న్యూఢిల్లీ : ట్రాఫిక్ రద్దీ ఆర్థిక వ్యవస్థకు భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. నాలుగు మేజర్ సిటీలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాల్లో నెలకొనే ట్రాఫిక్ రద్దీతో వార్షికంగా ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.1.47 లక్షల కోట్ల ఖర్చు చెల్లించుకోవాల్సి వస్తుందని ఓ గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ అధ్యయనం పేర్కొంది. రద్దీ వేళలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు ఈ సర్వే చేపట్టింది. నాన్-పీక్ అవర్స్ కంటే కూడా రద్దీ వేళల్లో గంటన్నరకు పైగా ట్రాఫిక్ జామ్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్టు తెలిపింది. జనవరిలో కోల్‌కత్తాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, ఆ తర్వాత బెంగళూరు ఉన్నట్టు తెలిపింది.
ఎక్కువ వాహనాలు ఉండే ఢిల్లీలో మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని, రోడ్డు నెట్‌వర్క్ మంచిగా ఉండటంతో ఇది సాధ్యమవుతుందని సర్వే పేర్కొంది. రోడ్డు నెట్‌వర్క్ కింద మొత్తం ప్రాంతంలో కోల్‌కత్తా కేవలం 6 శాతం మాత్రమే ఉంది. ప్రతి నగరంలో 300 మంది వ్యక్తులను ఈ సర్వే కవర్ చేసింది. రిపోర్టు ప్రకారం ఢిల్లీలో 45 శాతం ప్రజలు ప్రైవేట్ వాహనాలు వాడుతుండగా.. బెంగళూరులో 38 శాతం మంది వాడుతున్నారు. బెంగళూరులో ట్రాన్స్‌పోర్ట్ విషయంలో ప్రైవేట్ మినీబస్సులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కోల్‌కత్తాలో ఎక్కువ మంది ప్రజా రవాణానే ఎంచుకుంటున్నప్పటికీ, రోడ్డు నెట్‌వర్క్ బాగా లేకపోవడంతో, నగరంలో ప్రధాన మార్గంలోనే వాహనాలు ఫ్లో ఎక్కువగా ఉంటుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పరుడుతుందని పట్టణ రవాణా నిపుణుడు ప్రొఫెసర్ ఎన్ రంగనాథన్ అన్నారు. మరోవైపు వచ్చే ఐదేళ్లలో 89 శాతం మంది ప్రయాణికులు సొంత వాహనం కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నట్టు బీసీజీ రిపోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment