ఒక్కొక్కరికి 41 కండోమ్లు
రియోడిజనిరో: మరి కొద్ది రోజుల్లో ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ 2016 ప్రారంభం కానుంది. ఆగస్టు 5 నుంచి 21 వరకు ఇవి జరగనున్నాయి. మొట్టమొదటిసారి దక్షిణ అమెరికాలోని రియోడిజనిరోలో ఈ క్రీడలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 206 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఈ క్రీడలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన కొన్ని గణాంకాలు పరిశీలిస్తే..
4,50,000 : ఇవి ఒలింపిక్స్ వస్తున్న అథ్లెట్ల కోసం సిద్ధం చేసిన కండోమ్స్ సంఖ్య. రోజుకు 11,000 మంది అథ్లెట్లు బరిలో ఉండగా వారికి రోజుకు రెండు ఇస్తారు. ఈ క్రీడలు పూర్తయ్యే వరకు ఒక్కొక్కరికి 41 కండోమ్స్ అన్నమాట.
17,000 : మొత్తం అథ్లెట్లు, నిర్వహణ అధికారుల సంఖ్య ఇది.
78,000 : ఈ క్రీడా సంరంభం ప్రారంభం కానున్న మారకాన స్టేడియంలో సామర్థ్యం. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలు ఇందులోనే జరుగుతాయి.
206 : ఆగస్టు 5 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ క్రీడల్లో పాల్గొంటున్న దేశాల సంఖ్య
1: మొట్టమొదటిసారి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న శరణార్థుల టీం సంఖ్య.
7.5 మిలియన్లు: ఈ క్రీడల వీక్షణకు ఉన్న టిక్కెట్లు
10 మైళ్లు(16 కిలోమీటర్లు ): ఈ క్రీడల కోసం ప్రత్యేకం గా భూగర్భంలో నిర్మించిన అతిపెద్ద మౌలిక సదుపాయాల మెట్రో వ్యవస్థ.
4: ఒలింపిక్స్ నిర్వహణ ప్రాంతాలు(ఒలింపిక్ పార్క్, డియోడారో, కోపనాకబానా బీచ్, మార్కానా స్టేడియం, ఇతర ఒలింపిక్ స్టేడియాలు)
25,000 : ఈ క్రీడల కవరేజికి రానున్న జర్నలిస్టులు
5,00,000 : ఒలింపిక్స్ క్రీడల కోసం రానున్న పర్యాటకులు(అంచనా)
60,000 : ఒలింపిక్ విలేజ్ లోని డైనింగ్ హాల్ లో వడ్డించనున్న భోజనాల సంఖ్య
80,000 : ఒలింపిక్ విలేజ్ లో ఏర్పాటుచేసిన కుర్చీలు
400 : ఒలింపిక్స్ లో ఫుట్ బాల్ కోసం ఉపయోగించనున్న బంతులు