‘అసెంబ్లీలో నోర్మూసుకుని కూర్చోమంది!’ | uttarpradesh assembly in fun seen | Sakshi
Sakshi News home page

‘అసెంబ్లీలో నోర్మూసుకుని కూర్చోమంది!’

Published Wed, Dec 20 2017 2:55 AM | Last Updated on Wed, Dec 20 2017 2:55 AM

uttarpradesh assembly in fun seen - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ శాసనసభలో మంగళవారం సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వీధి జంతువులపై సభలో చర్చ నడుస్తుండగా, ఉన్నట్టుండి అంశం భార్యాభర్తల సంభాషణపైకి మళ్లింది. తొలిసారిగా ఎంపికైన బీఎస్పీ ఎమ్మెల్యే అనిల్‌ సింగ్‌... చర్చిస్తున్న అంశానికి ఏ మాత్రం సంబంధం లేని, తన భార్య, తాను మాట్లాడుకున్న విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. ‘అసెంబ్లీలో నీకు ఎలా ఉందని నా భార్య అడిగింది. అంత బాగా ఏం లేదని నేను చెప్పాను’ అని అనిల్‌ వ్యాఖ్యానించగా ‘అందుకు నీ భార్య ఏమని స్పందించింది?’ అని స్పీకర్‌ హృదయ్‌ నరైన్‌ దీక్షిత్‌ నవ్వుతూ అడిగారు. ‘నిశ్శబ్దంగా కూర్చొని అనుభవం పెంచుకోమని చెప్పింది’ అని అనిల్‌ సమాధానం ఇవ్వడంతో సభ్యులంతా విరగబడి నవ్వారు. ఆ తర్వాత స్పీకర్‌ మాట్లాడుతూ ‘నువ్వు ఇప్పుడు లేచి సభలో మాట్లాడటం టీవీలో నీ భార్య చూస్తే తిడుతుందేమో’ అనడంతో మరోసారి నవ్వులు పూశాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement