విద్యార్థులను అభినందిస్తున్న డీఈఓ రాధాకిషన్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు శుక్రవారం కలిసి సన్మానించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ప్రతినిధులు ముస్కు మల్లారెడ్డి, బొడ్డు నారాయణ, బి.మదన్ పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్‌గా కస్తూర్భా విద్యార్థినులు
సిరిసిల్లఎడ్యుకేషన్: రాజస్థాన్‌లోని రోహత్ జిల్లా పాలి గ్రామంలో జరిగిన 18వ నేషనల్ జంబూరికి వెళ్లిన కేజీబీవీ విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించడంతో ఓవరల్ చాంపియన్‌గా నిలిపారు. విద్యార్థులను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ శుక్రవారం అభినందించారు.
వీర్నపల్లి, రుద్రంగి కేజీబీవీల నుంచి నలుగురి చొప్పున ఈ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమంలో భాగంగా ఫోక్‌డ్యాన్స్, మార్చ్‌ఫాస్ట్, కలర్‌పార్టీ, ట్రెక్కింగ్ వంటి పోటీల్లో పాల్గొన్నారు. ఎస్‌ఎస్‌ఏ కో–ఆర్డినేటర్ పద్మజ, డిస్ట్రిక్ట్ గైడ్ ఆర్గనైజింగ్ కమిషనర్ నీలిమ, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కమిషనర్ సురేశ్, గైడ్ టీచర్ స్రవంతి, కేజీబీవీ విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment