ట్రాఫిక్‌జాంలో ఇరుక్కుంటే మీరేం చేస్తారు? | Some people in Mumbai turned a boring traffic jam into a street party | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌జాంలో ఇరుక్కుంటే మీరేం చేస్తారు?

Published Thu, Jan 7 2016 12:47 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

ట్రాఫిక్‌జాంలో ఇరుక్కుంటే మీరేం చేస్తారు?

ట్రాఫిక్‌జాంలో ఇరుక్కుంటే మీరేం చేస్తారు?

నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణమైపోయాయి. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌లలో గంటలకొద్ది నిరీక్షిస్తూ వాహనాలు నడుపడం అంటే మాటలు కాదు. ఎంతో ఓపిక కావాలి. క్షణక్షణం విసుగెత్తిపోతుంది. అలాంటి నరకప్రాయమైన అనుభవాన్ని ఓ ముంబైవాలా సంబరంగా మార్చేశాడు. ఇటీవల భారీ ట్రాఫిక్‌ జామ్‌లో కూరుకుపోయిన ఆయన.. ఇక నిరీక్షించి లాభం లేదనుకొని రోడెక్కాడు. కారు స్టీరియో సౌండ్‌ను పూర్తిగా పెంచేసి.. రోడ్డుపై ఆనందంగా డ్యాన్స్ చేశాడు. ఆయనను చూసి ఇతర వాహనాదారులు కాలు కలిపారు. ట్రాఫిక్ గోల వదిలేసి సంతోషంగా స్టెప్పులు వేశారు. రోడ్డుపక్కన ఉన్నవాళ్లు చూస్తూ ఉరుకుంటారు. వాళ్లు కూడా ఈ ఉత్సవంలో చేరిపోయారు. అంతా కలిసి రోడ్డుమీద స్ట్రీట్‌ పార్టీ చేసేశారు. చిన్నాపెద్దా కలిసి ఆనందంగా నరిస్తున్న ఈ వీడియో ఫేస్‌బుక్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 'బీయింగ్  ఇండియన్‌' పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటికే 19 లక్షలమంది చూసేశారు.

 
Mumbai's Spirit

This is exactly why Mumbai's Spirit is commendable! While they were stuck in a traffic jam, they decided to start the party on the streets ;)#MustWatch

Posted by Being Indian on Monday, January 4, 2016

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement