వినతిపత్రం ఇస్తున్న నామాపూర్ రైతులు
ముస్తాబాద్(సిరిసిల్ల): మల్లన్నసాగర్ కెనాల్‌కు అవసరమైన భూములను తమకు తెలియకుండానే సేకరించడం సరికాదని ముస్తాబాద్ మండలం నామాపూర్ రైతులు పేర్కొన్నారు. తహసీల్దార్ మునీందర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతులు ఆర్డీవో శ్రీనివాస్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీకోడు నుంచి నామాపూర్‌కు వచ్చే మల్లన్నసాగర్ సబ్‌కెనాల్ ద్వారా ఇక్కడి రైతులకు ఉపయోగం లేదన్నారు.
కెనాల్ కోసం నిర్వహించిన గ్రామసభల్లో ఇదే విషయం చెప్పామన్నారు. ఇప్పుడు తమ భూములకు చెక్కులు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అంగీకారం లేకుండా భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కెనాల్‌లో భూములు కోల్పోతున్న తమకు మరో ఆధారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం వద్దంటూ చెక్కులను తీసుకోలేదు. భూములకు బదులు మరోచోట ప్రభుత్వ భూములు కేటాయించాలని కోరారు. ఈవిషయంలో మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతులు డాకూరి నాగరాజు, రాజేశం, చెర్ల మల్లేశం, గూడ రాజిరెడ్డి, వెల్ముల రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment