ట్రాక్టర్లో తరలిస్తున్న టేకు కలప
చందుర్తి(వేములవాడ): అటవీ ప్రాంతం నుంచి టేకు కలప అక్రమంగా రవాణా జోరుగా సాగుతోంది. చందుర్తి అటవీ ప్రాంతం నుంచి కలపను ట్రాక్టర్లో తరలిస్తున్న పట్టించుకునేవారు లేరు. చందుర్తి మండలం తిమ్మాపూర్ శివారు నుంచి శుక్రవారం టేకు దుంగలను ట్రాక్టర్లో తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది గ్రామంలో ఉన్నారనే సమాచారంతో ట్రాక్టర్ను దారిమళ్లించారని తెలిసింది.
ఇలా నిత్యం టేకు కలప తరలిపోతోందని మండలంలోని అటవీ గ్రామాల వారు చర్చించుకుంటున్నారు. అటవీశాఖలో పనిచేస్తున్న సిబ్బందిని కొందరు స్మగ్లర్లు మచ్చిక చేసుకుని విలువైన టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిమ్మాపూర్లో టేకు కలపను పట్టుకున్నారన్న గ్రామస్తుల సమాచారంతో సంబంధిత బీట్ అధికారి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఎఫ్ఆర్ఓ ఖలీలొద్దీన్ను వివరణ కోరగా తమకు సమాచారం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment