Fun
-
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్‌చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్‌లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్‌లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్‌లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
మన ఇల్లే... ఒక పాఠశాల ప్రయోగశాల
ఒక వైపు వృత్తి నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ స్కూల్ పిల్లలకు అవసరమైన సలహాలు, టిప్స్‌ను సోషల్ మీడియా ద్వారా అందిస్తోంది ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్. తాజాగా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ మార్గంలో సైన్స్ సూత్రాలను అర్థం చేయించే టిప్స్‌ను షేర్ చేసింది. పిల్లలకు భూభ్రమణం గురించి వివరించడానికి హ్యూమన్ సన్డయల్ ఎలా తయారు చేయాలి, ‘సింక్ అండ్ ఫ్లోట్ ఎక్స్పెరిమెంట్’ను వివరించడానికి నారింజలు, నీళ్లను ఎలా ఉపయోగించాలి... అనేవి ఇందులో ఉన్నాయి. ‘ఐఐటీ దిల్లీలో ఇంజినీరింగ్ చదువుకున్నాను. డిగ్రీ కంటే శాస్త్రీయ దృష్టి, విశ్లేషణ ముఖ్యం’ అంటుంది దివ్య మిట్టల్. ‘సూపర్ కలెక్షన్. ఫన్–టు–డూ. మీ పిల్లలు అదృష్టవంతులు. మీరు ఇచ్చిన టిప్స్‌ను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలి’ అని ఒక యూజర్ స్పందించాడు. -
జైలుకు పోవాలన్న ఆతృత వాళ్లకెందుకు?
సంగారెడ్డి టౌన్: జైలు.. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఖైదీలు. తెల్లని చొక్కా, దాని మీద నెంబరు.. తెల్ల నిక్కర్.. తెల్ల టోపీ. అయితే జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే వారికోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ‘ఫీల్ ది జైల్’ పేరుతో సంగారెడ్డిలో ప్రత్యేక కారాగారం ఏర్పాటు చేసింది. దేశంలోనే మొదటి మ్యూజియం, జైలు కూడా ఇదే. నిజాం కాలంలో.. నిజాం కాలంలో మొదట సంగారెడ్డి జైలు ఏరియాలో గుర్రపుశాల నిర్మించారు. ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం అదే ఏరియాలో 1.5 ఎకరాల్లో జైలు ఏర్పాటు చేశారు. ఇందులో పదుల సంఖ్యలో బ్యారక్‌లు ఉన్నాయి. ఒక్కోదానికి తెలంగాణ, మొఘల్, నిజాం చరిత్ర, భారత స్వాతంత్య్ర ఉద్యమ సంఘటనల పెయింటింగ్ వేయించారు. బ్రిటీష్ కాలం నాటి ఫొటోలు కూడా గదుల్లో ఏర్పాటు చేయించారు. టైపు రైటర్లు, అప్పటి రేడియోలు, పెన్నులు, వాల్ క్లాక్ లు, గంటలు.. ఇలా ప్రతీ వస్తువు ప్రదర్శన కోసం ఉంచారు. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి.. జైలు మ్యూజియమే కాదు.. జైలు జీవితాన్ని అనుభవించాలనుకునేవారికి అధికారులు సంగారెడ్డి జైలులో అవకాశం కల్పించారు. ఇందుకోసం రోజుకు రూ. 500 చెల్లించాలి. వారికి సాధారణ ఖైదీలాగే ఖాదీ దుస్తులు, చొక్కా, నిక్కర్ లేదా ప్యాంట్, ప్లేట్, గ్లాస్, మగ్గు, సబ్బు, మంచి భోజనం, నిద్రించేందుకు దుప్పట్లు తదితర సౌకర్యాలు కల్పించారు. టీ, టిఫిన్ ఇచ్చేవారు. యోగా, క్రమశిక్షణ నేర్పించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాకప్‌లో ఉంచేవారు. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరిగేవి. జాతిరత్నాలు సినిమాతో పాటు ఇతర సినిమాల్లో జైళ్ల్ల సీన్ల షుటింగ్ కూడా ఇక్కడే జరిగాయి. ఉదయం 6.30 నుంచే.. ఉదయం 6.30 గంటల నుంచి వ్యాయామం, యోగా శిక్షణ ఉండేది. 7.30 గంటలకు టీతో పాటు టిఫిన్, తర్వాత పరేడ్ 8 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యాదానం ఉండేది. 9.30 గంటలకు మ్యూజియం సూపర్వైజర్ రౌండ్‌కు వచ్చేవారు. ఉదయం 10:30 నుంచి 11:00 గంటల వరకు మధ్యాహ్న భోజనం వడ్డించేవారు. 11 గంటల నుంచి తిరిగి విద్యాదానం కొనసాగేది. మధ్యాహ్నం 12.30 గంటలకు టీ, 12.35 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి. 1.30 నుంచి సాయంత్రం 4 గంట ల వరకు కంప్యూటర్ విద్య, ఇతర అంశాలపై అవ గాహన కల్పించేవారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు యోగా, 4.30 గంటల నుంచి బ్యారక్‌ను శుభ్రం చేయడం వంటి ట్రైనింగ్ ఉండేది. సాయంత్రం 5.30 గంటలకు భోజనం ముగిసిన తర్వాత 6 గంటలకు లాకప్‌లో ఉంచేవారు. ఇలా ఇక్కడ సుమారు 50 మంది వరకు జైలు జీవితం కూడా గడిపారు. ఇదంతా గతం. కరోనా ఎఫెక్ట్‌తో జైలు మూతబడింది. ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరింది. భారీ వర్షాలకు కాంపౌండ్ వాల్ పడిపోయింది. ప్రభుత్వం స్పందించి ఫీల్ ది జైల్‌ను పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఫీల్ ది జైల్ ప్రారంభించాలి శిథిలమైన ఫీల్ ది జైల్‌కు రిపేర్ చేయించాలి. పర్యాటకశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలి. జైలు జీవితం అనుభవించాలనుకునే వారికి అవకాశం కల్పించాలి. ఈతరం వారికి జైలు అంటే ఎలా ఉంటుందో తెలియజేయాలి. – అఖిల్ యాదవ్, సంగారెడ్డి ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి సంగారెడ్డిలోని మ్యూజియం జైలును పునరుద్ధరించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. జైలు జీవితంపై యువతకు అవగాహన కల్పించాలి. చెడుమార్గంలో నడవకుండా, నిజజీవితంలో జైలు జీవితమంటే ఎంత నరకమో తెలియజేయాలి. – కూన వేణు, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు -
ఉగ్రం మూవీ టీమ్ తో యాంకర్ సుమ చిట్ చాట్...
-
ట్విటర్ కొత్త సీఈవోగా ఆమె! మస్క్‌కు థ్యాంక్స్, కానీ..
న్యూయార్క్: ట్విటర్ సీఈవోగా తప్పుకునేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించి సంచలనానికి తెర తీశాడు ఎలన్ మస్క్. దీంతో ట్విటర్ బాస్‌గా బాధ్యతలు మూణ్ణాళ్ల ముచ్చటేనా? అనే ప్రశ్న, ఒకవేళ అదే నిజమైతే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చా జోరందుకుంది. ఈలోపు తనను సీఈవోగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతలంటూ ఒకావిడ చేసిన ట్వీట్.. ఈ ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్‌కు కారణమైంది. బెస్ కాల్బ్(35).. తనకు ట్విటర్ కొత్త సీఈవోగా అవకాశం ఇచ్చినందుకు ఎలన్ మస్క్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు తాము(ఎలన్ మస్క్) కలుసుకోనేలేదని, ఈ పరిణామం తనకు ఆశ్చర్యం కలిగిందని చెబుతూనే.. సీఈవో బాధ్యతలను తాను ఒక గౌరవంగా భావిస్తానని పోస్ట్ చేసింది. ఆపై వరుసగా ఐదు పోస్టులు చేశారామె. అంతేకాదు..ఆపై మొదటి రోజు బాధ్యతలు నిర్వర్తించానని, అద్భుతంగా ఉందని పోస్ట్ కూడా చేసింది. అయితే.. Can finally announce: I am humbled, honored, and frankly still in shock to be the new CEO of @twitter. Though we haven't always seen eye to eye (Edgelord memes! Verification fiasco! The "sink" joke being the full extent of his business plan!) I am thrilled @elonmusk took a chan— Bess Kalb (@bessbell) December 21, 2022 బెస్ కాల్బ్.. ఎవరో కాదు. పాపులర్ టీవీ షో ‘జిమ్మీ కుమ్మెల్’కు స్క్రిప్ట్ రైటర్. ఎమ్మీ అవార్డుకు సైతం నామినేట్ అయ్యారామె. హ్యూమర్‌తో కూడిన రైటింగ్‌కు ఆమె పెట్టింది పేరు. దీంతో ఆమె సరదాగా, వ్యంగ్యంగా అలా ట్వీట్లు చేసి ఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. గతంలో ఆమె ఎలన్ మస్క్‌ను విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. Whether he has failed to rescue people from a cave and then called the actual rescuer a pedophile, sent CPAP machines to hospitals instead of direly needed ventilators, or spent $44 billion to ruin his reputation and legacy, @elonmusk has always been on the forefront of— Bess Kalb (@bessbell) December 21, 2022 ఇక కొత్త సీఈవో బాధ్యతలపైనా తొలుత సరదాగా స్పందించిన మస్క్.. ఆ తర్వాత సీరియస్‌గా సమాధానం ఇచ్చారు. తాము కేవలం సీఈవోగా గురించి వెతకడం లేదని.. బాధ్యతతో ట్విటర్‌ను నిలబెట్టే వ్యక్తి కోసం వెతుకుతున్నామని తెలిపారు. మరోవైపు ట్విటర్ కొత్త సీఈవో కోసం వేటలో ఆ సంస్థ ఉన్నట్లు అనధికార సమాచారం. I will resign as CEO as soon as I find someone foolish enough to take the job! After that, I will just run the software & servers teams. — Elon Musk (@elonmusk) December 21, 2022 -
Rishi Sunak: సార్.. కోహినూర్!
బ్రిటన్ ప్రధాని పీఠంపై చిన్న వయసులో.. అదీ తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్ పగ్గాలు అందుకున్నారు. భారత మూలాలు ఉన్న వ్యక్తి, పైగా మన దేశపు అల్లుడు కావడంతో ఇక్కడి నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మీమ్స్ వడ్డన మామూలుగా ఉండడం లేదు. రెండు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ భారత క్రికెటర్ అశిష్ నెహ్రా.. రిషి సునాక్ కవలలు అంటూ మొదలైన మీమ్స్ ఫెస్టివల్.. ఇవాళ అధికారికంగా ఆయన ప్రధానిగా నియామకం అయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఆయనకు భారతీయులు ట్విటర్ ద్వారా చేసిన తొలి విజ్ఞప్తి.. కోహినూర్ వజ్రాన్ని ఎలాగైనా భారత్‌కు పంపించాలని. అలాగే.. వలసవాదులను వలసరాజ్యంగా మార్చేసి.. పాలించబోతున్నారంటూ మరో సెటైర్ పేలుస్తున్నారు. ఇక యూకే ప్రధాని అధికారిక భవనం 10 డౌనింగ్ స్ట్రీట్ డోర్లకు దండలు, ఆ బయట చెప్పులు విడిచేసి ఉండడం, కాపలాగా వాచ్మెన్ ఉండడం.. ఇలా దేశీ టచ్‌ను మీమ్స్‌కు జత చేసి హిలేరియస్ ఫన్ను పుట్టిస్తున్నారు. మరోవైపు రిషి సునాక్ ప్రధాని అయ్యాడు కాబట్టి.. ఇడ్లీ, వడ, చట్నీ, కాఫీ.. మెనూలో చేరతాయని జోకులు పేలుస్తున్నారు. ఇక పాక్‌కు బర్నల్ పంపాల్సిన అవసరం ఉందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి గనుక అల్లుడి ఇంటికి వెళ్తే.. 10 డౌనింగ్ స్ట్రీట్ కాస్త తీన్ మూర్తి భవనం(రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిపి) అవుతుందని జోకులు పేలుస్తున్నారు. Meanwhile in UK :) pic.twitter.com/nnOuU2b0FQ — Switty (@Switty2020) October 25, 2022 If NRN and Sudha move into Dus Number, perhaps it can be called Teen Murti Bhavan — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2022 Our first mission is to bring back our ' Kohinoor '. let's goo #Sunak #Kohinoor pic.twitter.com/UvEwXp6cjt — Teju (@tejasflyingmac) October 24, 2022 As #RishiSunak is about become UK PM ,India to send trucks full of Burnol to Pakistan pic.twitter.com/GSm3qbI3O3 — 𝒮𝒽𝒶𝒾𝓁𝑒𝓈𝒽_𝐼𝒩𝒟 भारत🇮🇳 (@Shailesh__IND) October 24, 2022 Meanwhile in UK 😀 pic.twitter.com/JxYC7Qz14k — Porinju Veliyath (@porinju) October 25, 2022 Congratulations Rishi Sunak! The new PM of Britain pic.twitter.com/JWhLJVTwMA — Syed Zain Raza (@SydZainRaza) October 25, 2022 -
Sakshi Cartoon: కిలో బరువు తగ్గితే వెయ్యి కోట్లు.. గడ్కరీ సరదా సవాల్
మీకు కూడా ఎవరన్నా ఇలాంటి సవాల్ విసిరితే బావుండు సార్! -
సరదాగా మొదలై... వ్యసనంగా మారి!
‘చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఇటీవల మత్తుమందుకు అలవాటు పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు పాకెట్ మనీ కట్ చేశారు. డ్రగ్స్ కొనడానికి డబ్బుల్లేకపోవడం, తల్లిదండ్రులను అడిగినా ఇవ్వకపోవడంతో ఏకంగా తండ్రినే హత్య చేసేందుకు సిద్ధపడ్డాడు’ ‘గచ్చిబౌలికి చెందిన ఓ యువతి డ్రగ్స్ కొనుగోలు కోసం దొంగతనానికి పాల్పడింది. ముందు ఇంట్లో తల్లిదండ్రుల పర్సులను మాయం చేసేది. అవి సరిపోకపోవడంతో బంధువుల ఇళ్లల్లో బంగారు ఆభరణాలను కొట్టేసి చివరకు పోలీసులకు చిక్కింది’ ‘మలక్‌పేటకు చెందిన ఓ యువకుడు డ్రగ్స్‌కు ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి తల్లిదండ్రులు కొనిచ్చిన టూ వీలర్‌ను అమ్మడమే కాదు.. వీధుల్లో పార్క్ చేసిన వాహనాలనూ కొట్టేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు’ సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మాదక ద్రవ్యాల కోసం యువత చిన్నచిన్న చోరీల నుంచి హత్యలు చేయడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవలికాలంలో నగరంలో పెరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్ రాడిసన్‌బ్లూ హోటల్లో దొరికిన 150 మందిలో 80 శాతం మంది 35ఏళ్లలోపు వారే. మధ్య తరగతి యువతీ, యువకులు ఎక్కువగా గంజాయి తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఉండి, పబ్బులకు వెళ్లేవాళ్లు కొకైన్, హెరాయిన్, ఓపీయం, ఎల్ఎస్డీ వంటి ద్రావణాలను తీసుకుంటున్నారు. ఆవేశంతోనో, ఆనందం కోసమో మొదలవుతున్న ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ తర్వాత వారి భవిష్యత్‌నే కబళిస్తోంది. వారి జీవితాలను పాడుచేసుకోవడమే కాదు... మత్తులో వాహనాలు నడిపి ఇతరుల మరణానికీ కారణమవుతున్నారు. చాలా ఘటనల్లో పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడడానికి స్నేహితులు, తల్లిదండ్రులే కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిల్లలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. లక్షణాలివే.. మాదక ద్రవ్యాలు తీసుకున్న వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులుంటాయి. చిన్న విషయాలకు చిరాకు, కోపం తెచ్చుకుంటారు. వేళకు తినరు. ఒక్కోసారి అతిగా తింటారు. వ్యక్తిగత శుభ్రత ఉండదు. చదువు, పనితీరులో వెనకబడుతుంటారు. ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. పరధ్యానంలో ఉంటారు. విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రుల కళ్లల్లోకి సూటిగా చూడలేక పోతారు. ఇలాంటి లక్షణాలుంటే డ్రగ్స్ తీసుకుంటున్నారని అనుమానించొచ్చు. పర్యవేక్షణ అవసరం.. పిల్లలు ఎక్కడికి, ఎవరితో వెళ్తున్నారు? తిరిగి ఇంటికెప్పుడొస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారు? వంటి అంశాలు తెలుసుకోవాలి. లేదంటే పిల్లలు చేయిదాటిపోవడమే కాదు అసాంఘీక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. ఊహాలోక అనుభూతికోసం.. గంజాయి, కొకైన్, హెరాయిన్, మారిజువానా, మార్పిన్, చేరస్ వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. డ్రగ్స్ తీసుకున్న వారు ఊహా లోకంలో విహరిస్తుంటారు. దీన్నే యూపోరియా అంటాం. ఒకసారి ఈ భావన పొందిన వ్యక్తి మళ్లీ, మళ్లీ అలాంటి అనుభూతినే పొందాలని భావిస్తుంటాడు. ఉన్నత వర్గాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. డ్రగ్స్ వాడకంతో మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి దొరక్కపోతే అసాంఘీక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడితే.. కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడుకోవచ్చు. –డా.కళ్యాణ్ చక్రవర్తి, మానసిక వైద్యనిపుణుడు ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం వ్యసనంగా మారిన డ్రగ్స్ యువత ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం ముక్కు నుంచి నీరు కారడం, లోపల మంట, గొంతులో పుండ్లు, బొంగురు పోవడం, చర్మంపై దద్దుర్లు, కీలకమైన సిరలు దెబ్బ తినడం, మొదడు పోటు, నిద్రలేమి/అతినిద్ర వంటి సమస్యలు తలెత్తడం, రాపిడికి గురై పళ్లు పాడైపో వడం, గుండెపోటు, వాల్వ్‌లకు ఇన్ఫెక్షన్లు, రక్తకఫం, పిల్లికూతలు, ఆయాసం, ఉబ్బసం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. –డాక్టర్ వై.జయరామిరెడ్డి, వైజేఆర్ డీఅడిక్షన్ సెంటర్ డ్రగ్స్‌తో బ్రెయిన్ స్ట్రోక్ లక్డీకాపూల్ (హైదరాబాద్): ఆల్కహాల్‌తోపాటు డ్రగ్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని నిమ్స్ న్యూరో సర్జన్ విభాగం అధిపతి డాక్టర్ ఎర్రంనేని వంశీకృష్ణ తెలిపారు. డ్రగ్స్‌తో రక్తనాళాలు వ్యాకోచించి, మెదడులో రక్తస్రావం అవుతుందని.. ఇది ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు పెరిగి.. తమ పనులను సక్రమంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ బాధితులు గుండెపోటుతో చనిపోతున్నారన్నారు. ఆల్కహాల్‌తో డ్రగ్స్ కలిపి తీసుకునేవారి సంఖ్య పెరిగిందని.. వారిలో చాలా మంది విద్యావంతులు కావడం, 29 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారే అధికంగా ఉండటం ఆందోళనకరమని చెప్పారు. కొకైన్, గంజాయిలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్న యువకుడు ఇటీవల మెదడులో రక్తస్రావంతో చనిపోయాడని.. ఓ ఐటీ ఉద్యోగిని గంజాయికి అలవాటుపడి రెండుసార్లు బ్రెయిన్ స్టోక్‌కు గురైందని వివరించారు. డ్రగ్స్ వల్ల చేజేతులా జీవితాలను కోల్పోయే ప్రమాదముందని.. యువత ఆల్కహాల్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. -
ఆన్లైన్ క్లాస్‌లో 'శ్యామ్ సింగరాయ్'.. తమను కలపాలని లెక్చరర్‌కు వినతి
Students Makes Fun With Lecturer On Shyam Singha Roy Name: నేచురల్ స్టార్ నాని, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిల అద్భుతనటనగల ప్రేమ కావ్యం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తర్వాత ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు కూడా పొందింది. ఈ సినిమా ప్రేమకథా అనేక ప్రేక్షక జనానికి ఎంతో నచ్చి ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో పూర్వజన్మ నేపథ్యంతో ప్రేమకథ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ఒక లెక్చరర్‌తో సరదాగా ఆడుకున్నారు. స్టూడెంట్ తన పేరు శ్యామ్ సింగరాయ్ అని తన భార్య పేరు రోజీ సింగరాయ్ అని చెప్పాడు. వాళ్లిద్దరిని ఎలాగైనా కలపాలని లెక్చరర్‌ను కోరి ఇబ్బంది పెట్టాడు. ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన ఓ విద్యార్థి తన ఐడీని శ్యామ్ సింగరాయ్‌గా మార్చుకున్నాడు. అది నిజంగా తన పేరా ? లేదా సినిమా పేరును ఐడీగా పెట్టుకున్నారా ? అని లెక్చరర్ అడగ్గా అది తన పేరేనని, తన భార్య రోజీ సింగరాయ్ కూడా క్లాస్‌లోనే ఉందని, తాను పునర్జన్మ ఎత్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న లెక్చరర్ క్లాస్ అయ్యాక పర్సనల్‌గా మాట్లాడదామని తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను ఓ నెటిజన్ శ్యామ్ సింగరాయ్ చిత్రబృందానికి ట్యాగ్ చేశాడు. దానికి ఆన్లైన్ క్లాస్‌లో శ్యామ్ సింగరాయ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూసిన మూవీ డైరెక్టర్ రాహుల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే ఈ ఆడియోను కావాలని సరదాగా క్రియేట్ చేశారో, నిజంగానే జరిగిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది. Shyam Singh Roy in Online Class🔥🥳😂😂😂@NameisNani @Sai_Pallavi92 @NiharikaEnt #ShyamSinghaRoy #ShyamSinghaRoyonnetflix pic.twitter.com/5Ga5l4Y0aK — RRRisky Venù (@RevuriVenu) January 28, 2022 -
పతన హాస్యం
‘ఫుల్లుమూను నైటటా.. జాసుమిన్ను వైటటా.. మూను కన్న మొల్ల కన్న నీదు మోము బ్రైటటా.. టా! టా! టా!’ అంటాడు గిరీశం ‘కన్యాశుల్కం’లో. ‘నేను వట్టి తెలివితక్కువ వాడిననా నీ అనుమానం’ అని కాంతం కథల్లో భర్త అంటే అందుకు కాంతం ‘అహహ అనుమానమేమీ లేదు.. గట్టి నమ్మకమే’ అంటుంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారబోశాను’ అని శ్రీశ్రీ రాస్తే జరుక్శాస్త్రి పేరడీగా ‘నేను సైతం కిళ్లీ కొట్లో పాతబాకీలెగరగొట్టాను’ అని రాశాడు. ‘నవ్వవు జంతువుల్.. నరుడు నవ్వును’ అంటాడో కవి. నవ్వు మానవ ప్రవృత్తి. సకల జీవజాలం నుంచి మనిషిని వేరు చేయగల ఒకే ఒక స్పందనాగుణం– నవ్వు. ‘నాకు గనక సెన్సాఫ్ హ్యూమర్ లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉందును’ అన్నారు గాంధీజీ. ఓ పెద్దాయన ‘ఏ మేన్ ఈజ్ నాట్ పూర్ ఇఫ్ హి కెన్ స్టిల్ హీ లాఫ్’ అన్నాడు. ‘నవ్వుకు చోటు దొరకనంత సేపు అది ఎంత పెద్ద గది అయినా ఇరుకే’ అని ఇంగ్లిష్ వ్యాఖ్య. బతకడానికి నవ్వు అవసరం అని సామాన్యుడేమిటి చక్రవర్తి కూడా అనుకున్నాడు. అందుకే విదూషకుణ్ణి ఆస్థానంలో పెట్టుకున్నాడు. తెనాలి రామలింగడు, బీర్బల్ తమ చక్రవర్తులను ఏమో కాని నేటికీ ఆబాలగోపాలాన్ని నవ్విస్తున్నారు. మనుషులు నిత్య జీవితంలో పరాచికాలతో నవ్వుతారు. వెక్కిరించి నవ్వుతారు. తప్పులకు, అబద్ధాలకు నవ్వుతారు. అవివేకులను, మందబుద్ధులను, అతి తెలివిగల వారిని చూసి నవ్వుతారు. అధికారంలో ఉన్నవారిని ఏమీ అనలేక గేలి చేసి నవ్వుతారు. చాలక పుస్తకాలు చదివి, నాటకాలు చూసి, సినిమాలకు వెళ్లి కూడా నవ్వుతారు. అయినా కూడా గౌరవం పొందే విషయంలో హాస్యానిది ద్వితీయ స్థానమే. గంభీరంగా ఉండే అధికారినీ, గంభీరమైన ఉపన్యాసకుణ్ణీ గౌరవించినట్టుగా హాస్యం మిళితం చేసేవారిని గౌరవించరు. సాహిత్యంలో గొప్ప రచనలన్నీ గంభీరమైన విషయాలవే. హాస్యం రాస్తే ‘హాస్య రచయిత’. గంభీరమైన విషయాలు రాస్తే ‘రచయిత’. అతి తక్కువ మందే హాస్యంతో గంభీరమైన విషయాలు రాసి గౌరవం పొందారు. తెలుగులో తొలి వచన సాధకులలో ఒకౖరైన వీరేశలింగం నవ్విస్తూ తొడపాశం పెట్టే శిల్పంలో తెలుగువారిని స్మిత వచనా సముద్రంలోకి ప్రవేశ పెట్టారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు ‘హాస్యత్రయం’ అనిపించుకున్నారు. చిలకమర్తి ప్రహసనాలు, పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలు క్లాసిక్స్. ఆ తర్వాతి రోజుల్లో ముళ్లపూడి వెంకటరమణ ‘బుడుగు’, పురాణం ‘ఇల్లాలి ముచ్చట్లు’, నండూరి పార్థసారథి ‘రాంబాబు డైరీ’... ఈ హాస్యధారను బలంగా ముందుకు తీసుకెళ్లాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, తెలిదేవర భానుమూర్తి తదితరులు మాండలిక రచనతో హాస్యం ఎంత నేటివ్ రుచిగా ఉంటుందో చూపించగలిగారు. అయితే ఆది నుంచి స్త్రీకి హాస్యం ‘అదుపు చేయబడినది’. నవ్వుకు ప్రధాన వాటాదారు పురుషుడే. స్త్రీ కాదు. ద్రౌపది కాలం నుంచి స్త్రీ నవ్వుకు అపఖ్యాతి, అపసవ్య వర్తనను ఆపాదిస్తూ వచ్చారు. నవ్వే, నవ్వించే స్త్రీలు నేటికీ తక్కువ. ఇలాంటి సంఘ అంకుశాలను కూడా ధిక్కరించి స్త్రీలు రాశారు. భానుమతి ‘అత్తగారి కథలు’, రంగనాయకమ్మ ‘స్వీట్‌హోమ్’ నవ్వించాయి. పొత్తూరి విజయలక్ష్మి, మృణాళిని, సోమరాజు సుశీల... పాఠకులను తమ ఫిక్స్డ్ ఖాతాల్లో వేసుకోగలిగారు. కాని నవ్వించడం ఏమాత్రం జోక్ కాదు. ఆరోగ్యకరమైన హాస్యంతో నవ్వించడం కొద్దిమందికే చేతనవుతుంది. సమాజంలో కానీ, రచనల్లో కానీ చాలామటుకు హాస్యం స్త్రీలను, బలహీనులను, వెనుకబడినవారిని దూషించడం వల్ల గేలి చేయడం వల్ల పుడుతూ ఉంటుంది. ఆస్తిత్వ రాజకీయ ఉద్యమాల వల్ల కలిగిన చైతన్యం ఇప్పుడు ఇవేవీ చేయడానికి వీల్లేని సంస్కారాన్ని ఇస్తున్నాయి. ఈ సంస్కార పరిధిలో ఉంటూ హాయిగా నవ్వుకోగల హాస్యాన్ని పుట్టించడం నవ్వు మీద సాముగా మారింది. ఈ సమయంలోనే నేటి తరం ఎటువంటి హాస్యానికి సామీప్యంలో ఉన్నదీ గమనించుకోవాలి. నిత్య ఒత్తిడి వల్ల పాఠకులు ప్రేక్షకులుగా మారి చదవడానికి బదులు చూడటానికి ఇష్టపడుతున్న సమయంలో హాస్యం వ్యాపార వనరుగా మారింది. అభినవ విదూషకులు పుట్టుకొచ్చారు. నిత్యం ప్రతి చానల్లో గంటో అరగంటో హాస్య కార్యక్రమం ఉంటోంది. అయితే అది ఎటువంటి హాస్యం? స్త్రీల రూపాలను, ఎదుటివారి ఆకారాలను పదే పదే హీనపరచడమే హాస్యంగా ఉంది. తెలుపు నలుపులను, పొడవు పొట్టిలను, భాషా యాసలను హీనపరచడమే హాస్యంగా ఉంది. ‘ఒరే దరిద్రుడా’ అనేది హాస్య సంబోధన. దరిద్రుడంటే పేదవాడు. పేదవాడు ఎవరికి హాస్య వస్తువు? ఎందుకు హాస్య వస్తువు? సమాజం లైంగిక అపక్రియల్లో మునిగినట్టుగా వాటి చుట్టూ అల్లిన హాస్యానికి రేటింగులు వస్తున్నాయి. మాటలతో సాగే రతిని హాస్యం అంటున్నారు. ఇవి ఇళ్లల్లో ఉండి చూస్తున్న పిల్లలకూ, యువతీ యువకులకూ ఏం నేర్పిస్తున్నాయి? ఆరోగ్యకరమైన హాస్యాన్ని అలవర్చుకోని పిల్లలు తమక్కావాల్సిన హాస్యాన్ని వెతుక్కోవడంలో ఎదుటివారి దుఃఖానికి హేతువు అవుతారు. బాధించడాన్ని ‘ఎంజాయ్’ చేస్తారు. సత్యానికి, హేతువుకు, వాదనకు నిలబడలేక ‘ముఖాన్నో, మూతినో’ కామెంటు చేసి పారిపోతారు. సాంస్కృతిక దాడి చేస్తారు. ఉన్నతమైన విషయాన్ని కూడా పతనానికి తెచ్చి నవ్వుదామనుకుంటారు. పతన హాస్యపు ప్రతిఫలనం ఇది. ఇప్పుడు చలామణిలో ఉన్నదానిని అపహాస్యం అనడానికి కూడా లేదు. ఇది దుర్మార్గ హాస్యం! -
సీరియస్ మీటింగ్స్ కాస్తా ఎంటర్టైన్ చేస్తున్నాయే
వార్ రూమ్ తరహాలో సీరియస్‌గా సాగే జూమ్ మీటింగ్స్ ఇకపై ఈ స్నాప్ కెమెరా ఆప్షన్ తో మరింత ఎంటర్ టైన్మెంట్గా మారనున్నాయి. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసుల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వరకు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి.అయితే ఆయా టెక్ దిగ్గజాలు సరికొత్త ఫీచర్లతో ఆన్లైన్ మీటింగ్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వీడియో కమ్యూనికేషన్ 'జూమ్'లో స్నాప్ చాట్ కు చెందిన స్నాప్ కెమెరా ఫిల్టర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను వినియోగించి ఆన్ లైన్లో కుటుంబ సభ్యులతో,స్నేహితులతో కలిసి ఫన్ జనరేట్ చేసుకోవచ్చు. జూమ్ మీటింగ్‌లో ఫిల్టర్ ఫీచర్‌ను వినియోగించి మన ఫేస్ కంప్లీట్‌గా జనరిక్ ఫిక్సార్, డ్రీమ్ వర్క్స్ కార్టూన్ క్యారక్టర్ లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యేలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ స్నాప్ కెమెరా v1.14.0 , విండోస్ 10, మాక్ 10.13 ఓఎస్, ఇంటెల్ కోర్ ఐ 3 2.5 జీహెచ్‌జెడ్, ఎఎమ్డి ఎఫ్ఎక్స్ 4300 2.6 జీహెచ్‌జెడ్, ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 4000 లేదంటే ఎన్విడియా జిఫోర్స్ 710, ఎఎమ్డి రేడియన్ హెచ్డి 6450 ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఈ కార్టూన్ ఫిల్టర్ కావాలనుకుంటే అఫీషియల్ వెబ్ సైట్ స్నాప్ ఐఎన్‌సీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి జూమ్ ఓపెన్ చేసిన తరువాత రైట్ సైడ్ కార్నర్లో వీడియో గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ బార్ లో వీడియో క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది కెమెరా ఆన్ చేస్తే స్నాప్ కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్నాప్ కెమెరా ఆప్షన్‌లోకి వెళ్లితే మీకు కావాల్సినట్లు మీ ఫేస్ కార్టూన్ కేరక్టర్‌లోకి ట్రాన్స్ ఫార్మ్ అవుతుంది. -
ఫన్ పటాస్
-
నిండు అందం
అప్పుడే లోపలికి వస్తున్న తల్లి ఈ మాట విని, ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ‘దీనికేమైంది?’ అన్నట్టుగా భర్త వైపు చూసింది. ఒక చిన్నమ్మాయి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లింది. ఆయన కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. కూతురి అలికిడి విని, తల పైకెత్తి, ‘ఏమ్మా’ అన్నట్టు చూశాడు. నెమ్మదిగా ఒక్కో మాటే పలుకుతూ, ‘నాన్నా, నాకు గుండు చేయించవా?’ అని అడిగింది.‘గుండా?’ ఆశ్చర్యపోయి, అది నిజమేనా అన్నట్టుగా అడిగాడు తండ్రి.చిన్నారిది మంచి ఒత్తయిన జుట్టు. ముఖం కళగా ఉంటుంది. ఆ జుట్టు కూడా ఈ అందానికి ఓ కారణం.‘అవును నాన్నా, గుండే... చేయించవా?’ మళ్లీ అడిగింది పాప.అప్పుడే లోపలికి వస్తున్న తల్లి ఈ మాట విని, ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ‘దీనికేమైంది?’ అన్నట్టుగా భర్త వైపు చూసింది. అప్పుడు చెప్పింది చిన్నారి. వాళ్ల క్లాసులో వర్షిణి ఉంది. ఈమె బెస్ట్ ఫ్రెండ్. ఆమెకు క్యాన్సర్ వచ్చింది. కీమోథెరపీ చికిత్స చేస్తే జుట్టంతా రాలిపోయింది. అందుకే ఆమెకు గుండు చేశారు. ఆ స్థితిలో ఆమె స్కూలుకు రావడానికి ఇష్టపడటం లేదు. ఎగతాళి చేస్తారని భయపడుతోంది. అందుకే వర్షిణికి తోడుగా తాను గుండు చేయించుకుంటానని చెప్పింది చిన్నారి. భార్యాభర్తలిద్దరికీ నోటమాట రాలేదు. కన్నీళ్లు ఆగలేదు. చిన్నపిల్లలా కాక కన్నతల్లిలా కనబడింది. -
సెల్ఫీ సరదా.. ప్రాణాలు తీసింది
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని ప్రయివేట్ కళాశాల ఇంటర్ సెకండియర్ విద్యార్థులైన నగరానికి చెందిన ఆ తొమ్మిదిమంది మిత్రులు బుధవారం చివరి పరీక్ష రాశారు. ఆనందంగా ఇళ్లకెళ్లారు. భోజనాలు ముగించుకున్నారు. - ‘హమ్మయ్య.. పరీక్షలు అయిపోయాయి. ఎవరెవరం ఎక్కడ చదువుతామో, ఏ స్థాయిలో ఉంటామో తెలియదు. అందుకే, ఈ చివరి రోజున సెల్ఫీలు దిగుదాం.. జ్ఞాపకాలుగా దాచుకుందాం’ అని ముందే అనుకున్నారు. అంతా ఒకచోట కలుసుకున్నారు. మంచి లొకేషన్ కోసం మూడు బైక్‌లపై నగరంలోగల మున్నేటి వద్దకు వెళ్లారు. సెల్ఫీలు దిగుతున్నారు. - ముస్తాఫానగర్‌కు చెందిన మాడుగు ప్రణయ్(17) కాలుకు మట్టి అంటింది. నీటిలోకి దిగి శుభ్రం చేసుకుంటున్నాడు. ఇంతలో కాలు జారింది... నీటిలో పడిపోయాడు. స్నేహితులంతా నిశ్చేష్టులై చూస్తున్నారు. భయంతో వారి గొంతులు పెగల్లేదు. - ఇందిరానగర్‌కు చెందిన కత్తుల రాహుల్(17) ఏమాత్రం ఆలోచించలేదు. మిత్రుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడు కూడా నీటిలోకి జారి పడిపోయాడు. క్షణాల్లోనే ఇద్దరూ గల్లంతయ్యారు. - మిగతా మిత్రులు తేరుకున్నారు. వారికి ఈత రాదు. దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నారు.. గట్టిగా అరుస్తున్నారు. అక్కడకు దగ్గరలో ఉన్న కొందరు పరుగు పరుగున వచ్చారు. - అర్బన్ సీఐ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మోహన్‌రావు, అశోక్ చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. - ఆ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆ ఏడుగురు మిత్రులకు కన్నీళ్లు ఆగడం లేదు. రాహుల్ తండ్రి ప్రసాద్, ఐసీడీఎస్ ఉద్యోగి. ఫ్రెండ్స్‌తో బయటికెళుతున్నానని అమ్మతో చెప్పి వెళ్లాడని, ఇక తిరిగి రాడని అనుకోలేదని అంటూ తల్లి రాధిక గుండె బాదుకుంటోంది. ప్రణయ్ తండ్రి బీమా కంపెనీలో చిరుద్యోగి. -
‘అసెంబ్లీలో నోర్మూసుకుని కూర్చోమంది!’
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభలో మంగళవారం సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వీధి జంతువులపై సభలో చర్చ నడుస్తుండగా, ఉన్నట్టుండి అంశం భార్యాభర్తల సంభాషణపైకి మళ్లింది. తొలిసారిగా ఎంపికైన బీఎస్పీ ఎమ్మెల్యే అనిల్ సింగ్... చర్చిస్తున్న అంశానికి ఏ మాత్రం సంబంధం లేని, తన భార్య, తాను మాట్లాడుకున్న విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. ‘అసెంబ్లీలో నీకు ఎలా ఉందని నా భార్య అడిగింది. అంత బాగా ఏం లేదని నేను చెప్పాను’ అని అనిల్ వ్యాఖ్యానించగా ‘అందుకు నీ భార్య ఏమని స్పందించింది?’ అని స్పీకర్ హృదయ్ నరైన్ దీక్షిత్ నవ్వుతూ అడిగారు. ‘నిశ్శబ్దంగా కూర్చొని అనుభవం పెంచుకోమని చెప్పింది’ అని అనిల్ సమాధానం ఇవ్వడంతో సభ్యులంతా విరగబడి నవ్వారు. ఆ తర్వాత స్పీకర్ మాట్లాడుతూ ‘నువ్వు ఇప్పుడు లేచి సభలో మాట్లాడటం టీవీలో నీ భార్య చూస్తే తిడుతుందేమో’ అనడంతో మరోసారి నవ్వులు పూశాయి. -
చంద్రబాబు ఎగతాళిగా మాట్లడుతున్నారు
-
ఒక్కొక్కరికి 41 కండోమ్‌లు
రియోడిజనిరో: మరి కొద్ది రోజుల్లో ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ 2016 ప్రారంభం కానుంది. ఆగస్టు 5 నుంచి 21 వరకు ఇవి జరగనున్నాయి. మొట్టమొదటిసారి దక్షిణ అమెరికాలోని రియోడిజనిరోలో ఈ క్రీడలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 206 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఈ క్రీడలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన కొన్ని గణాంకాలు పరిశీలిస్తే.. 4,50,000 : ఇవి ఒలింపిక్స్ వస్తున్న అథ్లెట్ల కోసం సిద్ధం చేసిన కండోమ్స్ సంఖ్య. రోజుకు 11,000 మంది అథ్లెట్లు బరిలో ఉండగా వారికి రోజుకు రెండు ఇస్తారు. ఈ క్రీడలు పూర్తయ్యే వరకు ఒక్కొక్కరికి 41 కండోమ్స్ అన్నమాట. 17,000 : మొత్తం అథ్లెట్లు, నిర్వహణ అధికారుల సంఖ్య ఇది. 78,000 : ఈ క్రీడా సంరంభం ప్రారంభం కానున్న మారకాన స్టేడియంలో సామర్థ్యం. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలు ఇందులోనే జరుగుతాయి. 206 : ఆగస్టు 5 నుంచి 21 వరకు జరుగుతున్న ఈ క్రీడల్లో పాల్గొంటున్న దేశాల సంఖ్య 1: మొట్టమొదటిసారి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న శరణార్థుల టీం సంఖ్య. 7.5 మిలియన్లు: ఈ క్రీడల వీక్షణకు ఉన్న టిక్కెట్లు 10 మైళ్లు(16 కిలోమీటర్లు ): ఈ క్రీడల కోసం ప్రత్యేకం గా భూగర్భంలో నిర్మించిన అతిపెద్ద మౌలిక సదుపాయాల మెట్రో వ్యవస్థ. 4: ఒలింపిక్స్ నిర్వహణ ప్రాంతాలు(ఒలింపిక్ పార్క్, డియోడారో, కోపనాకబానా బీచ్, మార్కానా స్టేడియం, ఇతర ఒలింపిక్ స్టేడియాలు) 25,000 : ఈ క్రీడల కవరేజికి రానున్న జర్నలిస్టులు 5,00,000 : ఒలింపిక్స్ క్రీడల కోసం రానున్న పర్యాటకులు(అంచనా) 60,000 : ఒలింపిక్ విలేజ్ లోని డైనింగ్ హాల్ లో వడ్డించనున్న భోజనాల సంఖ్య 80,000 : ఒలింపిక్ విలేజ్ లో ఏర్పాటుచేసిన కుర్చీలు 400 : ఒలింపిక్స్ లో ఫుట్ బాల్ కోసం ఉపయోగించనున్న బంతులు -
సరదా సరదాగా...
దర్శకుడు పూరి జగన్నాథ్ రెండో చిత్రం ‘బాచీ’లో జగపతిబాబు కథానాయకుడు. ఆ చిత్రం విడుదలై పదహారేళ్లయింది. ఇన్నేళ్లల్లో మళ్లీ పూరి-జగపతిబాబు కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. అయితే కొంచెం మార్పు. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయకుడు. కథానాయకుడిగా కల్యాణ్‌రామ్ నటిస్తున్నారు. మామూలుగా పూరి షూటింగ్ అంటే సరదా సరదాగా సాగుతుంది. ఈ చిత్రం షూటింగ్ కూడా అలానే జరుగుతోందనడానికి ఇక్కడున్న ఫొటోయే నిదర్శనం. షాట్ గ్యాప్‌లో జగపతిబాబు-కల్యాణ్‌రామ్‌లకు పూరి ఎలాంటి హెల్ప్ చేస్తున్నారో చూశారుగా! -
ప్రేమ, వినోదం
సెంటిమెంట్, ప్రేమ, వినోదం కథాంశంగా తెరకెక్కిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సాయికిరణ్, ఆనంద్, కల్యాణ్, పూజాశ్రీ, మేఘన, నట్ష్యా ప్రధాన పాత్రల్లో ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్, షేరింగ్ టాలెంట్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. బీచుపల్లి రఘు మాట్లాడుతూ- ‘‘నేటి ట్రెండ్‌కు తగ్గట్టు అన్ని అంశాలతో నిర్మించిన చిత్రమిది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దాం. కథను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఊటీ, గోవా, హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: లక్కీ, సంగీతం: నవనీత్ చారి. -
ట్రాఫిక్జాంలో ఇరుక్కుంటే మీరేం చేస్తారు?
నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణమైపోయాయి. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్లలో గంటలకొద్ది నిరీక్షిస్తూ వాహనాలు నడుపడం అంటే మాటలు కాదు. ఎంతో ఓపిక కావాలి. క్షణక్షణం విసుగెత్తిపోతుంది. అలాంటి నరకప్రాయమైన అనుభవాన్ని ఓ ముంబైవాలా సంబరంగా మార్చేశాడు. ఇటీవల భారీ ట్రాఫిక్ జామ్‌లో కూరుకుపోయిన ఆయన.. ఇక నిరీక్షించి లాభం లేదనుకొని రోడెక్కాడు. కారు స్టీరియో సౌండ్‌ను పూర్తిగా పెంచేసి.. రోడ్డుపై ఆనందంగా డ్యాన్స్ చేశాడు. ఆయనను చూసి ఇతర వాహనాదారులు కాలు కలిపారు. ట్రాఫిక్ గోల వదిలేసి సంతోషంగా స్టెప్పులు వేశారు. రోడ్డుపక్కన ఉన్నవాళ్లు చూస్తూ ఉరుకుంటారు. వాళ్లు కూడా ఈ ఉత్సవంలో చేరిపోయారు. అంతా కలిసి రోడ్డుమీద స్ట్రీట్ పార్టీ చేసేశారు. చిన్నాపెద్దా కలిసి ఆనందంగా నరిస్తున్న ఈ వీడియో ఫేస్బుక్లో హల్చల్ చేస్తోంది. 'బీయింగ్ ఇండియన్' పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటికే 19 లక్షలమంది చూసేశారు. Mumbai's Spirit This is exactly why Mumbai's Spirit is commendable! While they were stuck in a traffic jam, they decided to start the party on the streets ;)#MustWatch Posted by Being Indian on Monday, January 4, 2016 -
ఫన్ స్పేస్
అదెలా కుదురుతుంది..! భార్య: ఏమండీ! నేను చచ్చిపోతే మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? భర్త: నువ్వు పొయ్యాక... నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు డియర్? భార్య: ఎందుకు చేసుకోకూడదు? మీ కష్టసుఖాలలో పాలుపంచుకోవడానికి ఎవరైనా మనిషి ఉంటే బాగుంటుంది కదా, నా మాట విని, మళ్లీ పెళ్లి చేసుకోండి ప్లీజ్. భర్త: ఎంత మంచిదానివి బంగారం! నువ్వు పోయాక కూడా నా సుఖం గురించి ఆలోచిస్తున్నావు. భార్య: అయితే, నేను పోగానే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వండి. భర్త: నీ కోసం నేను మళ్లీ పెళ్లి చేసుకుంటాను. సరేనా డియర్? భార్య: అయితే కొత్తపెళ్లాంతో కలసి ఈ ఇంట్లోనే కాపరం చేస్తారు కదా. భర్త: అవును, కానీ, ఆమెను నీ గదిలోకి అడుగు కూడా పెట్టనివ్వను. భార్య: ఆమె నా కారు డ్రైవ్ చేస్తుంది కదా? భర్త: లేదు, అది నీ జ్ఞాపకంగా దాచుకుంటాను. దానికి కొత్త కారు కొనిస్తాను. భార్య: అయితే ఆమె నా నగలన్నీ పెట్టుకుంటుంది కదా.. భర్త: లేదు, నీ జ్ఞాపకాలని మరొకరితో పంచుకుంటానా? అయినా, అందుకు ఆమె ఒప్పుకోదు. కొత్తవి కొనిమ్మంటుంది. భార్య: అయితే ఆమె నా కొత్త చెప్పులు తొడుక్కుంటుందేమో? వెంటనే భర్త... ‘‘అదెలా కుదురుతుంది? ఆమెదేమో 7వ నంబరు. నీ సైజు 9 కదా’’ అని నాలుక్కరుచుకున్నాడు. కొద్దిసేపు నిశ్శబ్దం... కట్ చేస్తే బంధుమిత్రులందరికీ భార్యనుంచి ఫోన్... ‘‘మా ఆయన సడెన్‌గా పోయాడు, అంత్యక్రియలు రేపే, మీరందరూ తప్పకుండా రావాలి’’ ....!!!...??? వాటే టచింగ్ స్టోరీ!?? -
ఫన్ స్పేస్
హోమ్ వర్క్ భార్య: వంట చేస్తున్నాను... ఆ కిటికీ దగ్గర ఉప్పు డబ్బా ఉంది. ఇలా తెచ్చివ్వండి... భర్త: ఇక్కడ లేదు... భార్య: మీరు అలా అంటారని నాకు తెలుసు. మీలాంటి బద్దకస్తుడిని నేనింత వరకు చూడలేదు. ఉప్పు డబ్బా తెచ్చివ్వడానికి కూడా ఇంత బద్దకమా! భర్త: లేదంటే వినవేం? భార్య: మీరిలా అంటారని తెలిసే...ఉప్పు డబ్బాను నేను ముందే తీసుకొచ్చి పెట్టాను. భర్త: !!!!!!!!!!!! ఆఫీస్ వర్క్ ఆరోజు కూడా రమణ మందు కొట్టాడు. భార్య అనుమానిస్తుందని, నిజం తెలిసి పోతుందని భయపడిపోయాడు. ‘ల్యాప్‌టాప్ తీసి పని చేస్తున్నట్లు నటిస్తే ఆమెకు అనుమానం రాదు’ అనుకున్నాడు. తన ఐడియాకు తానే గర్వపడ్డాడు. కొద్ది సేపటి తరువాత... ‘‘మళ్లీ మందు కొట్టి వచ్చావా?’’ కోపంతో కళ్లెర్ర చేసింది రమణ భార్య రాధ. ‘‘ఆఫీసులో వర్క్ ఎక్కువై చస్తున్నాను. ఆఫీస్‌లో మిగిలిన వర్క్‌ను ఇలా ల్యాప్‌టాప్‌లో చేసుకుంటున్నాను. నీకు మాత్రం మందు కొట్టి వచ్చినట్లు అనిపిస్తోంది. నిన్ను ఎవరూ బాగు చేయలేరు’’ విసుక్కున్నాడు రమణ. ‘‘చాల్లేండి సంబడం...మీ చేతుల్లో ఉంది ల్యాప్‌టాప్ కాదు సూటుకేసు. ఓవర్ యాక్షన్ ఆపండి’’ అని గట్టిగా అరిచింది రాధ. -
పొంగేషు పూరీ... గుటకేషు గప్‌చుప్!
నవ్వింత: మా రాంబాబుగాడు దేన్నైనా బలంగా నమ్మాడంటే చాలు... దాన్ని నిరూపించడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. అలాంటి వాడు అకస్మాత్తుగా పూరీల మీద పడ్డాడు. వాడు పడితే పడ్డాడు కానీ... మమ్మల్నందర్నీ పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడొచ్చింది ఇబ్బంది. పొద్దున్నే పూరీలు వండే ఇల్లు పూరిల్లట. చక్కటి పూరింట్లో దొరికే పూరీలూ, రుచికరమైన ఆలూఖుర్మా, రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కర్పూరతాంబూలం, రకరకాల పూరీ కూరల రుచులను ఎంచే సరసులూ ఉంటే కవిత్వం ఆటోమేటిగ్గా వస్తుందంటాడు మా అల్లసాని రాంబాబు. వాడి వాదన ఎంతవరకూ వెళ్లిదంటే... ఏదైనా పద్యం తాలూకు చివరిపాదం చెప్పి మొదటి మూడు లైన్లూ నింపడాన్ని పూరించడం అని ఎందుకు అంటారంటే... పూరీలు తినడం వల్ల జ్ఞానం బాగా పెరిగి, తక్షణం ఆ లైన్లను నింపగలుగుతారట! ‘‘ఇది కరెక్ట్ కాదేమోరా?’ అంటే... ‘‘మరి వడ్డెర చండీదాస్ అనుక్షణికం నవల్లో ‘స్నానించడం’ అని రాస్తే దానికి ‘స్నానం చేయడం’ అని అర్థం ఉన్నప్పుడు సిమిలర్‌గా ఇదెందుకు కాకూడదు?’’ అని ఎదురుప్రశ్న వేశాడు. ‘‘ఒరే... మిద్దె ఉన్న ఇల్లు మిద్దె ఇల్లు, గడ్డితో కప్పువేసే చిన్న గుడిసె పూరిల్లు. అది గుడిసె కాబట్టి పూరి గుడిసె అని కూడ అంటార్రా’’ అంటే వినడే! ఒకవేళ గుడిసెలో పూరీలు చేస్తే దాన్ని పూరి గుడిసె అంటారని వాడు ఒక్కసారి కమిటయ్యాడట. ఇక వాడి మాట వాడే వినడట. ఈ డైలాగ్ కూడా పేరులో పూరీ ఉన్న ఫిల్మ్ డెరైక్టర్ కమ్ రైటర్ పూరీ జగన్నాథ్దట. ‘అలాంటప్పుడు మీ మాట ఎందుకు వినాల’న్నది వాడి వాదన. పూరీల రుచిని ఒకపట్టాన వదులుకోలేని ఎందరో జిహ్వాగ్రేసరులంతా దాన్ని మరవలేక భేల్‌పూరీ, సేవ్పూరీ, పానీపూరీ అంటూ మరెన్నో విధాలుగా తింటుంటారట. పానీపూరీని ఇతరులతో షేర్ చేసుకోడానికి వీల్లేనందువల్ల, ఒక్కరే గప్‌చుప్‌గా గుటుక్కుమనిపిస్తారు కాబట్టే దాన్ని ముద్దుగా ‘గప్‌చుప్’ అని కూడా అంటారట. అక్కడితో ఆగకుండా ఫక్తు సంస్కృత సూక్తుల తరహాలో అనేక కొటేషన్లూ చెప్పాడు. ‘‘పొంగేషు పూరీ, మింగేషు మిర్చీ, గుటకేషు గప్‌చుప్, బొక్కేషు బోండా, భోజ్యేషు బజ్జీ, కొరికేషు కోవా, నమిలేషు కిళ్లీ’’ అని... ‘‘వీటన్నింటిలోనూ పూరీలను ముందుగా ఎందుకు పెట్టాననుకుంటున్నావ్? చపాతీ పెనానికి అతక్కుపోతుంది. అదేగానీ... పూరీ మూకుడులో వేయగానే పొంగుకుంటూ పైకి తేలుతుంది. ‘మునిగి మునకలేయకు, అతికి పెనానికి కరుచుకోకు, ముడుచుకోకు, విచ్చుకో... నాలా పైకి తేలు’ అంటూ ఎందరికో స్ఫూర్తినీ, సందేశాన్నీ ఇస్తుంది పూరీ. అందుకే నా శ్లోకంలో ముందుగా దానిపేరే రాశా’’ అన్నాడు వాడు. ‘‘వదిలెయ్ రా... పొడగకపోయినా రుచిలో మార్పేమీ రాదు కదా’’ అన్నా. ‘‘అలాగని గొప్పగొప్పవాళ్లు దాన్ని వదిలేయలేదు కదా. నిజానికి వాళ్లు పూరీని తమ పేరులో పెట్టుకోవడం వల్లే న్యూమరాలజీ ప్రకారం సక్సెసయ్యారట తెలుసా?’’ అన్నాడు. ‘‘ఎవర్రావాళ్లూ?’’ అడిగా. ‘‘ఓంపూరీ, అమ్రీష్‌పూరీ, పద్మినీ కొల్హాపూరీ లాంటి గ్రేట్ నటులూ, హస్రత్ జైపూరీ లాంటి మహాకవులూ... వీళ్లంతా నిత్యం పూరీని స్మరిస్తూ తమ పేరులో దాన్ని భాగం చేసుకున్నవాళ్లే’’ ‘‘వాళ్ల పేరులో ఉన్నది పూరీ కాదురా... పురి... పురి...’’ అని ఆ మాట సాగకుండా పురిపెట్టి వాడు చక్కగా ఉచ్చరించేలా పురిగొల్పడానికి ప్రయత్నించా. ‘‘కొంతమందికి దీర్ఘాలు తీస్తూ మాట్లాడటం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్లూ పూరీతో పాటూ, అక్కడి దీర్ఘాన్ని మింగేశారు. చాలామంది తెలుగు వాళ్లు ఆ పేర్లను పిలిచేప్పుడు ‘పూరీ’ అంటూనే పిలుస్తారు. ఉచ్చారణే నాకు ప్రామాణికం’’ అంటూ మొండికేశాడు. అక్కడితో ఆగకుండా కవిత్వానికీ, పూరీకీ మళ్లీ మరో లింకు పెట్టాడు. అదేంట్రా అంటే... ‘‘ఒకాయన భోజుడి నుంచి ఏదైనా బహుమతి పొందాలని వచ్చాట్ట. భోజరాజు ముఖం చూస్తే చాలు కవిత్వం అలా పొంగుకొచ్చేస్తుందట కదా. అలా కార్యార్థియై వచ్చిన ఆయన భోజుడి ముఖం చూడగానే కవిత్వం మరచి, బాగా ఆకలేసి పలారం అడిగాట్ట. ‘‘టిపినీ దేహి రాజేంద్ర... పూరీ కూర్మా సమన్వితం’’ అని కోరాడట. భోజుడి లెవల్‌కు సింపుల్‌గా పూరీ మాత్రమే అడగటమేమిటీ, రాజుగారు ఇవ్వడమేమిటీ అని అతడి బంగారు పాలనలో ఉన్న ప్రజలంతా కలిసి తాము మాట్లాడుకునే భాషకు భోజ-పూరీ అని పేరుపెట్టుకున్నారట. అందుకే ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల ప్రాంతాల్లోనూ, బీహార్ పశ్చిమ ఏరియాల్లోనూ, గయానా, సురినమ్, ఫిజీ, మారిషస్... దేశాల్లోనూ భోజ్‌పురి భాష మాట్లాడతారట. ఎందుకనీ...భోజుడి పట్ల గౌరవం, పూరీల పట్ల విపరీతమైన ప్రేమ’’ అన్నాడు వాడు. మనమెంత చెప్పినా వీడింతే అనుకొని పూరీలు తినడం పూర్తయ్యాక.. ‘పుర్రెకో వెర్రీ... జిహ్వకో పూరీ’ అంటూ నిట్టూరుస్తూ బయల్దేరాం. - యాసీన్ -
ఘర్షణెందుకురా మగడా అంటే...?
ఉత్త(మ)పురుష మావారికి నాతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం అంటే చాలా సరదా. నాకేమో ఇంట్లో ప్రశాంతత ఇష్టం. ఏ చిన్న సంఘటన జరిగినా చాలు... దాంట్లోంచి ఏదో ఒక పాయింట్‌ను పట్టుకుని అదేపనిగా వాదిస్తుంటారాయన. ఆయన వాదనలెలా ఉంటాయంటే... నేనోరోజు పప్పు వండుతాను. ఆరోజు చికెన్ ఎందుకు చేయలేదని గొడవ. ఇవ్వాళ్ల శనివారం కదా అందుకే వండలేదంటాను నేను. అప్పుడు స్పీచ్ మొదలు... ‘‘నువ్వసలు జీవహింసే చేయదలచుకోలేదనుకో. ఇక చికెన్ తినడం పూర్తిగా మానెయ్. అంతేగానీ... శనివారం ఒక్కరోజు తినకుండా ఉండి, ఆ తర్వాతి రోజుల్లో తింటూ ఉంటే ఏం లాభం? పైగా నువ్వు ఆ ఒక్క రోజూ వండనంత మాత్రాన నిన్ను కోడిజనబాంధవురాలని ఎవరూ అనరు. అంతరించిపోతున్న కోడి జాతికి నువ్వు చేసిన సేవలకు నీకెవరూ పక్షివిభూషణ, పక్షిభూషణ, పక్షిరత్న లాంటి బిరుదేమీ ఇవ్వరు. కాబట్టి ఇలాంటివేవీ పెట్టుకోకు. ఇకనుంచి శనివారమైనా కోడి వండాల్సిందే’’ అంటూ లెక్చర్ ఇస్తారు. అసలు ఆయనకు ఇదేం బుద్ధో నాకు అర్థం కాదు. ఆయనకు తినాలని ఉంటే శనివారం మాత్రం నేను వండకుండా ఉంటానా? ‘‘ఇవ్వాళ్ల ఏం తింటారు మహానుభావా’’... అని నేను అడుగుతూనే ఉంటాను. ఓ పట్టాన జవాబివ్వరు. ఇక వంటకు ఆలస్యం అయిపోతోందంటూ హడావుడిగా ఏదో చేసేస్తాను. ఒకవేళ ఆయనకు నిజంగానే కోడి తినాలని ఉందే అనుకుందాం. మార్కెట్‌కు వెళ్లి చికెన్ తెచ్చి ఇవ్వవచ్చు కదా. అదేం చేయరు. కానీ... భోజనం తయారు అని నేననగానే ఆయనా తయారు... మళ్లీ గొడవకూ, ఘర్షణకు. ఆయన పెట్టే ఈ ఆరళ్లూ... ఈ అల్లర్లూ తట్టుకోలేక ఒక రోజున గట్టిగానే నిలదీశా. అలాంటి రియాక్షన్ నా నుంచి ఎదురు చూళ్లేదాయన. అందుకే కాస్త దెబ్బతిన్నట్టు చూశారు. కాస్త దార్లోకి వస్తూ వస్తూనే మళ్లీ ఎంత చెడ్డా ఆ పురుషాహంకారం కాస్త గాడి తప్పిస్తుంటుంది. ఆ పురుషాధిక్య బుద్ధి ఎక్కడికి పోతుందీ? అందుకే దిగి వస్తూ కూడా తన మాటల్లో కాస్త సైన్సూ, రొమాన్సూ కలగలిపి చెప్పారు. ‘‘ఏవోయ్... తరచు ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరెందుకూ, ఎప్పుడూ ఏదో ఘర్షణ లేకపోతే మీకు తోచదా?... గొడవ లేకుండా సంసార పడవ నడవదా అంటుంటావ్ కదా. ఎడ్డెమంటే తెడ్డెమంటూ అడ్డు వేస్తున్నామనుకో. అంటే ఏమిటన్నమాట? మన మధ్య ఘర్షణ ఉంటుందన్న మాట. ఘర్షణ అంటే మరేమిటో కాదు... ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ వల్లనే గచ్చు మీద నడుస్తున్నా అడుగు కుదురుగా పడుతుంది. నడక చెదరకుండా సాగుతుంది. ఆ ఫ్రిక్షనే లేదనుకో. ఆ నడక గచ్చు మీద కాకుండా, రొచ్చులోన నడచినట్టయి, జర్రుమంటూ జారిపడతాం. కాబట్టి సంసారంలో నిత్యం కావాల్సిందే ‘ఘర్షణ’. అందుకే నిత్యం నీతో నా సంఘర్షణ’’ అంటూ ముగించారాయన. ఈ పురుషపుంగవులున్నారే! రొచ్చుమీద ఫ్రిక్షన్ తగ్గి కిందపడ్డా... తమ కాలుపైనే, పైపైనే అంటారు. ఏం మగాళ్లో ఏమో?! - వై! -
ఇవ్వాళ్ట్టి జేబు చిల్లు...! రేపటికి గుండెకు గండి...!!
సరదాగా... ‘‘ఈమధ్య మీ ఖర్చు చాలా పెరిగింది. గొంతు చిల్లులు పడినట్లు నేను చెబుతున్నా, జేబుకు చిల్లులు పడినట్లు ఖర్చు పెడుతూనే ఉన్నారు. అర్జెంటైతే తప్ప ఆఫీసు నుంచి ఇంటికీ ఇంటి నుంచి ఆఫీసుకూ బస్సులోనే వెళ్తుండండి’’ అన్నాను. శ్రీవారికి ఓ అలవాటుంది. నేను దేన్నైనా తప్పు అంటే చాలు, అదే రైటని సమర్థించడానికి ప్రయత్నిస్తుంటారు. ‘‘ఆదాయానికి కాస్త చిల్లు ఉండాలోయ్. అప్పుడే అన్ని వర్గాలకూ సంపద చేరుతుంది. ఆటోలో వచ్చాననుకో... అప్పుడు ఆటోవాడూ, నీసాటిదే అయిన వాడి పెళ్లాం, మన చిన్నారుల్లాంటి... వాడి పిల్లలూ.. అంతా నాలుక్కాలాలుంటారు. నాలుక్కూరలు తింటారు. అందుకే అప్పుడప్పుడూ తెగించి జేబుకు కాస్త చిల్లు వేస్తుండాలి’’ అన్నారాయన. ఆయనకు ఇష్టమైన మిస్సమ్మ పాటలో చెప్పాలంటే... ఆయనదంతా ‘తనమతమేదో తనదీ... మనమతమసలే పడని’ రెటమతం. ఈ మగాళ్లు ఏదో అంటారుగానీ....‘ఔనంటే కాదనిలే, కాదంటే ఔననిలే‘ అనే టైపు వాళ్లదే. అందుకే మళ్లీ చిల్లు గొప్పదనం చెప్పడం మొదలుపెట్టారు. ‘‘మొదట్లో అట్లకాడనే బోలుగా చేసి ఆ గరిటతోనే నూనెలోంచి వడలూ, గారెలు తీసేవారట. కానీ నూనెంతా దాంట్లోనే నిలిచిపోతూ ఉండేదట. మిస్సమ్మలో చెప్పినట్లు ‘తైలం’ చాలా విలువైనది కాబట్టి తైలాన్ని రక్షించుకోడానికి చిల్లు పెట్టి దాన్ని జల్లిగంటె చేశారట. ఇవాళ్టి మన జేబుకు చిల్లు సాటి పేదలకు వరాల జల్లు’’ అంటూ ఓ ఇన్స్టాంట్ ఉపన్యాసం ఇచ్చారు. ‘‘అందుకే అప్పట్లో మీకు ఈసీజీ తీయిస్తే గ్రాఫు హెచ్చుతగ్గులుండాల్సిన చోట సమసమాజం, సామ్యవాదం అనే పదాలు పడ్డాయట. దాంతో కంగారు పడ్డ డాక్టర్లు మీ తలకాయకు సీటీ స్కాన్ చేయిస్తే అందులో ఏమీ కనిపించలేదట... పరోపకారం అనే అక్షరాలు తప్ప. అలాగే ఎక్స్‌రేలో మీ చేతికి ఎముక కనపడలేదట. మీ పరోపకారం కుటుంబానికి కారం, జేబుకు భారం కాకూడదు. అదీ నేను చెప్పేది’’ అంటూ ఏదో చెప్పబోయా. కానీ చిల్లు గొప్పదనాన్ని చెప్పడం మానలేదు. దాంతో ఆయనకు జరిగిన ఆపరేషన్ గురించి చెప్పా. ‘‘అప్పట్లో ఒకసారి మీ పేగుకు చిల్లు పడితే అర్జెంటుగా దాన్ని మూసేందుకు ఆపరేషన్ చేసేసి మిమ్మల్ని రక్షించారంటూ మీరే చెప్పలా.గుండెను రక్షిస్తూ ఉండే పెరికార్డియమ్ పొరకు మరింత రక్షణగా ఉండే పై పొరే జేబు. ఇవ్వాళ్టి జేబుకు చిల్లే... రేపటికి గుండె వరకూ గండిగా మారవచ్చు. పేగుకు పడితేనే చిల్లు - పెరిగిందంతగా హాస్పిటల్ బిల్లు. ఇక గుండెకు గండి పడితేనో? అందుకే ఇకనైనా పొదుపుగా ఉండండి’’ అంటూ ఉపదేశించా. దాంతో ఆయనిక సెలైంటైపోక తప్పలేదు. సెలైంటైనా తప్పులేదు.