ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రోడ్లపై పలు చోట్ల నీరు నిలిచి ట్రాపిక్ జామ్ అయింది.
పలు రూట్లలో లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ట్రాక్‌పై చెట్లు పడిపోవడంతో కసారా-టిట్వాలా సెక్షన్‌లో రైళ్లను రద్దు చేశారు.
నగరంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్సుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నగరంలో రోడ్లపై నీళ్లు నిలిచిన వీడియోలను పలువురు ముంబైకర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment