సాయిపల్లవి అందుకోసం ఏడురోజులు కష్టపడింది | Director Rahul Sankrityan About Shyam Singha Roy Movie | Sakshi

Shyam Singha Roy: నాని అప్పటి నుంచి నన్ను నమ్ముతున్నారు.. డైరెక్టర్‌

Dec 20 2021 7:08 PM | Updated on Dec 20 2021 7:08 PM

Director Rahul Sankrityan About Shyam Singha Roy Movie - Sakshi

దేవ‌దాసి వ్య‌వ‌స్థ అనేది మెయిన్ స‌బ్జెక్ట్ కాదు. క‌థ‌లో క్యారెక్ట‌ర్‌కి భాగంగా తీసుకున్న‌దే.. దానికి వ్య‌తిరేకంగా లీడ్ క్యారెక్ట‌ర్ పోరాడుతాడు...

Shyam Singha Roy Movie Director Rahul Sankrityan: నేచురల్ స్టార్ నాని హీరోగా, సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా  చిత్ర ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్యాన్  మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

స‌త్య‌దేవ్ జంగా గారు ఈ కథ బెంగాల్‌లో జ‌రుగుతుందని చెప్ప‌గానే చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. ఈ క‌థ మీద వ‌ర్క్ చేయడానికి స్కోప్ ఉంద‌నిపించింది. క్యారెక్ట‌ర్స్ చాలా బాగా కుదిరాయి. దాన్ని ఇంకా ఎంత బెట‌ర్‌గా చేయొచ్చు అనే దానిపై వ‌ర్క్ చేశాను. లాక్‌డౌన్‌లో దొరికిన టైమ్‌ను బాగా ఉప‌యోగించుకున్నాను. ల‌క్కీగా ఆ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్స్‌కు త‌గ్గ ఆర్టిస్టులు దొరికారు. 

క‌థ‌ పూర్తిగా డెవ‌ల‌ప్ చేశాక నేరుగా నానిగారి దగ్గ‌ర‌కే వెళ్లి న‌రేష‌న్ ఇచ్చాను. మ‌రో ఆప్ష‌న్ కూడా అనుకోలేదు ..ఆ పాత్ర‌లో నానిగారు త‌ప్ప మ‌రెవ్వ‌రూ క‌న‌ప‌డ‌లేదు. 

ఎడిట‌ర్ న‌వీన్ నూలి జ‌ర్సీకి ప‌ని చేశారు కాబ‌ట్టి ఆయ‌న్నే తీసుకున్నాం. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ముందు ర‌వివ‌ర్మ‌న్ అనుకున్నాం. కానీ అప్పుడు ఆయ‌న పొన్నియ‌న్ సెల్వ‌మ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మ్యూజిక్ రెహ‌మాన్ అనుకున్నాం కుదరకపోవడంతో మిక్కీ జే మేయ‌ర్‌ను స‌జెస్ట్ చేశాను. సాను జాన్ వ‌ర్గీస్‌ను నాని స‌జెస్ట్ చేశారు. హీరోయిన్‌గా సాయి ప‌ల్ల‌వి ఫ‌స్ట్ ఆప్ష‌న్‌. నానికి  ఈ విష‌యం చెప్ప‌గానే త‌ను చేస్తే ఈ క్యారెక్ట‌ర్ చాలా బాగుంటుందని ఎగ్జ‌యిట్ అయ్యారు. 

దేవ‌దాసి వ్య‌వ‌స్థ అనే పాయింట్ క‌థ ప్ర‌కారం ప‌శ్చిమ బెంగాల్‌లో స్టార్ అయిన ఆంధ్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు ఇలా ప్యాన్ ఇండియా స్థాయిలో దానిని చ‌ర్చిస్తాం. ఈ సినిమాలో దేవ‌దాసి వ్య‌వ‌స్థ అనేది మెయిన్ స‌బ్జెక్ట్ కాదు. క‌థ‌లో క్యారెక్ట‌ర్‌కి భాగంగా తీసుకున్న‌దే.. దానికి వ్య‌తిరేకంగా లీడ్ క్యారెక్ట‌ర్ పోరాడుతాడు. స‌మాజానికి మంచి సందేశం ఇస్తాడు.

నాని గారితో గ‌తంలో ఒక స‌బ్జెక్ట్ గురించి చ‌ర్చించాను. అది కుద‌ర‌లేదు. కాని ఆయ‌న ఎలాంటి క‌థ‌ల మీద ఇంట్రెస్ట్‌గా ఉంటార‌ని ఒక ఐడియా ఉంది. ఈ స‌బ్జెక్ట్  చెప్ప‌గానే ఫ‌స్ట్ సిట్టింగ్‌లోనే ఒకే చేశారు. అప్ప‌టి నుంచే న‌న్ను న‌మ్మ‌డం మొద‌లైంది. ఈ రోజు వ‌ర‌కూ ఆ న‌మ్మ‌కం పెరుగుతూనే వ‌స్తుంది త‌ప్ప ఎక్క‌డా తగ్గ‌లేదు. ఆయ‌న స‌పోర్ట్‌ వ‌ల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయ‌గలిగాను. ఈ స్క్రిప్ట్ అనుకున్న రోజే శ్యామ్ సింగ‌రాయ్ అనే టైటిల్ కూడా అనుకున్నాం.

క్లైమాక్స్ పార్ట్ చిత్రీక‌ర‌ణ చాలా చాలెంజింగ్ అనిపించింది. రెండు రోజులు షూటింగ్ చేశాం. అది ఎందుకు అనేది సినిమా విడుద‌ల‌య్యాక చెప్తాను. 

సాయి ప‌ల్ల‌వి మంచి డ్యాన్స‌ర్..ఈ సినిమా కోసం క్లాసిక‌ల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ప‌గ‌లంతా రిహార్స‌ల్ చేయ‌డం రాత్రి పెర్ఫామ్ చేయ‌డం అలా ఏడు రోజుల పాటు ఆ సాంగ్ షూటింగ్ కంటిన్యూగా చేసింది. ప్ర‌స్తుతం టైమ్ ట్రావెల్ జోన‌ర్‌లో ఒక క‌థ రెడీగా ఉంది. అది మరో డిఫరెంట్ జోనర్.. ఈ సినిమా త‌ర్వాత దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చాడు రాహుల్‌.

'శ్యామ్ సింగరాయ్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫోటోలు చూసేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement