మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన దినసరి కూలి బెస్త పద్మయ్య(50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రులు తిరిగిన రోగం నయంకాలేదు. ఖరీదైన వైద్యం అందక ఇంటి వద్దనే ఉండగా.. పరిస్థితి విషమించి శుక్రవారం ప్రాణాలు వదిలాడు.
పద్మయ్య భార్య పద్మ పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. కూతురు స్వర్ణలత పెళ్లి చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పద్మయ్య ఏడాది క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎవరూ లేకపోవడంతో తిండి సరిగ్గా దొరక్క ఆరోగ్యం క్షీణించి మరణించాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దహన సంస్కారాల నిర్వహణకు సర్పంచ్ కొండపురం బాల్‌రెడ్డి రూ.5వేలు, మానుక కిషన్ రూ.2వేలు, మరి కొందరు సాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment