
మాట్లాడుతున్న గుంటి వేణు
సిరిసిల్లటౌన్: జిల్లాలోని అర్హులకు రేషన్‌కార్డులు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. చాలా మంది అర్హులు కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. 2017 నుంచి రేషన్‌కార్డులు అందించకుండా సర్కారు తాత్సారం చేయడం దారుణమని పేర్కొన్నారు. పంతం రవి, సోము నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇసుక వాహనాలు పట్టివేత
ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ముస్తాబాద్‌లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామని ఆర్‌ఐ శ్యామ్ తెలిపారు. మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న గండిలచ్చపేట, ముస్తాబాద్‌కు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇసుక వాహనం పట్టివేతఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా మానేరువాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించామని ఎస్సై తెలిపారు. నారాయణపూర్‌కు చెందిన శివరాత్రి మహేశ్ అనే ట్రాక్టర్ యజమానితోపాటు డ్రైవర్ రాజన్నపేటకు చెందిన శివరాత్రి నర్సింలుపై కేసులు నమోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పట్టుబడ్డ వాహనం