
అప్పుడే లోపలికి వస్తున్న తల్లి ఈ మాట విని, ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ‘దీనికేమైంది?’ అన్నట్టుగా భర్త వైపు చూసింది.
ఒక చిన్నమ్మాయి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లింది. ఆయన కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. కూతురి అలికిడి విని, తల పైకెత్తి, ‘ఏమ్మా’ అన్నట్టు చూశాడు. నెమ్మదిగా ఒక్కో మాటే పలుకుతూ, ‘నాన్నా, నాకు గుండు చేయించవా?’ అని అడిగింది.‘గుండా?’ ఆశ్చర్యపోయి, అది నిజమేనా అన్నట్టుగా అడిగాడు తండ్రి.చిన్నారిది మంచి ఒత్తయిన జుట్టు. ముఖం కళగా ఉంటుంది. ఆ జుట్టు కూడా ఈ అందానికి ఓ కారణం.‘అవును నాన్నా, గుండే... చేయించవా?’ మళ్లీ అడిగింది పాప.అప్పుడే లోపలికి వస్తున్న తల్లి ఈ మాట విని, ఆమె కూడా ఆశ్చర్యపోయింది.
‘దీనికేమైంది?’ అన్నట్టుగా భర్త వైపు చూసింది. అప్పుడు చెప్పింది చిన్నారి. వాళ్ల క్లాసులో వర్షిణి ఉంది. ఈమె బెస్ట్ ఫ్రెండ్. ఆమెకు క్యాన్సర్ వచ్చింది. కీమోథెరపీ చికిత్స చేస్తే జుట్టంతా రాలిపోయింది. అందుకే ఆమెకు గుండు చేశారు. ఆ స్థితిలో ఆమె స్కూలుకు రావడానికి ఇష్టపడటం లేదు. ఎగతాళి చేస్తారని భయపడుతోంది. అందుకే వర్షిణికి తోడుగా తాను గుండు చేయించుకుంటానని చెప్పింది చిన్నారి. భార్యాభర్తలిద్దరికీ నోటమాట రాలేదు. కన్నీళ్లు ఆగలేదు. చిన్నపిల్లలా కాక కన్నతల్లిలా కనబడింది.
Comments
Please login to add a commentAdd a comment