
మృతిచెందిన బాలుడు ఎర్రబోయిన అనూష్(3)
వేములవాడ: ఆవు బాలుడిని తొక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన వేములవాడలోని రాజన్న ఆలయ ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు..భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన తిరుపతి దంపతులు వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చారు. రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆదివారం రాత్రి ఆలయ ఆవరణంలో నిద్రకు ఉపక్రమించారు.
అయితే ఎక్కడి నుంచో వచ్చిన ఓ ఆవు, తల్లిదండ్రుల పక్కనే నిద్ర పోతున్న ఎర్రబోయిన అనూష్‌పై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలోనే మృతిచెందాడు. బాలుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.