vemulawada police
-
రాజన్న దర్శనం.. భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ప్రదీప్ భక్తుల నుంచి డబ్బు తీసుకుని నేరుగా భారీకేడ్ జరిపి ఆలయంలోకి అనుమతించిన వైనం సెల్‌ఫోన్ కెమెరాకు చిక్కింది. ఎస్పీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని ఈవో రమాదేవి దృష్టికి తీసుకెళ్లారు. సదరు హోంగార్డుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈవో ఆదేశించారు. (చదవండి: మంత్రుల ఆదేశాలు బేఖాతర్.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే) -
దివ్య హత్య కేసులో లొంగిపోయిన నిందితుడు
-
పథకం ప్రకారమే దివ్య హత్య!
గజ్వేల్/వేములవాడ: బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్యోదంతం మలుపులు తిరుగుతోంది. పథకం ప్రకారమే ఆమె హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచా రం. మంగళవారం రాత్రి గజ్వేల్‌లోని తమ ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యపై దాడి చేసి పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో ఆమె మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో గత కొన్నేళ్లుగా వేధిస్తున్న వెంకటేశ్ అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే, దివ్య, తన కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, హైదరాబాద్‌లో ఇరువురూ కలిసి కొంతకాలం ఉన్నారని వెంకటేశ్ తండ్రి చెప్పడం సంచలనంగా మారింది. మరోపక్క వెంకటేశ్ బుధవారం వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. పదో తరగతి నుంచే... రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలపల్లి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. హత్యకు గురైన దివ్య చిన్న కుమార్తె. లక్ష్మీరాజం వేములవాడ ఆలయం వద్ద కిరాణా దుకాణం నిర్వహిస్తూ ప్రైవేటు లాడ్జిని లీజుకు తీసుకొని నడిపేవారు. ఆ సమయంలో దివ్య వేములవాడలోని వెంకటరమణ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ చదివింది. వేములవాడలోని శాస్త్రినగర్‌కు చెందిన కైరి పరుశురాం, లత దంపతుల కుమారుడు వెంకటేశ్ కూడా అదే పాఠశాలలో పదో తరగతి చదివాడు. అప్పటినుంచే దివ్యను ప్రేమ పేరుతో వేధించేవాడని మృతురాలి తల్లిదం డ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటర్ సమయంలోనూ వేధింపులు కొనసాగించాడని, దీంతో వెంకటేశ్‌పై వేములవాడ, ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశామని చె బుతున్నారు. ఓసారి దివ్య కోసం ఒంటిపై కిరోసిన్ పోసు కుని ఆత్మహత్యకు యత్నించగా.. వెంకటేశ్ కుటుంబీకులు తమపై దాడికి ప్రయత్నించారని లక్ష్మీరాజం వెల్లడించారు. దీంతో తాము కొంతకాలం హైదరాబాద్ వెళ్లిపోయామని.. అప్పుడే తమ కుమార్తె ఓయూలో డిగ్రీ పూర్తిచేసి, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఉద్యోగం సాధించిందన్నారు. కొంతకాలంగా వెంకటేశ్ రెక్కీ? వరంగల్‌కు చెందిన సందీప్‌తో దివ్యకు పెళ్లి కుదిరింది. ఈ నెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో దివ్యపై కక్ష పెంచుకున్న వెంకటేశ్ కొంతకాలంగా గజ్వేల్ వచ్చి ఆమె ను దూరం నుంచి గమనించడం.. ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరగడం చేస్తుండేవాడని పోలీసు విచారణలో బ యటపడినట్టు సమాచారం. పథకం ప్రకారం ఆమెను హ త్యచేసే ఉద్దేశంతో గజ్వేల్ వచ్చాడని, దివ్య తల్లిదండ్రులు పెళ్లి పనులపై ఎల్లారెడ్డిపేట వెళ్లారని తెలియడంతో అదను చూసి ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడిచేసి చంపేశాడని అ నుమానిస్తున్నారు. దివ్య కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకటేశ్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయగా.. ఆ సమయం లో అతడు గజ్వేల్‌లోనే ఉన్నట్టు వెల్లడైంది. దీంతో వెంకటేశ్‌ను పట్టుకునేందుకు గజ్వేల్, వేములవాడలకు రెండు ప్ర త్యేక బృందాలను పంపించారు. అనంతరం వెంకటేశ్ తల్లిదండ్రులను విచారణ నిమిత్తం వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్ నేరుగా ఠాణాకు వచ్చి లొంగిపోయాడు. దీంతో అతడిని విచారణ నిమిత్తం సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. దివ్య కుటుంబీకుల ఆందోళన: దివ్య మృతదేహానికి పోస్టుమార్టం సందర్భంగా గజ్వేల్ ప్రభుత్వాసుపత్రివద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. న్యాయం జరిగేంతవరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమంటూ భీష్మించారు. అంతలో మంత్రి కేటీఆర్..ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ సభ్యుడు ఆగయ్యకు ఫోన్‌చేసి.. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ విషయాన్ని ఆగయ్య చెప్పడంతో ఆందోళనకు తెరపడింది. దివ్యకు ఎల్లారెడ్డిపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు: పరుశురాం వెంకటేశ్, దివ్య ప్రే మించి పెళ్లి చేసుకున్నార ని అతడి తండ్రి పరుశు రాం విలేకరులకు తెలిపారు. ఇద్దరూ టెన్త్ సమయంలోనే ప్రేమలో పడ్డార నీ, పెళ్లయిన తర్వాత దివ్య తల్లిదండ్రులు ఆమెను ఇ క్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారన్నారు. దీంతో తానే స్వ యంగా డబ్బులు ఖర్చుచేసి దివ్యను హైదరాబాద్‌లో హాస్టల్లో ఉంచి చదివించానని చెప్పారు. ఓయూ క్యాంపస్‌లో చదువుతున్న దివ్య.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంజనీరింగ్ కోచింగ్ తీసుకుంటున్న వెంకటేశ్‌తో కలసి ఉన్నట్లు వివరించారు. అయితే.. ఉద్యోగం వచ్చాక దివ్య ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. అప్పట్నుం చి తన కుమారుడు వెంకటేశ్ ఇబ్బందులు పడుతున్నా డని చెప్పారు. తిరిగి దివ్యకు తల్లిదండ్రులు దగ్గరై పెళ్లి సంబంధాలు చూడటంతో వెంకటేశ్ మానసిక సంఘర్షణ కు గురయ్యాడన్నారు. నిజానికి తన కుమారుడు పిరికివాడని, హత్య చేసేంత ధైర్యం అతడికి లేదని అతని తండ్రి పరశురాం వివరించారు. -
మద్యం మత్తులో.. బీరుసీసాలతో దాడి!
సాక్షి, రాజన్న సిరిసిల్లా : హనుమాజీ పేట గ్రామంలోని పర్మిట్ రూమ్ వద్ద నలుగురు వ్యక్తులు నానా హంగామాచేశారు. మద్యం మత్తులో ఒకరిపైఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. పాత కక్షలతోనే ఒకరిపై ఒకరు ఈ దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వేములవాడ రూరల్ పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. వేములవాడ మండలం మల్లారంకు చెందిన గంగరాజు, ప్రవీణ్, జానీలతో పాటు చందుర్తి మండల మూల పల్లెకు చెందిన ప్రశాంత్‌లు పర్మిట్ రూమ్‌లో మద్యం సేవిస్తూ ఉండగా.. మాటలతో వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో బీరుసీసాలతో కొట్టుకున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురిని వేములవాడ ఆసుపత్రికి తరలించారు. -
ఆవు తొక్కడంతో బాలుడి మృతి
వేములవాడ: ఆవు బాలుడిని తొక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన వేములవాడలోని రాజన్న ఆలయ ఆవరణలో చోటుచేసుకుంది. వివరాలు..భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన తిరుపతి దంపతులు వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చారు. రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆదివారం రాత్రి ఆలయ ఆవరణంలో నిద్రకు ఉపక్రమించారు. అయితే ఎక్కడి నుంచో వచ్చిన ఓ ఆవు, తల్లిదండ్రుల పక్కనే నిద్ర పోతున్న ఎర్రబోయిన అనూష్పై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలోనే మృతిచెందాడు. బాలుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని..
సాక్షి, సిరిసిల్ల: నేరళ్ల ఘటన మరువకముందే మరో దాష్టీకానికి పాల్పడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. తమ అక్రమాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడన్న ఆక్రోశంతో ఓ యువకున్ని దారుణంగా కొట్టారు. బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్లకు చెందిన సదానందం అనే యువకుడు పోలీసులు చేస్తున్న అక్రమాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ పేరుతో యువకున్ని పిలిచి తీవ్రంగా కొట్టారు. తనను వేములవాడ పోలీసులు నిర్భందించి తీవ్రంగా కొట్టారని సాక్ష్యాలతో సదానందం కోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా పోలీసుల అరాచకాలపై ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే సామాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడటాన్ని తప్పుబడుతున్నారు. -
గిరిగిరి.. కిరికిరి
వేములవాడకు చెందిన రాజు చిరువ్యాపారి. గతేడాది శివరాత్రి జాతర సందర్భంగా టాయ్స్(బొమ్మలు) విక్రయిస్తే మంచిలాభం వస్తుందనే ఆశతో ఫైనాన్షియర్‌ను సంప్రదించాడు. రూ.లక్షల్లోంచి రూ.15వేలు కోత విధించిన సదరు ఫైనాన్షియర్.. రాజుకు రూ.85 వేలు అప్పు ఇచ్చాడు. రోజూ రూ.వెయ్యి చొప్పున వందరోజుల్లో బాకీ తీర్చాలని నిబంధన విధించాడు. కాలం కలిసిరాలేదు.. వ్యాపారం సక్రమంగా సాగలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడం రాజుకు కష్టంగా మారింది. అప్పు ఇచ్చిన వ్యక్తి రోజూ దుకాణానికి వచ్చి వాయిదా చెల్లించాలని పరుషపదజాలంలో దూషించాడు. దీంతో రాజు బాకీ తీర్చేందుకు షాపు అమ్మేశాడు.. చివరకు భార్యపై ఉన్న బంగారం విక్రయించి ఊరు వదిలి పెట్టి వెళ్లిపోయాడు. ఇట్లాంటి వారు వేములవాడ రాజన్న గుడి ఎదుట వందల సంఖ్యలో ఉన్నారు. సిరిసిల్లలోనూ గిరిగిరి చిట్టీలు, ఫైనాన్స్ బాధితుల వేదన వర్ణణాతీతం. సిరిసిల్లక్రైం: వడ్డీవ్యాపారులు, గిరిగిరి ఫైనాన్స్ నడిపేవారు జిల్లావ్యాప్తంగా సుమారు 450 వరకు ఉంటారని అంచనా. ఒక్క వేములవాడలోనే 300 – 400 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. జిల్లాకేంద్రం సిరిసిల్లలో 50 – 100 మంది వరకు ఉంటారని సమాచారం. అనుమతిలేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ వ్యవహారం నడుపుతున్న వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడురోజులుగా వరుస దాడులు చేస్తున్నారు. దీంతో వడ్డీవ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అధిక మిత్తికి ఆశపడి ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుందా? లేదా? అని భయపడుతున్నారు. ఫైనాన్స్‌లు, గిరిగిరి చిట్టీలు నిర్వహిస్తూ వడ్డీల పేరిట వేధిస్తే నేరుగా పోలీస్ కార్యాలయాలకు రావాలని ఎస్పీ ప్రకటించడంతో వ్యాపారుల్లో వణుకు పుడుతోంది. పైగా ఫైనాన్స్ దందా నిలిపి వేశారు. కాగా, మహాశివరాత్రి సందర్భంగా రూ.కోట్లు అప్పు తీసుకుని చిరువ్యాపారులు వ్యాపారం చేసేవారు. కానీ మహాశివరాత్రికి వారంరోజుల ముందు నుంచే జరుగుతున్న పోలీసుల దాడులతో అప్పులిచ్చే వారు, తీసుకునే వారికి బ్రేకులు పడ్డాయని తెలిసింది. కానరాని వసూళ్లు.. జిల్లాలోని ప్రధాన పట్టణాలు సిరిసిల్ల, వేములవాడలో ఇప్పటి వరకు 14 మంది వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వడ్డీవ్యాపారం ఒక్కసారిగా స్తంభించింది. దాడులకు ముందు గిరిగిరి (డైలీ) అప్పు ఇచ్చి రోజూవారిగా వసూలు చేసేవారు ఇప్పుడు బయటకు వెళ్లడంలేదని సిరిసిల్లలోని ఓ షాపు నిర్వాహకుడు తెలిపారు. వే ములవాడలో అప్పులిచ్చిన వారికి ఫోన్ చేసి.. వాయిదా చెల్లిస్తామని బాకీదారులు చెప్పినా ఫైనాన్షియర్లు ముందుకు రావడంలేదని తెలిసింది. కొందరైతే ఏకంగా తమ మైబైల్స్‌ను స్విచ్ఆఫ్ చేసినట్లు తెలిసింది. మూడురోజులుగా ఇదేపరిస్థితి కొనసాగుతోంది. చితికిపోతున్న చిరువ్యాపారులు.. నిబంధనల ప్రకారం వడ్డీవ్యాపారాలు చేయాలని, అలాకాని పక్షంలో చట్ట పరిధిలో చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించడాన్ని కొందరు చిరువ్యాపారులు సమర్థిస్తున్నారు. అదేసమయంలో తమ వ్యాపారాలు సాగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారాలు చేసేందుకు బ్యాంకర్లు అప్పులు ఇవ్వరని, ఒకవేళ కొందరు అధికారులు ఇచ్చేందుకు అంగీకరించినా ఏవేవో కుంటిసాకులు చెబుతారని, సాక్షులు, డిపాజిట్ అడుగుతారని పేర్కొంటున్నారు. అందుకే కాస్త ఎక్కువ మిత్తి అయినా, అడిగిన వెంటనే అప్పులిచ్చే ఫైనాన్షియర్స్‌ను ఆశ్రయిస్తున్నామని అంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు వడ్డీవ్యాపారులు జలగల్లా పీక్కుతింటున్నారని ఆవేదన చెందుతున్నారు. దక్షిణకాశీగా పేరున్న వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా పదిరోజులపాటు వ్యాపారం చేసేందుకు రూ.10 చొప్పున అప్పు చేసినా.. దేవుడి దయవల్ల వ్యాపారం బాగా నడిస్తే వాటిని తీర్చేవాళ్లమని, పోలీసుల వరుస దాడులతో ఇప్పుడు అప్పు పుట్టడడమే గగనంగా మారిందన్న ఓ చిరువ్యాపారి అన్నారు. వడ్డీల పేరిట రక్తాన్ని పీల్చే వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలంటూనే, అక్రమంగా ఉన్న డబ్బును బ్యాంకుల్లో చేర్చి వారికి ఆస్తిపన్ను పడేలా చూడాలని, వ్యాపారులకు బ్యాంకులు రుణాలు అందించేలా చూడాలని కోరుతున్నారు. కొనసాగుతున్న దాడులు.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వడ్డీ, చిట్టీల నిర్వహణ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గత బుధవారం సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేటలో ఏకకాలంలో దాడులు చేసి 11 మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఇద్దరిని, శుక్రవారం మరొకరిని అరెస్డ్ చేశారు. టాస్క్‌ఫోర్స్ సీఐ బన్సీలాల్ నేతృత్వంలో వరుస దాడులు సాగిస్తున్నారు. శుక్రవారం వేములవాడ సాయినగర్‌కు చెందిన వ్యాపారి ఖమ్మం గణేశ్ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అతడి నుంచి 22 ప్రాంసరీ నోట్లు, 3 బాండు పేపర్లు, 4 చెక్కులు, 9 నోట్బక్కులు, ఒక రిజిష్టర్, 4 చెక్కుబుక్కులు, 8 చిట్టీబుక్కులు, 1 గాయత్రీ బ్యాంకు పాస్బుక్కు, నగదు లెక్కించే యంత్రం, రూ.2.21 లక్షల నగుదు, రెవెన్యూ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందంలో ఎస్సైలు సత్యనారాయణరెడ్డి, చీనానాయక్ పాలుపంచుకుంటున్నారు. గిరిగిరి చిట్టీ వ్యాపారం ఇలా.. ఒకరికి రూ.లక్ష అవసరం ఉంటే.. రూ.15 వేలు ముందుకుగా కట్‌చేసుకుని మొగతా రూ.85 వేలను ప్రైవేట్ ఫైనాన్షియర్ చెల్లిస్తాడు. బాకీదారు రోజూ రూ.వెయ్యి చొప్పున వందరోజుల పాటు చెల్లించాలి. ఇలా చెల్లించిన సొమ్ము రూ.లక్ష వరకు చేరుతుంది. అంటే.. బాకీదారు రూ.85 వేలకు వంద రోజుల్లోనే రూ.15 వేల వడ్డీ చెల్లిస్తున్నాడన్నమాట. ఇలాంటి వ్యాపారులు రోజూ కనీసంఇరవై మందికి ఫైనాన్స్ ఇస్తున్నారు. రోజూవారీగా వసూలు చేసే సొమ్మును మళ్లీ ఇతరులకు అప్పుగా ఇస్తున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లించే బాకీదారుకు రూ.6 – రూ.8 వరకు వడ్డీ పడుతుండగా, ఆలస్యమైన వారు రూ.10కి మించి చెల్లించాల్సి వస్తోంది. రోజూ దాడులు.. నిబంధనలు అతిక్రమించి, ప్రజలను హింసించి వ్యాపారాలు చేసేవారిపై పోలీస్‌శాఖ రోజూ దాడులు చేస్తూనే ఉంటుంది. వడ్డీ వ్యాపారులు, చిట్టీల నిర్వాహకులు తమ పద్ధతి మార్చుకోవాలి. లేనిపక్షంలో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత దాడుల ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నాం. – విశ్వజిత్ కాంపాటి, ఎస్పీ -
నమ్మితే ‘నయా’వంచన
మాటల గారడీతో మాయ చేశాడు ఇత్తడి ఎరవేసి పుత్తడి దోచాడు సాయం చేస్తానని దగ్గరై దోచుకెళాడు నిందితుడిపై రెండుజిల్లాల్లో ఎనిమిది కేసులు పగటి దొంగను పట్టుకున్న వేములవాడ పోలీసులు వేములవాడ, న్యూస్‌లైన్ : మిమ్మల్నిచూస్తే మంచివారిలా ఉన్నారు. నా వస్తువులు మీ దగ్గర దాచితే భద్రంగా ఉంటాయనిపిస్తుంది. ఏమాత్రం స్వార్థంలేని మనిషిలా ఉన్నారు మీరు. మీకు డబ్బిచ్చినా భద్రంగా తిరగిస్తారు... అబ్బో ఇలా పొగిడేస్తూంటే పడిపోని వారుంటారా. అందునా అమాయక జనాలైతే ఇట్టే నమ్మేస్తారు కదా. అవునండీ యూఏఈ ఎక్స్ఛేంజ్, బ్యాంక్, రైల్వేస్టేషన్.. ఇలా ఎక్కడైనా సరే అతడు అమాయకులను ఇట్టే బుట్టలో పడేస్తాడు. తన ఒంటిపైనున్న రోల్డ్‌గోల్డ్ నగలు, ఉంగరాలూ ఏవడిగినా అడక్కపోయినా ఇట్టే ఒలిచి ఇచ్చేస్తాడు. నమ్మేసి మన ఒంటిపై నగలో, దాచుకున్న సొమ్మో ఇస్తే పత్తాలేకుండా పోతాడు. వేములవాడ సీఐ చల్లా దేవారెడ్డి నేతృత్వంలో పోలీసులు వలపన్ని పట్టుకున్న ఇతగాడి పేరు అబ్దుల్లాపూర్ చిన్నారెడ్డి. స్వగ్రామం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వన్నెల్(కె). ఇతగాడి గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం కలుగుతోంది కదూ.. ఇలా కేసు నమోదు కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కౌసల్య (55) షోలాపూర్‌లో ఉన్న తమ బంధువల వద్దకు వెళ్లేందుకు కామారెడ్డి రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. రైలొచ్చేదాకా వేచి ఉన్న సమయంలో చిన్నారెడ్డి ఆమె వద్దకు చేరుకున్నాడు. తనను తాను పరిచయం చేసుకున్న చిన్నారెడ్డి హైదరాబాద్ రైలుకోసం వేచి చూస్తున్నట్లు చెప్పాడు. ఎక్కడికెళ్తున్నారమ్మా అంటూ మాటలు కలిపాడు. ఆత్మీయ పలకరింపుతో కరిగిపోయిన కౌసల్య వివరాలన్నీ వెల్లడించింది. ఆమె ఫోన్‌నెంబర్ పొందిన చిన్నారెడ్డి ఆ తర్వాత పక్షం రోజుల తర్వాత డిసెంబర్ 18న ఆమెకు కాల్ చేశాడు. అప్పటికే తిరిగి కొడిమ్యాలకు చేరుకున్న కౌసల్య తను ఇంటివద్ద ఉన్నట్లు తెలిపింది. తాను వేములవాడకు వచ్చానని, తన కూతురికి బంగారు ఆభరణం చేయించాల్సి ఉందని పేర్కొన్నాడు. అయితే ఇక్కడి స్వర్ణకారులెవరూ తనకు పరిచయంలేదని, మీకు తెలిసిన వారుంటే పరిచయం చేయాలని కోరాడు. అందుకు అంగీకరించిన ఆమె వేములవాడకు వచ్చింది. ఆమెను కలిసిన చిన్నారెడ్డి కౌసల్య ఒంటిపైనున్న బంగారు ఆభరణం బాగుందంటూ మెచ్చుకున్నాడు. అదే డిజైన్‌ను తన కూతురికి చేయించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఆమె నుంచి ఆభరణాన్ని పొందిన చిన్నారెడ్డి స్వర్ణకారుడికి ఈ డిజైన్ చూపించి వస్తానంటూ వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ తన సెల్ఫోన్లో బ్యాలెన్స్ లేదని కౌసల్య తాలూకూ సెల్‌ఫోన్ సహితం తీసుకెళ్లాడు. ఎంతకీ తిరిగిరాకపోవటంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎర వేశారిలా ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు స్థానిక సీఐ చల్లా దేవారెడ్డి నేతృత్వంలో రంగప్రవేశం చేశారు. చిన్నారెడ్డి తీసుకెళ్లిన కౌసల్య ఫోన్ ద్వారా చిన్నారెడ్డి వినియోగించే ఫోన్ నెంబర్లను సేకరించారు. ఇంతలోనే నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన నర్సయ్యను దోచుకునేందుకు చిన్నారెడ్డి పథకం పన్నాడు. ఇందులో భాగంగా తన వద్దనున్న ఐదు తులాల బంగారాన్ని తీసుకుని రూ. లక్ష ఇవ్వాల్సిందిగా నర్సయ్యను కోరాడు. ఇచ్చేందుకు నర్సయ్య సిద్ధపడ్డాడు కూడా. ఈ విషయాన్ని పోలీసులు సెల్‌ఫోన్ ట్యాపింగ్ ద్వారా పసిగట్టారు. ఆ వెనువెంటనే నర్సయ్యవద్దకు చేరుకున్న పోలీసులు చిన్నారెడ్డి చేసే మోసాలను గురించి వివరించారు. తమకు సహకరించాల్సిందిగా కోరారు. నర్సయ్యతో మాట్లాడించి డబ్బు తీసుకెళ్లాల్సిందిగా చిన్నారెడ్డికి సమాచారం అందించారు. రెండు రోజుల తర్వాత వచ్చిన చిన్నారెడ్డిని పోలీసులు కామారెడ్డిలో అదుపులోకి తీసుకున్నారు. తీగ లాగితే... పోలీసు మార్కు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన నిందితుడు చిన్నారెడ్డి తన గుట్టు విప్పాడు. తీగలాగితే డొంక కదిలింది. మాయమాటలు చెప్పి చేసిన మోసాలను వివరించాడు. కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఆర్మూర్‌లలో ఇతడిపై మొత్తం ఎనిమిది కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో తదుపరి విచారణకు చిన్నారెడ్డిని మరోసారి పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్లు సీఐ దేవారెడ్డి తెలిపారు. మరికొన్ని కేసుల్లో ఫిర్యాదు అందాల్సి ఉందన్నారు.