numbers
-
పశుపక్ష్యాదులకూ లెక్కలు తెలుసు!
సంగీత జ్ఞానం అని ఒక మాట ఉంది. భక్తి లేకుండా సంగీత జ్ఞానం లేదు అంటాడు త్యాగరాజు. ఆ సంగతి పక్కన పెడితే స్వరజ్ఞానం, తాళజ్ఞానం అని సంగీతంలో రెండు భాగాలు. ఇక అక్షరజ్ఞానం అని మరొక మాట ఉంది. అంటే చదవడం, రాయడం రావడం అన్నమాట. మరి అంకెల మాట ఏమిటి? అందరికీ ఏదో ఒక రకంగా లెక్కపెట్టడం తెలిసే ఉంటుంది. చివరకు పిల్లలకు కూడా పంపకంలో తమకు అన్యాయం జరిగిన సంగతి అర్థం అవుతుంది. ఈ రకంగా మొత్తం మీద అందరికీ అంకెల గురించిన తెలివి ఉంటుంది. అది అనుకోకుండానే వస్తుంది. మనిషి మెదడుకు అంకెలు అర్థమవుతాయి, వాటి మధ్యన లంకె తెలుస్తుంది. అయితే ఈ జ్ఞానం ఉన్నది ఒక్క మనుషులకే కాదు అంటున్నారు. చీమల నుంచి మొదలు తేనెటీగల దాకా ఇంకా పైజాతి జంతువుల వరకు అన్నింటికీ అంకెల గురించి తెలుసు అంటున్నారు. కోతులు, సాలెపురుగులు కూడా కొన్ని అంకెలనైనా తెలుసుకుంటాయి అంటారు పరిశోధకులు. తేనెటీగలు బయలుదేరి తేనె సేకరణ కోసం తిరుగుతూ ఏ ప్రాంతంలో ఎక్కువ పువ్వులు ఉన్నదీ సులభంగా అర్థం చేసుకుంటాయి. కోతులకు ఏ చెట్టు మీద పండ్లు ఎక్కువ ఉన్నాయీ తెలుస్తుంది. ఎదుటి గుంపు గర్జనలను గుర్తించి క్రూర మృగాలు శత్రువుల సంఖ్యను తెలుసుకుంటాయి. జంతువులన్నీ ఆ రకంగా విషయాలు తెలుసుకుంటే గాని వాటి బతుకు సులభంగా సాగదు అంటారు ఆండ్రియాస్ నీడర్. ఆయన జర్మనీలోని ‘ట్యూబింజెన్’ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. సంఖ్యను గుర్తించే ఈ వెసులుబాటు జంతు జాతుల చరిత్రలో అత్యంత ప్రారంభ కాలంలోనే మొదలైంది అంటున్నారు పరిశోధకులు. అయితే మరి కొత్తగా ఈ సంగతిని గురించి ఎందుకు పట్టించుకోవాలి అన్నది ప్రశ్న. ఒక్కసారి చూచి గుర్తుంచుకోగలిగిన అంకెల విషయంలో మనుషులకు పరిమితులు ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. నాలుగు వరకు మాత్రమే సులభంగా గుర్తుంటాయి అంటున్నారు. ఒకచోట నాలుగు పుస్తకాలు ఉంటే సులభంగా గుర్తించగలుగుతాం. అంతకన్నా ఎక్కువగా ఉంటే లెక్కపెట్టవలసి వస్తుంది. ఏ విషయంలో అయినా ఇదే పరిమితి. ఇందులో కూడా రెండు అంచెలు ఉంటాయి. ముందు సంఖ్య నిర్ణయం అవుతుంది. ఆ తరువాత ఆ సంఖ్య సరైనదేనా అని లెక్క తేలుతుంది. క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పెట్రో పినైరో షాగాస్ ఈ విషయంలో ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఇక ఏ అంకె లేకుండా... అంటే సున్నా అన్న భావన ఉన్నచోట కూడా లెక్కింపు అవసరమే అంటున్నారు. అసలు అంకెలు అన్నింటిలోకి సున్నా అన్నది చాలా గొప్పది అంటారు నీడర్. చిన్న చిన్న అంకెలు నేర్చుకున్న తర్వాత కూడా సున్నా అనే భావన నేర్చుకోవడానికి చిన్నపిల్లలకు కొంతకాలం పడుతుంది అని పరిశోధకులు గమనించారు. ఏదో ఉంది అని చెప్పడం, వాటిని లెక్కించడం వింతగా తోచదు కానీ ఏమీ లేని చోట సున్నా అన్న భావన రావడం గొప్ప విషయం. నీడర్ బృందం వారు తమ పరిశోధన ద్వారా కోతులు, తేనెటీగలు, కాకులకు కూడా ‘0’ అన్న విషయం తెలుసునని కనుగొన్నారు. ఈ అంశం గురించి కొంత కాలం క్రితమే ‘క్వాంటా’ అనే పరిశోధన పత్రికలో వ్యాసాలు వచ్చాయి. చాలావరకు జంతువులు, లేదంటే జంతువులు అన్నింటికీ సంఖ్యాజ్ఞానం ఉంది అని సులభంగానే తెలుస్తుంది కానీ దానికి పరిమితి ఎక్కడ అన్న ప్రశ్న చిత్రమైనది. ఆస్ట్రేలియాలోని డికెన్స్ యూనివర్సిటీలో కృషి చేస్తున్న స్కార్లెట్ హోవర్డ్ ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. జంతువు అంకెల పరిమితి మనం ఇంతకుముందు అనుకున్న ప్రకారం కాక మరీ ఎక్కువగా ఉందని కనుగొన్నారు. సున్నా అంటే ఒకటి కన్నా తక్కువ అని తెలుసునట. వాటికి కూడికలు, గుణకారాలు కూడా తెలుసునట. నిజానికి మనిషి పరిణామం చాలా కాలం తర్వాత జరిగింది. మనిషికి కూడా ఈ లెక్కలన్నీ తెలిశాయి. ఇది మొత్తం ప్రాణి ప్రపంచంలోనే ఉన్న విషయం అని పరిశోధకులకు తెలిసింది. మనుషులు ఒకసారి చూచినా, విన్నా ఎనిమిది అంకెల వరకు సులభంగా గుర్తించగలుగుతారని కొంత కాలం క్రితమే తెలుసు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ నంబర్లు 10 అంకెలు ఉంటాయి. కనుక వాటిని ఒకసారి విని గుర్తుంచుకోవడం కష్టం అవుతున్నదట. కొంతకాలం క్రితం ఫోన్ నంబర్లలో 8 కన్నా తక్కువ అంకెలు ఉండేవి. అప్పట్లో సులభంగా గుర్తుండేవట!ఇటువంటి విషయాలను గురించి మనం సాధారణంగా ఆలోచించం. అది సైంటిస్టుల పని అనుకుంటాం. నిజానికి ఈ విషయాలు అందరికీ సంబంధించినవి మరి!కె.బి.గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత -
అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయా? వాట్సాప్ ఏం చెప్పిందంటే..
గత కొన్ని రోజులుగా వాట్సాప్ (WhatsApp)లో యూజర్లకి అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలను లైక్ చేయడం, స్క్రీన్షాట్లను పంపడం వంటివి చేస్తే చాలు నగదు, ఇతర బహుమతులు వస్తాయంటూ నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు దుండగులు. ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? ఈ అనుమానాస్పద కాల్స్ కు సంబంధించి వాట్సాప్ వివరణ ఇచ్చింది. స్పామ్‌ను ఆపడానికి అసాధారణ ప్రవర్తన కలిగిన అకౌంట్లను గుర్తించి చర్య తీసుకోవడానికి తాము స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సీఎన్‌బీసీ టీవీ18 వార్తా సంస్థ ద్వారా తెలియజేసింది. ఫిర్యాదుల స్వీకరణకు భారత్ లో ప్రత్యేక అధికారిని నియమించినట్లు పేర్కొంది. అనుమానాస్పద కాల్స్ లేదా ఇతర అసౌకర్యాలు కలిగితే తమను సంప్రదించవచ్చని సూచించింది. ఇలా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యలను యూజర్లు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ స్కామ్‌ల నుంచి రక్షణకు వాట్సాప్ లో అంతర్నిర్మితంగా ఉన్న టూ-స్టెప్ వెరిఫికేషన్, బ్లాక్ అండ్ రిపోర్ట్ గోప్యతా నియంత్రణల వంటి భద్రతా సాధనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి “స్టే సేఫ్ విత్ వాట్సాప్” పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్, సందేశాలు ఎక్కువయ్యాయంటూ ట్విటర్ లో పోస్టింగులు హోరెత్తాయి. ఇలా వస్తున్న కాల్స్ లో ఎక్కువ భాగం +251 (ఇథియోపియా), +60 (మలేషియా), +62 (ఇండోనేషియా), +254 (కెన్యా) +84 (వియత్నాం)తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తున్నాయి. వాట్సాప్ లో అంతర్జాతీయ నంబర్ల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తే స్పందించవద్దని తెలంగాణ సైబరాబాద్ పోలీసులు కూడా ట్విటర్ ద్వారా వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్‌లో స్కామర్లు తన స్నేహితుడిని మోసగించి రూ. 5 లక్షలు ఎలా కాజేసారో బిలియనీర్, జెరోధా సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలియజేశారు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం -
వాట్సాప్ కి ఆ తరహా కాల్స్ లిఫ్ట్ చేస్తే ఇక అంతే సంగతి
-
చాలా మిస్సవుతున్నా.. ఈ నెంబర్‌కు కాల్ చెయ్!
సాక్షి, సిటీబ్యూరో: ‘ఒంటరిగా ఫీల్ అవుతున్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. మీ గొంతు వినకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఈ నెంబర్‌కు కాల్ చెయ్యి’ అంటూ ఎస్సెమ్మెస్‘హలో హలో మీరు మాట్లాడుతోంది నాకు వినిపించట్లేదు. నేను చెప్పేది వినిపిస్తోందా? దయచేసి నాకు కాల్ బ్యాక్ చేయండి’ అంటూ మహిళల గొంతుతో హిందీలో ఫోన్కాల్స్వీటితో పాటు ఉక్రెయిన్, అజార్బైజాన్ తదితర దేశాల నంబర్లతో అర్ధరాత్రి వేళల్లో మిస్డ్కాల్స్ ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఎవరైనా స్పందించి ఆయా నెంబర్లను సంప్రదిస్తే నిండా మునిగినట్లే. ఫోన్‌కాల్స్ బిల్లు భారీగా వస్తుంది. స్నేహం, ప్రేమ, డేటింగ్ పేరుతో వర్చువల్ నెంబర్లతో వల వేసి నిలువునా ముంచే ‘ప్రీమియం కాల్స్’ బెడద ఇటీవల పెరిగిందని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. యువతులు పేర్లతో బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపడం, ఫోన్లు చేయడం, మిస్డ్ కాల్స్ ఇవ్వడంతో పాటు ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆన్లైన్లో దోచుకునే ఈ వ్యవహరంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వర్చువల్ నంబర్లు ఎంపిక చేసుకుని... మెట్రో నగరాల్లో ఉంటున్న కొందరు ‘ప్రీమియం గాళ్లు’ తాము టార్గెట్‌గా చేసుకున్న వారికి పంపడానికి వర్చువల్ నంబర్లను వాడుతున్నారు. ఇంటర్నెట్లోని అనేక వెబ్సైట్లు ఈ ఫోన్ నెంబర్లను నిర్ణీత కాలానికి అద్దెకు ఇస్తుంటాయి. ఆయా సైట్లలో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన, వివిధ సర్వీసు ప్రొవైడర్లు అందించే కొన్ని నంబర్లు డిస్ప్లే అవుతుంటాయి. వీటిలో తమకు కావాల్సిన దేశానికి చెందిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకుఆ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నంబర్లు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా పని చేస్తాయి. ఇలా వర్చువల్ నంబర్ పొందే వారు వాటిని బల్క్ ఎస్సెమ్మెస్ రూపంలో స్నేహం, ప్రేమ, డేటింగ్ అంటూ సదరు నంబర్‌ను ప్రచారం చేస్తారు. ఇవి ప్రీమియం నంబర్లు కావడంతో అసలు చార్జికి కొన్ని రెట్లు ఎక్కువ పడుతుంది. వివిధ టీవీ ఛానళ్లు నిర్వహించే ఎస్సెమ్మెస్ కాంటెస్ట్‌లు, ఫోన్ కాంటెస్టులకూ ఇలాంటి ప్రీమియం నంబర్లనే వాడతారు. ఎస్ఎంఎస్కు రూ.5, కాల్‌కు నిమిషానికి రూ.18 వరకు చార్జ్ పడుతుంది. ‘ప్రీమియంగాళ్లు’ వాడేవి ఇంటర్నేషనల్ రూటింగ్ కాల్స్ కావడంతో ఈ చార్జీలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇంటర్నేషనల్ క్యారియర్లతో ఒప్పందాలు... వినియోగదారుడు ఏ సర్వీసు ప్రొవైడర్‌కు చెందిన సిమ్ వాడితే బిల్లు వారికే చెల్లిస్తారు. అయితే సదరు సర్వీసు ప్రొవైడర్ ప్రతి కాల్‌కు కొంత మొత్తాన్ని బీఎస్ఎన్ఎల్కు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కాల్ వెళ్లడానికి అవసరమైన శాటిలైట్ స్పేస్‌ను సర్వీసు ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ నుంచే అద్దెకు తీసుకోవాలి. ఇలా బీఎస్ఎన్ఎల్ పరిధి జాతీయ స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఇంటర్నేషనల్ కాల్స్‌కు సంబంధించి ఆ సంస్థ కూడా ఇంటర్నేషనల్ క్యారియర్స్‌తో ఒప్పందాలు చేసుకుంటుంది. వీరు దేశం దాటే కాల్స్‌ను ఆయా దేశాలకు ఎన్‌రూట్ చేస్తారు. దీని నిమిత్తం బీఎస్ఎన్ఎల్ సంస్థ కూడా వారికి నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ‘ప్రీమియం’ ఒప్పందాలు... బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపే ‘ప్రీమియంగాళ్లు’ ఆ నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వెబ్సైట్లకు ఇలాంటి ఇంటర్నేషనల్ క్యారియర్లతో ఒప్పందాలు ఉంటాయి. సంక్షిప్త సందేశానికి ఆకర్షితుడై ఎవరైనా ఫోన్ చేస్తే... మాట్లాడటానికి కొందరు యువతులను ఏర్పాటు చేసుకుంటారు. ఈ కాల్స్ అన్నీ ఇంటర్నేషనల్ రూటింగ్ ద్వారా వస్తాయి. వీరు సంభాషణను వీలైనంత పొడిగించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. దీంతో భారీగా పడే ప్రీమియం చార్జీలు ఫోన్ చేసిన వ్యక్తి (బాధితుడి) సర్వీసు ప్రొవైడర్‌కు... అక్కడ నుంచి బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నేషనల్ క్యారియర్‌కు చేరతాయి. తన రాబడి పెంచినందుకు ఇంటర్నేషనల్ క్యారియర్ నుంచి కొంత కమిషన్ వెబ్సైట్ నిర్వాహకుడిని చేరుతుంది. ఇందుకుగాను ‘ప్రీమియంగాళ్ళ’కు వెబ్సైట్ నిర్వాహకులు కమీషన్ చెల్లిస్తారు. ఈ చెల్లింపులు రోజు, వారం, పక్షం, నెలకు ఒకసారి చొప్పున ఉంటాయి. ఇవన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతాయి. ఇలా ఇంటర్నేషనల్ కాల్ ట్రాఫిక్ జనరేషన్ కోసం, ధనార్జన కోసం అమాయకులకు సంక్షిప్త సందేశాలు పంపుతుంటారు. కట్టడి అంత తేలిక కాదు ఈ తరహా ప్రీమియం నంబర్ల బాధితులు ఇటీవల పెరుగుతున్నారు. తమకు న్యాయం చేయమంటూ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే వర్చువల్‌గా ఉండే ఈ నెంబర్ల మూలాలు కనుక్కోవడం, కట్టడి చేయడం అత్యంత కష్టసాధ్యం. ఆయా వెబ్సైట్లకు సంబంధించిన సర్వర్లు విదేశాల్లో ఉండటమే దీనికి కారణం. వీటి బారినడపకుండా జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం. అపరిచిత నంబర్ల నుంచి స్నేహం, ప్రేమ, డేటింగ్ అంటూ వచ్చే సంక్షిప్త సందేశాలకు స్పందించకూడదు. వినియోగదారుల బలహీనతలే పెట్టుబడిగా ఈ ముఠాలు పని చేస్తుంటాయని మర్చిపోవద్దు.– సైబర్ క్రైమ్ అధికారి -
రేపటి ఫన్డేలో.. లచ్చిగాని కల
లచ్చిగాని పేరు ఊరంతా మారుమోగిపోతోంది. కలలో దేవుడితో మాట్లాడుతున్నాడట లచ్చిగాడు. ఎవరికి ఏ సమస్య ఉందని చెప్పినా, వాళ్లడిగిన దేవుడి దగ్గరికి కలలో వెళ్లి మాట్లాడుతున్నాడట. ఆ ఊర్లో అందరి మంచి చెడ్డలు చూసే రాజన్నకు ఇది వింతగా కనిపించింది. రాజన్న వెళ్లి తన సమస్య చెప్పుకున్నాడు. తనతో పాటు ఊర్లో చాలామందిదీ ఇదే సమస్య అని చెప్పుకున్నాడు. లచ్చిగాడు కలలో రాజన్న సమస్యకు పరిష్కారం కోసం ఒక దేవుణ్ని కలుసుకున్నాడు. ఆ సమస్య ఏంటీ? ఆ దేవుడెవరు? ఆయన చూపిన పరిష్కారమేంటీ? చదవండి.. ‘లచ్చిగాని కల’ అనే కథలో.. దాని ఆమె లేకుండానే అతను చాలాకాలంగా ఒంటరిగా బతుకుతున్నాడు. ఆమె సమాధితో మాట్లాడతాడు. తానూ ఆమె ఉన్నచోటకు వస్తానంటాడు. ఆమె ‘‘నీకింకా ఈ భూమ్మీద చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.’’ అని చెబుతుంది. అరవై ఏళ్లుగా అతను ఆమె కోసమే బతుకుతున్నాడు. ఆమె లేకుండా ఉన్న ఈ పదేళ్లు కూడా. అలాంటి వ్యక్తి కథను చదవండి.. ఈవారం కథ ‘దాని’లో.. అంకెల గారడి ‘ఈ విషయ ప్రపంచాన్ని నిర్దేశించే మౌళిక సూత్రం అంకెలే.’ అంటూ మొదలయ్యే ఒక జీవితాన్ని చదవండి ఈవారం అనువాద కథ ‘అంకెల గారడి’లో. కొన్ని జీవితాలను, ఒక కుటుంబాన్ని చిదిమేసిన కొన్ని అంకెలు, వాటి చుట్టూ నడిచే ఓ కథ.. అంకెల గారడి. -
జనసంద్రమైన వాడపల్లి
-మార్మోగిన గోవిందనామం -భక్తులకు ట్రాఫిక్ కష్టాలు -వీఐపీల రాకతో గంటల తరబడి క్యూలైన్లో.. -ఉత్తర ద్వార దర్శనానికి బ్రేక్ ఆత్రేయపురం (కొత్తపేట):కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శనివారం శ్రావణమాసం త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివార్ని దర్శించుకున్నారు. ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది. శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ని ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించారు. ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి మొక్కుబడులు చెల్లించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో పర్యవేక్షకులు సాయిరామ్ , శ్రీదేవి ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ట్రాఫిక్ స్తంభించడంతో అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. లొల్ల వంతెన వద్ద గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఆలయంలో ప్రముఖుల తాకిడి అధికంగా ఉండటంతో గంటల తరబడి క్యూలైన్లు నిలిపివేయడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్లో భక్తులు సుమారు 3 గంటల పాటు పడిగాపులు పడ్డారు. ఆలయంలో ఉత్తర ద్వారం నిలుపుదల చేయడంతో పాటు మరో మార్గం ఏర్పాటు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని భక్తులు వాపోయారు. ప్రముఖులు, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం ప్రధాన మార్గం ద్వారా వెళ్లడంతో భక్తులు స్వామి వారి దర్శనం కోసం అష్టకష్టాలు పడ్డారు. స్వామి వారి సన్నిధిలో అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసస్నకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల సత్కారం అందుకున్నారు. ఆలయ చైర్మన్ నరసింహరావు, ఈవో సత్యనారాయణరాజు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. -
ఫ్యాన్సీ నంబర్‌కు ఆన్లైన్ బ్రేక్
తణుకు : కొత్త వాహనం కొనుగోలు చేసినవారు గుర్తింపునిచ్చే (ఫ్యాన్సీ) నంబర్‌కు ప్రాధాన్యమిస్తుంటారు. కొందరు తమకు ఇష్టమైన నంబర్ కోసం ఎంతైనా వెచ్చిస్తుంటారు. దీనిద్వారా కోట్లాది రూపాయల ఆదాయం రవాణా శాఖకు సమకూరుతోంది. అయితే జిల్లాలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియ కారణంగా ఫ్యాన్సీ నంబర్లకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించడంలో జరుగుతున్న జాప్యంతో నంబర్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రవాణాశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం సాధారణ నంబర్లను సీరియల్ ప్రకారం కేటాయిస్తున్నారు. జిల్లాలో కొత్త సిరీస్‌లు జిల్లాలో ఏలూరులోని ఉపరవాణాశాఖ కార్యాలయంతోపాటు భీమవరంలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాలకు అనుసంధానంగా తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు పట్టణాల్లో రవాణాశాఖ యూనిట్ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియతో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌ల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రతి కార్యాలయానికి కొత్త సిరీస్‌ను కేటాయించారు. ఆన్లైన్లో కొనసాగుతున్న సిరీస్‌కు అనుబంధంగా ఆఫ్‌లైన్‌లో కొత్తగా సిరీస్‌ను కేటాయించారు. దీనిలో భాగంగా ఏలూరుకు 37/డీఈ, భీమవరం 37/సీయూ, తణుకు 37/సీఎస్, కొవ్వూరు 37/సీఆర్, తాడేపల్లిగూడెం 37/సీక్యూ, జంగారెడ్డిగూడెం 37/సీవీ సిరీస్‌లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సిరీస్‌ల నంబర్ల కేటాయిస్తున్నారు. పాత సిరీస్‌లో ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిచిపోయింది. పది నెలలుగా ఫ్యాన్సీ నంబర్ల కొరత ఏర్పడింది. ‘ఈ–బయ్’ ఎక్కడ..? ఆన్లైన్ ప్రక్రియలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపునకు వీలుగా ‘ఈ–బయ్’ విధానం ప్రవేశపెట్టడానికి రవాణాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే నంబర్ దక్కించుకునేందుకు వేలంలో పాల్గొనే వారంతా బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డులతో లావాదేవీలు నిర్వహించాలి. వేలంలో నంబర్ దక్కని వారికి తిరిగి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. తిరిగి చెల్లింపుల విషయంలో స్పష్టత రాకపోవడంతో ‘ఈ–బయ్’ విధానానికి బ్రేకులు పడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.కోట్లు మేర ఆదాయం సమకూరుతుంది. ఒక్కో సిరీస్‌లో 0001 నుంచి 9999 వరకు నంబర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో సిరీస్‌లో ఫ్యాన్సీ నంబర్ల ద్వారా సుమారు రూ.కోటి వరకు ఆదాయం వస్తున్నట్టు అంచనా. ఫ్యాన్సీ నంబర్‌కు కనీసం రూ.5 వేలు నుంచి గరిష్టంగా రూ.50 వేల వరకు ధర నిర్ణయించారు. కొన్ని నంబర్లను వేలంలో లక్షలు వెచ్చించి వాహనదారులు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానంతో కరెంట్ రిజర్వేషన్ కూడా నిలిచిపోయింది త్వరలో ఇబ్బందులు తొలగిస్తాం ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలిచిపోయింది. ఆన్లైన్లో ఫ్యాన్సీ నంబర్ల కోసం బిడ్లు ఆహ్వానించి నంబర్లు కేటాయించాల్సి ఉంది. తిరిగి చెల్లింపుల విషయంలో స్పష్టత రాలేదు. త్వరలోనే ఇబ్బందులన్నీ తొలగించి ఫ్యాన్సీ నంబర్లు కేటాయింపునకు చర్యలు తీసుకుంటాం. – ఎస్.సత్యనారాయణమూర్తి, డీటీసీ, ఏలూరు -
ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలకు నెంబర్ల కేటాయింపు
– పట్టభద్రులకు 112, ఉపాధ్యాయులకు 54 పోలింగ్ కేంద్రాలు కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఎన్నికలకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు జిల్లా అధికారులు నెంబర్లు కేటాయించారు. పట్టభద్రుల విభాగంలో 87057 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు 112 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి 225 నుంచి 336 వరకు నెంబర్లు ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 1 నుంచి నెంబర్లు ఇచ్చారు. తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లా పోలింగ్ కేంద్రాలకు నెంబర్లు ఇచ్చారు. ఉపాధ్యాయుల విభాగానికి 7419 ధరఖాస్తులు వచ్చాయి. వీటికి 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి 118 నుంచి 171 వరకు నెంబర్లు కేటాయించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని ఇటీవల జాయింట్ కలెక్టర్ హరికిరణ్ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో కోరారు. అయితే ఒక్క ఫిర్యాదు అందలేదు. దీంతో జిల్లా యంత్రాంగం ఎంపిక చేసిన వాటినే పోలింగ్ కేంద్రాలుగా కొనసాగించనున్నారు. -
ఒక్కొక్కరికి 41 కండోమ్‌లు
రియోడిజనిరో: మరి కొద్ది రోజుల్లో ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ 2016 ప్రారంభం కానుంది. ఆగస్టు 5 నుంచి 21 వరకు ఇవి జరగనున్నాయి. మొట్టమొదటిసారి దక్షిణ అమెరికాలోని రియోడిజనిరోలో ఈ క్రీడలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 206 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఈ క్రీడలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన కొన్ని గణాంకాలు పరిశీలిస్తే.. 4,50,000 : ఇవి ఒలింపిక్స్ వస్తున్న అథ్లెట్ల కోసం సిద్ధం చేసిన కండోమ్స్ సంఖ్య. రోజుకు 11,000 మంది అథ్లెట్లు బరిలో ఉండగా వారికి రోజుకు రెండు ఇస్తారు. ఈ క్రీడలు పూర్తయ్యే వరకు ఒక్కొక్కరికి 41 కండోమ్స్ అన్నమాట. 17,000 : మొత్తం అథ్లెట్లు, నిర్వహణ అధికారుల సంఖ్య ఇది. 78,000 : ఈ క్రీడా సంరంభం ప్రారంభం కానున్న మారకాన స్టేడియంలో సామర్థ్యం. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలు ఇందులోనే జరుగుతాయి. 206 : ఆగస్టు 5 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ క్రీడల్లో పాల్గొంటున్న దేశాల సంఖ్య 1: మొట్టమొదటిసారి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న శరణార్థుల టీం సంఖ్య. 7.5 మిలియన్లు: ఈ క్రీడల వీక్షణకు ఉన్న టిక్కెట్లు 10 మైళ్లు(16 కిలోమీటర్లు ): ఈ క్రీడల కోసం ప్రత్యేకం గా భూగర్భంలో నిర్మించిన అతిపెద్ద మౌలిక సదుపాయాల మెట్రో వ్యవస్థ. 4: ఒలింపిక్స్ నిర్వహణ ప్రాంతాలు(ఒలింపిక్ పార్క్, డియోడారో, కోపనాకబానా బీచ్, మార్కానా స్టేడియం, ఇతర ఒలింపిక్ స్టేడియాలు) 25,000 : ఈ క్రీడల కవరేజికి రానున్న జర్నలిస్టులు 5,00,000 : ఒలింపిక్స్ క్రీడల కోసం రానున్న పర్యాటకులు(అంచనా) 60,000 : ఒలింపిక్ విలేజ్ లోని డైనింగ్ హాల్ లో వడ్డించనున్న భోజనాల సంఖ్య 80,000 : ఒలింపిక్ విలేజ్ లో ఏర్పాటుచేసిన కుర్చీలు 400 : ఒలింపిక్స్ లో ఫుట్ బాల్ కోసం ఉపయోగించనున్న బంతులు -
అంకెల్లో తెలంగాణ ఆవిష్కరణ
రాష్ట్ర సామాజిక, ఆర్థిక వివరాలను వెల్లడించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆయా రంగాల్లో ఏవిధంగా దగాకు గురయిందో రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ తన అధ్యయనంలో నిగ్గు తేల్చిందని ‘సామాజిక, ఆర్థిక సర్వే’ (రీ ఇన్వెంటింగ్ తెలంగాణ - సోషియో, ఎకనమిక్ ఔట్లుక్ )-2014 పేర వెలువరించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఈ వివరాలతో నిమిత్తం లేకుండా ప్రణాళికాసంఘం ఈ నివేదికను తయారు చేసింది. రాష్ట్ర తలసరి ఆదాయం (రూ.93,151) ఎంతో తేల్చినా, తలసరి అప్పుల లెక్కలు మాత్రం పేర్కొనలేదు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తులు, అప్పుల విభజన ఇంకా పూర్తి స్థాయిలో జరగనందున అప్పులు తేలలేదు. దేశంలో 29వ రాష్ట్రంగా జూన్2వ తేదీన ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి అవసరమైన బాటలు వేసేందుకు రాష్ట్రం ఏయే రంగాల్లో ఏ స్థానంలో ఉంది, జాతీయ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి, ఇతర రాష్ట్రాలతో పోలిక తదితర వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ప్రధానంగా రాష్ట్ర స్థూల ఆదాయం, స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, ఏయే రంగాల నుంచి ఎంతెంత ఆదాయం సమకూరుతోంది అన్న సమాచారాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. రాష్ట ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాల కార్యకలాపాలు, పారిశ్రామిక అభివృద్ధి, సేవా.. తదితర రంగాల పరిస్థితిని వివరిస్తూ గణాంకాలతో రూపు దిద్దుకున్న ఈ సర్వే నివేదిక రాష్ట్ర పరిస్థితిని ఆవిష్కరించింది. తగ్గిపోతున్న వ్యవసాయ రంగం వాటా రాష్ట్ర ఆదాయంలో క్రమేపీ వ్యవసాయ రంగం వాటా తగ్గిపోతోంది. 2000-01 ఆర్థిక సంవత్సరంలో 26 శాతంగా ఉన్న వాటా 2013-14 నాటికి 14 శాతానికి పడిపోయింది. 55.7శాతం మంది ఆధారపడిన వ్యవసాయం రంగం వాటా తగ్గిపోగా, ఇదే కాలానికి సేవారంగం వాటా 48 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2004-05లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.24,409 కాగా, 2013-14 నాటికి అది రూ.93,151కి పెరిగింది. మానవాభివృద్ధి మానవాభివృద్ధి సూచిలో (హెచ్‌డీఐ) కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం స్థానం మెరుగ్గా ఉంది. 2004-05, 2011-12లో ఇచ్చిన ర్యాంకుల్లో తొలి నాలుగు స్థానాల్లో కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లు ఉన్నాయి. కాగా, చివరి నాలుగు స్థానాల్లో బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మాత్రం 13వ స్థానం (2004-05) నుంచి 10వ స్థానానికి(2001-12) మెరుగు పడింది. సాగునీటి సౌకర్యం తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం (గ్రాస్ ఇరిగేటెడ్) అందుతున్న భూముల విస్తీర్ణం పెరిగింది. 2012-13లో 25.57లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండగా, అది 2013-14లో 31.64లక్షల హెక్టార్లకు పెరిగింది. మొత్తంగా 23.74శాతం పెరుగుద ల నమోదయ్యింది. పశుపోషణ పశుపోషణలో రాష్ట్రం దేశంలో 10వ స్థానంలోఉంది. (5.52 శాతం) గొర్రెల పెంపకంలో దేశంలో మొదటి స్థానం. కోళ్ల పెంపకంలో దేశంలో 5వ స్థానం మేకల పెంపకంలో దేశంలో 12వ స్థానం రాష్ట్రంలో 29 లక్షల కుటుంబాలు పశుపోషణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా 1,006.05కోట్ల గుడ్ల ఉత్పత్తితో దేశంలో 3వ స్థానం. ఏటా 4.46లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పిత్తితో దేశలో 6వ స్థానం. ఏటా 39.24లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి. దేశంలో 13వ స్థానం. పారిశ్రామిక రంగం రాష్ట్రంలో పారిశ్రామికరంగం పురోగమిస్తోంది. దశాబ్దకాలంలో సరాసరి 9.4 శాతం వృద్ధిరేటును సాధించింది. (జాతీయ సరాసరి 6.9శాతం) రాష్ట్రంలో ఫ్యాక్టరీల సంఖ్య 9,005కు (2011-12) పెరిగింది. ఈ సంఖ్య 2010-11లో 8,980గా ఉండింది. పెరిగిన ఫ్యాక్టరీల వల్ల 7లక్షల మందికి ఉపాధి లభించింది. భారీ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాల్లో దేశంలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. సేవా రంగం రాష్ట్రంలో సేవారంగం ద్వారా 32.6 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా 9 శాతం, సామాజిక, వ్యక్తిగత సర్వీసుల ద్వారా 8.6శాతం, నిర్మాణ రంగం ద్వారా 8శాతం, రవాణా, స్టోరేజీ, సమాచార రంగాల ద్వారా 5.7శాతం మంది ఉపాధి పొందుతున్నారు. -
ఒక్క ఏపీ అనేది మార్చితే చాలు!
-
నంబర్లు మారవు...
సిరీస్, జిల్లా కోడ్ మార్పు మాత్రం తప్పనిసరి! పాత వాహనాలకు ఏపీ స్థానంలో టీఎస్ రవాణా శాఖతో సీఎం కేసీఆర్ సమీక్ష, గందరగోళానికి తెర 73 లక్షల వాహనాల నంబర్లు మార్చడం అసాధ్యమన్న అధికారులు తొందరపాటు ప్రకటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల విషయంలో రాష్ర్ట ప్రభుత్వం నాలుక్కరుచుకుంది. ప్రస్తుతం ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల పాత వాహనాలకూ కొత్తగా టీఎస్ సిరీస్‌తో కొత్త నంబర్లు పొందాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కొత్త రాష్ట్రానికి కేటాయించిన టీఎస్ సిరీస్ నంబర్లను లక్షల సంఖ్యలో ఉన్న పాత వాహనాలకు అమలు చేయడం అసాధ్యమని రవాణా శాఖ అధికారులు గురువారం తేల్చి చెప్పడంతో సర్కారు పెద్దలు పునరాలోచన చేశారు. పాత వాహనాలకు కొత్త జిల్లా కోడ్‌తో పాటు ఏపీ బదులు టీఎస్ అని మార్చాల్సి ఉంటుందని, నంబర్ మాత్రం అదే కొనసాగుతుందని నిర్ధారించారు. 4 నెలల్లో పాత వాహనాలన్నింటికీ నంబర్లు మార్చాల్సిందేనని రవాణా శాఖ మంత్రి బుధవారం చేసిన ప్రకటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. సిరీస్‌తో పాటు నంబర్లూ మార్చుకోవడమేంటని, అందుకు తాము మళ్లీ జేబులు గుల్ల చేసుకోవడమేంటని వాహనదారులు నొసలు చిట్లించడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. అసలు దీన్ని అమలు చేయడమే కష్టమని అధికారులూ చెప్పడంతో ఈ విషయంలో నెలకొన్న గందరగోళానికి సీఎం తెరదించే ప్రయత్నం చేశారు. గురువారం సాయంత్రం ఆయన రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆ శాఖ కమిషనర్ జగదీశ్వర్, సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్లుతో సమీక్ష జరిపారు. పాత వాహనాల నెంబర్ల నూ మార్చుకోవాలని ప్రకటించడమేంటని మంత్రి మహేందర్ రెడ్డిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే అధికారులు అందజేసిన సమాచారం మేరకే ప్రకటించాల్సి వచ్చిందని రవాణా మంత్రి చెప్పినట్టు సమాచారం. దీంతో అధికారులను కూడా కేసీఆర్ మందలించినట్టు తెలిసింది. కీలక విషయాలను ప్రకటించే సమయంలో ముం దస్తు కసరత్తు అవసరమని, లేదంటే ఇలాంటి గందరగోళ పరిస్థితులే నెలకొంటాయని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇకపై కొత్త వాహనాలకే టీఎస్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయాలని, పాత వాటికి కేవలం టీఎస్‌తో పాటు జిల్లా కోడ్‌ను మార్చితే సరిపోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. భారీ రుసుము చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా, భారీ సంఖ్యలో ఉన్న పాత వాహనాల నంబర్ల మార్పు అంత సులభం కాదని, భారీ కసరత్తుతో కూడుకున్న వ్యవహారమని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. మరి అలాం టప్పుడు వాటిని మార్చుకోవాలని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిం దని కేసీఆర్ ప్రశ్నించడంతో అధికారులు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. కాగా, పాత జిల్లా కోడ్లనే కొనసాగించాలని అధికారులు సూచించినప్పటికీ సీఎం అంగీకరించనట్లు తెలిసిం ది. కొత్త రాష్ట్రంలో కొత్త కోడ్లు కేటాయిస్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని పై కసరత్తు ప్రారంభించామని ఈ భేటీ అనంతరం అధికారులు వెల్లడించారు. అయితే జిల్లాల పేర్ల ప్ర కారం అక్షర క్రమం ఆధారంగా కోడ్‌ను కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున ఏదో ఒక కోడ్ ఇవ్వడమే మేలని భావిస్తున్నట్లు తెలిపారు. కొత్త కోడ్లను 2రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామన్నారు.