
సాక్షి, సిరిసిల్ల: మార్ట్‌లో తక్కువ ధరలకు వస్తువులు దొరుకుతాయన్న కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సిరిసిల్లలో ఎమ్మార్పీ కన్నా అధికంగా వసూలు చేయడం కలకలం రేపింది. లీగల్‌మెట్రాలజీ అధికారి రూపేశ్‌కుమార్ బుధవారం జరిపిన దాడుల్లో ఈ విషయం నిర్ధారణయ్యింది. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మోర్ సూపర్‌మార్ట్, రాఘవేంద్ర ఎలక్ట్రికల్స్‌తోపాటు మరో రెండు గ్యాస్‌స్టౌవ్‌లు విక్రయించే దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలిపారు.
మోర్ మార్టులో హార్లిక్స్ బాటిల్‌పై రూ.111 ధర ఉండగా ఓ కస్టమర్‌కు బిల్లులో రూ.114 వేశారు. అప్పటికే మార్టులో తనిఖీలు చేస్తున్న రూపేష్‌కుమార్ దృష్టికి సదరు కస్టమర్ ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మిగతా మూడు దుకాణాల్లో ఎమ్మార్పీ, తయారీదారు చిరునామాలు సరిగ్గా లేకపోవడంతో రూ.13వేలు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. వ్యాపారులు అధిక ధరలకు వస్తువులు అమ్మితే.. అడ్రస్ లేకుండా వస్తువులను అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చదవండి: అమ్మపార్టీలో.. చిన్నమ్మ భయం
Comments
Please login to add a commentAdd a comment