సంజయ్‌కి వినతిపత్రం ఇస్తున్న నాయకులు
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలకేంద్రంలో శుక్రవారం నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారికి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కోనరావుపేటకు చెందిన బొల్లె ఇసాక్–రూప దంపతుల కూతురు చరిష్మా(4) ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో తలపై తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందించారు. చిన్నారి ప్రస్తుతం క్షేమంగా ఉంది.
వేతనాలు పెంచేలా కృషి చేయండి
ముస్తాబాద్(సిరిసిల్ల): వేతనాలు పెంచి, రెగ్యులర్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ బీఎంఎస్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను కలిసి విన్నవించారు. బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ మాట్లాడుతూ ఏళ్లుగా పారిశుధ్య కార్మికులు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి, రెగ్యులర్ చేయాలని కోరారు. జల్లి లక్ష్మణ్, పోష రాములు, రాములు తదితరులు ఉన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు, కార్యకర్తలు పోరాడాలని బీజేపీ అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్‌రెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో శుక్రవారం ప్రజాగోస కార్నర్ సమావేశం జరిగింది. సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శక్తి కేంద్రం ఇన్‌చార్జి యాదగిరి, నాయకులు శ్రీకాంత్, రవీందర్, రజిత, ప్రశాంత్, రవి, నరేశ్, రమేశ్, సాయి, సుధాకర్, నవీన్ పాల్గొన్నారు.
నేడు విధుల్లో చేరనున్న డీఈవో రమేశ్‌కుమార్
సిరిసిల్లఎడ్యుకేషన్: మెదక్ జిల్లా డీఈఓగా పనిచేస్తున్న ఎ.రమేశ్‌కుమార్‌ను సిరిసిల్ల జిల్లా విద్యాధికారిగా బదిలీ అయ్యారు. ఆదర్శ పాఠశాలల అసిస్టెంట్ డైరక్టర్ ఉన్న రమేశ్‌కుమార్ ఇప్పటి వరకు మెదక్ జిల్లా విద్యాధికారిగా పనిచేశారు. ఇప్పటి వరకు డీఈగా పని చేసిన రాధాకిషన్ మెదక్ జిల్లా విద్యాధికారిగా బదిలీ అయ్యారు. డీఈవోగా రమేశ్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment