![చెట్లపై ఉన్న కొండచిలువలు - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/25/24vmd56-180057_mr_0.jpg.webp?itok=06Og77hy)
చెట్లపై ఉన్న కొండచిలువలు
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలంలోని మామిడిపల్లిలో శుక్రవారం రెండు భారీ కొండచిలువ కలకలం సృష్టించాయి. మామిడిపల్లి శివారులోని చిన్నన్న –పెద్దన్న చెరువు వద్ద గల చెట్లపై రెండు కొండచిలువలు శుక్రవారం రైతులకు కనిపించాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా గొర్లు, మేకలు మేతకోసం వస్తుంటాయి. చెట్లపై కనిపించడంతో గొర్లకాపరులు ఆందోళన చెందారు. మేకల మందపై దాడి చేసేందుకే వచ్చినట్లు కాపరులు భావిస్తున్నారు. అటువైపు వెళ్లే కాపరులు, ఉపాధిహామీ కూలీలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.
బాల్యమిత్రుని భార్య వైద్యానికి ఆర్థిక సహాయం
చందుర్తి(వేములవాడ): క్యాన్సర్‌తో బాధపడుతున్న బాల్య మిత్రుని భార్య వైద్యానికి పదోతరగతికి చెందిన మిత్రులు ఆర్థిక సహాయాన్ని అందించి శుక్రవారం అండగా నిలిచారు. చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన మ్యాదరి లక్ష్మణ్ భార్య విజయ క్యాన్సర్‌తో బాధపడుతోందన్న విషయం తెలుసుకున్న పదోతరగతి వరకు కలిసి చదువుకున్న మిత్రులు తమ వంతు సహాయంగా రూ.20వేల నగదు అందజేశారు. 1989–90 విద్యా సంవత్సరంలో చందుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న మోతె రాములు, ఈగ శ్రీనివాస్, బీరెల్లి రామారావు, తాటికొండ కృష్ణహరి కలిసి రూ.20వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
పెనంమడుగు షట్టర్లు అపహరణ పోలీసులకు ఫిర్యాదు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం శివారులోని పెనంమడుగు నుంచి ఆయకట్టు భూములకు వచ్చే సాగునీటి కాలువ తూము షెట్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం అటువైపు వెళ్లిన రైతులు గమనించి నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏఈ వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సింగారం గ్రామంలోని ఆయకట్టు భూముల కు సాగునీరందించే కాలువ రెండు షట్టర్లను ఎత్తుకెళ్లడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నా రు. వెంటనే పోలీసులు దొంగలను పట్టుకొని, షె ట్టర్లను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. పో లీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
![ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న పదోతరగతి మిత్రులు1](https://www.sakshi.com/gallery_images/2023/02/25/24vmd77-180056_mr.jpg)
ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న పదోతరగతి మిత్రులు
![తూమును పరిశీలిస్తున్న అధికారులు2](https://www.sakshi.com/gallery_images/2023/02/25/24srl102-180049_mr.jpg)
తూమును పరిశీలిస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment