Shyam Singha Roy Online Class Funny Video, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy: ఆన్​లైన్​ క్లాస్​లో 'శ్యామ్ సింగరాయ్'​.. తమను కలపాలని లెక్చరర్​కు వినతి

Published Fri, Jan 28 2022 8:55 PM | Last Updated on Sat, Jan 29 2022 8:27 AM

Students Makes Fun With Lecturer On Shyam Singha Roy Name - Sakshi

Students Makes Fun With Lecturer On Shyam Singha Roy Name: నేచురల్​ స్టార్​ నాని, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్​ సాయిపల్లవిల అద్భుతనటనగల ప్రేమ కావ్యం 'శ్యామ్​ సింగరాయ్​'. రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై మంచి టాక్​ సంపాదించుకుంది. తర్వాత ఓటీటీ దిగ్గజం నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతూ అనూహ్య రెస్పాన్స్​ తెచ్చుకుంటోంది. ఇటీవల నెట్​ఫ్లిక్స్​ గ్లోబల్​ మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు కూడా పొందింది. ఈ సినిమా ప్రేమకథా అనేక ప్రేక్షక జనానికి ఎంతో నచ్చి ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సినిమాలో పూర్వజన్మ నేపథ్యంతో ప్రేమకథ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో కొంతమంది స్టూడెంట్స్ ఆన్​లైన్​లో​ ఒక లెక్చరర్​తో సరదాగా ఆడుకున్నారు. ​స్టూడెంట్​ తన పేరు శ్యామ్​ సింగరాయ్​ అని తన భార్య పేరు రోజీ సింగరాయ్​ అని చెప్పాడు. వాళ్లిద్దరిని ఎలాగైనా కలపాలని లెక్చరర్​ను కోరి ఇబ్బంది పెట్టాడు. ప్రముఖ ఇంజినీరింగ్​ కాలేజ్​కు చెందిన ఓ విద్యార్థి తన ఐడీని శ్యామ్​ సింగరాయ్​గా మార్చుకున్నాడు. అది నిజంగా తన పేరా ? లేదా సినిమా పేరును ఐడీగా పెట్టుకున్నారా ? అని లెక్చరర్​ అడగ్గా అది తన పేరేనని, తన భార్య రోజీ సింగరాయ్​ కూడా క్లాస్​లోనే ఉందని, తాను పునర్జన్మ ఎత్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న లెక్చరర్ క్లాస్​ అయ్యాక పర్సనల్​గా మాట్లాడదామని తెలిపాడు. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్​ను ఓ నెటిజన్​ శ్యామ్ సింగరాయ్​ చిత్రబృందానికి ట్యాగ్​ చేశాడు. దానికి ఆన్​లైన్​ క్లాస్​లో శ్యామ్ సింగరాయ్​ అంటూ ట్వీట్​ చేశాడు. ఇది చూసిన మూవీ డైరెక్టర్​ రాహుల్​ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే ఈ ఆడియోను కావాలని సరదాగా క్రియేట్​ చేశారో, నిజంగానే జరిగిందో తెలియదు గానీ సోషల్​ మీడియాలో మాత్రం వైరల్​గా మారింది. ​ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement