
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిరిసిల్లక్రైం(కరీంనగర్): వెబ్‌చానల్‌లో రిపోర్టర్‌గా అవకాశం కల్పిస్తానని నమ్మబలికి తలా రూ. 10 వేలు మొత్తం 100 మంది వద్ద రూ.10 లక్షలు వసూలు చేసిన సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితుడైన జగిత్యాల జిల్లా చెందిన శ్రీనివాస్ మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల ఇలా అనేక జిల్లాలో రిపోర్టర్లను నియమించుకున్నట్లు చెప్పారు.
ఒక వెబ్‌చానల్ చిరునామా తీసుకొని మోసానికి పాల్పడినట్లు వాపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి చిరునామాకు వెళ్లినట్లు తెలిసింది. అప్పటికే రంజిత్ పరార్ అయినట్లు సమాచారం. ఇదే రంజిత్ గతంలో ఫొటోషూట్ కోసం పలురకాల కెమెరాలు అద్దెకు తీసుకుని, ఇతరులకు అమ్ముకున్నాడని కేసు నమోదు అయింది.
Comments
Please login to add a commentAdd a comment