Telangana: Minister KTR Fires on Central Government - Sakshi
Sakshi News home page

తెలంగాణ పుట్టుకను అవమానించింది మోదీ కాదా?: కేటీఆర్‌

Published Mon, Mar 27 2023 4:37 PM | Last Updated on Mon, Mar 27 2023 5:35 PM

Telangana: Minister Ktr Fires Central Government - Sakshi

సాక్షి, కరీంనగర్‌(సిరిసిల్ల) బీజేపీ దుర్నీతిని ప్రజల్లో ఎండగట్టాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్‌ మిల్‌ను మంత్రి సోమవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను కేంద్రం ఓ శతృ దేశంలా చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణ పుట్టుకను అవమానించింది మోదీ కాదా అని ప్రశ్నించారు.

శంలో వాళ్ల పార్టీ మాత్రమే బతకాలి మిగతా వాళ్లును చంపేయాలి అనే విధంగా వాళ్ల చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. డబుల్‌ ఇంజన్‌ అంటే మోదీ అదానీ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ‘సీఎంను పట్టుకుని బ్రోకర్‌ అని బండి సంజయ్‌ అంటున్నాడు.. అదానీకి మోదీ బ్రోకర్‌ అని నేను అనగలను కానీ అలా అనను.. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది’అని  వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement