ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు కుట్ర | Conspiracy To Expel Tribals | Sakshi
Sakshi News home page

ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు కుట్ర

Published Mon, Mar 4 2019 4:31 PM | Last Updated on Mon, Mar 4 2019 4:31 PM

Conspiracy To Expel Tribals - Sakshi

సిరిసిల్ల: మూడు తరాలుగా అడవుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ఆరోపించారు. సిరిసిల్లలో ఆదివారం ఆ యన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలం గాణలో సుమారు 80 వేల మంది ఆదివాసీలు అడవుల్లో ఉన్నారని, 1971 నుంచి పరిశ్రమల పేరుతో వారిని అడవుల నుంచి బయటకు వె ళ్లగొట్టేందుకు సర్కారు కుట్ర చేస్తోందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ చ ట్టాలను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. అ టవీ సంపదను దోచుకునేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను అడ్డుకుం టామని నాయకులు బూర శ్రీనివాస్, మంత్రి చంద్రన్న పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement