
లచ్చిగాని పేరు ఊరంతా మారుమోగిపోతోంది. కలలో దేవుడితో మాట్లాడుతున్నాడట లచ్చిగాడు. ఎవరికి ఏ సమస్య ఉందని చెప్పినా, వాళ్లడిగిన దేవుడి దగ్గరికి కలలో వెళ్లి మాట్లాడుతున్నాడట. ఆ ఊర్లో అందరి మంచి చెడ్డలు చూసే రాజన్నకు ఇది వింతగా కనిపించింది.
రాజన్న వెళ్లి తన సమస్య చెప్పుకున్నాడు. తనతో పాటు ఊర్లో చాలామందిదీ ఇదే సమస్య అని చెప్పుకున్నాడు. లచ్చిగాడు కలలో రాజన్న సమస్యకు పరిష్కారం కోసం ఒక దేవుణ్ని కలుసుకున్నాడు. ఆ సమస్య ఏంటీ? ఆ దేవుడెవరు? ఆయన చూపిన పరిష్కారమేంటీ? చదవండి.. ‘లచ్చిగాని కల’ అనే కథలో..
దాని
ఆమె లేకుండానే అతను చాలాకాలంగా ఒంటరిగా బతుకుతున్నాడు. ఆమె సమాధితో మాట్లాడతాడు. తానూ ఆమె ఉన్నచోటకు వస్తానంటాడు. ఆమె ‘‘నీకింకా ఈ భూమ్మీద చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.’’ అని చెబుతుంది. అరవై ఏళ్లుగా అతను ఆమె కోసమే బతుకుతున్నాడు. ఆమె లేకుండా ఉన్న ఈ పదేళ్లు కూడా. అలాంటి వ్యక్తి కథను చదవండి.. ఈవారం కథ ‘దాని’లో..
అంకెల గారడి
‘ఈ విషయ ప్రపంచాన్ని నిర్దేశించే మౌళిక సూత్రం అంకెలే.’ అంటూ మొదలయ్యే ఒక జీవితాన్ని చదవండి ఈవారం అనువాద కథ ‘అంకెల గారడి’లో. కొన్ని జీవితాలను, ఒక కుటుంబాన్ని చిదిమేసిన కొన్ని అంకెలు, వాటి చుట్టూ నడిచే ఓ కథ.. అంకెల గారడి.