ఫన్ స్పేస్ | Fun Space | Sakshi
Sakshi News home page

ఫన్ స్పేస్

Published Fri, Dec 26 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

ఫన్ స్పేస్

ఫన్ స్పేస్

హోమ్ వర్క్
 భార్య: వంట చేస్తున్నాను... ఆ కిటికీ దగ్గర ఉప్పు డబ్బా ఉంది.  ఇలా తెచ్చివ్వండి...
 భర్త: ఇక్కడ లేదు...
 భార్య: మీరు అలా అంటారని నాకు తెలుసు. మీలాంటి బద్దకస్తుడిని నేనింత వరకు చూడలేదు. ఉప్పు డబ్బా తెచ్చివ్వడానికి కూడా ఇంత బద్దకమా!
 భర్త: లేదంటే వినవేం?
 భార్య: మీరిలా అంటారని తెలిసే...ఉప్పు డబ్బాను నేను ముందే తీసుకొచ్చి పెట్టాను.
 భర్త: !!!!!!!!!!!!
 
ఆఫీస్ వర్క్

 ఆరోజు కూడా రమణ మందు కొట్టాడు.
 భార్య అనుమానిస్తుందని, నిజం తెలిసి పోతుందని భయపడిపోయాడు.
 ‘ల్యాప్‌టాప్ తీసి పని చేస్తున్నట్లు నటిస్తే ఆమెకు అనుమానం రాదు’ అనుకున్నాడు. తన ఐడియాకు తానే గర్వపడ్డాడు.
 కొద్ది సేపటి తరువాత...
 ‘‘మళ్లీ మందు కొట్టి వచ్చావా?’’ కోపంతో కళ్లెర్ర చేసింది రమణ భార్య రాధ.
 ‘‘ఆఫీసులో వర్క్ ఎక్కువై చస్తున్నాను. ఆఫీస్‌లో మిగిలిన వర్క్‌ను ఇలా ల్యాప్‌టాప్‌లో చేసుకుంటున్నాను. నీకు మాత్రం మందు కొట్టి వచ్చినట్లు అనిపిస్తోంది. నిన్ను ఎవరూ బాగు చేయలేరు’’ విసుక్కున్నాడు రమణ.
 ‘‘చాల్లేండి సంబడం...మీ చేతుల్లో ఉంది ల్యాప్‌టాప్ కాదు సూటుకేసు. ఓవర్ యాక్షన్ ఆపండి’’ అని గట్టిగా అరిచింది రాధ.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement