Uttarpradesh assembly
-
UP By-election: క్రిమినల్ కేసులో ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయి.. ఉపఎన్నిక జరిగిన చోట..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి కీలకంగా మారాయి. ముఖ్యంగా కాన్పూర్‌లోని సీసామవు అసెంబ్లీ స్థానంపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.సీసామవు అసెంబ్లీకి చెందిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన దరిమిలా అతని సభ్యత్వం రద్దయ్యింది. అనంతరం ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాకేష్ సోంకర్ 1996లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. డీలిమిటేషన్ తర్వాత ఈ సీటు ముస్లింల ప్రాబల్యం కలిగినదిగా మారింది. తదనంతరం ఎస్పీ నేత ఇర్ఫాన్ సోలంకి 2012 నుంచి 2022 వరకు ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.కాన్పూర్‌లోని సీసామవు స్థానం అఖిలేష్ యాదవ్‌కు బలమైన స్థానాల్లో ఒకటి. అయితే ఇప్పుడు సీసామవు అసెంబ్లీ సీటు అటు బీజేపీ, ఇటు ఎస్పీకి ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది. సీసామవు స్థానం నుంచి బీజేపీ తరపున సురేశ్ అవస్థీ బరిలో నిలిచారు. ఈసారి సీసామవు అసెంబ్లీ స్థానంలో ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఇర్ఫాన్ సోలంకీకి 79,163 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5,616 ఓట్లు రాగా, బీజేపీకి 66,897 ఓట్లు వచ్చాయి. ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట -
‘అసెంబ్లీలో నోర్మూసుకుని కూర్చోమంది!’
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభలో మంగళవారం సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వీధి జంతువులపై సభలో చర్చ నడుస్తుండగా, ఉన్నట్టుండి అంశం భార్యాభర్తల సంభాషణపైకి మళ్లింది. తొలిసారిగా ఎంపికైన బీఎస్పీ ఎమ్మెల్యే అనిల్ సింగ్... చర్చిస్తున్న అంశానికి ఏ మాత్రం సంబంధం లేని, తన భార్య, తాను మాట్లాడుకున్న విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. ‘అసెంబ్లీలో నీకు ఎలా ఉందని నా భార్య అడిగింది. అంత బాగా ఏం లేదని నేను చెప్పాను’ అని అనిల్ వ్యాఖ్యానించగా ‘అందుకు నీ భార్య ఏమని స్పందించింది?’ అని స్పీకర్ హృదయ్ నరైన్ దీక్షిత్ నవ్వుతూ అడిగారు. ‘నిశ్శబ్దంగా కూర్చొని అనుభవం పెంచుకోమని చెప్పింది’ అని అనిల్ సమాధానం ఇవ్వడంతో సభ్యులంతా విరగబడి నవ్వారు. ఆ తర్వాత స్పీకర్ మాట్లాడుతూ ‘నువ్వు ఇప్పుడు లేచి సభలో మాట్లాడటం టీవీలో నీ భార్య చూస్తే తిడుతుందేమో’ అనడంతో మరోసారి నవ్వులు పూశాయి. -
అసెంబ్లీ పేల్చివేత కుట్ర.. ఊహించని మలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పేల్చివేత కుట్ర కేసు ఊహించని మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సభలో వెల్లడించినట్లు.. ఎమ్మెల్యే సీటు కింద దొరికింది అసలు పేలుడు పదార్థం కానేకాదని తేలింది. దీంతో మామూలు పౌడర్‌ను శక్తిమంతమైన బాంబుగా పేర్కొంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ అధికారిపై వేటు పడింది. జులై 13న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఓ ఎమ్మెల్యే సీటు కింద అనుమానాస్పద ప్యాకెట్ లభించడం, అధికారులు చెప్పినదాన్ని బట్టి అది బాంబేనని సీఎం ప్రకటించడంతో కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే. నాటి ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. 50 రోజులపాటు పలు కోణాల్లో దర్యాప్తు చేసి చివరికి నిజాన్ని నిగ్గుతేల్చారు. ‘‘ఆ ప్యాకెట్లో ఉన్నది కేవలం పౌడర్ మాత్రమే. కానీ ఫోరెన్సిక్ అధికారి దానిని శక్తిమంతమైన పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్)గా చెప్పారు. తప్పుడు ధృవీకరణ ఇచ్చి భయభ్రాంతికి కారణమైన అతనని సోమవారం అరెస్ట్ చేశాం’’ అని యూపీ పోలీస్ ఉన్నతాధికారి మీడియాకు చెప్పారు. ఆ అధికారి ఎందుకలా చెప్పారు? అసలు ఆ ప్యాకెట్ ఎమ్మెల్యే సీటు కిందికి ఎలా వచ్చింది? అనే విషయాలు త్వరలోనే తేలతాయని పేర్కొన్నారు.