
తాయారమ్మ వర్సెస్...
ఫన్
తాయారమ్మ షాపింగ్‌కు వెళ్లింది. తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసింది. బిల్లు చెల్లించడానికి ఆమె బ్యాగు తెరిచినప్పుడు అందులో టీవీ రిమోట్ కనబడింది షాప్‌కీపర్‌కు. ‘‘రిమోట్ బ్యాగులో పెట్టుకున్నారేమిటి?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు షాప్‌కీపర్.
‘‘మా ఆయన ఇంట్లో టీవీ ముందు కూర్చున్నాడు. నాతో షాపింగ్‌కు రమ్మంటే రానన్నాడు. అందుకే ఇలా బ్యాగులో పెట్టాను’’ అని చెప్పింది తాయారమ్మ.
అయిదు నిమిషాల తరువాత...
‘‘అయ్యో...మీ క్రెడిట్ కార్డును మీ ఆయన బ్లాక్ చేశాడండీ’’ చెప్పాడు షాప్‌కీపర్.
నీతి:‘భర్త ఇష్టాయిష్టాలను గౌరవించాలి.’
అయిదు నిమిషాల తరువాత...
తాయారమ్మ తన పర్స్ నుంచి భర్త క్రెడిట్ కార్డు తీసి అన్ని బిల్లులూ చెల్లించింది. పాపం భర్త...తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.
నీతి:‘భార్య తెలివితేటలను తక్కువ అంచనా వేయవద్దు’