Web Channel
-
వెబ్ చానెల్లో అవకాశం అంటూ రూ.10 లక్షలకు టోపి..
సాక్షి, సిరిసిల్లక్రైం(కరీంనగర్): వెబ్‌చానల్‌లో రిపోర్టర్‌గా అవకాశం కల్పిస్తానని నమ్మబలికి తలా రూ. 10 వేలు మొత్తం 100 మంది వద్ద రూ.10 లక్షలు వసూలు చేసిన సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితుడైన జగిత్యాల జిల్లా చెందిన శ్రీనివాస్ మీడియా ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల ఇలా అనేక జిల్లాలో రిపోర్టర్లను నియమించుకున్నట్లు చెప్పారు. ఒక వెబ్‌చానల్ చిరునామా తీసుకొని మోసానికి పాల్పడినట్లు వాపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి చిరునామాకు వెళ్లినట్లు తెలిసింది. అప్పటికే రంజిత్ పరార్ అయినట్లు సమాచారం. ఇదే రంజిత్ గతంలో ఫొటోషూట్ కోసం పలురకాల కెమెరాలు అద్దెకు తీసుకుని, ఇతరులకు అమ్ముకున్నాడని కేసు నమోదు అయింది. -
స్ట్రెయిట్ ఫ్రమ్ స్టవ్
పొయ్యి మీద నుంచి డైరెక్ట్‌గా కంచంలో పడిన వంటకం ఎలా ఉంటుంది? అలాగే ఉంటున్నాయి ఈ వెబ్ చానెల్స్ షోస్ కూడా. మధ్యలో చల్లారబెట్టే సెన్సార్‌బోర్డ్ లాంటి వ్యవస్థ ఏదీ వీటికి లేదు. ఇదివరకు ఇంగ్లిష్ ‘ఎ’ సర్టిఫికెట్ సినిమాలు ఊరవతల ఉన్న టాకీసుల్లో రిలీజ్ అయ్యేవని చెప్పుకునేవారు. ఎవరికీ తెలియకుండా ఆ సినిమాలు చూడాలి అనుకునేవారు. సీక్రెట్‌గా పొలిమేరలకు వెళ్లేవాళ్లు. ఆ తర్వాత పదేళ్లకు ఊళ్లోనే సెంటర్లో ఉన్న సినిమా హాళ్లకే ట్రాన్స్ఫర్ అయ్యాయి అవి. కాకపోతే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లోనే స్క్రీనింగ్ ఉండేది. అనంతరం పదేళ్లకు ప్రైవేట్ చాన్సల్ రాకతో ఇంగ్లిష్ సినిమాలు ఇంట్లోకే వచ్చేశాయి. ఇప్పుడు.. ఇంగ్లీష్ సినిమాలే కాదు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, హిందీ ఎట్సెట్రా భాషల సినిమాలతోపాటు సీరియల్స్ కూడా అరచేతిలో షో చేస్తున్నాయి. యెస్.. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అది. వాడుక భాషలో వెబ్ చానెల్స్. ఈ యేటి సాంకేతిక ఉప్పెన! ఇవి చూపించేవన్నీ ‘ఎ’ సర్టిఫికెట్ చిత్రాలే. సేక్రెడ్ గేమ్స్, లస్ట్ స్టోరీస్, ఇన్సైడ్ ఎడ్జ్.. వంటివి కొన్ని ఉదాహరణలు. ఆడియెన్స్ క్రేజ్‌ను క్యాచ్ అండ్ క్యాష్ చేసుకుంటున్న బొమ్మలు. పొయ్యి మీద నుంచి డైరెక్ట్‌గా కంచంలో పడిన వంటకం ఎలా ఉంటుంది? అలాగే ఉంటున్నాయి ఈ వెబ్ చానెల్స్ షోస్ కూడా. మధ్యలో చల్లారబెట్టే సెన్సార్‌బోర్డ్ లాంటి వ్యవస్థ ఏదీ వీటికి లేదు. గల్లీలో గాలియా (వీధిలో తిట్లు) నుంచి గోలియోంకి రాస్లీలా దాకా.. అన్నీ ఉన్నవి ఉన్నట్టే.. వినిపిస్తూ కనిపిస్తాయి. సిల్వర్ స్క్రీన్ పాటించే సోకాల్డ్ మర్యాద, పట్టింపుల గ్రామర్ బెడద వెబ్ చానెల్స్‌కు లేదు. తూటాలు కణతల్లోంచి దూసుకుపోయే సీన్.. ట్రాన్స్‌జెండర్ న్యూడ్ లుక్, డ్రెస్సింగ్ రూమ్‌లో చీర్ గర్ల్‌తో సెక్స్.. ఎలాంటి పరదా, బ్లర్ ఇమేజ్ లేకుండా చాలా సామాన్య దృశ్యాలుగానే రోల్ అవుతాయి. సినిమాల కన్నా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే సినిమా బడ్జెట్కేమీ తీసిపోకుండా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా స్టార్స్‌ను పెట్టీ మరీ వెబ్ మూవీస్‌ను, వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి వెబ్ చానెల్స్. క్రైమ్ అయినా, శృంగారం అయినా.. అనురాగం అయినా.. ముసుగు లేకుండా చూపించడమే వీటి సిగ్నేచర్. సిల్వర్ స్క్రీన్.. ప్రేక్షకుల చాయిస్. కాని టీవీ.. నట్టింటి వినోదం. ఇలాంటి షోస్ పాస్వర్డ్ రక్షణతో పరిణతి లేని వాళ్లకు ఇన్విజబుల్గా ఉండే అవకాశం ఉందా? ఒక ఒరవడి 24 గంటల ఆయువునే రాసుకుని వస్తున్న కాలంలో ఉన్నాం. అవకాశాలు ఎప్పుడు ప్రమాదాలవుతాయో.. ప్రమాదాలు ఎలాంటి ప్రమోదాలుగా మారుతాయో తెలియని.. గ్రహించలేని వేగంలో కొట్టుకుపోతున్నాం. ఫలితాలను బేరీజు వేసుకొని సమీక్షించేంత టైమ్ కూడా ఉండట్లేదు. అన్నిటికీ వీక్షకులమే.. వెబ్ చానెల్స్కైనా.. రేపు వచ్చే ఇంకో కొత్త ట్రెండ్ మీడియానికైనా! – సరస్వతి రమ -
ఒడిశా బ్రాడ్కాస్ట్..వెబ్ చానల్ ప్రారంభం
బరంపురం: స్థానిక డైమండ్ జూబ్లీ టౌన్ హాల్ ప్రాంగణంలో ఒడిశా బ్రాడ్కాస్ట్..అనే కొత్త వెబ్ చానల్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి సూర్యనారాయణ పాత్రో హాజరై ప్రారంభజ్యోతిని వెలిగించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఎం.డి ఉషా పట్నాయక్, న్యూస్ ఎడిటర్లు ప్రకాష్ పట్నాయక్, జ్యోతి రంజన్ పట్నాయక్, ఆలిండియా రేడియో డైరెక్టర్ రుశీకేశ్ పాణిగ్రహి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి హోలీకిశోర్ పట్నాయక్, ఎంఎల్ఏ రమేష్ చంద్ర చావ్ పట్నాయక్, బీడీఏ చైర్మన్ సుభాష్ మహరణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కన్ను పతి, సుదీప్సాహు పాల్గొని సామజిక వార్తలపై వివిధ రకాలుగా ప్రసగించారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు, ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో తెలుగులో బీబీసీ చానల్
హైదరాబాద్: ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో వార్తలు అందిస్తున్న బీబీసీ చానల్ ఇకపై తెలుగులో కూడా వెబ్‌చానల్ ప్రారంభించనున్నట్లు బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝా తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీబీసీ హెచ్.ఆర్ హెడ్ నివేదితతో కలసి మాట్లాడుతూ.. అతిత్వరలో తెలుగు, మరాఠి, గుజరాతీ, పంజాబీ నాలుగు భాషల్లో వెబ్‌చానల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. వెబ్ చానల్లో ఉద్యోగ నియామకాల కోసం బీబీసీ వెబ్సైట్లో వరల్డ్ సర్వీస్ జాబ్స్ తెలుగు పేజీలో లాగిన్ కావాలని చెప్పారు. నియామకాలు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతాయని తెలిపారు.