
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి కీలకంగా మారాయి. ముఖ్యంగా కాన్పూర్‌లోని సీసామవు అసెంబ్లీ స్థానంపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
సీసామవు అసెంబ్లీకి చెందిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన దరిమిలా అతని సభ్యత్వం రద్దయ్యింది. అనంతరం ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాకేష్ సోంకర్ 1996లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. డీలిమిటేషన్ తర్వాత ఈ సీటు ముస్లింల ప్రాబల్యం కలిగినదిగా మారింది. తదనంతరం ఎస్పీ నేత ఇర్ఫాన్ సోలంకి 2012 నుంచి 2022 వరకు ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.
కాన్పూర్‌లోని సీసామవు స్థానం అఖిలేష్ యాదవ్‌కు బలమైన స్థానాల్లో ఒకటి. అయితే ఇప్పుడు సీసామవు అసెంబ్లీ సీటు అటు బీజేపీ, ఇటు ఎస్పీకి ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది. సీసామవు స్థానం నుంచి బీజేపీ తరపున సురేశ్ అవస్థీ బరిలో నిలిచారు. ఈసారి సీసామవు అసెంబ్లీ స్థానంలో ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఇర్ఫాన్ సోలంకీకి 79,163 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5,616 ఓట్లు రాగా, బీజేపీకి 66,897 ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట