పరీక్ష ఫెయిలైన కొడుకును తిడుతూ ఓ తండ్రి ‘‘ఇంకోసారి ఫెయిలైతే ఇక నువ్వు నన్ను మరిచిపోవాల్సిందే!’’ అన్నాడు కోపంగా.
(ఏడాది తర్వాత)
తండ్రి: ఏరా రిజల్ట్స్ వచ్చాయా?
కొడుకు: ఎవరు నువ్వు?
పచ్చి నిజం
హిస్టరీ లెక్చరర్: మూడో ప్రపంచం యుద్ధం వస్తే ఏం జరుగుతుంది?
స్టూడెంట్: ఇంకో చాప్టర్ పెరుగుతుంది!!
ఏం చెప్పిందండీ!
ఫ్రెండ్ 1: ఏరా కార్తీకను రెస్టారెంట్‌కు తీసుకెళ్లావు, ఏం మాట్లాడుకున్నారు.
ఫ్రెండ్ 2: ఏం మాట్లాడుకోలేదు, కళ్లలోకి చూసుకుంటూ గడిపాం.
ఫ్రెండ్ 1: తను కూడా ఏమీ మాట్లాడలేదా?
ఫ్రెండ్ 2: మూడు పదాలు మాత్రం చెప్పింది!
ఫ్రెండ్ 1: ఐ లవ్ యూ... అనా?
ఫ్రెండ్ 2: కాదు... పే ద బిల్... అని
నవ్వింత: పంచ్ పడింది!
Published Sun, Feb 9 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement