
ఫన్
దొంగలా...!
ఆరేళ్ళ టింకూ చేతికి కొన్ని ఉత్తరాలు ఇచ్చి పోస్టు చేసి రమ్మన్నాడు అరవిందరావు.
పావుగంట తర్వాత ఉత్తరాలు పట్టుకొని వెనక్కు వచ్చేశాడు టింకూ. ‘‘ఏరా టింకూ...! ఉత్తరాలు పోస్టులో వేయకుండా తెచ్చేశావేం...?’’ అని అడిగాడు అరవిందరావు.
‘‘మరీ...నేను ఉత్తరాలు డబ్బాలో వేద్దామనే వెళ్ళాను. కాని ఎవడో దొంగాడు తాళం తీసి ఉత్తరాలన్నీ పట్టుకెళ్ళిపోతున్నాడు. అందుకే ఉత్తరాలు వేయకుండా తెచ్చేశా...’’ అన్నాడు టింకూ.
నేనైతే..!
ఇద్దరు పిసినారులు మాట్లాడుకుంటున్నారు.
‘‘నేను టి. వి అస్తమానం పెట్టను. వార్తలు ఒక్కటే పెడతాను. కరెంటు ఆదా అవుతుందనీ...’’
‘‘నేనైతే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అని చెప్పేటపుడు మాత్రమే పెడతాను...’’