందిరి కింద పెళ్లికూతురు, ఆమె తండ్రి విగతజీవులై ఉన్నారు. ఈ హృదయవిదారక ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో చోటుచేసుకుంది. పాత మద్దిపడగకు చెందిన కొండ రాజన్న(50), వసంత దంపతులు. వీరి ఏకైక సంతానం మౌనిక(22). రాజన్న ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి ఏడాది క్రితమే తిరిగివచ్చారు. భార్య వసంత ఊళ్లోనే కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని నడిపేది. మౌనిక హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షా సమీపంలోని రాజూరాకు చెందిన సింగరేణి ఉద్యోగి జనార్దన్‌తో మౌనికకు ఈ నెల 25న పెళ్లి జరిగింది. పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. 27న రాజూరాలో జనార్దన్ కుటుంబం ఏర్పాటు చేసిన రిసెప్షన్లో రాజన్న కుటుంబంతోపాటు బంధుమిత్రులంతా పాల్గొన్నారు. అనంతరం నవదంపతులతోపాటు అదేరోజు రాత్రి పాతమద్దిపడగకు బయల్దేరారు. సరిగ్గా పదినిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా అనుకోని ఘోరం జరిగింది. కడెం ప్రాజెక్టు దిగువన పాండ్వాపూర్ బ్రిడ్జి వద్ద వీరు ప్రయాణిస్తున్న ఎర్టిగ వాహనం రాంగ్రూట్లో వెళ్లి కల్వర్టు మూలను బలంగా ఢీకొంది. వాహనం పల్టీలు కొడుతూ రోడ్డు దిగువన పడిపోయింది. అర్ధరాత్రి కావడంతో అందరూ నిద్రమత్తులోనే ఉన్నారు. తేరుకునేలోపే భర్త భుజంపై తలవాల్చి పడుకున్న కొత్త పెళ్లికూతురును మృత్యువు మింగేసింది. తన బిడ్డను విడిచి ఉండలేనన్నట్లు రాజన్న కూడా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. వసంత, జనార్దన్‌కు స్వల్పగాయాలయ్యాయి. బంధువుల అమ్మాయికి, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అమ్మాయి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. అతివేగం, నిద్రమత్తు.. వాహనం అతివేగంగా వెళ్తుండటంతోపాటు డ్రైవర్‌ను నిద్రమత్తు ఆవరించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కడెం ప్రాజెక్టు కిందకు పల్టీ కొట్టిన వాహనం నదికి కొంతదూరంలోనే ఆగింది. అది నది నీళ్లలో పడి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెప్పారు. -
అయ్యాసార్లు కాళ్లు మొక్కుతా.. పింఛన్ ఇయ్యిండ్రి..
సాక్షి, తంగళ్లపల్లి(కరీనంగర్): మంచానికే పరిమితమైన తల్లిదండ్రులకు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని తనయుడు వేడుకుంటున్నాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక కనీసం ఒక్కపూట భోజనం అందించలేని స్థితిలో ఉన్నానని ఆర్థికసాయంకోసం ఎదురుచూస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పెకుడ యాదయ్య(58) –రాదవ్వ(54) దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు అంజమ్మ, మమత, కొడుకు రాజు సంతానం. కూతుర్ల వివాహాలుకాగా 22 ఏళ్ల కొడుకు రాజు అవివాహితుడు. పదేళ్లక్రితం రాదవ్వ వ్యాధిబారిన పడి రెండుకాళ్లు పని చేయకుండా మంచానపడింది. యాదయ్య, రాజు ఇన్నాళ్లూ బతుకు బండి లాగిస్తున్నారు. ఒకరు పనికి వెళ్తే మరొకరు రాదవ్వను చూసుకునేవారు. కుటుంబంపై విధి పగబట్టింది. యాదయ్య కూడా రెండునెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వీరిద్దరి బాధ్యత రాజుపై పడింది. ఆకలితో పోరాటం రాజు బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పార్కులో పవర్లూమ్ కార్మికుడిగా, టాకాలు పట్టే కార్మికుడిగా, వాచ్‌మన్‌గా పనులు చేశాడు. నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు వచ్చేవి. తల్లిదండ్రుల మందులకే రూ.10 వేలు ఖర్చు అయ్యేవి. ప్రస్తుతం తల్లిదండ్రులను వదిలి పనికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. ఆర్థికపరిస్థితి క్షీణించింది. తినడానికి తిండి లేని దుస్థితి ఏర్పడింది. తోడబుట్టిన వారు పలుమార్లు ఆర్థికంగా ఆదుకున్నా..నెలకు రూ.10 వేలు మందులకు ఖర్చు అవుతుండడం రాజుకు భారంగా మారింది. వ్యవసాయ కాలేజీ నిర్మాణంలో పోయిన భూమి పెకుడ యాదయ్యకు జిల్లెల్ల శివారులో 1 ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమి ఉండగా వ్యవసాయ కాలేజీ నిర్మాణ సమయంలో ప్రభుత్వం తీసుకుంది. రాళ్లు రప్పలు కలిగిన ప్రాంతంలో 1:20 ఎకరం భూమిని ప్రభుత్వం ఇవ్వగా అది వ్యవసాయ యోగ్యంకాకపోవడంతో ఎందుకు పనిరాకుండా ఉంది. రాదవ్వ అంగవైకల్యంతో బాధపడుతుండగా, యాదయ్య రెండునెలలుగా కాళ్లు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. వీరిద్దరు పింఛన్ పొందేందుకు అర్హులు. కాళ్లు మొక్కుత పింఛన్ ఇయ్యిండ్రి.. అయ్యాసార్లు కాళ్లు మొక్కుతా..పదేండ్ల సంది మంచంలనే ఉంటున్న. ఒక్క పోరడు కన్న తండ్రి లెక్క అన్ని చేస్తుండు. తినడానికి తిండి కూడా లేదు దయచేసి పింఛన్ ఇప్పిస్తే ఒక్కపూట తిండైనా దొరుకుతది. – పెకుడ రాదవ్వ, జిల్లెల్ల ఆదుకోండ్రి సారు అమ్మనాయినలను కాపాడుకుంటా దయచేసి ఆర్థికంగా సాయాన్ని అందించండి. ప్రభుత్వం తరఫున ఏదైనా ఆర్థికసాయం చేయండి. చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తే నా తల్లిదండ్రులను సాదుకుంటా..సాయం చేయండి. పేదరికంలో ఉన్నాం. దాతలు ఆదుకోండి. – పెకుడ రాజు, జిల్లెల్ల -
వెబ్ చానెల్లో అవకాశం అంటూ రూ.10 లక్షలకు టోపి..
సాక్షి, సిరిసిల్లక్రైం(కరీంనగర్): వెబ్‌చానల్‌లో రిపోర్టర్‌గా అవకాశం కల్పిస్తానని నమ్మబలికి తలా రూ. 10 వేలు మొత్తం 100 మంది వద్ద రూ.10 లక్షలు వసూలు చేసిన సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితుడైన జగిత్యాల జిల్లా చెందిన శ్రీనివాస్ మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల ఇలా అనేక జిల్లాలో రిపోర్టర్లను నియమించుకున్నట్లు చెప్పారు. ఒక వెబ్‌చానల్ చిరునామా తీసుకొని మోసానికి పాల్పడినట్లు వాపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి చిరునామాకు వెళ్లినట్లు తెలిసింది. అప్పటికే రంజిత్ పరార్ అయినట్లు సమాచారం. ఇదే రంజిత్ గతంలో ఫొటోషూట్ కోసం పలురకాల కెమెరాలు అద్దెకు తీసుకుని, ఇతరులకు అమ్ముకున్నాడని కేసు నమోదు అయింది. -
మార్ట్ లో మాయాజాలం.. ఎమ్మార్పీ కన్నా డబుల్..
సాక్షి, సిరిసిల్ల: మార్ట్‌లో తక్కువ ధరలకు వస్తువులు దొరుకుతాయన్న కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సిరిసిల్లలో ఎమ్మార్పీ కన్నా అధికంగా వసూలు చేయడం కలకలం రేపింది. లీగల్‌మెట్రాలజీ అధికారి రూపేశ్‌కుమార్ బుధవారం జరిపిన దాడుల్లో ఈ విషయం నిర్ధారణయ్యింది. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మోర్ సూపర్‌మార్ట్, రాఘవేంద్ర ఎలక్ట్రికల్స్‌తోపాటు మరో రెండు గ్యాస్‌స్టౌవ్‌లు విక్రయించే దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలిపారు. మోర్ మార్టులో హార్లిక్స్ బాటిల్‌పై రూ.111 ధర ఉండగా ఓ కస్టమర్‌కు బిల్లులో రూ.114 వేశారు. అప్పటికే మార్టులో తనిఖీలు చేస్తున్న రూపేష్‌కుమార్ దృష్టికి సదరు కస్టమర్ ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మిగతా మూడు దుకాణాల్లో ఎమ్మార్పీ, తయారీదారు చిరునామాలు సరిగ్గా లేకపోవడంతో రూ.13వేలు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. వ్యాపారులు అధిక ధరలకు వస్తువులు అమ్మితే.. అడ్రస్ లేకుండా వస్తువులను అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: అమ్మపార్టీలో.. చిన్నమ్మ భయం -
Mission Kakatiya: అంతా మాఇష్టం.. రూ.137.46 కోట్ల నిధులు ‘నీళ్ల ’పాలు..
‘పక్క చిత్రం సిరిసిల్ల పట్టణ శివారులోని చంద్రంపేట ఈదుల చెరువు. మిషన్‌కాకతీయ మొదటి దశలో రూ.40 లక్షలతో చెరువులో పూడికతీసి, కట్టను బలోపేతం చేసి మత్తడి నిర్మించాల్సి ఉంది. చెరువులో మట్టితీసి కొంతమేరకు కట్టపై పోసి, మత్తడి కట్టారు. కట్టపై మొరం పోశారు. ఇది రికార్డుల్లో నమోదైన వివరాలు. కానీ ఇదే చెరువులో ఉపాధిహామీ పథకంలో గత ఏడేళ్లుగా స్థానిక కూలీలు మట్టిని తీశారు. ఉపాధిహామీ పథకంలో కూలీలు తవ్విపోసిన మట్టిగుంతలనూ సైతం మిషన్‌కాకతీయలో రికార్డు చేసి కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని నొక్కేశారు. ఇప్పుడు వర్షాలు పడడంతో చెరువులో నీరు చేరింది. మిషన్ కాకతీయలో చేసిన పనులకు లెక్కలు లేకుండా పోయాయి. రికార్డుల్లో మాత్రం పూడిక మట్టి తీసినట్లుగా నమోదు చేసి బిల్లు చెల్లించారు. ఇప్పుడెవరైనా పనుల లెక్కలు చూద్దామంటే నిండిన చెరువులోనే లెక్కలన్నీ పూడుకుపోయాయి.’ ‘ఇది ముస్తాబాద్‌లోని పెద్ద చెరువు. దీని ఆయకట్టు 400 ఎకరాలు. 2016లో మిషన్‌కాకతీయలో భాగంగా చెరువుకు రూ.35 లక్షలతో మరమ్మతులు చేశారు. పనులు చేసిన ఆరు నెలలకే 2016 సెప్టెంబర్‌లో వర్షాలకు చెరువు కట్ట తెగిపోయింది. కాంట్రాక్టర్ల నాసిరకం పనులకు ముస్తాబాద్ పెద్ద చెరువు ఉదాహరణగా నిలుస్తుందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. మళ్లీ ఇదే పెద్ద చెరువును రూ.6 కోట్లతో గండిని పూడ్చి మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశారు. ఇప్పుడు నిండిన నీటితో ముస్తాబాద్ పెద్ద చెరువు కళకళలాడుతోంది.’ సాక్షి, సిరిసిల్ల: పూడుకుపోయిన చెరువులు, కుంటల్లో మట్టిని తొలగించి, కట్టలను బలోపేతం చేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్‌కాకతీయ (మన ఊరు.. మన చెరువు)కు శ్రీకారం చుట్టింది. దశలవారీగా జిల్లాలోని చెరువులను బలోపేతం చేసి ఆయకట్టుకు నీరందించాలని, భూగర్భ జలాల పెంపునకు చెరువులు దోహదపడతాయని ఆశించింది. కానీ క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నేతలే కాంట్రాక్టర్లుగా మారారు. చెరువుల్లో పూడిక తీ యకుండానే తీసినట్లుగా రికార్డులు చేశారు. కొన్ని పనుల్లో నాణ్యత లోపించింది. మొక్కుబడిగా పనులు చేసి ప్రజాధనాన్ని నొక్కేశారు. కాంట్రాక్టర్లు, అధికారులు ఒక్కటై లక్ష్యాన్ని నీరుగారించారు. మిషన్‌కాకతీయ బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారులను ఏకంగా అవినీతి నిరో ధకశాఖకు పట్టించే స్థాయికి చేరింది. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ కాకతీయ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. పనుల ఆనవాళ్లు.. నీళ్లపాలు జిల్లాలో మిషన్‌కాకతీయ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. అనుభవం లేని కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు, చెరువును బాగుచేసే పనిని పొందడం, అధికారులతో ఒప్పందం చేసుకుని పనులు చేయకుండా జాప్యం చేశారు. మరోవైపు గతంలో ఉపాధిహామీ పథకంలో చేసిన పనులను రికార్డు చేయించుకుని ప్రజాధనాన్ని దండుకున్నారు. కాంట్రాక్టర్లు ఎక్కువ మంది అధికార పార్టీ నేతలే కావడంతో ఇరిగేషన్ అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆ చెరువుల్లో పనులను తనిఖీ చేస్తామన్నా నీటితో నిండడంతో పూడిక తీసిన ఆనవాళ్లు.. నీటి అడుగున కనిపించకుండా పోయాయి. మొక్కుబడి పనులతో ఆయకట్టు రైతులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. మి షన్కాకతీయ జిల్లాలో స్లోగా సాగింది. మరోవైపు ఇంకా పనులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. జిల్లాలో కేటాయింపులు ఇలా.. మొదటి దశ: జిల్లాలోని 104 చెరువుల్లో పనులు చేసేందుకు రూ.20.13 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.19.98 కోట్లు ఖర్చు చేసి 12,982.39 ఎకరాల ఆయకట్టు రైతులకు మేలు చేసినట్లు రికార్డులు చేశారు. రెండో దశ: 117 చెరువులను బాగుచేసేందుకు రూ.85.23 కోట్లు కేటాయించారు. ఇందులో 105 చెరువులకు రూ.53.10 కోట్లు ఖర్చు చేశారు. 8,789 ఎకరాల ఆయకట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు రికార్డులు చేశారు. మూడో దశ: 69 చెరువుల్లో పనులు చేసేందుకు రూ.24.20 కోట్లు కేటాయించారు. ఇందులో 68 చెరువుల్లో పనులు ప్రారంభించి 57 చోట్ల పూర్తి చేశారు. రూ.11.76 కోట్లు ఖర్చు చేసి 12,791 ఎకరాలకు మేలు జరిగినట్లు స్పష్టం చేశారు. నాలుగో దశ: జిల్లాలో 46 సాగునీటి వనరులను బాగు చేసేందుకు రూ.7.90 కోట్లు కేటాయించారు. 22 చెరువుల్లో రూ.2.98 కోట్లు ఖర్చు చేశారు. 3,714 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలిగినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. సగం పనులు కూడా చేయలేదు మాది ఇల్లంతకుంట మండలం అనంతారం. మా పెద్ద చెరువులో సగం పనులు కూడా చేయలేదు. పూడిక తీయలేదు. కట్టను బందవత్తు చేయలేదు. తూము, మత్తడి దెబ్బతిన్నాయి. చెరువులోని నీరు లీకేజీ అవుతుంది. పూడిక తీస్తే నీళ్లు బాగా ఉండేవి. మిషన్ కాకతీయ పనులు మధ్యలోనే వదిలేసి పోయిండ్రు. – అక్కెం రామస్వామి, రైతు, అనంతారం చెరువును లోతు చేయాలి మాది కోనరావుపేట మండలం వెంకట్రావుపేట. మా కేశవరావు చెరువును లోతు చేయాలే. మిషన్ కాకతీయలో పనులు చేసినా.. అవి పూర్తి స్థాయిలో జరగలేదు. మత్తడి అలాగే ఉంది. గుట్టల ప్రాంతం నుంచి వచ్చే వరద నీటితో పూడికి వచ్చి చేరుతుంది. పూడికతీసి లోతు చేస్తే చెరువుతో రైతులకు మేలు జరుగుతుంది. – బైరగోని సురేశ్‌గౌడ్, వెంకట్రావుపేట కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చాం జిల్లాలో పనులు చేయకుండా మధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్లకు అనేకసార్లు నోటీసులు జారీ చేశాం. జిల్లాలో ఇంకా 48 చోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు జరిగిన మేరకు రికార్డులు అయ్యాయి. కాంట్రాక్టర్లకు పేమెంట్ సరిగా రావడం లేదు. తెగిపోయిన చెరువులు, కుంటలకు మరమ్మతులు చేస్తాం. – అమరేందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ -
Haritha Haram: ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు.. నిర్లక్ష్యం చూపితే చర్యలు..
సాక్షి, సిరిసిల్ల: ఏడో విడత హరితహారంలో భాగంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు అందించాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా అధి కారులతో కలిసి అన్ని మండలాల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పల్లెప్రగతిని జూలై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలన్నారు. ప్రతీ మండల కేంద్రంలో పది ఎకరాల్లో పల్లె ప్రకృతివనం నిర్మించేందుకు స్థలం సేకరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, నీటిట్యాంకులను శుభ్రం చేయాలని సూచించారు. బాధ్యతగా పనిచేయాలని, నిర్లక్ష్యం చూపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్ల వెంట మొక్కలు నాటాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ పల్లెల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలిన కోరారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, డీపీవో రవీందర్, పీఆర్ ఈఈ శ్రీనివాస్‌రావు, ఏడీవో రణధీర్‌కుమార్, ఆర్టీవో కొండల్రావు, అడిషనల్ డీఆర్డీవో మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. హరితహారం పోస్టర్ల ఆవిష్కరణ జిల్లాలో పల్లెప్రగతిని పండుగలా నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ కోరారు. కలెక్టరేట్లో సోమవారం హరితహారం పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. పల్లెప్రగతిని సామాజిక బాధ్యతగా నిర్వహించాలని కోరారు. చదవండి: నేడు గొల్లపూడిలో దిశ యాప్ అవగాహన సదస్సు -
‘రాజన్న’ మూవీ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో హీరో నాగార్జున అక్కినేని లీడ్‌రోల్ వచ్చిన మూవీ ‘రాజన్న’. ఇందులో నాగార్జున స్వంతంత్య్ర సమరయోధుడు రాజన్నగా కనిపించగా ఆయనకు భార్యగా నటి స్నేహ నటించింది. 2011లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది, ఇక ఇందులో రాజన్న కూతురు మల్లమ్మగా నటించిన ఆ చిన్నారి తన నటనతో ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకుంది. శత్రువులను ఎదురించి తన తండ్రి జాడ తెలుసుకునేందుకు ఆమె చేసే ప్రయత్నం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక మల్లమ్మగా తన తండ్రి రాజన్న చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని పాటల రూపంలో తెలుపుతూ ఇతరులలో స్ఫూర్తిని నింపుతుంది. అలా అంతగా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ చిన్నారి అసలు పేరు అనీ. ఈ సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆరిస్టుగా నంది అవార్డు గెలుచుకున్న అనీ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా!. కాగా రాజన్న మూవీ సమయంలో అనీ వయసు 10 ఏళ్లు. ఆమె నాలుగేళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ‘అనుకోకుండ ఒకరోజు’ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన అనీ ఆ తర్వాత తెలుగు సీరియల్ గోరింటాకుతో పాటు పలు సీరియల్స్‌లో నటించింది. ఇక చివరగా ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబుకు(రామ్ చరణ్) చెల్లి పాత్రలో కనిపించిన బేబీ అనీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అవినాష్ డిగ్రీ కాలేజీలో కామర్స్ చదువుతుంది. -
సిరిసిల్లలో బైక్.. హైదరాబాద్‌లో జరిమానా
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలో విద్యానగర్‌కు చెందిన యూసుఫ్ హుస్సేన్ మహ్మద్‌కు చెందిన ఏపీ 13 ఇ 2646 నంబర్ గల సీడీ 100 బైక్‌కి హైదరాబాద్‌లో పోలీసులు జరిమానా విధించారు. స్థానిక అవసరాలకు మినహా బయటకు తీసుకెళ్లే అవసరం లేదని వాపోతున్నాడు. ఈనెల 12న ఉదయం 11.07 గంటలకు ఇదే నంబర్ గల వాహనం కుషాయిగూడ పీఎస్ పరిధిలోని ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్డులో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు ఆన్లైన్ జరిమానా రూ.1135 విధించారు. సమాచారం యూసుఫ్ సెల్‌ఫోన్‌కు వచ్చింది. ఆన్లైన్లో వాహన ఫొటోను పరిశీలించగా అదిగ్లామర్ వాహనంగా నిర్ధారించారు. ఇలాంటి వారిని పట్టుకుని తనకు న్యాయం చేయాలని యూసుఫ్ పోలీసులను కోరుతున్నాడు. -
పల్లె సేవలో ప్రవాసులు
సాక్షి, నెట్వర్క్: కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలలో ఎన్ఆర్ఐలను కోఆప్షన్ సభ్యులుగా నియమించడానికి అవకాశం ఏర్పడింది. దీంతో పలు పల్లెల్లో కోఆప్షన్ సభ్యులుగా ప్రవాసులు పదవులు పొందారు. సీనియర్ సిటిజన్ లేదా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, ఎన్ఆర్ఐ కోటాలో మరో వ్యక్తిని కోఆప్షన్ సభ్యులుగా నియమించడానికి పంచాయతీరాజ్ శాఖ అనుమతి ఇచ్చింది. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి వచ్చిన ఎంతో మంది కోఆప్షన్ పదవిని అలంకరించారు. సవరించిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా తమకు ఒక మంచి అవకాశం లభించిందని, పంచాయతీల అభివృద్ధికి సహాయం అందిస్తామని వారు చెబుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలలో గల్ఫ్ వలస జీవులు అభివృద్ధి పనులకు చేయూత ఇచ్చారు. ఇలా.. ఊరికి ఉపకారం చేసిన వారిపై అభిమానంతో వారిని గ్రామస్తులు కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేసుకున్నారు. పల్లెల అభివృద్ధిలో భాగస్వాములైన గల్ఫ్ వలస జీవుల మనోగతం వారి మాటల్లోనే... సమష్టిగా సమస్యల పరిష్కారం బతుకుదెరువు కోసం పదిహేనేళ్లు దుబాయికి వెళ్లా. అక్కడ సెంట్రింగ్ కార్మికునిగా పనిచేశా. నాలుగేళ్ల క్రితం దుబాయి నుంచి వచ్చి.. స్థానికంగానే పనిచేస్తున్నా. ఇటీవల గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యుడిగా నన్ను ఉండాలన్నరు. సీనియర్ సిటిజన్ కోటాలో ఎన్నికయ్యా. మా తండ్రి శివయ్య జ్ఞాపకార్థం బస్‌షెల్టరు నిర్మిస్తా. – మ్యాదరి దేవయ్య, జోగాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఊరు కోసం పనిచేస్తా.. మాది సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట. ఉపాధి కోసం 2008లో మస్కట్ వెళ్లి కూలీ పనులు చేశాను. అక్కడ ఆరేళ్ల పాటు ఉన్నా. జీతం కొద్దిగా ఉండడంతో 2014లోగ్రామానికి వచ్చిన. అప్పటి నుంచి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ కిరాణం షాపు నడిపించుకుంటున్నా. నన్ను కోఆప్షన్ సభ్యుడిగా ఉండాలని గ్రామస్తులు కోరితే ముందుకు వచ్చా. భవిష్యత్‌లోనూ ఊరు కోసం పనిచేస్తా. – చిగుర్ల మల్లేశం పేదలకు సేవ చేస్తా.. నాది చందుర్తి మండలం జోగాపూర్. ఉపాధి కోసం దుబాయికి వెళ్లాను. ఎనిమిదేళ్లు అక్కడే కంపెనీలో పనిశాను. పదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నా. దేవాలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాను. ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు మృతిచెందగా.. అ చిన్నారుల పేరుపై రూ.1.80 లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేయించా. నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నా. నన్ను గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యునిగా ఎన్నుకున్నారు. – మ్యాకల పరశురాములు నా వంతు సాయం.. ఏడు సంవత్సరాలు గా దుబాయిలో వలస కూలీగా ఉన్నా. కొ న్నేళ్లుగా ఊరికి దూరమయ్యాను. అప్పుడప్పుడు ఊరికి వస్తే.. ఇక్కడే ఉండాలనిపించేది. ఈ మధ్యనే గ్రామానికి వచ్చేశాను. ఇక ఊళ్లోనే ఉండాలని.. అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోఆప్షన్ సభ్యుడిగా నియామకమయ్యాను. ప్రజలకు సేవ చేయాలనేదే నా కోరిక. – మహమ్మద్ ఫసి, నర్సాపూర్(జి),నిర్మల్ జిల్లా గ్రామాన్ని మారుస్తా.. నేను పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాను. అక్కడ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను. ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాను. మా గ్రామస్తులు నన్ను కోఆప్షన్ మెంబర్‌గా ఎన్నుకున్నారు. దుబాయిలో పారిశుద్ధ్యం తీరును చూసిన నేను.. మా గ్రామంలో కొంతవరకైనా అమలు చేయాలనుకుంటున్నా. గ్రామాభివృద్ధికి చేయూత ఇస్తా.– సంజీవ్‌రెడ్డి, కుమ్మర్పెల్లి, రాయికల్‌మండలం, జగిత్యాల జిల్లా సేవ చేసే అవకాశం దక్కింది నేను తిమ్మాపూర్‌కు కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికయ్యాను. ఈ పదవి ద్వారా మా గ్రామానికి సేవ చేసే అవకాశం దక్కింది. కువైట్, దుబాయిలలో వ్యాపారం చేస్తున్ననేను మా గ్రామానికి ఏదైనా చేయాలని భావించాను. కోఆప్షన్ సభ్యునిగా ఎంపిక చేయడంతో గ్రామానికి ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి సిద్ధమయ్యాను. సొంత గ్రామం రుణం తీర్చువకోవాడానికి ఇది అవకాశం అనుకుంటున్నా.– దాసరి సంతోష్, తిమ్మాపూర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) గ్రామాభివృద్ధికి బాటలు వేస్తాం.. మా సొంత ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర. నేను దుబాయికి సామాన్య కార్మికుడిగా వెళ్లాను. అక్కడే కంపెనీ ఏర్పాటు చేశాను. దుబాయిలో ఈటీసీఏ (ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఉన్నా. మా ఊళ్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత ఇచ్చాను. గుడిని రూ.1.50లక్షలతో అభివృద్ధి చేశాను. మరో రూ.1.50 లక్షలతో స్కూల్‌కు ఫర్నిచర్ అందించాను. ఆడ పిల్లల పెళ్లిళ్లకు పుస్తె, మట్టెలు అందిస్తున్నా. మున్ముందు కూడా గ్రామాభివృద్ధికి సహకారం అందిస్తా. కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. – రాధారపు సత్యం, అడవి పదిర పేదలకు సాయం చేస్తా.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మల్లారం సొంత ఊరు. పదేళ్లుగా దుబాయిలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. నెలకోసారి ఇంటికి వస్తా. మా ఊరిలో పేదలకు సాయం చేస్తా. గ్రంథాలయ అభివృద్ధికి సహకారం అందించాను. స్కూల్ పిల్లలకు పుస్తకాలు, ప్రొజెక్టర్ అందించా. ఇటీవలే గ్రామాభివృద్ధి కోసం కొత్త పాలకవర్గానికి సహకారం అందించాను. నేను దుబాయిలో ఉండగానే నన్ను గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యుడిగా ఎనుకున్నందుకు సంతోషం. గ్రామానికి మరింత చేయూతనిస్తా. – కొమ్ము అశోక్ అందరి సహకారంతో ఎన్నిక.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్. నేను 2006లో గల్ఫ్ వెళ్లాను. అక్కడే రెండేళ్లు పనిచేశాను. దుబాయిలో మన వాళ్లు పడే కష్టాలను కళ్లారా చూశాను. ఇంటికి వచ్చి మళ్లీ వ్యవసాయం చేశాను. ఈ మధ్యనే సిరిసిల్లలో ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నా. ఊళ్లో ఏ పని జరిగినా నేను అందరితో పాటు పాల్గొంటా. ఇటీవల గ్రామ కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికయ్యా. పాలకవర్గం సభ్యుల సహకారంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతా.– కనమేని శ్రీనివాస్‌రెడ్డి ఊరిని తీర్చిదిద్దుతాం.. రుద్రంగి మండలం మానాల శివారులోని గైదిగుట్టతండా మా స్వగ్రామం. మునుపు మా ఊరు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండేది. నేను రెండేళ్ల పాటు సౌదీ అరేబియా వెళ్లి వచ్చా. ఇప్పుడు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నా. మా తండా కొత్తగా గ్రామ పంచాయతీ అయింది. నాకు గ్రామ కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం లభించింది. ఊరిలో వీధులను అందంగా తీర్చిదిద్దేందుకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని సంకల్పించా. అందరం సమష్టిగా ఊరును అభివృద్ధి చేసుకుంటాం.– ధరావత్ రవి సేవకు గుర్తింపు లభించింది మాది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి. నేను 14 ఏళ్లు దుబాయికి వెళ్లా.ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక ఇంటికి వచ్చాను. ఊరిలో సాయిబాబాఆలయ అభివృద్ధికి రూ.4 లక్షలు ఇచ్చా. కళాశాలలో విద్యార్థులకు కంప్యూటర్లు సమకూర్చాను. ట్రీ గార్డులకు ఆర్థిక సాయం అందించా.నేను ఊరికి చేసిన సేవలను గుర్తించి గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యుడిగా ప్రజలు అవకాశం ఇచ్చారు. భవిష్యత్‌లోనూ ఊరి అభివృద్ధికి నా వంతు సహకారం ఉంటుంది. – ఎర్రం గంగనర్సయ్య -
తల్లీ కూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు
చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ, కూతురు అలేఖ్య పటేల్ సక్సెస్ ఇది.. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో పెద్ద వింతేమీ కాకపోవచ్చు. కానీ ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించడం ఒక ఎత్తు అయితే .. విజయవంతంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం మరో ఎత్తు. పెద్ద కుటుంబంలో చిన్న కోడలు పెళ్లయిన 12 సంవత్సరాల తరువాత తిరిగి చదువును కొనసాగించాలనుకుంది పద్మ. అలా మొదలు పెట్టి.. రాసిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పాసై అటు పైన పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడీ, నెట్ అర్హతలు సాధించి అంతిమంగా టీఎస్పీఎస్సీ ద్వారా గురుకుల కళాశాలలో పీజీటీగా ఎంపికైంది. ఇపుడు సిరిసిల్ల జిల్లా చిన బోనాలలోని రెసిడెన్షియల్ కాలేజ్‌లో పీజీటీగా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి పద్మ మాట్లాడుతూ – ‘మాది మంథని దగ్గరి రామకృష్ణాపూర్. పదో తరగతి పూర్తయ్యాక వివాహం అయింది. ఎనిమిది మంది సంతానం గల పెద్ద కుటుంబానికి చిన్న కోడలుని. మా అమ్మాయి అలేఖ్య ఆరో తరగతి వచ్చే వరకు ఇంటి పనులు చక్కదిద్దడం, పిల్లల్ని స్కూల్‌కి పంపడం, వంటా వార్పుతోనే సరిపోయేది. పాప తన పనులు తాను చేసుకునే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. చాలా సార్లు చదువు పైన నాకు ఇష్టం ఉందని గ్రహించిన మా వారు తిరిగి చదువుకొమ్మని ప్రోత్సహించారు. అలా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. తొలి ప్రయత్నంలోనే పాసవడంతో మరింత ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత రెగ్యులర్‌గా బీఈడి, ఆ పైన ఎంఈడి పూర్తి చేశాను. ఎంఈడిలో నాది రాష్ట్రంలో 9వ ర్యాంకు. జాతీయ పరీక్ష నెట్లో కూడా అర్హత సాధించాను. తొలి ప్రయత్నంలోనే రెసిడెన్షియల్ టీచర్‌గా ఎంపికయ్యాను. టీజీటి, పీజీటి స్థాయి పోస్టుల్లో రెండేసి సబ్జక్టుల్లో తెలుగు, సోషల్‌కు ఎంపికయ్యాను. ఫైనల్‌గా పీజీటి తెలుగులో జాయిన్ అయ్యాను’ అని వివరించింది పద్మ. అమ్మతో పోటీ పడిన కూతురు తనేమీ తక్కువ కాదనుకున్న కూతురు అలేఖ్య మరింత ఎక్కువగా శ్రమ పడి టీఎస్ పీఎస్సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించింది. ఇప్పుడు శిశు సంక్షేమ శాఖలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీడీపీవో(చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి అలేఖ్య మాట్లాడుతూ –‘చిన్నప్పటి నుంచి చదువులో అమ్మా, నాన్నల ప్రోత్సాహం చాలా గొప్పది. నాన్న బాగా ఎంకరేజ్ చేశారు. çపది, ఇంటర్మీడియోట్ 95 శాతం మెరిట్‌తో పాసయ్యాను. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్మితా సభర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్‌గా ఉండేవారు. పరిపాలనలో మేడమ్ డైనమిజం చూసి చాలా ఆకర్షితురాలినయ్యాను. నేను కూడా కలెక్టర్ కావాలనుకునేంతగా స్ఫూర్తి పొందాను. అందుకే ఐఏఎస్ అకాడమీలో చేరి మూడేళ్ల డిగ్రీ పూర్తి చేశాను. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి స్టేట్ ఫస్ట్‌లో మెరిట్ సాధించాను. ఉద్యోగంలో చేరేనాటికి 21 ఏండ్ల 10 నెలల వయసు. చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగంలో చేరిపోయానని ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద ప్రాజñ క్ట్ను మానిటర్ చేసే హోదాలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ఆగిపోకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. సాధించగలననే నమ్మకం ఉంది’ అని తెలిపింది. ఇంట్లో స్నేహితులం తల్లీ కూతుళ్లుగా బంధం నిర్ణయించినప్పటికీ ఇంట్లో ఇద్దరం మంచి స్నేహితులం. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటాం. ‘ఇవి పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు’ అని అమ్మ అనదు, ‘ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం’ అని నేను అనుకోను. చదువు, ప్రిపరేషన్ గురించే కాదు ఇంటి పనుల్లోనూ పక్కా ప్లానింగ్‌తో చేసేవాళ్లం. మా చుట్టుపక్కల వీళ్లు తల్లి కూతుళ్లు అనే కన్నా ఇద్దరినీ మంచి స్నేహితులు అంటుండేవారు. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో రూపొందించుకున్న టైమ్ టేబుల్‌ను అనుసరిస్తూ పరస్పరం ప్రోత్సహించుకుంటాం. అదృష్ట్టవశాత్తు ఇద్దరికీ ఒకే జిల్లాలో పోస్టింగ్ రావడం చాలా సంతోషాన్నిస్తోంది. మా ఇద్దరి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని తెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది’ అని తెలిపింది అలేఖ్య. తల్లీ కూతుళ్లుగా తాము సాధించిన విజయాల వెనుక రౌతు రమేశ్ పాత్ర కీలకమైంది. పద్మ భర్త రమేశ్ సింగరేణి కాలనీలో చిరుద్యోగి. పెద్ద కుటుంబంలో చిన్నవాడు. అయితేనేం అర్థాంగి మనస్తత్వాన్ని, ఆమె అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని చదువుకోవాలని ప్రోత్సహించాడు. ఈ వయసులో చదువెందుకు అని ప్రశ్నించిన వారికి చిరునవ్వుతో సమాధానమిస్తూనే ఉన్నత విద్య విషయంలో రాజీ పడలేదు. అందుకే తాము సాధించిన ఈ విజయాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం రమేశ్‌కే దక్కుతుందని తల్లీ కూతుళ్లిద్దరూ ఆనందంగా చెబుతారు.– గెంట్యాల భూమేశ్, సిరిసిల్ల కల్చరల్ఫొటో: వంకాయల శ్రీకాంత్ -
నేడు మహాకవి 88వ జయంతి
మాత్రా సాహిత్యాన్ని స్పర్శించి, మానవ అభ్యుదయాన్ని కాంక్షించి, తెలుగు సాహితీ సుక్షేత్రం కావ్య కన్య స్వాభిమాన పరిరక్షణ కోసం ఏడు దశాబ్ధాల పాటు కలంమూయని కారణజన్ముడు. అఖిల ఆంధ్రావని కవి కోటి పారాయణరెడ్డి, ఆచార్య సి.నారాయణరెడ్డి. తన పాండిత్యం, సాహిత్యంతో పండిత పామరులందరికీ నిత్య స్మరణీయుడయ్యాడు. సమకాలీన సంఘటనలపై మానవీక స్పందనతో కవిత్వాన్ని అందించిన సినారె శబ్ధం మీద సాధికారతను సాధించి అర్థస్ఫూర్తితో నిరంతరం అభ్యుదయం, మానవీయ చింతన చేసిన మహాకవి సినారె. మహావక్తగా, మహాకవిగా సాహిత్యాభిమానుల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా.. సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్) : సినారెగా సుప్రసిద్ధుడైన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిది రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని హనుమాజీపేట. బుచ్చమ్మ, మల్లారెడ్డి తల్లిదండ్రులు. 1931 జూలై 29న జన్మించారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంతో పాటు సిరిసిల్ల,కరీంనగర్లో పూర్తి చేశారు. ఉన్నత విద్యాభ్యాసానికి హైదరాబాద్ వెళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసి అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. కళాశాల విద్యార్థిగా ఉన్నపుడే శోభ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. పసి వయసులో విన్న హరికథలు, జానపదాలు, జంగం కథల స్ఫూర్తితో ఉన్నత స్థాయి సాహితీవేత్తగా ప్రఖ్యాతి చెందారు. 1953లో నవ్వనిపువ్వుతో ప్రారంభమైన సినారె సాహిత్య ప్రస్థానం అలుపెరగక సాగిపోయింది. పద్య కవితలు, గేయకావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సంగీత నృత్య రూపకాలు, ముక్తకాలు, బుర్ర కథలు, గజళ్లు, వ్యాసాలు విమర్శలు, అనువాదాలు వంటి అనేక సాహితీ ప్రక్రికయల్లో అనితర సాధ్యమైన ప్రతిభను చాటుకున్నారు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి ఆకాశం, విశ్వంభర, మంటలు మానవుడు, మధ్య తరగతి మందహాసం, నడక నా తల్లి, తెలుగు గజళ్లు, భూమిక, ముఖాముఖి, ఆరోహణ, అక్షర గవాక్షాలు, ఇంటి పేరు చైతన్యం తదితర రచనలు చేశారు. సినారె రాసిని రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడింది. దీంతో పాటు ఆయన గ్రంథాలు ఇంగ్లిష్, ఫ్రెంచ్ సంస్కృతం, మలయాళం, హిందీ, ఉర్దూ కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో సందర్శించారు. అంతర్జాతీయ కవి సమ్మేళనాల్లో భారతీయ ప్రతినిధిగా హాజరై తెలుగు సాహిత్య వైభవాన్ని విశ్వయవనికపై చాటారు. ఆధునిక ఆంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు పేరిట సినారె పరిశోధన ఆయను పీహెచ్డీ ప్రామాణిక విమర్శన గ్రంథంగా మిగిలింది. అత్యున్నత పురస్కారాలు.. కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ ల్యాండ్ నెహ్రు పురస్కారంతో పాటు విశ్వంభర దీర్ఘ కావ్యానికి 1988లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారం వరించింది.భారతీయ భాషా పరిషత్, రాజలక్ష్మి, అసాన్, ఉమ్మడి రాష్ట్రంలో సాంస్కృతిక వ్యవహారాలు సలహాదారునిగా, సాంస్కృతిక మండలి, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట సాహిత్య పురస్కారం అందుకున్నారు. డాక్టర్ బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం స్వీకరించారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్నతమైన బాధ్యతలను నిర్వహించారు. భారత ప్రభుత్వం సినారె సేవలను గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలిచ్చింది. పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌తో గౌరవించాయి. సినిమా పాటలు కైకట్టి.. వందలాది సినిమాలకు వేల సంఖ్యలో సినీ గీతాలు రాశారు. స్వర్గీయ ఎన్టీఆర్ కథానాయకుడిగా విడుదలైన గులేబకావళి కథ సినిమాలో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాటతో సినీ రంగ ప్రవేశం చేసిన సినారె ఆపైన సుమారు మూడు వేలకు పైగా పాటలు రచించి సినిమా ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు. చిలిపి కనుల తీయని చెలికాడా..అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి, నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు, జాతిని నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు. అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అద్దమున్నదా.. కంటేనే అమ్మ అని అంటే ఎలా.. ఓ ముత్యాల కొమ్మా...ఓ రాములమ్మా.. తదితర తెలుగు సినిమా పాటలు సినారె ప్రతిభకు తార్కాణాలు. సినిమా పాటల్లో సైతం సాహిత్య విలువలకు పట్టం కట్టి తెలుగు సినీ సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు. రెండేళ్ల క్రితం జూన్ 17 హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్ను మూశారు. సాహిత్యంపై సమాలోచన సినారె జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఈ నెల 30న సాహిత్య సమాలోచన జరుపుతోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సినారె కేంద్ర గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, జూకంటి జగన్నాథం, కందేపి రాణీప్రసాద్, పెద్దింటి అశోక్ కుమార్, దూడం సంపత్ తదితరులు హాజరు అవుతున్నారు. సాహితీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని రచయితల సంఘం ప్రతినిదులు డాక్టర్ జనపాల శంకరయ్య, ఎలగొండ రవి తెలిపారు. -
దేవలక్ష్మిని పెళ్లి చేసుకున్న రాజు
సాక్షి, సిరిసిల్ల: సమాజంపై సరైన అవగాహన లేని పిచ్చితల్లిని లోబర్చుకుని గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు తన తప్పు తెలుసుకున్నాడు. ఐదురోజులుగా పిచ్చితల్లి పడుతున్న బాధను గ్రామపెద్దలు అర్థం చేసుకుని న్యాయం చేయడానికి ముందుకొచ్చారు. శుక్రవారం ఇరువురికి పెళ్లి జరిపించారు. చిన్నబోనాలలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఇండ్ల నర్సయ్య–వజ్రవ్వలకు కూతురు దేవలక్ష్మి(22) ఉంది. చిన్ననాటి నుంచి దేవలక్ష్మి కాస్త మతిస్థిమితం కోల్పోయి ఉండేది. ప్రతిరోజు ఇంటిలో వారందరూ కూలీ పనులకు వెళ్లడం గమనించి స్థానికంగా ఉండే రాజు ఆమె పై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. గర్భం దాల్చడంతో విషయం బయటకు రాకుండా జాగ్రత్త తీసుకున్నాడు. ఈనెల 7న దేవలక్ష్మి బాతురూం వెళ్లిన క్రమంలో వచ్చిన నొప్పులకు శరీరంలో పాపను తానే బయటకు తీసుకుంది. గర్భం అంటే ఏందన్న విషయం కూడా అవగాహన లేని దేవలక్ష్మి చేష్టలతో పురిట్లోనే శిశువు మృతిచెందింది. విషయం బయటకు రావడంతో పోలీసులు విచారణ చేపట్టగా.. గ్రామ పెద్దలు సైతం ముందుకొచ్చారు. రాజుతో మాట్లాడి శుక్రవారం ఇద్దరికి పెళ్లి చేసి ఒక్కింటివారిని చేసి ఆశీర్వదించారు. దేవలక్ష్మికి వివాహం జరిపించి, న్యాయం చేసిన సిరిసిల్ల మాజీ వైస్ ఎంపీపీ చల్ల హరికృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ బండారి శ్యాంకు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి ‘రాజన్న బిడ్డ’ పాట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ యాస, భాషతో యాంకర్‌గా, ప్రెజెంటర్‌గా రాణిస్తున్న బిత్తిరి సత్తి అలియాస్ రవి ఇప్పుడు సింగర్‌గా తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు సంబందించిన పాటలు మాత్రమే పాడిన సత్తి తొలిసారి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ఓ పాటను పాడారు. తీన్మార్ వార్తల యాంకర్‌గా కనిపించే బిత్తిరి సత్తిని ప్రాంతాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారు. ‘రాజన్న బిడ్డ అదుగో.. వస్తున్నాడు చూడరా.. అచ్చం రాజన్న లా నేడే ’ అంటూ సాగే పాటను బిత్తిరి సత్తి ఇరగదీశారు. అరచేతిలో స్వర్గం చూసే నాయకులే మనకొద్దురా.. ఆంధ్రప్రదేశ్‌కి జగనన్నే రావాలిరా.. రానే వచ్చాడు రానే వచ్చాడు నాయకుడే వచ్చాడు రా.. అంటూ మాస్ బీట్తో సాగే ఈ పాట లేటెస్ట్ సెన్సేషన్‌గా నిలిచింది. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలోని కొన్ని ప్రధాన దృశ్యాలను ఈ గీతానికి బ్యాక్ డ్రాప్‌గా చూపించారు. కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను కూడా దీనికోసం వినియోగించారు. బిత్తిరి సత్తి తన సొంత యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఈ సాంగ్ తక్కువ సమయంలోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ జాబితాలో దూసుకుపోతోంది. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా లిరిక్స్ ఉన్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన మారుమోగుతోంది. ఒక పార్టీ ప్రచారగీతం 1.7 కోట్ల వ్యూస్ సాధించి దేశ రాజకీయ చరిత్రలోనే యూట్యూబ్ ఆల్‌టైం రికార్డ్లను తిరగరాసింది. -
ప్రచారం.. పట్టణాలకే పరిమితం!
సాక్షి, కథలాపూర్(వేములవాడ): నిన్న..మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామాల్లో రాజకీయపార్టీల ప్రచారం అంతా.. ఇంతా కాదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలైతే చిన్నపాటి యుద్ధంలాగే సాగాయి. కానీ లోక్‌సభ ఎన్నికల ప్రచార సరళి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులు సైతం తమ ప్రచారాన్ని మండల కేంద్రాలకే పరిమితం చేసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించడం లేదు. కొందరికైతే ఎవరెవరూ పోటీ చేస్తున్నారనే విషయం కూడా తెలియడం లేదు. గడువు దగ్గరపడుతున్నా.. నిజామాబాద్ ఎంపీ స్థానానికి బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో తమ రోడ్‌షోలు.. బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలైన మండల కేంద్రాల్లోనే నిర్వహిస్తుండడంతో గ్రామీణులకు ఎన్నికల సందడి తెలియడం లేదు. ఎంపీగా బరిలో ఉన్న అభ్యర్థులు మండలానికి ఒక్కసారి వచ్చి రోడ్‌షోలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రచారానికి గడువు ఈనెల 9వ తేదీతో ముగియనుండడంతో అభ్యర్థుల ప్రచారం గడపగడపకూ చేరకపోవడంతో ప్రజల్లో చర్చానీయాంశంగా మారింది. ఎంపీ అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లోని ద్వితీయశ్రేణి నేతలపైనే తమ ప్రచారం భారం వేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించడం లేదని రాజకీయనాయకులు చర్చించుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో కనిపించడం లేదు. అసెంబ్లీకి పోటాపోటీ ప్రచారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారం సైతం అదేస్థాయిలో ఉండేది. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించింది. కానీ నేటి పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కులసంఘాలు, వివిధ యూత్ అసోసియేషన్లతో మండలకేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోనే సమావేశమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దొరకని ఓటరు నాడి అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు ఉంటున్నారో స్పష్టంగా తెలిసింది. కానీ ఎంపీకి ఎటో ఓటు వేస్తారో తెలియడం లేదు. గ్రామాల్లో ప్రచారం లేకపోవడంతో గ్రామీణులు ఓట్లు ఎటూ వేయాలో తేల్చుకోవడం లేదు. ఏదేమైనా గత ఎన్నికల కన్నా విభిన్నంగా ఎంపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రచారం లేకపోవడంతో పల్లెవాసుల్లో ఎన్నికల ముచ్చట్లు వినిపించడం లేదు. -
బతుకమ్మ 'సిరి'
సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌కు చెందిన నేత కార్మికుడు రాజయ్య (57) 12 సాంచాలపై వస్త్రోత్పత్తి చేస్తాడు. మరమగ్గాలపై పాలిస్టర్ బట్ట నేయడం ద్వారా నెలకు రూ.8 వేల నుంచి రూ.పది వేలు వస్తే ఇదే సాంచాలపై బతుకమ్మ చీరలను నేయడం వల్ల నెలకు రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకూ వస్తుంది. నేత కార్మికుల పింఛన్ నెలకు రూ.1000 వస్తుంది. అంత్యోదయ కార్డు ద్వారా రూపాయికి కిలో చొప్పున నెలకు 35 కిలోల బియ్యం వస్తున్నాయి. కార్మికురాలు రాజయ్య భార్య లత నెలకు రూ.2,000 సంపాదిస్తోంది.కొడుకు రాహుల్ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బొటాబొటీ ఆదాయం, పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబ కలహాలు, వెరసి బలవన్మరణాలు.. ఇవి ఈ ప్రాంతంలో నిత్యకృత్యం కాగా, ఇం దుకు కార్గిల్ లేక్ (చెరువు) సాక్షిగా సిరిసిల్ల ఉరిసిల్ల అయింది. కుటుంబంలో ఐదుగురు ఒకేసారి ఒకేరో జు ఆత్మహత్య చేసుకొన్న విషాదాలూ ఉన్నాయి. ఇప్పుడా గతం గాయాలు మానుతున్నాయి. కష్టాలు, కన్నీళ్లను అధిగమించి ఆత్మవిశ్వాసంతో నేతన్నలు అడుగులు వేస్తున్నారు. వెలుగులు నింపిన బతుకమ్మ... నేతన్నల ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇవ్వడం నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపింది. సిరిసిల్లలో ఆరు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలిస్టర్ బట్ట (తెల్లది)ను ఉత్పత్తి చేస్తే మీటరుకు రూ.1.50 మాత్రమే ఇస్తుంటే, బతుకమ్మ చీరలకు అవసరమైన ఒక్కో మీటరు బట్టను నేస్తే రూ.4.25 చెల్లిస్తున్నారు. ఇందుకోసం రూ.300 కోట్లు కేటాయించారు. మరో వైపు రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) లో కోటి 30 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు కలిపి మొత్తంగా సిరిసిల్ల నేత పరిశ్రమకు ఇప్పుడు రూ.360 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. గత ఫిబ్రవరిలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లను జౌళిశాఖ సిరిసిల్ల నేతన్నలకు అందించింది. సిరిసిల్లలోని 121 మ్యాక్స్ సంఘాలకు, 64 చిన్నతరహా పరిశ్రమలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారు. దీంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు నూలు దిగుమతి చేసి జౌళిశాఖ సూచన మేరకు కార్మికులకు చేతినిండా పని కల్పిస్తూ బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. నేతన్నకు చేతినిండా పని... గత 2017లోనే తొలిసారి రూ.220 కోట్ల విలువైన బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చినా సకాలంలో చీరలు అందించడం సాధ్యం కాలేదు దీంతో సూరత్ నుంచి చీరలు కొన్నారు. అయితే సూరత్ చీరల్లో నాణ్యత లేదనే ఆరోపణలతో 2018లో రూ.290 కోట్ల ఆర్డర్లు మే నెలలో ఇవ్వగా నూలు దిగుమతి చేసుకుని వస్త్రోత్పత్తి ప్రారంభించేసరికి రెండు నెలలు ఆలస్యమై జూలైలో చీరల ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో బతుకమ్మ పండుగకు చీరలు అందించేందుకు క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏడు నెలల ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్లను అందించింది. దీంతో ఆరు నెలల పాటు సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని లభిస్తుంది. కోటి చీరల ఉత్పత్తి లక్ష్యంతో సిరిసిల్లలో ఆర్డర్లు ఇచ్చారు. బతుకమ్మ పండుగకు ముందే తెలంగాణ ఆడపడుచులకు అందించే బతుకమ్మ చీరలు నాణ్యత, నవ్యతతో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. పొదుపు నేర్పుతున్న ‘త్రిప్ట్’ పథకం.. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో త్రిప్ట్ పథకం అమలవుతోంది. నేత కార్మికుడు తన సంపాదన లో కనీసం 8 శాతం బ్యాంకులో జమచేస్తే అంతే మొ త్తం ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఉదాహరణకు నెల కు గరిష్టంగా రూ.1000 జమ చేస్తే జౌళిశాఖ మరో వెయ్యి కార్మికుడి ఖాతాలో జమ చేస్తుంది. మూడేళ్ల తరువాత ఆ సొమ్మును వడ్డీతో సహా కార్మికుడు తీసుకుని వినియోగించుకోవచ్చు. ఇందులో చేరేందుకు నేత కార్మికులు, డయింగ్, వార్పిన్, సైజింగ్, జాపర్లు, వైపని కార్మికులు అర్హులు. మరోవైపు జియోట్యాగింగ్ ద్వారా సిరిసిల్లలో 25,578 మరమగ్గాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి ఆధారంగా కార్మికుల వివరాలను నమోదు చేశారు. కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రం ఆధారంగా పది శాతం నూలు రాయితీని నేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు జౌళిశాఖ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన తంగళ్లపల్లి, చంద్రంపేట, జ్యోతినగర్, రాజీవ్‌నగర్, పద్మనగర్ ప్రాంతాల్లోని నేత కార్మికులకు చేతినిండా పనితో పాటు మెరుగైన వేతనాలు అందుతున్నాయి.– వూరడి మల్లికార్జున్,సాక్షి– సిరిసిల్ల ఇంటర్ చదివిన ద్యావనపెల్లి దేవేందర్ (23) తండ్రి నేత కార్మికుడైన రాములు పదేళ్ల కిందటే గుండెపోటుతో మరణించాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా దేవేందర్ చదువు మానేసి మరమగ్గాల మధ్య కండెలు చుడుతున్నాడు. ఇతనికి నెలకు రూ.10 వేల జీతం వస్తుంది. బీడీ కార్మికురాలు తల్లి బాలనర్సవ్వకు పింఛన్ నెలకు రూ.1,000 వస్తుంది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో దేవేందర్ ఆదాయం పెరిగి తల్లి బాగోగులు చూసుకోగలుగుతున్నాడు. సిరిసిల్లలోని 25వేల మంది మరమగ్గాల (పవర్‌లూమ్స్) కార్మికుల జీవితాల్లో వచ్చిన మెరుగైన మార్పులకు ఈ ఇద్దరు నేతన్నలు ఓ ఉదాహరణ. ప్రభుత్వ ఆర్డర్లే బతికించాయి ప్రభుత్వ బతుకమ్మ చీరల, ఆర్వీఎం వంటి ఆర్డర్లు సిరిసిల్ల నేత పరిశ్రమను బతికించాయి. లేకుంటే సాంచాలు అమ్ముకునే పరిస్థితి.ఈ ఆర్డర్లతో కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్ నేతన్నలకు ఎంతో మేలుచేశారు.– ఆడెపు భాస్కర్, పాలిస్టర్ సంఘం ప్రధాన కార్యదర్శి. నేతన్న ఆలోచనల్లోమంచి మార్పు దశాబ్దకాలంగా నేత కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాను. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో నేతన్నల్లో చాలా మార్పు వచ్చింది.కుటుంబ కలహాలు తగ్గాయి. పొదుపు అలవాటై వ్యసనాలకు దూరంగా ఉంటున్నారు. – కె.పున్నంచందర్, సైకాలజిస్ట్ -
సర్‘కారు’ గుర్తుండేలా..
సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కారు గుర్తు ఓటర్ల మదిలో గుర్తుండిపోయేలా చేశారు పార్టీ అభిమాని ఒకరు. సిరిసిల్ల ఎంపీపీ జూపల్లి శ్రీలత భర్త శ్రీనివాస్‌రావు తన పాత కారుకు గులాబీ రంగు వేయించి గద్దె కట్టి రోడ్డు పక్కన నిలిపారు. సిరిసిల్ల – కామారెడ్డి ప్రధాన రహదారి పక్కనే శ్రీనివాస్‌రావు తన సొంత భూమిలో ఇలా కారును ఉంచగా పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. -
ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు కుట్ర
సిరిసిల్ల: మూడు తరాలుగా అడవుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ఆరోపించారు. సిరిసిల్లలో ఆదివారం ఆ యన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలం గాణలో సుమారు 80 వేల మంది ఆదివాసీలు అడవుల్లో ఉన్నారని, 1971 నుంచి పరిశ్రమల పేరుతో వారిని అడవుల నుంచి బయటకు వె ళ్లగొట్టేందుకు సర్కారు కుట్ర చేస్తోందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ చ ట్టాలను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. అ టవీ సంపదను దోచుకునేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను అడ్డుకుం టామని నాయకులు బూర శ్రీనివాస్, మంత్రి చంద్రన్న పేర్కొన్నారు. -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
ఇల్లంతకుంట: ఐదేళ్ల పాటు కొనసాగే పంచాయతీ పాలకులపై పల్లె ప్రగతి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తామని కొత్త సర్పంచులు చెబుతున్నారు. కాని కొత్త పంచాయతీరాజ్ చట్టం నిబంధనలు కఠినతరంగా ఉండటంతో నిధులు, విధుల్లో ఏమాత్రం తేడా వచ్చిన, నిర్లక్ష్యం చేసినా సర్పంచ్‌తో పాటు పాలకవర్గానికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొత్త సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏళ్లకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ కొత్త సర్పంచులు పరిష్కారం చేస్తారనే కొండంత ఆశతో గ్రామీణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత, కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న నిబంధనలు సర్పంచులకు ఐదేళ్ల పాలన సాగించాలంటే కత్తిమీద సాముల మారుతోంది. గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ.. 2015 ఆగస్టు 17న తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రణాళిక తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వాటి అమలుకు గ్రామస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత క్రమం బట్టి గ్రామాల్లో పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. కానీ నేటి వరకు గ్రామజ్యోతి అమలుకు నోచుకోలేదు. కొత్త పంచాయతీల పాలనలోనైనా గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేస్తే పల్లెల్లో ప్రగతి కాంతులు నిండే అవకాశం ఉంది. గతంలో సర్పంచులకు అధికారాలే తప్ప నిధులు, బాధ్యతలు ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. సర్పంచులకు లక్ష్యాలు ఇలా.. తెలంగాణ సర్కారు కొత్త పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత అనే లక్ష్యాలను నిర్ధేశించారు. నిర్ధేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోయినా, కేటాయించిన నిధులు నిబంధనల మేరకు సక్రమంగా ఖర్చు చేయలేకపోయినా సర్పంచ్ పదవి తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దు చేసే అవకాశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచారు. సర్పంచులకు అధికారాలతో పాటు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నియమాలు రూపొందించారు. పాత చట్టం ప్రకారం ఉపసర్పంచ్‌పై నాలుగేళ్లకు పైగా అవిశ్వాసం ఉండగా ప్రస్తుతం రెండేళ్లకు కుదించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా కూడా పాలకవర్గం రద్దు చేసే పరిస్థితి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా కూడా రూ.500 జరిమానా విధించనున్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలివి.. ∙ కొత్త పంచాయతీల్లో కనిపించని వీధి దీపాలు ∙ గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు ఆయా పంచాయతీల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. ∙ ఇంకా ఇంటింటికి పూర్తి కాని మిషన్‌భగీరథ నల్లా కనెక్షన్లు ∙ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు, గ్రామాల్లో ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, సమయపాలన పాటించేలా చూడడం. ∙ పాత పంచాయతీల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించడం, కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో జీపీ భవనాల నిర్మాణాలు ∙ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి ∙ ప్రతీ గ్రామంలో శ్మశానవాటిక నిర్మించాలి ∙ డంపింగ్ యార్డులను నిర్మించాలి ∙ గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలి బాధ్యతలు పెరిగాయి కొత్త పంచాయతీ చట్టంతో సర్పంచులకు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పాలకవర్గాలపై చర్యలు తప్పవు. – అమరేందర్‌రాజు, ఎంపీడీవో, ఇల్లంతకుంట -
రాజన్న రైతు బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్కే
-
20 నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్
గంభీరావుపేట(సిరిసిల్ల): జాతీయ, రాష్ట్రస్థాయి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20 నుంచి ఆలిండియా లారీల నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తెలిపారు. గంభీరావుపేట మండలం లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం బంద్‌కు సంబంధించిన ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పరిమిట్ విధానం అమలు చేయాలని కోరారు. యాక్సిడెంట్, ఓవర్‌లోడ్ కేసులలో డ్రైవర్ల లైసెన్స్ రద్దు విధానాన్ని విరమించుకోవాలని, లారీలపై ఓవర్‌లోడ్ నిషేధించాలని, జిల్లాకొక డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్హతతో సంబంధం లేకుండా సామర్థ్యం పరీక్షించి డ్రైవింగ్ లైసెన్స్‌లు మంజూరు చేయాలని కోరారు. మండలశాఖ అధ్యక్షుడు పిట్ల వెంకటి, నాయకులు నర్సింలు, శేఖర్, ఓనర్లు చంద్రారెడ్డి, నాగయ్య పాల్గొన్నారు. -
వేడుక ఇంట విషాదం
వేములవాడరూరల్ : కూతురి నిశ్చితార్థం జరుగుతుందన్న సంతోషం కొన్ని క్షణాల్లోనే మాయమైంది. మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ కొడుకు ప్రాణాలు తీసుకుంది. నిశ్చితార్థం కోసం వచ్చిన బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం విషాదంలో మునిగింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన పల్లి శంకర్–రేణుక కుమార్తెకు నిశ్చితార్థం సోమవారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన తమలపాకులు, కేకును తీసుకొచ్చేందుకు వారి కుమారుడు సాయి(22) తన స్నేహితుడు ప్రశాంత్‌ను తీసుకొని బైక్‌పై వేములవాడకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా అనుపురం, రుద్రవరం గ్రామ సమీపంలో వీరి బైక్‌ను లారీ ఢీకొట్టింది. ప్రశాంత్ ఎగిరిపడగా కాలు విరిగింది. సాయిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ లారీకిందనే చిక్కుకుపోయింది. లారీ డ్రైవర్ ఆపకుండానే దాదాపు 9 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. బైక్‌ను లాక్కెళ్తున్న లారీని గమనించిన యువకులు వెంబడించడంతో కొదురుపాక–వెంకట్రావుపల్లి గ్రామాల మధ్య లారీని నిలిపి డ్రైవర్ పరారయ్యాడు. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యా దుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటస్వా మి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయ్యో కొడుకా..! ఇంటిలో జరుగుతున్న శుభకార్యంలో అందరితో అప్పటి వరకు కలిసి పనిచేసిన సాయి కొన్ని నిమిషాల్లోనే చనిపోయాడని విన్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. భోజన కార్యక్రమంలో అందరికీ వడ్డించిన సాయి విగతజీవిగా కనిపించడంతో రోదనలు మిన్నంటాయి. ఒ క్కగానొక్క కుమారుడు లారీ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది. కన్నీటి పర్యంతమైన స్నేహితులు అప్పటి వరకు స్నేహితులతో కలిసి ఉన్న సాయి మృతితో స్నేహితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మన సాయి ఇక లేడంటూ రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. గ్రామస్తుల ఆందోళన ప్రమాద విషయం తెలుసుకున్న రుద్రవరం గ్రామస్తులు కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రోడ్డుపై ఆందో ళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ దాదాపు నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఇసుక లారీలు అతివేగంగా వస్తుండడంతో రోడ్డుపక్కనే ఉన్న పునరావాస గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారని, అది మరిచిపోకముందే మరొకరు చనిపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగంతోపాటు లారీ యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఆర్ఓ శ్యాంప్రసాద్‌లాల్, సీఐ వెంకటస్వామి, తహసీల్దార్ మునీందర్ సంఘటన స్థలానికి వచ్చి లారీ యజమానితో మాట్లాడి న్యాయం చేస్తామని, ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఇప్పించి, గాయపడిన ప్రశాంత్‌కు వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా న్యాయం చేస్తానని డీఆర్ఓ తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.5లక్షలు, గాయపడ్డ యువకుడి కుటుంబానికి రూ.3లక్షల చెక్కును కలెక్టర్ కృష్ణభాస్కర్ అందించారు. -
గొల్ల కుర్మల్ని ధనవంతుల్ని చేయడమే లక్ష్యం
సాక్షి, సిరిసిల్ల : పాడి-పంట బాగుంటేనే రైతు అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్‌లో రాష్ట్రస్థాయి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఇందులో భాగంగా లబ్దిదారులకు కేటీఆర్ 30 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గతేడాది 60 లక్షల గొర్రెల పంపిణీ జరిగిందని, గొల్ల కుర్మలను ధనవంతులుగా మార్చాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. గొర్రెలు రీసైక్లింగ్ చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. యాభైఏళ్ల కాంగ్రెస్‌పాలనలో ఒరిగిందేమీ లేదు యాభైఏళ్ల కాంగ్రెస్‌పాలనలో ఒరిగిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, రానున్న రోజుల్లో తెలంగాణలో హరిత, నీలి, గులాబి, శ్వేత విప్లవాలు రాబోతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల చెరువులు నిండి నీలి విప్లవం రాబోతుందని కేటీఆర్ తెలిపారు. -
‘నేరెళ్ల’ గాయానికి ఏడాది
సిరిసిల్ల : జాతీయస్థాయిలో రాజకీయంగా రగిలిన నేరెళ్ల ఘటన ఇంకా సలుపుతూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దళితులపై ‘థర్డ్‌డిగ్రీ’ ప్రయోగించిన ఘటన మానని గాయమైంది. సరిగ్గా నేటికి ఏడాది కిందట జూలై 2న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని దళితుడు భూమయ్య మరణించిన ఘటన వివాదాస్పదమైంది. ఏడాదిగా బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. అసలేం జరిగింది..! మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురయ్యే ప్రాంతంలోని ఇసుకను తొలగించేందుకు మైనింగ్‌శాఖ టెండర్లు నిర్వహించింది. చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీల్లో ఇసుక తరలిపోతుంది. ఇసుక లారీలతో ఏడాదిలో 42 ప్రమాదాలు జరిగాయి. అప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు. జూలై 2న నేరెళ్లకు చెందిన భూమయ్య ఇసుక లారీ ఢీకొ ని మరణించాడు. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురై ఐదు ఇసుక లారీలను తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడి చేశారు. తంగళ్లపల్లి ఎస్సై సైదారావు, కొందరు పోలీసులు గాయపడ్డారు. లారీ దహనం, పోలీసులపై దాడి చేసిన ఘ టనలో 13మందిపై పోలీసులు కేసు నమోదు చేశా రు. జూలై 4న రాత్రి 11.30 గంటలకు నేరెళ్లకు చెం దిన పెంట బాణయ్య, కోల హరీష్, చెప్పాల బాల రాజు, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్‌కు చెందిన బత్తుల మహేశ్, జిల్లెల్లకు చెందిన కోరుగంటి గణేశ్, చీకోటి శ్రీనివాస్నుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరాకరించిన జైలర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిని జూలై 8న రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ జైలర్ నిందితులపై గాయాలు చూసి జైలులోకి తీసుకునేందుకు నిరాకరించారు. పోలీసులు పెయిన్‌కిల్లర్స్ ఇచ్చి వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ సర్టిఫికెట్తో జూలై 10న జైలుకు పంపించారు.వీరిలో నలుగురు తీవ్రఅస్వస్థతకు గురికాగా.. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జైలర్ నిందితుల ఆరోగ్యంగా లేరని నిరాకరించడంతో పోలీసుల థర్డ్ డిగ్రీ ఘటన వెలుగులోకి వచ్చింది. థర్డ్ డిగ్రీ ప్రయోగంపై నిరసన.. జైలు ములాఖాత్‌లో తమ వారిని కలిసిన కుటుంబ సభ్యులు పోలీసుల దెబ్బలను చూసి చలించిపోయారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ తొలుత నిందితులను కలిసి పోలీసుల తీరును తప్పుబట్టారు. అంతకు ముందు టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వారితో మాట్లాడారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కె.రాములు నేరెళ్లకు వచ్చి బాధితుల గోడు విన్నాడు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ కరీంనగర్, నేరెళ్ల, జిల్లెల్లకు వచ్చి బాధితులను పరామార్శించారు. సీపీఐ నేత నారాయణ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, టఫ్ ప్రతినిధులు, టీమాస్ ఫోరమ్ ప్రతినిధులు విమలక్క, రిటైర్డు జడ్జి చంద్రకుమార్, దళిత బహుజన సంఘాల నేతలు నేరెళ్ల బాధితుల పక్షాన నిలిచారు. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఇప్పటికీ బాధితులకు అండగా ఉంటూ.. న్యాయపోరాటానికి మద్ధతు ఇస్తున్నారు. బాధితులు మానవహక్కుల సంఘాన్ని, రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వివాదాస్పదమైన పోలీసుల తీరు.. నేరెళ్ల ఘటనతో సిరిసిల్ల పోలీసులు ఆత్మరక్షణలో పడ్డారు. అప్పటి జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఇంటరాగేషన్‌లో స్వయంగా పాల్గొన్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో అప్పటి సీసీఎస్ ఎస్సై రవీందర్‌ను సస్పెండ్ చేశారు. ఎస్పీ విశ్వజిత్ కాంపాటి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం బాధితులను వేములవాడలో పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో నలుగురు బాధితులు మంత్రి కేటీఆర్ మాటకు విలువిచ్చి సరెండర్ అయ్యారు. మిగితా నలుగురు ఇంకా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవల దేశరాజధాని ఢిల్లీ వరకు వెళ్లి టీఆర్ఎస్ సర్కారు తీరుపై నిరసన తెలిపారు. -
చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరి
వేములవాడఅర్బన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల విద్యా వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు పదేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడవక చేసేది ఏమీ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్సీల్లో 9 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది మండల సమన్వయ కర్తలు పనిచేస్తున్నారు. తమకు కనీస వేతనాలు పెంచాలని వారు ప్రభుత్వన్ని కోరుతున్నారు. అప్పట్లో వీరిని ఎంపిక చేసి ఔట్ సోర్సింగ్‌పై నియమించారు. వీరు అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ విభాగం, కంప్యూటర్ రంగంలో పరిజ్ఞానం కలిగిన వారిని ఎంపిక చేశారు. ఎమ్మార్సీ కార్యాలయంలో డేటా ఎంట్రీ మండల విద్యావనరుల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మండల సమన్వయ కర్తలుగా నియామకమైన వీరు మండ కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల నెలవారీ వేతనాలతో పాటు పాఠశాలకు మంజూరయ్యే నిధులు, ఖర్చుల వివరాలను నమోదు చేస్తారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవోల అసిస్టెంట్లుగా ఉంటున్నా వీరు అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. చాలీచాలని వేతనం.. పదేళ్ల క్రితం నియామకమైన వీరికి కనీస వేతనాల ఊసేలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మార్సీ కార్యాలయాల్లో అన్ని పనులు చేస్తుంటారు. కానీ వారికి వేతనం రూ.15 వేలు మించదు. దాంతో వారి కుటుంబాలు గడవక వీధిన పడే పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. అయినా ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వారి డిమాండ్లు ఇవే.. ∙సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ∙ఏడాదికి 22 సెలవులు ఇవ్వాలి. ∙మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ∙రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందజేస్తున్న జీవో నెం 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ∙ఉద్యోగ భద్రత కల్పించి హెల్త్ కార్డులు అందించాలి. ∙ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సెలవులు, అలవెన్సులు కల్పించాలి. -
ఒక్కటైన మూగ మనసులు
ఇల్లంతకుంట(మానకొండూర్) : మండల కేంద్రానికి చెందిన మామిడి అంజయ్య ఏకైక కూతురు అనూష పుట్టు మూగ, కరీంనగర్‌కు చెందిన అర్జున్ అనే యువకుడు కూడా పుట్టు మూగ. మండల కేంద్రంలోని వైశ్యభవన్‌లో పెద్దల సమక్షంలో అనూష, అర్జున్ గురువారం వివాహం చేసుకున్నారు. మానకొం డూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొంకటి అనీల్ నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అజయ్‌వర్మ మాట్లాడుతూ ఇద్దరు మూగ వారు కావడంతో వారికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కోరారు. -
హాస్టల్లో ఉండనని విద్యార్థిని ఆత్మహత్య
బోయినపల్లి(చొప్పదండి) : హాస్టల్లో ఉండి చదువుకోవ డం ఇష్టం లేక మండలంలోని కొదురుపాకకు చెందిన కుడుదుల మౌనిక (16) మంగళవారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ రుద్ర క్రిష్ణకుమార్ కథనం ప్రకారం.. మౌనిక కరీంనగర్‌లోని ప్రభుత్వకళాశాలలో ఇంట ర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లి రావడానికి బస్సులో అప్‌అండ్‌డౌన్ చేస్తోంది. తల్లిదండ్రులు ప్రయివేటు హాస్టల్లో ఉండి చదువుకొమ్మని చెప్పారు. తాను హాస్టల్లో ఉండనని తల్లిదండ్రులతో గొడవ పడింది. ఈ నెల 15న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తండ్రి దేవయ్య 16న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన మౌనిక ఇం టికి చేరింది. 17న పోలీసుల కౌన్సెలింగ్‌లో తనకు హాస్టల్ లో ఉండడం ఇష్టం లేదని చెప్పింది. మంగళవారం హాస్టల్లో ఉండే విషయంలో ఇంట్లో మళ్లీ గొడవ జరిగింది. ఆవేశంతో తన బెడ్రూంలోకి వెళ్లి తలుపు గడియ వేసుకుని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తలుపు ఎంత బాదినా రాలే దు. దీంతో జేసీబీతో తలుపులు తీయించారు. అప్పటికే మౌనిక పూర్తిగా కాలి చనిపోయింది. మృతు రాలి తండ్రి కుడుదుల దేవ య్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వేములవాడలో వేదపాఠాలు
వేములవాడ(రాజన్న జిల్లా) : వేములవాడ రాజన్న ఆలయం ఆధ్వర్యంలో ఇకనుంచి వేదపాఠాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటివరకు సంస్కృత భాషాభివృద్ధికి సంస్కృత పాఠశాల, డిగ్రీ, పీజీ కళాశాలలను కొనసాగిస్తున్న ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వేదపాఠశాల ప్రారంభానికి మోక్షం లభించింది. గతంలో ఆలయానికి సంబం«ధించిన ఆసుపత్రి కొనసాగిన భవనంలో వేదపాఠశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో ఆలయ అధికారులు అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈమేరకు అడ్మిషన్ల ప్రక్రియకు దరఖాస్తులు అందుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం వేకువజామున బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛారణల మధ్య వేదపాఠశాల లాంఛనంగా ప్రారంభించేందుకు ఆలయ అధికారులు బుధవారం ఏర్పాట్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. చిన్నారి విద్యార్థులకు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం నమఃశివాయః అనే పంచాక్షరి మంత్రంతో మార్మోగుతున్న వేములవాడ పట్టణంలో ఇక నుంచి వేదపాఠాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం సంస్క ృత విద్యను కొనసాగించిన ఆలయ అధికారులు ఇకనుంచి వేదపాఠశాలను కొనసాగించనున్నారు. దీంతో వేదాలు నేర్చుకున్న ఘనాపాఠీలు నిత్యం వేదమంత్రోచ్ఛారణలను వినిపించగా, ఇకనుంచి చిన్నారి విద్యార్థులకు వేదపాఠాలు బోధించనున్నారు. 20రోజులు ఆలస్యంగా.. వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయం ఎదుట ఉన్న ఓ భవనంలో వేదపాఠశాల ప్రారంభించేందుకు ఆలయ అధికారులు, దేవాదాయశాఖ, ప్రభుత్వ యంత్రాంగం పనులు చేపట్టింది. ఈమేరకు గతనెల 20న ప్రారంభించనున్నట్లు ముందస్తుగానే ప్రకటించారు. కాగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీ పర్యటనలో ఉండడంతోపాటు.. ఇతర కారణాల వల్ల వేదపాఠశాలను ప్రారంభించలేకపోయామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. నిర్వహణ.. నియామకాలకు కమిటీ వేదపాఠశాలలో అడ్మిషన్లు, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను నియమించుకునేందుకు ఐదుగురు సభ్యులు గల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో వేదపారాయణదారులు, ఈవో, ఏఈవో, ట్రస్టుబోర్డు చైర్మన్ ఇలా ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరి నిర్ణయమై ఫైనల్. ఇందుకు అయ్యే ఖర్చును రాజన్న ఆలయం భరిస్తుండగా.. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు యాభై శాతం ఆలయం, మరో యాభై శాతం కామన్ గుడ్ ఫండ్ నుంచి వేతనాలు చెల్లించనున్నారు. అడ్మిషన్లు వస్తున్నాయి వేములవాడ రాజన్న ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేదపాఠశాలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వేదపాఠశాలతోపాటు సంగీత, నృత్యకళాశాల ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేదపాఠశాలకు సొంత భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతం ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వేదపారాయణదారులు రాధాకిషన్‌ను నియమించాం. - దూస రాజేశ్వర్, ఆలయ ఈవో -
పెళ్లింట విషాదం
ఇంట్లో పెళ్లి ఉందని బంధువులందరికీ చెప్పారు.. పెళ్లి పత్రికలు పంచారు.. బంధువులంతా పెళ్లి కొడుకు ఇంటికి చేరుకున్నారు.. మరీ కొన్ని గంటల్లో పెళ్లి జరిగిపోతుందని అందరు బంధువులూ పెళ్లికి సిద్ధమయ్యారు. అంతలోనే విధి కన్నెర్ర చేసింది. పెండ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటివరకు సంబరంగా ఉన్న వారంతా దుఖంలో మునిగిపోయారు. కన్న కొడుకు పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కాటికిపయనమయ్యాడు. గుండెపోటుతో తండ్రి మృతి చెందడంతో పెళ్లింట విషాదం నిండింది. అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులు పెళ్లికొడుకు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం అందరినీ కంటతడి పెట్టించింది. సిరికొండ(బోథ్): సిరికొండ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన సట్ల రాజన్న(60) గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. రాజన్నకు ఇద్దరు కుమారులు ఒక కూతురు. పెద్ద కొడుకు, కూతురు పెళ్లిళ్లు గతంలోనే కాగా చిన్న కొడుకు పోశెట్టి పెళ్లి ఉట్నూర్ మండలం టేకుగూడ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. బుధవారం 12 గంటలకు వధువు ఇంటి వద్ద పెళ్లి జరగాల్సి ఉంది. మగపెళ్లివారు బయల్దేరడానికి సిద్ధమవుతుండగానే పెళ్లి కొడుకు తండ్రి రాజన్నకు గుండెపోటు వచ్చి కింద పడిపోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు సంబరంగా ఉన్న ఆ ఇంట్లో రోదనలు ఆకాశాన్నంటాయి. ఇంటి పెద్ద మరణంతో పెళ్లిని వాయిదా వేశారు. గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. -
నాకు ఓటేయకుంటే...
తుమకూరు: ఓటు కావాలంటే ఓటరు దేవుణ్ని వేడుకోవాలి, ఈయన మాత్రం సరదాగా బెదిరింపులకే దిగడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కాకుండా మరో పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మీకు మంచి రోజులు ముగిసినట్లేనని జిల్లాలోని మధుగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కే.ఎన్.రాజణ్ణ ప్రజలను సరదాగా బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. బుధవారం మధుగిరి పట్టణంలోని మండ్ర కాలనీలో నిర్వహించిన పార్టీ ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మధుగిరిని అభివృద్ధి చేసింది తామేనన్నారు. అటువంటి తమకు కాకుండా ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేస్తే మీకు చెడు కాలం దాపురించినట్లేనంటూ చేసిన వ్యాఖ్యలు టీవీలు, సోషల్ మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. -
రేపటి ఫన్డేలో.. లచ్చిగాని కల
లచ్చిగాని పేరు ఊరంతా మారుమోగిపోతోంది. కలలో దేవుడితో మాట్లాడుతున్నాడట లచ్చిగాడు. ఎవరికి ఏ సమస్య ఉందని చెప్పినా, వాళ్లడిగిన దేవుడి దగ్గరికి కలలో వెళ్లి మాట్లాడుతున్నాడట. ఆ ఊర్లో అందరి మంచి చెడ్డలు చూసే రాజన్నకు ఇది వింతగా కనిపించింది. రాజన్న వెళ్లి తన సమస్య చెప్పుకున్నాడు. తనతో పాటు ఊర్లో చాలామందిదీ ఇదే సమస్య అని చెప్పుకున్నాడు. లచ్చిగాడు కలలో రాజన్న సమస్యకు పరిష్కారం కోసం ఒక దేవుణ్ని కలుసుకున్నాడు. ఆ సమస్య ఏంటీ? ఆ దేవుడెవరు? ఆయన చూపిన పరిష్కారమేంటీ? చదవండి.. ‘లచ్చిగాని కల’ అనే కథలో.. దాని ఆమె లేకుండానే అతను చాలాకాలంగా ఒంటరిగా బతుకుతున్నాడు. ఆమె సమాధితో మాట్లాడతాడు. తానూ ఆమె ఉన్నచోటకు వస్తానంటాడు. ఆమె ‘‘నీకింకా ఈ భూమ్మీద చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.’’ అని చెబుతుంది. అరవై ఏళ్లుగా అతను ఆమె కోసమే బతుకుతున్నాడు. ఆమె లేకుండా ఉన్న ఈ పదేళ్లు కూడా. అలాంటి వ్యక్తి కథను చదవండి.. ఈవారం కథ ‘దాని’లో.. అంకెల గారడి ‘ఈ విషయ ప్రపంచాన్ని నిర్దేశించే మౌళిక సూత్రం అంకెలే.’ అంటూ మొదలయ్యే ఒక జీవితాన్ని చదవండి ఈవారం అనువాద కథ ‘అంకెల గారడి’లో. కొన్ని జీవితాలను, ఒక కుటుంబాన్ని చిదిమేసిన కొన్ని అంకెలు, వాటి చుట్టూ నడిచే ఓ కథ.. అంకెల గారడి. -
‘వెట్టిచాకిరీ చేస్తున్న షాపింగ్‌మాల్స్ కార్మికులు’
సిరిసిల్లటౌన్: జిల్లాలోని షాపింగ్ మాల్స్‌లో పని చేస్తున్న కార్మికులు ఏళ్ల తరబడిగా వెట్టిచాకిరీ చే స్తున్నారని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మూ షం రమేశ్ అన్నారు. యూనియన్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కో కార్మికునితో యజమాన్యాలు 8 గంటలకు మించి పనిచేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేలలోపే వేతనాలు చెల్లిస్తూ.. కనీ స వేతన చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని తెలి పారు. కార్మికులకు అధికారులు కనీస వేతనాలు అమలు చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మోర అజయ్, అన్నల్దాస్ గణేశ్, ఒగ్గు గణేశ్, నక్క దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘శ్మశానం’లో రాజకీయం!
వేములవాడరూరల్: మండలంలోని రుద్రవరం గ్రామ పునరావాస కాలనీలో శ్మశాన వాటికకు 2016లో అప్పటి అధికారులు సర్వే నంబర్ 65, 66, 67 లోని ఆరు ఎకరాల స్థలాన్ని పంచాయతీ అధికారులకు అందజేశారు. మూడేళ్లుగా స్థల యజమాని అప్పగించడంలేదు. తన స్థలం అనుపురం పరిధిలో ఉందని, రుద్రవరం పరిధిలో ఉన్న స్థలాన్నే తీసుకోవాలంటూ యజమాని శ్మశాన వాటికకు కేటాయించిన స్థలానికి అడ్డుపడుతున్నాడు. ఈ ఆందోళన ఎట్టకేలకు కలెక్టర్ వరకు చేరింది. ఈ విషయంపై రుద్రవరం సర్పంచ్ పిల్లి రేణుక కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో తమ గ్రామానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలం తమకే దక్కాలని దానికి హద్దులు ఏర్పాటు చేసి తమకు ఇవ్వాల సర్పంచ్‌తోపాటు గ్రామ పెద్దలు కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ గతంలో ఇచ్చిన విధంగా ఆరెకరాలు ఇవ్వడం కుదరదని, నాలుగు ఎకరాలు రెండు గ్రామాల్లో కలిపి తీసుకోవాలంటూ కలెక్టర్ వారికి తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో జిల్లా అధికారులు కూడా ఏమీ చేయలేక గతంలో తమకు కేటాయించిన స్థలం నుండే తగ్గిస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కలెక్టర్ స్థలాన్ని తగ్గించడంతో తాము న్యాయ పోరాటం చేస్తామని సర్పంచ్ పిల్లి రేణుక తెలిపారు. గతంలో అధికారులే తమకు అన్ని ఆధారాలతో అనుమతులతో స్థలాన్ని అప్పగించారని ప్రస్తుతం ఆ స్థలం నుంచి కొంత స్థలాన్ని తీసుకోవాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
ఆవు తొక్కడంతో బాలుడి మృతి
వేములవాడ: ఆవు బాలుడిని తొక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన వేములవాడలోని రాజన్న ఆలయ ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు..భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన తిరుపతి దంపతులు వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చారు. రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆదివారం రాత్రి ఆలయ ఆవరణంలో నిద్రకు ఉపక్రమించారు. అయితే ఎక్కడి నుంచో వచ్చిన ఓ ఆవు, తల్లిదండ్రుల పక్కనే నిద్ర పోతున్న ఎర్రబోయిన అనూష్పై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలోనే మృతిచెందాడు. బాలుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం లక్ష్యం
ముస్తాబాద్(సిరిసిల్ల): గ్రామీణప్రాంత పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఐఏంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చింతోజు శంకర్ అన్నారు. ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ లక్ష ఆపరేషన్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జెడ్పీటీసీ శరత్‌రావు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నలభై ఏళ్ల క్రితం ఎంబీబీఎస్, డీజీవో పూర్తి చేసి ముస్తాబాద్‌లో ఆసుపత్రి పెట్టామన్నారు. అతితక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందిస్తూ తమ ప్రస్థానాన్ని కొనసాగించామన్నారు. ఎన్నో వందలాది క్రిటికల్ కేసులను పరిష్కరించడం ఆత్మ సంతృప్తిని ఇచ్చిందన్నారు. పేదల దేవుడిగా శంకర్ తెలంగాణకే గర్వకారణమని జెడ్పీటీసీ శరత్‌రావు అన్నారు. పిలిస్తే పలికే డాక్టర్‌గా లక్ష సర్జరీలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ముస్తాబాద్ నేడు వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్, డాక్టర్‌రాజారాంను సన్మానించారు. ఎంపీపీ శ్రీనివా స్, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు సర్వర్, సెస్ డైరెక్టర్ విజయరామారావు, సర్పం చ్ నల్ల నర్సయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుర్ర రాములు, డీసీసీ కార్యదర్శి ఓరగంటి తిరుపతి, సంతోష్‌రావు, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ యాత్ర మొదలు
-
వైఎస్ యాత్ర మొదలు
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం. జనరంజక పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత జీవిత విశేషాలను ఆవిష్కరించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఏంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. అభిమానుల గుండెల్లో ‘రాజన్న’గా నిలిచిపోయిన ఆ మహానేత జీవితాన్ని మహీ వి. రాఘవ్ తెరకెక్కించనున్నారు. ‘పాఠశాల’ వంటి కాలేజ్ లవ్‌స్టోరీ తర్వాత రీసెంట్గా ‘ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ‘యాత్ర’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించనున్నారు. ‘‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ చిత్రాల తర్వాత మా బ్యానర్లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యాత్ర’. వైఎస్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఎమోషనల్ కంటెంట్‌గా ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం’’ అని విజయ్ చిల్లా తెలిపారు. -
అందుకే మీ నుంచి దూరంగా వెళ్లిపోతున్నా..!
► ప్రేయసి దూరమైందనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య వేములవాడ: ‘అమ్మా.. నన్ను క్షమించు.. నా బంగారం(తాను ప్రేమించిన యువతి) లేనిదే బతకలేనని నీకు ముందే చెప్పా.. అందుకే మీ నుంచి దూరంగా వెళ్లిపోతున్నా.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నా మిత్రుడు మిథున్‌కు చెందిన బంగారంపై నేను యూఏఈ ఎక్సే్ఛంజీలో లోను తీసుకున్నా.. ఆ లోను చెల్లించి బంగారం వాడికి అప్పగించండి’ అని సూసైడ్ నోట్ రాసి రాపర్తి హరీశ్(26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్దిపోచమ్మవీధిలో శనివారం జరిగింది. బంధువుల కథనం ప్రకారం.. బద్దిపోచమ్మవీధిలో హరీశ్ తన తల్లి, ఒక సోదరితో కలిసి కొన్నేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల ఆ ఇంటిని ఖాళీ చేసి సుభాష్‌నగర్‌లోని మరో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఖాళీ చేసిన ఇంట్లో ఇంకా కొంత సామగ్రి అలాగే ఉంది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం వరకు భీమేశ్వరాలయం సమీపంలోని తాను నడిపిస్తున్న టిఫిన్ సెంటర్లో పనులు పూర్తి చేసుకున్న హరీశ్.. ఇంటికొచ్చి తల్లిని పలకరించి బయటకు వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు తమ కుటుంబసభ్యులకు చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ‘ఐ మిస్ యూ ఆల్’ అంటూ మెసేజ్ పెట్టడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. రాత్రి వరకూ ఇంటికి రాకపోవడంతో బంధువులు, మిత్రులు రాత్రంతా పట్టణంలో గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం మొన్నటివరకు అద్దెకున్న బద్దిపోచమ్మవీధిలోని అద్దె ఇల్లు తాళం పగలగొట్టి ఉండడంతో స్థానికులు హరీశ్ తల్లి విజయకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూసేసరికి హరీశ్ దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. విగతజీవుడైన కుమారుడిని చూసి తల్లి కన్నీరుమున్నీరైంది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై సురేశ్ తెలిపారు. కాగా, తాను ప్రేమించిన యువతి దూరమైందనే మనస్తాపంతోనే హరీశ్ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు స్నేహితులు తెలిపారు. -
దళితులకు ఒక్క ఎకరా భూమి కూడా ఇవ్వలేదు ?
-
సైంటిఫిక్ థ్రిల్లర్
‘బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్’ వంటి అద్భుతమైన చిత్రాలకు కథ అందించి, ‘రాజన్న’ మూవీతో డైరెక్టర్‌గా తన సత్తా చాటిన విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్రీవల్లీ’. రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే జంటగా రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ఇది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తిస్తాయి. టీజర్, ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ బాగుందని పలువురు ప్రముఖులు ఫోన్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఖాజీపేట : ఖాజీపేట మండలం మల్లాయపల్లె గ్రామంలో యాండ్ల రాజన్న (42) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో గురువారం సాయంత్రం మృతి చెందాడు. అప్పనపల్లె– రంగాపురం గ్రామ మధ్యలో ఉన్న వక్కిలేరు కాలువలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మల్లాయపల్లె గ్రామానికి చెందిన యాండ్ల రాజన్నగా పోలీసులు గుర్తించారు. అయితే ఒంటినిండా తీవ్ర గాయాలు కావడంతో ఎవరైనా హతమార్చారా? లేక మద్యం మత్తులో కిందపడి మృతి చెందాడా అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మృతుడిది జమ్మలమడుగు నియోజకవర్గంలోని గుండ్లకుంట ప్రాంతమని తెలిసింది. అయితే ఇల్లరికం కారణంగా ఇతను మల్లాయపల్లె గ్రామంలో నివాసముంటున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. -
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
-
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
వేములవాడ : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రావణసందడి మొదలైంది. శ్రావణ మాసంలో శివాలయాల సందర్శనను భక్తులు శుభప్రదంగా భావిస్తారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో రాజన్న ఆలయ ఆవరణంతా కిక్కిరిసిపోయింది. రద్దీతో అధికారులు ఆర్జిత సేవలు రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. దీంతో కొందరు భక్తులు అసహనం వ్యక్తంచేశారు. భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలాచరించి కోడె మొక్కులు చెల్లించుకునానరు. బాలత్రిపుర సుందరీ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈవో దూస రాజేశ్వర్, ఏఈవోలు ఉమారాణి, గౌరీనాథ్, దేవేందర్, హరికిషన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీఐపీల దర్శనాలను పీఆర్వో చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించారు. -
వ్యక్తి దారుణ హత్య
చలిమంట కాసుకుంటున్న వ్యక్తి పై ప్రత్యర్థి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన అదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పుష్పూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంకజ్‌పటేల్(26), కేబుల్ టీవీ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అదే గ్రామంలో కేబుల్ నిర్వహిస్తున్న రాజన్న అనే వ్యక్తితో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పంకజ్‌పటేల్ ఆదివారం రాత్రి ఇంటి ముందు చలిమంట కాసుకుంటున్న సమయంలో రాజన్న కత్తితో అతని పై దాడి చేసి హతమార్చాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టును ఢీకొన్న టాటాఎస్.. వ్యక్తి మృతి
అనంతపురం: వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం తడకలపల్లి గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. కర్ణాటకలోని మధుగిరి తాలుక బేర్పూర్ గ్రామానికి చెందిన రాజన్న(42) టాటా ఎస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని హిదూపురం నుంచి బేర్పూర్‌కు పశువుల లోడ్‌తో బయలుదేరాడు. వాహనం తడకలపల్లి సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న రాజన్న అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని బెంగళూరు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్లాస్ రూంలో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
బోగస్ మెడికల్ బిల్లు కేసు భయం.. అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాఠశాల తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కడెం మండలం దస్తూరాబాద్ పంచాయతీ పరిధి రాంపూర్ గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడెం : దస్తురాబాద్ గ్రామానికి చెందిన మారవేని రాజన్న(51) పంచాయతీ పరిధిలోని రాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రోజూలాగే గురువారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లాడు. హెచ్ఎం ప్రభాకర్ సెలవులో ఉండడంతో రాజన్నే ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం త్రైమాసిక పరీక్షల దృష్ట్యా ఉదయం గణితం సబ్జెక్టు పరీక్ష నిర్వహించారు. రాజన్న విద్యార్థులతో పరీక్ష రాయించాడు. కాసేపటికి తనకు తల నొప్పిగా ఉందని, పక్క గదిలోకెళ్లి నిద్రిస్తానని, తనను డిస్ట్రబ్ చేయవద్దని, పరీక్ష సాఫీగా రాయండని విద్యార్థులకు చెప్పి, పాఠశాల ప్రాంగణంలోని అదనపు తరగతి గదికి వెళ్లాడు. మధ్యాహ్న భోజన సమయం అవుతున్నా రాజన్న బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు గదిలోకి వెళ్లి చూడగా తాడుతో ఉరేసుకొని ఉన్న రాజన్న మృతదేహం కనిపించింది. ఎస్సై టీవీ.రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాజన్న షర్టు జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంది. బోగస్ మెడికల్ బిల్లు కేసు భయం, అనారోగ్య కారణాలతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యార్థులు క్షమించాలని అందులో పేర్కొన్నాడు. అతడికి భార్య లక్ష్మి, కుమార్తెలు స్వాతి, శ్వేత ఉన్నారు. చిన్నకూతురు శ్వేతకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, 2013లో రాజన్నపై బోగస్ మెడికల్ రీయింబర్స్మెంట్ కేసు నమోదైందని, కేసు భయంతోపాటు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కాగా, రాజన్న మృతి విషయం తెలిసి సహచర ఉపాధ్యాయులు, స్థానికులు పెద్ద ఎత్తున పాఠశాలకు తరలివచ్చారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంఈవో భూమన్న, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పరామర్శించారు. రాజన్న మృతికి వేర్వేరుగా సంతాపం ప్రకటించారు. -
రూ.కోటి దాటిన రాజన్న ఆదాయం
వేములవాడ, న్యూస్‌లైన్ : ఎములాడ రాజన్న కోటిశ్వరుడయ్యాడు. శతాబ్దాల ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భక్తులు భారీ కానుకలు సమర్పించడంతో ఆలయ ఆదాయం రూ. కోటి దాటింది. 27 రోజుల ఆదాయానికి సంబంధించి బుధవారం ఆలయ ఆవరణలో గల ఓపెన్‌స్లాబ్‌లో హుండీలెక్కించారు. రాత్రి పదిగంటలకు లెక్కింపు పూర్తయ్యే సరికి స్వామివారి ఆదాయం రూ. 1,01,73,342 సమకూరినట్లు లెక్కతేలింది. 350 గ్రాముల బంగారం, 12.500 కిలోగ్రాముల వెండి సమకూరిందని, వీటిని తూకం వేయించి స్వామివారి ఖజానాకు జమచేశామని ఈవో కృష్ణాజీరావ్ వెల్లడించారు. తెరవని మరో 4 హుండీలు.. తెరిచిన హుండీల్లోని సొమ్ము లెక్కింపునకే రాత్రి పది గంటలైంది. ఇంకా నాలుగు హుండీలు తెరవాల్సి ఉన్నా సిబ్బంది అలసటకు గురి కావడంతో అధికారులు లెక్కింపును ఆపేశారు. మిగిలిన నాలుగు హుండీల్లో మరో రూ. రెండు లక్షల వరకు సమకూరవచ్చని ఆలయ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెలుగుచూసిన భారీ కానుకలు.. హుండీ లెక్కింపులో భారీ కానుకలు వెలుగుచూశాయి. రూ . 2 లక్షల నగదుతో కూడిన ఓ మూట, 200 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు కలిగిన కవరు గుర్తించారు. మిగతా బంగారు కానుకలతోపాటు ఓ అరకిలో వెండి కడ్డీ కనిపిం చింది. హుండీ లెక్కింపును ఆలయ ఈవో సీ.హెచ్.వీ. కృష్ణాజీ రావ్, ట్రస్టుబోర్డు సభ్యులు అరుణ్ తేజాచారి, సగ్గుపద్మా దేవరాజ్, బాలరాజు, ఏఈవోలు ఉమారాణి, హరికిషన్, గౌరీనాథ్, దేవేందర్ తదితరులు పర్యవేక్షించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం మృగ్యం
శిడ్లఘట్ట, న్యూస్‌లైన్ : ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సేవలు అందకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులను రోగులు ఆశ్రయిస్తున్నారని శాసనసభ ఉపాధ్యక్షుడు ఎన్.హెచ్.శివశంకరరెడ్డి అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటైన మానస ఆస్పత్రి భవనాలను ఆయన ఆదివారం ప్రారంభించి, మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు సరైన వైద్యం అందడం లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో గ్రామీణులకు మెరుగైన వైద్యం అందిస్తున్న మానస గ్రూప్ ఆఫ్ ఆస్పత్రుల వంటి సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు ప్రాధాన్యతనివ్వడంలో భాగంగా జిల్లాకొక వైద్య విద్య కాలేజీల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. చిక్కబళ్లాపురం జిల్లాలోనూ వైద్యకీయ కాలేజీ ఏర్పాటు అవుతుందని అన్నారు. ప్రతి తాలూకా కేంద్రంలోనూ డయాలసిస్ కేంద్రం స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజణ్ణ, మానస సమూహ ఆస్పత్రుల వ్యవస్థాపకుడు హెచ్.ఎన్.సుబ్రహ్మణ్యం, కె.పి.శ్రీనివాసమూర్తి, డాక్టర్ పి.ఎన్.గోవిందరాజు, నేత్ర వైద్యుడు డాక్టర్ నరపత్ సోలంకి, కౌన్సిలర్ చిక్కమునియప్ప, అప్సర్ పాషా, బంక్ మునియప్ప, హనుమంతరెడ్డి, డాక్టర్ శశిధర్, డాక్టర్ మధుకర్, డాక్టర్ నరసారెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, బ్యాటరాయశెట్టి, రమేష్, నారాయణస్వామి, శివప్రసాద్ పాల్గొన్నారు. -
పుట్టెడు దుఖం..
-
హస్తాలను అడ్డుపెట్టి...
-
పెద్దాయన, పెద్దాయన...
-
నువ్వు కావాలి..
-
అన్నా... రాజన్నా...
-
సత్యం వధా... ధర్మం చెర...
-
రాజన్నపాట ప్రోమో