
డాక్టర్ శంకర్‌ను సన్మానిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీపీలు
ముస్తాబాద్(సిరిసిల్ల): గ్రామీణప్రాంత పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఐఏంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చింతోజు శంకర్ అన్నారు. ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ లక్ష ఆపరేషన్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జెడ్పీటీసీ శరత్‌రావు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నలభై ఏళ్ల క్రితం ఎంబీబీఎస్, డీజీవో పూర్తి చేసి ముస్తాబాద్‌లో ఆసుపత్రి పెట్టామన్నారు. అతితక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందిస్తూ తమ ప్రస్థానాన్ని కొనసాగించామన్నారు. ఎన్నో వందలాది క్రిటికల్ కేసులను పరిష్కరించడం ఆత్మ సంతృప్తిని ఇచ్చిందన్నారు. పేదల దేవుడిగా శంకర్ తెలంగాణకే గర్వకారణమని జెడ్పీటీసీ శరత్‌రావు అన్నారు. పిలిస్తే పలికే డాక్టర్‌గా లక్ష సర్జరీలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ముస్తాబాద్ నేడు వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్, డాక్టర్‌రాజారాంను సన్మానించారు. ఎంపీపీ శ్రీనివా స్, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు సర్వర్, సెస్ డైరెక్టర్ విజయరామారావు, సర్పం చ్ నల్ల నర్సయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుర్ర రాములు, డీసీసీ కార్యదర్శి ఓరగంటి తిరుపతి, సంతోష్‌రావు, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment