Jokes
-
మొదటి అధ్యక్షురాలి అవకాశం మీకే!
న్యూయార్క్: అమెరికా సెనేట్ మెజారిటీ నేత చుక్ షుమర్తోపాటు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జోకులు పేల్చారు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన అల్ స్మిత్ మెమోరియల్ డిన్నర్‌కు హాజరైన ట్రంప్..కమలా హ్యారిస్ నెగ్గకుంటే మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం మీకే వస్తుందంటూ షుమర్‌ను ఆటపట్టించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు వచ్చి సరదాగా పట్టించుకుంటారు. ఇలా అందే విరాళాలు కేథలిక్ చారిటీలకు వెళ్తుంటాయి. అయితే, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమలా హారిస్ రాలేదు. బదులుగా చుక్ షుమర్ వచ్చారు. వేదికపై ట్రంప్‌కు సమీపంలోనే ఆయన కూడా ఉన్నారు. ‘షుమర్ చాలా డల్‌గా కనిపిస్తున్నారు. మరో కోణం కూడా చూడాలి. వాళ్ల పార్టీ చాలా చురుగ్గా తయారైంది. కమల అవకాశం కోల్పోతే, మొదటి అధ్యక్షురాలయ్యే అవకాశం మీకే వచ్చే అవకాశముంది’అని షుమర్నుద్దేశించి ట్రంప్ బిగ్గరగా అనడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది.ఈసారి కమలా హారిస్ లక్ష్యంగా ట్రంప్.. ‘నా ప్రత్యర్థి ఈ కార్యక్రమానికి రావల్సిన అవసరం లేదని భావించినట్లున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె తీవ్రంగా అవమానించారు. గతంలో 1984లో వాల్టర్ మొండెల్ మాత్రమే ఇలా చేశారు. అప్పట్లో ఆయన రొనాల్డ్ రీగన్ చేతిలో ఓడిపోయారు’అంటూ వ్యాఖ్యానించారు.దీనిపై అనంతరం కమల తనదైన శైలిలో స్పందించారు. ‘సహాయకుడు రాసిచ్చిన జోకుల్ని చదివేందుకే అవస్థలు పడ్డ ట్రంప్.. టెలీ ప్రాంప్టర్‌ను లోపలికి అనుమతించలేదంటూ ప్రశ్నించారు. తను అనుకుంటున్న జోకులకు ప్రేక్షకులు నవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ జోకులు ఎవరికైనా అర్థమవుతాయా? ట్రంప్ మాట్లాడింది ఒక్క ముక్క కూడా అర్థం కాదు’అంటూ చురకలు అంటించారు. అనంతరం సోషల్ మీడియాలో ట్రంప్ జోకులపై మిశ్రమ స్పందన వచ్చింది. -
USA: వయసుపై జోకులు వేసుకున్న బైడెన్.. పాపులర్‌గా మారిన యాడ్
వాషింగ్టన్: అమెరికా అధ్యకక్షుడు జో బైడెన్ తన వయసుపై తానే జోకులు వేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున బైడెన్ మళ్లీ పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా షూట్ చేసిన ఒక టీవీ ప్రకటనలో బైడెన్ తనపై తానే జోకులు వేసుకున్నారు. ‘చూడండి.. నేను యువకుడిని కాదు. ఇందులో రహస్యమేమీ లేదు. అయితే అమెరికా ప్రజలకు ఏం చేయాలో నాకు తెలుసు’ అని కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ బైడెన్ యాడ్‌లో చెప్పడం ఆసక్తిరేపింది. ఆ తర్వాత తాను కరోనాను ఎలా నియంత్రించాను, వృద్ధులకు ఇన్సులిన్ ధరలను ఎలా తగ్గించాను, మౌలిక సదుపాయాల చట్టం, గర్భం ధరించే విషయంలో మహిళలకు స్వేచ్ఛ లాంటి విషయాల్లో తన విజయాలను వీడియోలో బైడెన్ ప్రజలకు వివరించారు. అయితే ఇదంతా పూర్తయిన తర్వాత యాడ్‌లో వన్ మోర్ టేక్ అనే వాయిస్ వినిపిస్తుంది. దీనికి ‘చూడు. నేను చాలా యంగ్, ఎనర్జిటిక్, అందగాడిని. నేనేం తప్పు చేశాను’ అని ముఖంలో కాస్త కోపంతో బైడెన్ అనడంతో యాడ్ బాగా పాపులర్ అయింది. ఇటీవలి కాలంలో బైడెన్ పలు విషయాలను మర్చిపోయి ప్రవర్తించిన ఉందంతాలు వెలుగు చూశాయి. తాజాగా జార్జియాలో హత్యకు గురైన నర్సింగ్ విద్యార్థిని లేకెన్ రిలే విషయం మాట్లాడుతూ ఆమె పేరును లింకన్ రిలే అని ఉచ్చరించడంతో బైడెన్ మతిమరుపు మరోసారి బయటపడినట్లయింది. ఇదీ చదవండి.. లెబనాన్‌లో ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు మృతి -
‘హీ నితీష్డ్ మీ’
న్యూఢిల్లీ: బిహార్ సీఎం నితీశ్ కుమార్ పదేపదే కూటములు మార్చడంపై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్, జోకులు పేలుతున్నాయి. మోసానికి సిసలైన పేరు నితీశ్ అంటూ కొత్త విశేషణాన్ని ఖరారుచేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్‌లో కొన్ని... ‘అతను నన్ను మోసం చేశాడు’ అనడానికి ‘హీ నితీష్డ్ మీ’ అంటూ పలువురు ట్యాగ్ చేస్తున్నారు. ‘‘బీసీసీఐ కొత్త తరహా క్రికెట్ టోర్నమెంట్ ఫార్మాట్ తేనుంది. అదేంటంటే మ్యాచ్ మధ్యలో కెప్టెన్లు మారిపోతారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ. ఆదాయానికి ఆదాయం. వరల్డ్ కప్ లాగా అది ‘నితీశ్ కప్’ అని ఒక పాత్రికేయుడు ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. కార్పోరేట్ ప్రపంచంలో సీఈవోలకు నితీశ్ కుమార్ ఒక ఆదర్శనీయుడు. తొమ్మిదిసార్లు ‘కంపెనీ’ల విలీనాలు, టేకోవర్ల తర్వాత కూడా ఈయనే సీఈవోగా కొనసాగడం అద్భుతం’ అని మరో యూజర్ ట్వీట్‌చేశారు. కూటముల మధ్య తెగ ‘పల్టీలు కొట్టే పుత్రుడు’ని కన్నందుకు ‘పాటలీపుత్ర’కు ఆ పేరు వచ్చిందని మరొకరు కొత్త భాష్యమిచ్చారు. ‘‘జాతీయ రహదారులపై యూటర్న్ గుర్తు తీసేసి అక్కడ నితీశ్ ఫొటో పెట్టాలని కేంద్ర రహదారుల మంత్రి ఆదేశించారు’’ అని మరొకరు ట్వీట్‌చేశారు. బిహార్‌లో మహాఘట్బంధన్ కూటమికి చరమగీతం పాడి బీజేపీతో నితీశ్ జట్టు కట్టిన విధానాన్ని ఐదు అంశాల్లో నెటిజన్లు సరికొత్తగా నిర్వచించారు. 1. ఎటంటే అటు మారేలా అనువుగా ఉండాలి. 2. సరిగ్గా సరైన సమయం చూసి అటువైపు దూకేయాలి. 3. అదే సమయంలో పాత మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి. 4. చెడిపోయిన స్నేహాన్ని చిగురింపజేయాలి. 5. కొత్త అవకాశం చేతికొచ్చాకే పాత మిత్రుల చేయి వదిలేయాలి. గవర్నర్ బిత్తరపోయిన వేళ! ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వెళ్లిన నితీశ్, 15 నిమిషాల్లోపే తిరిగి రాజ్‌భవన్‌కు రావడం చూసి గవర్నర్ షాకయ్యారంటూ సరదా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అదేమంటే, రాజ్‌భవన్‌లో మర్చిపోయిన తన మఫ్లర్(స్కార్ఫ్)ను తీసుకోవడం కోసం నితీశ్ వెనుదిరిగి వస్తారు. అది చూసి గవర్నర్ బిత్తరపోతారు. ‘ఈసారి కూటమికి గుడ్‌బై చెప్పడానికి నితీశ్‌కు 18 నెలలు టైమ్ పట్టింది. ఇప్పుడేమిటి మరీ 15 నిమిషాల్లోపే మళ్లీ వచ్చారా?’ అని గవర్నర్ షాక్‌కు గురయ్యారంటూ కాంగ్రెస్ వ్యంగ్యంగా ట్వీట్‌చేసింది. ‘‘వెంటవెంటనే రాజీనామాలు, ప్రమాణాలతో నితీశ్ రాజకీయ రంగు మారుస్తున్నారు. ఈయనను చూసి ఊసరవెల్లి కూడా కొత్త రంగును వెతుక్కోవాల్సి వస్తోంది. ఆయారామ్ గయారామ్ బదులు ఇక ఆయా నితీశ్ గయా నితీశ్ అనుకోవాలి’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. -
మణిపూర్ మండుతూ ఉంటే పార్లమెంట్లో జోకులా?
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని మరోసారి టార్గెట్ చేశారు. గురువారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి బదులిస్తూ ప్రధాని మోదీ నవ్వడం, జోకులు వేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని ప్రవర్తన సరైంది కాదన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మోదీ మణిపూర్ హింసను తక్షణం ఆపాలనుకుంటే, అందుకు అవసరమైన చాలా మార్గాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు. భారత ఆర్మీ అక్కడి పరిస్థితులను రెండు రోజుల్లోనే అదుపులోకి తీసుకొస్తుందని చెప్పారు. ‘అక్కడ మహిళలు, చిన్నారులు చనిపోతున్నారు. మహిళలు వేధింపులు, అత్యాచారాలకు గురవుతున్నారు. భారత ప్రధాని మోదీ మాత్రం నిండు పార్లమెంట్లో రెండు గంటలపాటు నవ్వుతూ, నవి్వస్తూ, నినాదాలతో గడిపారు. నాలుగు నెలలుగా మణిపూర్ మంటల్లో ఉన్న విషయం ఆయన మర్చిపోయినట్లున్నారు. మణిపూర్ మండుతూనే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, మంటలను ఆపడం ప్రధానికి ఇష్టం లేదు’అని రాహుల్ ధ్వజమెత్తారు. ఈ విషయం రాహుల్ గాం«దీకి, కాంగ్రెస్‌కు, ప్రతిపక్షానికి సంబంధించింది కాదు, ఇది భారత్‌కు, మన దేశానికి సంబంధించిన విషయం. ఒక రాష్ట్రం నాశనమైంది. అదిప్పుడు ఉనికిలో లేదు. విభజించు, పాలించు, తగులబెట్టు..తరహా బీజేపీ రాజకీయాల వల్లే ఇలా అయింది’అని రాహుల్ మండిపడ్డారు. ‘నేను అటల్ బిహారీ వాజ్‌పేయి, దేవెగౌడ వంటి ప్రధానుల్ని చూశాను. మోదీ వంటి ఇంత దిగజారిన ప్రధానిని ఎన్నడూ చూడలేదు’అన్నారు. ‘మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైంది’అని నేను చేసిన వ్యాఖ్య సాధారణమైంది కాదు. నా 19 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి మాట వాడటం ఇదే మొదటిసారి’అని అన్నారు. మణిపూర్‌లోని మొయితీలుండే ప్రాంతానికి వెళ్లినప్పుడు.. వాళ్లు మమ్మల్నెంతో ప్రేమగా చూశారు. అక్కడే ఉండిపొమ్మన్నారు. అక్కడున్న భద్రతా సిబ్బంది ఒక్క కుకీ వర్గం వ్యక్తి కూడా లేరు. కుకీలుండే ఏరియాకు వెళ్లినప్పుడూ మాకు ఇదే అనుభవం ఎదురైంది. అక్కడ ఒక్కడి భద్రతా సిబ్బందిలో ఒక్క మొయితీ కూడా లేరు. ఇలాంటి పరిస్థితి మణిపూర్‌లో మునుపెన్నడూ లేదని కేంద్ర భద్రతా సిబ్బంది ఒకరు నాతో అన్నారు’అని రాహుల్ చెప్పారు. ‘అందుకే మణిపూర్‌లో భరతమాత హత్యకు గురైందన్నాను. అది తమాషాకు కాదు. వాస్తవమే చెప్పాను’అని రాహుల్ తెలిపారు. ‘పార్లమెంట్లో నా ప్రసంగంలోని భరతమాత అనే మాట దోషంగా భావించి రికార్డుల నుంచి తొలగించి వేశారు. అందులో తప్పేముంది? ఇలా భరతమాత మాటను తొలగించడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి’అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని హోదాకు తగని ప్రసంగం గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. -
Parliament session: నాకు కోపమే రాదు ఎందుకంటే... నా పెళ్లై 45 ఏళ్లయింది!
మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న వేళ రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తనపైనే జోకులు వేసుకుని సభలో నవ్వులు పూయించారు. దాంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మీకు పదేపదే కోపమెందుకు వస్తుందని విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘సర్. నాకసలు కోపమే రాదు. ఎందుకంటే నా పెళ్లై 45 ఏళ్లయింది’ అంటూ ధన్‌ఖడ్ చెణుకులు విసరడంతో సభ్యుల నవ్వులతో సభ దద్దరిల్లిపోయింది. ‘‘చిదంబరం (కాంగ్రెస్ సభ్యుడు) చాలా సీనియర్ లాయర్ కూడా. అథారిటీపై కోపం చూపే హక్కు మాకుండదని ఆయనకు బాగా తెలుసు. సభలో మీరే (సభ్యులు) అథారిటీ. మరో విషయం. నా భార్య ఎంపీ కాదు. కనుక ఆమె గురించి నేనిలా సభలో మాట్లాడటం సరికాదు కూడా’’ అంటూ ధన్‌ఖడ్ మరోసారి అందరినీ నవి్వంచారు. తనకు కోపం వస్తుందన్న వ్యాఖ్యలను సవరించుకోవాల్సిందిగా ఖర్గేను కోరారు. దాంతో ఆయన లేచి, ‘‘మీకు కోపం రాదు. చూపిస్తారంతే. కానీ నిజానికి చాలాసార్లు లోలోపల కోపగించుకుంటారు కూడా’’ అనడంతో అధికార, విపక్ష సభ్యులంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయారు! రెండుసార్లు వాకౌట్ అంతకుముందు, మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు తదితర విపక్షాలు ఉదయం రాజ్యసభ భేటీ కాగానే వాకౌట్ చేశాయి. మధ్యాహ్నం రెండింటికి తిరిగి సమావేశమయ్యాక కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీకి చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. మణిపూర్ హింసపై, మహిళలపై ఘోర అత్యాచారాలపై చర్చకు అవకాశం కోరుతున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై అధికార, విపక్ష సభ్యులతో ఎన్నిసార్లు సమావేశమైనా ఎవరికి వాళ్లే తమదే పై చేయి కావాలని పట్టుదలకు పోవడంతో లాభం లేకపోతోందంటూ చైర్మన్ వాపోయారు. ఆగ్రహించిన విపక్ష సభ్యులు ‘ప్రధాని మోదీ సభకు రావాలి’ అంటూ నినాదాలకు దిగారు. వాటిని పట్టించుకోకుండా ఖనిజాల (సవరణ) బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రి ప్రహ్లాద్ జోషికి చైర్మన్ అవకాశమిచ్చారు. దాన్ని నిరసిస్తూ విపక్షాలు రెండోసారి వాకౌట్ చేశాయి. -
మల్లా రెడ్డి సార్ కి కోపం వచ్చింది
-
ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!
న్యూఢిల్లీ:సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ యూజర్లకు మరో ఎదురు దెబ్బ. ఇప్పటికే బ్లూటిక్ పోవడంతో హతాశులైన యూజర్లు చాలామందికి ఇపుడిక ట్విటర్ లోడ్ కూడా కావడం లేదు. ప్రస్తుతం చాలామంది వినియోగదారులకు మైక్రో బ్లాగింగ్ సేవలు అందుబాటులో లేవు. ప్రధానంగా డెస్క్‌టాప్ యూజర్లకు ‘దిస్ పేజ్ ఈజ్ డౌన్’ అనే సందేశం కనిపిస్తోంది. అయితే తొందరలోనే లోపాన్ని సవరిస్తామనే మెసేజ్ దర్శనమిస్తోంది. దీంతో ట్విటర్ మీకు పనిచేస్తోందా అంటూ నెటిజన్లు తెగ ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్! ట్విటర్-డౌన్ ట్విటర యాప్ లేదా వెబ్సైట్ (డెస్క్‌టాప్, మొబైల్ రెండూ)చాలావరకు పని చేయలేదు. మొబైల్ సైట్‌ని యాక్సెస్ చేసినప్పుడు, ప్రస్తుతం ‘మీ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ సైట్‌ని చేరుకోవడం సాధ్యం కాదు’ అని లాంటి మెసేజెస్ కనిపించింది. ఈ సమస్య ఎంత విస్తృతంగా వ్యాపించిందనే దాని గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు, అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీకి ఎంత సమయం పడుతుంది అనే దానిపై కూడా స్పష్టత లేదు. కాగా శుక్రవారం ఉదయం నుంచి సెలబ్రిటీలకు బ్లూటిక్ తీసివేయడంతో కలకలం రేగింది. దీంతో యూజర్లు జోక్స్, మీమ్స్‌తో ట్విటర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. Elon Musk be like.#BlueTick pic.twitter.com/hlB9NxDKgd — Farhan Khan (@babarazam215) April 21, 2023 ట్విటర్‌ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత చేసిన పలు మార్పుల్లో భాగంగా బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్లూటిక్ కావాలనుకునే యూజర్లు బ్లూటిక్ కోసం నెలవారీ రుసుము చెల్లించాలి. -
World Funniest Joke: మామూలు జోక్ కాదు.. ఇది జోకులకే జోక్!
ఏదైనా జోక్ వింటే చటుక్కున నవ్వు వచ్చేస్తుంది.. కానీ అన్ని జోకులు అందరికీ నచ్చవు. కొన్ని సార్లు పడీ పడీ నవ్వేస్తుంటాం.. మరికొన్ని సార్లు చిన్నగా నవ్వి ఊరుకుంటాం. మరి ఎన్నో జోక్‌లు ఉన్నా ఎక్కువ మందికి నచ్చే జోక్ ఏమిటన్న డౌట్ వస్తుంది కదా.. రిచర్డ్ వైస్మాన్ అనే సైకాలజిస్టుకూ ఇదే అనుమానం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బాగా ఇష్టపడే జోక్ ఏమిటా అన్న దానిపై ఓ ప్రయోగం మొదలుపెట్టాడు. ‘మీకు ఇష్టమైన జోకులను పెట్టండి. నచ్చిన వాటికి ఓటేయండి’అంటూ ఓ వెబ్సైట్లో ప్రకటన పెట్టాడు. ఇలా మొత్తంగా 40 వేల జోకులు పోగయ్యాయి. సుమారు 20 లక్షల మంది తమకు నచ్చిన జోక్‌కు రేటింగ్ ఇచ్చారు. అందులో ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన గుర్పాల్ గోస్సాల్ అనే సైకియాట్రిస్ట్ పెట్టిన జోక్ అత్యంత హాస్యభరితమైన జోక్‌గా నిలిచింది. మరి ఆ జోక్ ఏంటో చూద్దామా.. చదవండి👉🏼క్యాన్సర్‌తో బాధపడుతున్నారా.. బీట్రూట్ తిన్నారంటే..! ఓ రోజు ఇద్దరు వేటగాళ్లు అడవికి వెళ్లారు. అందులో ఒకడు సడన్‌గా స్పృహ తప్పి పడిపోయాడు. కళ్లు తేలేసేశాడు.. ఊపిరి కూడా తీసుకుంటున్నట్లు కనపడలేదు. దీంతో చనిపోయేడామో అని రెండోవాడికి డౌట్ వచ్చింది.. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. ‘నా స్నేహితుడు చనిపోయాడు. నేనిప్పుడు ఏం చేయాలి’అని టెన్షన్ పడుతూ అడిగాడు. అటు వైపు ఆపరేటర్.. ‘నేను మీకు సాయం చేస్తాను. మీరు కూల్ అవ్వండి. ముందు మీ స్నేహితుడు నిజంగానే చనిపోయాడా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోండి’అని చెప్పాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం.. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం.. ‘చనిపోయాడు.. కన్ఫర్మ్.. ఇప్పుడు నేనేం చేయాలి’అని ఆ వేటగాడు రొప్పుతూ మళ్లీ అడిగాడు.. సైంటిఫిక్‌గానూ ఇదే బెస్ట్ జోక్! మంచి జోక్‌లకు సంబంధించి.. ఆశ్చర్యం కలిగించడం, ఒత్తిడిని దూరం చేయడం వంటి కొన్ని ప్రమాణాలు ఉంటాయని, అవన్నీ ఈ జోక్‌లో ఉన్నాయని సైకాలజిస్టు రిచర్డ్ వైస్మాన్ చెప్పారు. 103 పదాలు ఉండే జోక్‌లు ఎక్కువగా నచ్చుతాయని.. ఈ జోక్‌లో 102 పదాలు (ఇంగ్లిష్‌లో) ఉన్నా యని వివరించారు. మరో చిత్రమేమిటంటే.. ఏటా అక్టోబర్ 7న, అదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో జోకులు ఎక్కువగా నవ్విస్తాయని తమ సర్వేలో తేలినట్టు పరిశోధకులు చెప్తున్నారు. చదవండి👉🏼కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స... చిగురిస్తున్న కొత్త ఆశ -
ఆవు తల్లితో సమానం
వారణాసి: ఆవులు, గేదెలపై జోకులేస్తూ విపక్ష పార్టీలు.. పశుసంపదపై ఆధారపడ్డ ఎనిమిది కోట్ల మంది ప్రజానీకాన్ని అవమానపరుస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన వారణాసిలో పాడి పరిశ్రమ సహా రూ.2,095 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగించారు. ‘ గోమాత మనకు మాతృ సమానురాలు. దేశానికే గర్వకారణమైన పశుసంపద(ఆవులు, గేదెలు..)పై ఆధారపడి దాదాపు ఎనిమిది కోట్ల జనాభా జీవనం కొనసాగిస్తోందనే విషయాన్ని విపక్షాలు మరిచాయి. ఆవులు, గేదెలు, ఆవు పేడపై జోకులేస్తూ విపక్ష పార్టీలు పాపం మూటగట్టుకుంటున్నాయి. వారు ఆవులపై ఎగతాళిగా మాట్లాడతారు. కానీ, మనకు గోమాత పూజనీయం’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘సమాజ్‌వాదీ పార్టీ పదకోశంలో మాఫియావాదీ, పరివార్‌వాదీ అనే పదాలుంటాయి. కానీ, మా డిక్షనరీలో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ లాంటివే ఉంటాయి. కులం, మతం, వర్గం దృక్కోణంలోనే ఆలోచిస్తారు తప్ప ఉత్తరప్రదేశ్ అభివృద్ధి వారికి పట్టదు’ అని విమర్శించారు. ‘భావితరాల పరిరక్షణకు మళ్లీ సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంభించాల్సిందే’ అని మోదీ అన్నారు. గత పది రోజుల వ్యవధిలో మోదీ తన సొంత పార్లమెంట్ స్థానం వారణాసిలో పర్యటించడం ఇది రెండోసారి. కర్ఖియాన్‌లో నిర్మించే భారీ డైరీ ప్రాజెక్టు ‘బనాస్ డైరీ శంకుల్’కు మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. రూ.475 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ఈ డైరీ ప్రాజెక్టు ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల పాల దిగుబడి సాధ్యంకానుంది. -
‘టమాటా కొనాలంటే.. పాన్ కార్డు కావాలి’
ధరల మోతతో కూరగాయాల మార్కెట్‌కు వెళ్లేందుకు సామాన్యులు జంకుతున్నారు. ముఖ్యంగా టమాటా ధర చుక్కలను తాకడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. భారీ వర్షాలతో భారీగా పెరిగిన టమాటా ధరలను దించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు టమాటా ధరల పెరుగుదలపై #tomatopricehike హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. సరదా ఫొటోలు, మీమ్స్, వీడియోలను నెటిజనులు ట్విటర్లో షేర్ చేస్తున్నారు. ‘మీరు మార్కెట్ నుంచి టమాటా కొనుగోలు చేసిన ప్రతిసారీ ప్రభుత్వం పాన్ కార్డును అడుగుతుంది. కూరగాయల వ్యాపారులు సైతం పాన్‌కార్డు జిరాక్స్ కాపీని అడుగుతున్నారు’ అంటూ ఈ నెటిజన్ సైటర్ వదిలారు. (చదవండి: హైదరాబాద్‌లో నో‘టమాటా’ రావట్లే.. అంత వద్దు ‘అర కిలో చాలు’) జనం తమను టమాటాలతో కొడతారన్న భయంతోనే పాలకులు వాటి ధరను భారీగా పెంచేశారని మరొకరు హాస్యమాడారు. ఇప్పుడు ఖరీదైన ఉంగరం ఇదే అంటూ టమాటాతో ఉన్న ఉంగరం ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు టమాటా ఇప్పుడు కొత్త మాణిక్యం (న్యూ రూబీ) అంటూ వెరైటీ నిర్వచనాలు ఇస్తున్నారు. టమాటా ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలతో పోటీ పడుతున్నాయని పేర్కొంటూ ఉసేన్ బోల్ట్ పరుగు పందెం ఫొటోను షేర్ చేశారు. ఈ నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. కాస్త కనిపెట్టండి అంటూ పాత ట్వీట్‌ను వెలికితీశారు మరో నెటిజన్. టమాటా ధరలు ఎంత పెరిగినా ఫర్వాలేదు. ఇలా చేయండి అంటూ కొత్త టెక్నిక్ కనిపెట్టారు. అదేంటో మీరూ చూడండి.. Tomato price hike ?, No problem, Here is the solution 👇🤣🤣🤣#tomatopricehike pic.twitter.com/DqsKgeDuCA — S℘ıɖɛყ🕸 (@Spidey_e) November 25, 2021 -
కరోనాపై వైరలవుతున్న జోక్స్ అండ్ మీమ్స్ ఇవే..!
పాజిటివ్.. నెగటివ్‌గా వినిపిస్తున్న వేళ ‘పాజిటివ్’ అన్నది ఇప్పుడు ఓ శాపంలా వినపడుతోంది. దీని మీద ఎన్ని హాస్యోక్తులో. ఠాగూర్ సినిమాలోని ‘తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట ‘క్షమించడం’ అనే డైలాగ్‌కు పేరడీగా ‘ఇంగ్లిష్‌లో ఇప్పుడు నాకు నచ్చని ఒకే ఒక్క మాట పాజిటివ్’ అనేది పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ నటుడు నానాపటేకార్ ఫొటోను వాడుకుంటూ ‘ఏక్ ఖూబ్సూరత్ వర్డ్ థా పాజిటివ్.. వో భీ బద్నామ్ హో గయా (‘పాజిటివ్’ అనే చక్కటి పదం కూడా ఇప్పుడు నెగటివ్ కీర్తిని మూటగట్టుకుంటోంది)’ అంటూ కరోనా మీద వచ్చిన వ్యంగ్యోక్తి నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం ఎవరినీ ‘బీ పాజిటివ్’ అని విష్ చేసే పరిస్థితి లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్.. కరోనా క్రియేటివిటీకి అర్హతపొందని సందర్భం లేదు. ఈ చిట్టాలో వర్క్‌ఫ్రమ్ హోమ్ ఫస్ట్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని జొమాటో, స్విగ్గి వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రకటనలనూ తయారు చేశాయి. మీమ్స్, జోక్స్కైతే చెప్పే పనేలేదు. వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్లు ఆన్లైన్ మీటింగ్‌లో కెమెరాలో కనిపించేంత మేరకే ఫార్మల్స్ (ఆఫీస్ వేర్)లో అప్పియర్ అవుతూండడంపై బోలెడు హాస్యోక్తులు పుట్టాయి. కింద అండర్వేర్ మీద మాత్రమే ఉండి పైన సూట్, టైతో ‘వర్క్‌ఫ్రమ్ హోమ్ ఫ్యాషన్ కలెక్షన్స్ ఫర్ మెన్’ వంటి వైరల్ పోస్ట్‌లు వాట్సప్ అకౌంట్లున్న అందరూ చూసే ఉంటారు. ఇలవేలుపు కరోనా వచ్చినప్పటి నుంచి పనిమనుషులు ఇంటి ఇలవేల్పులే అయ్యారు. ఈ సిట్యుయేషన్ మీద వచ్చిన స్పూఫ్స్కి లెక్కేలేదు. వీటికి టీవీ సీరియల్స్ ఆధారం. ఇంటి కోడలు దేవుడి గదిలో విగ్రహం ముందు నిలబడి హారతి ఇస్తూ ఉంటుంది. డోర్ బెల్ మోగుతుంది. అది గుడిగంటలా ప్రతిధ్వనిస్తుంది. ఆ చప్పుడికి ఇంట్లో వాళ్లందరి కళ్లల్లో మెరుపు.. మొహంలో సంతోషం.. ఒక్కొక్కరిగా అందరూ ‘ఆగయీ (వచ్చింది)’ అంటూంటారు. దేవుడికి హారతి ఇస్తున్న కోడలు కూడా ఒక్కసారిగా అప్రతిభురాలవుతుంది... దేవుడే ప్రత్యక్షమైనంతగా. హారతి పళ్లెం పట్టుకునే స్లో మోషన్లో ఇంటి ప్రధాన ముఖ ద్వారం వైపు వస్తూంటుంది. కొన్ని సెకన్ల ఆ స్లోమోషన్ తర్వాత తలుపు తీస్తుంది.. ఎదురుగా నిలబడ్డ పనిమనిషిని దేవతే తమ ఇంటికి దయతలిచినంత సంభ్రమాశ్చర్యాలతో లోపలికి ఆహ్వానిస్తుంది ఆ కోడలు హారతితో. ఇంకా ఇలాంటివెన్నో . ప్లవనామ సంవత్సరం సందర్భంగా పంచాంగ శ్రవణం అది.. కరోనా ఎఫెక్ట్ జాతకం అది. అవతల ఆ వైరస్ గడగడలాడిస్తుంటే దాంతో జోకులేంటి? అని ముక్కుపుటాలు అదిరిస్తున్నా మాస్క్ ఆ కోపాన్ని కప్పేస్తుంది. చలికాలంలో ఐస్‌క్రీమ్ తినడం ఎంత హీరోయిజమో..నవ్వుతో దిగులును దిగమింగడమూ అంతే సాహసోపేతం. నరనరానా కరోనా భయం నిండి ఉన్న నేపథ్యంలో మనసును కాస్త ఉల్లాస పరిచి జీవితం మీద ఆసక్తిని పెంచడానికే ఈ ప్రయత్నం. ఇప్పుడు తిట్టుకున్నా సబ్జెక్ట్ కరోనానే.. జోకులేసుకున్నా ఆబ్జెక్ట్ కరోనానే. డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ డిసీజ్ మీద వచ్చినన్ని జోక్స్, మీమ్స్ రాజకీయ వివాదాలు, ఆర్థిక కుంభకోణాలు మొదలు ప్రపంచంలోని ఇంకే పరిణామాల మీదా వచ్చి ఉండవు. కరోనా నివారణ మీద దృష్టి పెడుతూనే దాన్నల్లుకున్న హాస్యాన్నీ మనసుకు పట్టించుకోండి. -
ఏప్రిల్ ఫూలదండ.. మార్చి 32..!
‘ఏప్రిల్ ఫూల్’ ‘ఏప్రిల్ కూల్’ గా మారాలంటే ఇవ్వాళే ఒక మొక్క నాటండి. చెబ్బాష్! మీరు ఈ రోజు ‘ఫూల్’ అయ్యారా? అయితే కచ్చితంగా గర్వపడండి. ఎందుకంటే మహారచయిత షేక్స్పియర్ ఇలా అన్నారు: ‘ఫూల్ తనను తాను మేధావి అనుకుంటాడు. మేధావి తనను తాను ఫూల్ అనుకుంటాడు’ ఏప్రిల్ ‘ఫుల్లు’ డే! ఏప్రిల్ ‘ఫుల్లు డే’ అనుకొని బార్లు కిటకిటలాడుతున్నాయి. ఎవరైనా చెప్పండి... ఈరోజు ‘ఏప్రిల్ ఫూల్ డే’ అని. మీకు తెలుసా? అలనాడు దుర్యోధనుడు మయసభలో ‘ఏప్రిల్ 1’ నే ఫూల్ అయ్యాడు. దేవదాసు తెలివి ‘ఎవరో నన్ను ఫూల్ చేయడం ఏమిటి పారూ...నన్ను నేనే చేసుకుంటాను’ అని దేవదాసు ఇలా చేశాడు... ఖాళీ బాటిల్ ఎత్తి ఖాళీ గ్లాసులో పోశాడు. తాగుతున్నట్లు నటిస్తూ ‘అబ్బా! ఈరోజు ఫుల్లు అయిపోయాను’ అన్నాడు. తమిళనాడు ఎన్నికల వాక్దానం మా పార్టీని గెలిపిస్తే ‘ఏప్రిల్ ఫూల్ డే’ మాత్రమే కాదు ‘మే ఫూల్ డే’ ‘జూన్ ఫూల్ డేలు’ కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రానికి తెస్తామని హామీ ఇస్తున్నాం. ఎవరికి ‘చెప్పు’కోవాలి! ఆనంద్ ఈరోజు చెరువులో గాలం వేశాడు. కొద్దిసేపటి తరువాత చాలా బరువుగా ఏదో తాకింది. ‘పే...ద్ద చేప పడిందోచ్’ అని గాలం లాగాడు. రెండు పాత చెప్పులు వచ్చాయి. వాటి మీద ‘ఏప్రిల్ ఫూల్’ అనే స్టిక్కర్లు అంటించి ఉన్నాయి. ఈ రోజు అయితే బెస్ట్... ఎవరికైనా లవ్‌ప్రపోజ్ చేయడానికి ఈరోజు అయితే బెస్ట్. పాస్ అయితే సంతోషం. ఫెయిల్ అయితే ‘నిన్ను ఫూల్ చేయడానికి అలా అన్నానంతే. నాకు అంత సీన్ లేదని నీకు తెలి యదా!’ అని మెల్లగా జారుకోవచ్చు. ఒకరినొకరు... అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్‌ను ‘ఫూల్’ చేయాలనుకున్నాడు. కిమ్‌కు ఫోన్ చేసి ‘హాలో నేను అమెరికా నుంచి కిమ్‌ను మాట్లాడుతున్నాను. బాగున్నారా’ అన్నాడు. కిమ్ ఏమన్నా తక్కువ తిన్నాడా? ఫోన్ పెట్టేసి వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి ‘నేను కొరియా నుంచి ట్రంప్‌ను మాట్లాడుతున్నాను బాగున్నారా’ అని అడిగాడు. మార్చి 32 కరోనా కారణంగా ఈరోజు ‘ఏప్రిల్ఫుల్ డే’ను రద్దు చేయడమైనది. ఈరోజును ‘మార్చి 32’గా మాత్రమే పరిగణించాలని మనవి. -
ఎన్నెన్నో కష్టాలు.. డ్యూటీ ఎలా చేసేది
ఆగ్రా: దేశంలో మహిళా పోలీసుల బలవన్మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు మహిళా పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల స్థితిగతులపై చర్చ మొదలయ్యింది. ఇందులో భాగంగానే మహిళా పోలీసు అధికారులపై ఇండియాటుడే.కామ్ ఓ అధ్యయనం నిర్వహించింది. మహిళా పోలీసులు తమని తాము రక్షించుకునేందుకు పురుషాధిపత్యంతో ఉన్న మగ పోలీసుల నుంచి ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్టు తేటతెల్లమయ్యింది. పోలీసు దుస్తుల్లో ఉన్నా, స్త్రీలమని గుర్తుచేస్తారు ఆగ్రాలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ఇండియాటుడేతో మాట్లాడుతూ ‘‘తాను పోలీసు యూనిఫాం ధరించి ఉండవచ్చు, అయినప్పటికీ అడుగడుగునా తాను మహిళననే విషయం గుర్తుచేస్తూనే ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు. సాధారణ మహిళలకూ తమకీ ఎటువంటి తేడా ఉండదని, సాధారణ మహిళలు ఎదుర్కొంటున్నట్టే విధినిర్వహణ విషయంలో తాము కూడా అనేక ఇబ్బందులను పంటి బిగువున అదిమిపట్టాల్సి వస్తుందన్నారు. సాధారణ మహిళ లు అడుగు బయటపెట్టినప్పుడు ఎలాంటి వివక్షనీ, ఇబ్బందులనూ ఎదుర్కొంటారో అవన్నీ తమకు కూడా సహజమేనని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా పోలీసులకే అసౌకర్యం ఉన్నచోట ఇతర మహిళలకు దిక్కేదీ? పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులకు ఉద్యోగాల్లో ఉంచడం వల్ల, మహిళలంతా పోలీస్ స్టేషన్లలో ఇబ్బందిపడకుండా ఉండగలుగుతారని భావిస్తారని, అయితే ‘‘మహిళా పోలీసులే పోలీస్ స్టేషన్లలో అసౌకర్యంగా , ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటే, మిగిలిన మహిళలను వాళ్ళెలా సౌకర్యవంతంగా ఉంచగలుగుతారు’’అని ఆమె ప్రశ్నించారు. పని విషయంలో సమానత్వమే సమాన గౌరవం దక్కదు పురుష ఉద్యోగులతో సమానంగా మహిళా పోలీసులు పనిచేయాలని అధికారులు కోరుకుంటారు. అలాగూ పురుష పోలీసులతో సమానంగా పనిచేయించుకుంటారు. కానీ పురుష పోలీసులతో సమానంగా మాత్రం చూడరని, వివక్ష తమని వెన్నాడుతూనే ఉంటుందని మరో పోలీస్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. వెకిలి జోకులు.. తప్పుడు కామెంట్లు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ళు అన్న తేడా లేకుండా, మహిళా పోలీసుపై వెకిలి జోకులూ, తప్పుడు కామెంట్లతో వేధిస్తుంటారు. ఆ మాటలు వినలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప చేసేదేం ఉండదు. అంటారు మరో మహిళ పోలీసు. కొత్తగా రిక్రూట్ అయిన మహిళా పోలీసులు, అధికారుల చేతిలో మరింతగా ఇలాంటి వివక్షకూ, ఇబ్బందులకూ గురవుతారని మహిళా కానిస్టేబుల్ చెప్పారు. ఇన్‌చార్జ్‌ల వేధింపులు రాకబ్ గంజ్ వుమెన్ పోలీస్ స్టేషన్ కి రావడానికి ముందు మరో పోలీస్ స్టేషన్ పనిచేశానని, అక్కడి ఇన్‌చార్జ్‌తో వేధింపులు తాళలేకపోయానని అంటారు మరో మహిళా పోలీసుల. స్నేహంగా ఉందామని చెప్పి నా బతుకు నరకంగా మార్చేశాడంటారు ఆమె. తాను రాజీనామా చేసి వెళ్ళిపోవాలనుకున్నానని, ప్రభుత్వ ఉద్యోగం దొరకడం ఎంత కష్టమో తెలుసు కనుక తన కుటుంబ సభ్యులు వారించారనీ అంటారామె. పోలీసు ఉద్యోగంలో చేరి తప్పు చేశాను తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు తన మిత్రులు కొంత మంది తాను, ఈ ఉద్యోగంలో కన్నా టీచర్ ఉద్యోగంలో చేరి వుంటే బాగుండేదని కామెంట్ చేశారు. అయినా బలవంతంగా ఇందులో చేరాను. అప్పుడు వారికేం సమాధానం చెప్పలేకపోయినా, యిప్పుడు మాత్రం తాను పోలీసు ఉద్యోగంలో చేరాలన్న నిర్ణయం అంత మంచి విషయమేం కాదని భావిస్తున్నట్టు మరో మహిళా హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు. పోలీసు సిబ్బందిలో మహిళలకు సరైన వాతావరణం లేదు పోలీసు సిబ్బందిలో మహిళా పోలీసులు పనిచేసేందుకు సరైన వాతావరణం లేదని మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అన్నారు. కొత్తగా రిక్రూట అయినవారికి మరిని మరింత ఇబ్బంది పెడతారు. పురుష పోలీసులు వారికి పదే పదే ఫోన్లు చేయడం, ఫోన్లలో అశ్లీల ఫొటోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తారని ఆమె చెప్పారు. ఆగ్రా ఎస్ఎస్పి బబ్లు కుమార్ పురుష పోలీసులపై చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. పోలీసు డిపార్టుమెంట్ మహిళలకు సురక్షితమైన పరిస్థితులను కల్పిస్తున్నారని, ఎవరికైనా ఇబ్బందులు వస్తే, తనని నేరుగా కలవొచ్చునని వ్యాఖ్యినంచారు. -
అలా... బయటికొచ్చాడన్నమాట!
స్వామి నిత్యానంద కోసం గుజరాత్, కర్ణాటక పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ఇదే కాకుండా...ఇంటర్‌పోల్ ఆఫీసర్లు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. తాను దేశం విడిచిపోలేదని, హిమాలయా పర్వత సానువుల్లో తపస్సు చేసుకుంటున్నాని సభ్యసమాజానికి వీడియో సందేశం పంపాడు నిత్యానంద. ఇప్పుడు హిమాలయ పర్వత సానువుల్లో ఏం జరుగుతుందో చూద్దామా మరీ... స్వామి నిత్యానంద సీరియస్‌గా తపస్సు చేసుకుంటున్నాడు. అతడి ముందు ‘ప్లీజ్ డోన్ట్ డిస్టర్బ్ మీ’ అనే బోర్డ్ ఉంది. దేవుడు ప్రత్యక్షమైతే ఒక వరం కోరుకోవాలనేది ఆయన ప్లాన్. తాను అడగదలచిన వరాన్ని మనసులో పదేపదే మననం చేసుకుంటున్నాడు... ‘‘స్వామి! నాకు చిన్న వరం ఇవ్వు. కర్ణాటక రాష్ట్రంలో నాకు బిడదిలో ఆశ్రమం ఉంది. ఈ హిమాలయాల్లో కూడా అలాంటిదే ఒక ఆశ్రమాన్ని స్థాపించాలనేది నా కల. నాకు వరం త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను...’’ రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలరోజులు గడిచాయి... దేవుడు ప్రత్యక్షం కాలేదు! విసుగెత్తిన నిత్యానంద తపస్సు విరమించాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది అతని పరిస్థితి. తిరిగి వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా అని ఇక్కడ ఉండాలనిపించడంలేదు. అబ్బో ఏం చలి! ‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు, ఇంతకీ నిత్యానంద హిమాలయాల్లోనే ఉన్నాడా? బయటి ప్రపంచంలోకి వచ్చాడా? తెలిసి కూడా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావో...చైనాకు పంపిస్తా...’’ అని హెచ్చరించాడు బేతాళుడు. ‘‘నిత్యానంద పోలీసులకు దొరికిపోయాడు’’ చెప్పాడు విక్రమార్కుడు. ‘‘అదెలా?’’ ఆశ్చర్యపోయాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు: ‘‘నిత్యానంద బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న మాటేగానీ...ల్యాప్ టాపు పుణ్యమా అని సీఐఏ నుంచి చింతపండు ధరల వరకు ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఈ విషయం పోలీసులకు లేటుగా తెలిసింది. అంతే....‘హిమాలయాల్లో ప్రాణాంతకమైన హిమోనా వైరస్’ అనే ఫేక్ న్యూస్‌ను బ్లాస్ట్ చేశారు. ఈ వైరస్ తనకెక్కడ సోకిందోనని భయపడిపోయి, హిమాలయాలలో నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన ఆస్పత్రిలోకల్లా వెళ్లి ‘నాకు గాని వైరస్ సోకిందా...’ అని టెస్టులు చేయించుకుంటున్న క్రమంలో ఒక హాస్పిటల్లో పోలీసులకు దొరికిపోయాడు నిత్యానంద. ‘‘నేనే లొంగిపోదామని వస్తున్నాను. ఈలోపు మీరు వచ్చారు. నా కోసం మీరు వచ్చినా, మీ కోసం నేను వచ్చినా...మ్యాటర్ సేమ్ కదా...’’ అని పళ్లికిలించాడు నిత్యానంద! బడా బ్యాంక్ రాబరీ! ముంబైలో బ్యాంకు రాబరీ జరిగింది. ఈ రాబరీపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపడానికి యస్పీభయంకర్ అనే అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆరోజు బ్యాంకుకు వచ్చిన వారిలో మన తెలుగు పౌరుడు సుబ్బారాయుడు కూడా ఉన్నాడు. ఆయనను ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు భయంకర్. భయంకర్: మీరు ఆ దొంగల్ని చూశారా? సుబ్బా: మీ మీద ఒట్టండి... చూశానండి... ఓ ముగ్గురు కుర్రాళ్లు ముసుగులు ధరించి వచ్చారండీ...వారితో పాటు ఒక ఏనుగు కూడా వచ్చిందండి. భయంకర్: ఏనుగా????!!!!! సుబ్బా: ఏనుగేనండీ...మీ మీద ఒట్టండి! భయంకర్: అది ఆఫ్రికన్ ఏనుగా? ఇండియన్ ఏనుగా? సుబ్బా: అది మనకెలా తెలుస్తదండీ! ఏనుగూ...ఏనుగూ...నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అని అడగలేం కదండీ...హ్హీ హ్హీ....హ్హీ... భయంకర్: నవ్వింది చాలుగానీ, నేను చెప్పింది శ్రద్ధగా విను...ఆఫ్రికా ఏనుగుల చెవులు పెద్దగా ఉంటాయి...మన ఏనుగుల చెవులు వాటితో పోల్చితే చిన్నగా ఉంటాయి. ఇప్పుడు చెప్పు...అది మన ఏనుగా? ఆఫ్రికన్ ఏనుగా? సుబ్బా: ఎలా చెబుతామండీ? భయంకర్: చూశానంటున్నావు కదా... లలల: అది కూడా మాస్కు ధరించి వచ్చిందండీ... – యాకుబ్ పాషా -
జియో ఫైబర్ : జుట్టు పీక్కుంటున్న దిగ్గజాలు
సాక్షి, ముంబై: జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు మరికొద్దిసేపట్లో కమర్షియల్‌గా లాంచ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో పలు జోక్‌లు, వ్యంగ్య కామెంట్లు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా లాంచింగ్ కోసం వేచి చూస్తున్నామంటూ మరికొంతమంది ఉత్సాహంగా కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా టెలికా మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన జియో డీటీహెచ్ మార్కెట్లో కూడా పలు కీలక ప్లాన్లను తీసుకురానుందని దీంతో దిగ్గజాలకు మరోసారి భారీషాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా జియో ఫైబర్ వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్డీ టీవీ సెట్ కూడా అందిస్తామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జియో ఫైబర్ రాకతో చాలామటుకు డైరెక్ట్ టు హోమ్ సేవలందించే సంస్థల వ్యాపారాలకు గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి కూడా. జీ5, హుక్ వంటి పలు వీడియో స్ట్రీమింగ్ మొబైల్ యాప్స్ కంటెంట్ అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ. 3,999కి సెట్ టాప్ బాక్స్‌ను ఆవిష్కరించింది. తొలి ఏడాది తర్వాత రూ. 999 వార్షిక ఫీజుతో సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు. #JioFiber Other service providers waiting for launch : pic.twitter.com/V9WdML38ps — Rakshit Mahajan (@Rakshitm09) September 5, 2019 Everyone waiting for Jio Fiber plans but most importantly the catch behind the 'free tv'. #JioGigafiber pic.twitter.com/eIEYvb8uSd — SpaceMonkey (@ThisIsSherab) September 5, 2019 People waiting for #JioFiber be like pic.twitter.com/SqxmNPYM4s — 🇮🇳Just_Right🇮🇳 (@Right_of_Right) September 5, 2019 #JioFiber Everybody right now 😂😂 pic.twitter.com/z5fMHEjQ4B — Er- Ram katariya (@Ramkishorkatar2) September 5, 2019 #JioFiber Waiting for jiofiber launch. Public to Mukesh ambani pic.twitter.com/gyGXBYJ7dl — THE MUSE (@Raopnky) September 5, 2019 #JioFiber plans going to launch today. Other Broadband providers be like: pic.twitter.com/TiOAjhOLP3 — Priyesh (@Pr1yesh786) September 5, 2019 -
నవ్వుతా తీయగా పుల్లగా!
ఆనందరావుకి జోక్స్ సేకరించడం, వాటిని పదిమందికి చెప్పి నవ్వించడం అంటే భలేసరదా. ఈ సరదా అతనికి కాస్తో కూస్తో పేరు తీసుకొచ్చింది. ఎక్కడైనా ఏదైనా పోగ్రాం జరిగితే ఆనందరావుని ఆహ్వానించి ‘జోక్సాభిషేకం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించేవారు. తన శక్తిమేరకు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసేవాడు ఆనందరావు. అలాంటి ఆనందరావుకు ఒక ఉదయం పూట ఫోన్ వచ్చింది... ‘‘హలో! ఆనందరావుగారేనా?’’ ‘‘ఆ...నేనే...మీరెవరండీ?’’‘‘నా పేరు భూకంపం భూపాల్. మీ టీవి నుంచి మాట్లాడుతున్నాను...’’‘‘చెప్పండి సార్...’’‘‘మేము ‘ఖబడ్దార్... చచ్చినట్లు నవ్వాల్సిందే... నవ్వకపోయారో’ అనే కార్యక్రమం ప్లాన్ చేశాము. మీ గురించి విన్నాం. మా నవ్వుల కార్యక్రమానికి మిమ్మల్ని జడ్జీగా అనుకుంటున్నాం...’’‘‘అయ్యో! అంతకంటే భాగ్యం ఏముందండీ.... తప్పకుండా...’’ ‘ఖబడ్డార్... చచ్చినట్లు నవ్వాల్సిందే... నవ్వకపోయారో’ మొదటి రెండు ఎపిసోడ్ల తరువాత ప్రోగ్రాం హెడ్ భూకంపం భూపాల్ ఆనందరావు దగ్గరకు వచ్చి...‘‘అయ్యా! మీరు ప్రోగ్రాంలో ముఖం సీరియస్‌గా పెట్టి అదోలా కూర్చుంటున్నారు.... కాస్త నవ్వాలి’’ అన్నాడు సుతిమెత్తగా.‘‘ఏం నవ్వుతామండీ బాబూ... ఒక్క జోక్కైనా నవ్వొచ్చి ఛస్తేకదా’’ నిట్టూర్చి నిజం చెప్పాడు ఆనందరావు.‘‘అది వేరే విషయం... మనమే నవ్వకపోతే ప్రేక్షకులు ఎలా నవ్వుతారండీ. కాబట్టి నవ్వాలి. నవ్వు రాకపోయినా బలవంతంగా నవ్వాలి. అప్పుడప్పుడు కాస్త గట్టిగా నవ్వాలి. ఫ్లోర్ అదిరిపోయేలా నవ్వాలి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలి. పొట్టపట్టుకొని నవ్వాలి...’’ ఇలా కొన్ని సలహాలు చెప్పాడు భూకంపం.‘‘రాక రాక వచ్చిన ఛాన్సు... నేను కాదు, కూడదు అంటే ఇంకెవరినైనా పెట్టుకుంటారు. ఎందుకొచ్చింది... నవ్వు రాకపోయినా నవ్వితే పోలా...’’ అనుకున్నాడు ఆనందరావు. పది ఎపిసోడ్ల తరువాత.... ‘‘హలో ఆనందు...’’‘‘హాహాహా.... ఏరా సుబ్బరాజు.... ఎలా ఉన్నావు... హాహాహా...’’‘‘ఒక బ్యాడ్‌న్యూస్.... మా తాతయ్య చనిపోయాడు’’‘‘హాహాహా.... తాతయ్య చనిపోయాడా.... ఎంత మంచివాడు.... హాహాహా..... దుక్కలా ఉండేవాడు కదరా.... హాహాహా..... ఇంకో అయిదు సంవత్సరాలైనా లాగించేస్తాడనుకున్నాను.... హాహాహా...’’‘‘తాతయ్య చనిపోయాడని చెబితే నవ్వుతావేమిటిరా ఫూల్.... తమాషాగా ఉందా?’’‘‘సారీ... హాహాహా.... ఈ పాడు నవ్వొకటి ఈమధ్య అలవాటైంది. నా ప్రమేయం లేకుండానే నవ్వేస్తున్నాను.... హాహాహా...’’హాస్పిటల్లో ఒకరోజు...డాక్టర్: చెప్పండి ఆనందరావుగారు ఏమిటి ప్రాబ్లమ్...ఆనందరావు: హాహాహా....ఒక్కటా రెండా..... హాహాహా...డాక్టర్: తర్వాత నవ్వుదురుగానీ ముందు సమస్యలు ఏమిటో చెప్పండి?ఆనందరావు: ఈ కీళ్లున్నాయి చూశారు... ఒకటే నొప్పులు.... హాహాహా.... ఈ నడుం ఉంది చూశారు... కొద్దిగా వంగితే చాలు.... ఒకటే నొప్పి... హాహాహా... ఈ కండ్లున్నయి చూశారు... సరిగ్గా కనబడి చావడం లేదు... హాహాహా....డాక్టర్: వాటన్నిటి కంటే పెద్ద సమస్య మీలో ఉంది...ఆనందరావు: ఏమిటది?డాక్టర్: నవ్వడం, అకారణంగా నవ్వడం, రంపపుకోతలా నవ్వడం, ఆగుతున్న గూడ్సుబండి చప్పుడులా నవ్వడం... అరటిపండు తొక్క మీద కాలువేసి పడినప్పుడు వినిపించే సౌండ్‌లా నవ్వడం, తుపానులో విరిగిపడుతున్న చెట్టు సౌండ్‌లా నవ్వడం... ఆపండి మహాప్రభో ఆపండీ....ఆనందరావు: దాన్దేముందండీ ఆపేస్తాను. హ్హాహ్హాహ్హా... నగరంలో పేరు మోసిన రాజకీయ నాయకుడు ఆయన. పేరు దున్న అప్పన్న.ఈ అప్పన్న ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోయాడు. ఆయన చావు ఊరేగింపు పెళ్లిలా ఘనంగా జరిగింది.దున్న అప్పన్న కుమారుడు దున్న గట్టన్న దగ్గరకు ఒక కార్యకర్త వచ్చి....‘‘నాయిన కోసం సంతాపసభ ఏర్పాటు చేసినమన్నా.... హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి పెద్దోళ్లను పిలుస్తున్నాం. వాళ్లు నాయిన గురించిమాట్లాడుతారు... అదిరిపోవాలి... వీరితో పాటు కామెడీకింగ్ ఆనందరావుని కూడా పిలుస్తున్నాము...’’ ఉత్సాహంగా చెప్పాడు ఒక కార్యకర్త.సరే అన్నాడు సంతోషంగా దున్న గట్టన్న.ఆరోజు...దున్నపోతుల్లాంటి రౌడీలు ఇద్దరు ఆనందరావు ఇంటికి వచ్చారు.‘‘ఆనందరావు.... ఓ ఆనందరావు...’’‘‘ఏమిటయ్య.... అలా అరుస్తున్నారు.... ఏమిటి?’’‘‘నీతో అర్జెంటుగా పనుందయ్యా...’’ ‘‘నాతో మీకేం పనయ్యా!’’‘‘ఏంలేదు... కొద్దిసేపు మాట్లాడి పోవాలి... అన్న దున్నగారి సంతాపసభ జరుగుతుంది. మీరు వచ్చి మాట్లాడాలి’’‘‘ఎప్పుడు?’’‘‘ఇప్పుడే’’‘‘కనీసం రెండురోజుల ముందు చెప్పొచ్చుగదయ్యా....’’‘‘మీకు మాట్లాడం పెద్ద విషయమా? మీ టాలెంట్ గురించి మాకు తెలియదనుకుంటున్నారా! పదండి... బండి ఎక్కండి’’ అంటూ ఆనందరావుని టాటాసుమో ఎక్కించారు తెల్లలుంగీరౌడీలు. నిజానికి దున్న అప్పన్న రౌడీయిజం గురించి తప్ప అతని పుట్టుపూర్వోత్తరాలు ఆనందరావుకి బొత్తిగా తెలియవు. ‘‘ఆయన గురించి నాకేమీ తెలియుదు. నేను రాలేను.మాట్లాడలేను’’అంటే ఎక్కడ పొట్టలో పొడుస్తారోనని భయంభయంగా బండి ఎక్కాడు ఆనందరావు. ఎక్కాడు సరే... సంతాపసభలో ఏంమాట్లాడాడు? వినండి...‘‘అన్న దున్న అప్పన్న చనిపోయాడు... హాహాహా...ఎప్పుడు చనిపోయాడు?ఎందుకు చనిపోయాడు?ఎలా చనిపోయాడు?... ఇవి కాదు మనకు కావాల్సింది... హాహాహా....మరి మనకు కావల్సింది ఏమిటి?ఆయన చనిపోవడమా... హాహాహా... కాదు.మళ్లీ బతకడమా... హాహాహా... కానే కాదు...లేక మనం చావడమా... హాహాహా... హ్హోహ్హోహ్హో....’’మామూలుగానైతే ఉపన్యాలసాలకు చప్పట్లు పడతాయి... మన ఆనందరావు ఉపన్యాసానికి మాత్రం నాన్‌స్టాప్‌గా చెప్పులు పడ్డాయి... తన బాధ ఎవరికి ‘చెప్పు’కోగలడు? మీరైనా ‘చెప్పండి’. – యాకుబ్ పాషా -
ట్వీటే చేటాయెనె?
ట్వీటర్‌ని మన అభిప్రాయాలను పంచుకోవడానికి ఉపయోగిస్తుంటాం. అలా అభిప్రాయాలు పంచుకోవడమే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కొంప ముంచింది. ఎప్పుడో పదేళ్ల క్రితం ఆయన వేసిన కొన్ని జోక్స్ వల్ల హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ ‘గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ’ సినిమాకి డైరెక్టర్‌గా ఆయన సీట్‌కే ఎసరొచ్చింది. విషయంలోకి వెళ్తే.. దాదాపు పదేళ్ల క్రితం ‘రేప్, చైల్డ్ అబ్యూస్ (చిన్నపిల్లలపై లెంగిక వేధింపులు) వంటి అంశాల గురించి కొన్ని ట్వీట్స్ పోస్ట్ చేశారు దర్శకుడు జేమ్స్ గన్. ఆయన ట్వీట్లు పలువురి మనోభావాలను దెబ్బతీసేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ జేమ్స్ గన్ను దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాల్ట్ డిస్నీ చైర్మన్ అలన్ హార్న్ పేర్కొన్నారు. ఆయన చేసిన పాత ట్వీట్స్ గురించి జేమ్స్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన ట్వీట్లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దానికి క్షమాపణలు కోరుతున్నాను. అప్పటికీ ఇప్పటికీ కంప్లీట్‌గా డిఫరెంట్ పర్శన్‌ని అయ్యాను’’ అన్నారు. మరి.. జేమ్స్ ఇచ్చిన ఈ వివరణకు అలన్ హార్న్ కూల్ అవుతారా? ‘గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ 3’ బాధ్యతలను తిరిగి ఇచ్చేస్తారా? ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటారా? కాలమే చెప్పాలి. -
జస్టిస్ సిక్రీ జోక్‌తో కోర్టులో నవ్వులు
న్యూఢిల్లీ: కర్ణాటక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సిక్రీ జోకుతో సుప్రీంలో నవ్వులు విరిశాయి. శుక్రవారం సుప్రీంకోర్టులో ఒకవైపు వాడీవేడిగా వాదనలు సాగుతుండగా.. జస్టిస్ సిక్రీ మధ్యలో జోక్యం చేసుకుంటూ ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక జోకు గురించి మీకు చెప్పాలి. తనకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రిసార్టు యజమాని గవర్నర్‌కు లేఖ రాశాడట’ అని ఆయన చెప్పగానే కోర్టులోని వారంతా పగలబడి నవ్వారు. బెంగళూరులోని ఈగల్టన్ రిసార్టులో కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేల్ని ఉంచిన అంశాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ సిక్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
సోషల్ మీడియాలో రోహిత్‌పై పేలిన జోక్స్
సాక్షి, హైదరాబాద్ : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కోహ్లిపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసిన నెటిజన్లు తాజాగా రోహిత్‌ను రోస్ట్ చేశారు. కుళ్లు జోకులతో, ఫొటో, వీడియో మార్ఫింగ్‌లతో హిట్ మాన్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ఇక రోహిత్ 59 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేయడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. హిట్ మాన్‌గా ముద్ర వేసుకున్న రోహిత్ తన శైలికి భిన్నంగా బంతిని బ్యాట్‌కు తగిలించడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. స్టెయిన్, రబడా, మోర్కెల్ బౌలింగ్‌ను ఎదుర్కొనలేక చేతులేత్తేశాడు. రబడా బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. శ్రీలంక సిరీస్‌లో సూపర్ ఫామ్ కనబర్చడంతో కెప్టెన్ కోహ్లి వైస్ కెప్టెన్ రహానేను కాదని తుది జట్టులోకి తీసుకున్నాడు. కానీ హిట్ మ్యాన్ కోహ్లి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేశాడు. ఇప్పటికే రహానేను ఎందుకు తీసుకోలేదని అభిమానులు, మాజీ క్రికెటర్లు కోహ్లిని ఎత్తిపొడుస్తుండగా.. రోహిత్ వైఫల్యం కోహ్లికి మరిన్ని చికాకులు తెప్పించనుంది. రోహిత్‌పై పేలిన జోకులు.. ‘డేల్ స్టెయిన్ బౌలింగ్ ఎదుర్కుంటే రోహిత్ డబుల్ సెంచరీ చేసినట్టే’ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో గంటసేపు తడబడ్డ రోహిత్ నాకు తెలిసి గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ వాచ్‌మన్. భారత్‌లోనే రోహిత్ వంద, రెండొందలు బాదగలడు..కానీ విదేశాల్లో రాణించలేడు. సీమర్స్ను ఎదుర్కోవాలంటే రోహిత్ ఒళ్లంతా ప్యాడ్స్ పెట్టుకోవాలి Exclusive pic of Rohit Sharma offering pads against express fast bowlers 😂😂 #SAvIND #INDvSA #FreedomSeries pic.twitter.com/9qkcJPg912 — Rahul (@clickator7) 6 January 2018 తొలి ఇన్నింగ్స్‌లో 92 కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అపద్భాందవుడిలా ఆదుకున్నాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న పాండ్యా(93) భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ 209 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లు సైతం పాండ్యా తీయడం విశేషం. ఇక భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ రాణించకపోతే రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కడం కష్టమవుతోంది. -
విరాట్-అనుష్క పెళ్లిపై జోకులే జోకులు!
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ పెళ్లి.. ఇప్పుడిదే ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్.. నెటిజన్లు ఇప్పుడు వీరి పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. అభినందనలతో వీరిని ముంచెత్తుతున్నారు. అనుష్కతో తన పెళ్లి గురించి ప్రకటిస్తూ కోహ్లి చేసిన ట్వీట్..అతి తక్కువ సమయంలో అత్యధిక మంది రీట్వీట్ చేశారు. దీంతో 2017లో అత్యధికమంది రీట్వీట్ చేసి.. ‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2017’ ఘనతను ఇది సొంతం చేసుకుంది. అభినందనలే కాదు వీరి పెళ్లిపై జోకులు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి గురించి వెల్లడిస్తూ అనుష్క, విరాట్ ఒకేరకమైన మెసేజ్‌ను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘నీ మెసెజ్ మస్తుంది. కాపీ చేసుకోవాలా?’ అని కోహ్లి అడిగితే.. ‘హా కాపీ చేసుకో.. కానీ ఫొటో మాత్రం మార్చు’ అని అనుష్క చెప్పినట్టు ఓ నెటిజన్ చమత్కరించాడు. Just BFF things. #VirushkaWEDDING pic.twitter.com/c9dMKbPa9R — East India Comedy (@EastIndiaComedy) 11 December 2017 ప్రధాని మోదీ ట్విట్టర్లో విరుష్క జంటకు ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ అభినందనలు తెలిపాడు. దీనికి కోహ్లి కృతజ్ఞతలు తెలుపగా.. ‘ఇంకో మాట.. నీ పెళ్లి సర్టిఫికెట్‌ను ఆధార్‌తో డిసెంబర్ 31లోపు తప్పకుండా లింక్చేయి’ అని ప్రధాని మోదీ సూచించాడు. ఇది నిజం కాదు.. ఫొటోషాప్ చేసి ఫన్నీగా ఓ నెటిజన్ పెట్టిన వ్యంగ్యాస్త్రం. ,😂😂😂😁😀😎#VirushkaWEDDING pic.twitter.com/JfxtAValZa — Makarand Shendkar (@makarand1995) 12 December 2017 మొదటిరాత్రి విరాట్ ఒత్తిడిలో ఉండి ఉంటాడు. ఎందుకంటే యూరప్‌లోని అతనికి పెద్దగా రికార్డు లేదు అంటూ ఓ నెటిజన్ చమత్కరించారు. భాయ్ నెక్ట్స్ మ్యాచ్ ఆడుతావా? అని రోహిత్ అడిగితే.. నేను హనీమూన్‌లో ఉన్న దుకాన్ బంద్ అంటూ ఓ నెటిజన్ జోకును పేల్చాడు. డ్యాండ్రఫ్ బనాదీ జోడీ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇలా పెద్దసంఖ్యలో జోకులు వెల్లువెత్తుతున్నాయి. Virat must be under pressure at his first night His record in Europe is not very good 😬😷🤑#VirushkaWEDDING — simran kaur (@simran_Gulabo) 11 December 2017 -
అందమైన మహిళలను రేప్ చేయాలనే.. : నటుడు
హాలీవుడ్లో లైంగిక వేధింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నటుడు బెన్ అఫ్లెక్.. ఓ మహిళా యాంకర్‌తో గతంలో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఆ యాంకర్‌తో అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించినందుకు అఫ్లెక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. తాజాగా అతని సహా నటుడు జాసన్ మొమోవా రేప్ గురించి భయంకరమైన జోకులు వేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. అఫ్లెక్, మొమోవా 'జస్టిస్ లీగ్' సినిమాలో కలిసి నటించారు. 2011లో 'గేమ్స్ ఆఫ్ థ్రోన్స్' యూనిట్ ఓ కామెడీ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు యూనిట్ సమాధానం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందిన ఈ సిరీస్‌లో నటించడం ఎందుకు ఇష్టమని ఓ ప్రేక్షకుడు ప్రశ్నించగా.. మొమోవా దారుణమైన జోక్ వేశాడు. 'అందమైన మహిళలను రేప్ చేసేందుకే..' అంటూ ఎమిలీయా క్లార్క్ వైపు చూస్తూ వెకిలిగా చెప్పాడు. ఈ జోక్‌కు మిగతా వారు నవ్వినా.. యూనిట్లో భాగంగా ఉన్న నటీమణులు క్లార్క్, డీబీ వీసీ తదితరులు సిగ్గుతో ముఖం దాచుకున్నారు. 'గేమ్స్ ఆఫ్ థ్రోన్స్'లో గిరిజన తెగ నాయకుడిగా నటించిన మొమోవా.. యువ వధువు (క్లార్క్)ను బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. ఆమెపై మొదట బలత్కారం జరిపినా.. తర్వాత వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. తాజాగా 'రేప్ జోక్' వీడియో వెలుగులోకి రావడంతో మొమోవాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్పందించిన మొమోవా క్షమాపణలు చెప్పారు. అత్యంత మొరటుగా తాను ఆ జోక్ వేశానంటూ సారీ చెప్పారు. -
'మళ్లీ అంటే నా భార్య విడాకులిస్తుంది'
లాస్ ఎంజెల్స్: తన భార్య మిషెల్లీ ఒబామాకు అసలు రాజకీయాలంటేనే ఇష్టం ఉండదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఒక వేళ తనకు మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంటే మిషెల్లీ ఏకంగా విడాకులు ఇస్తుందని చమత్కరించారు. ఓ లైవ్ షోలో పాల్గొన్న ఒబామా ప్రస్తుతం అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ల తరుపున బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ప్రతిసారి తనను ట్వీట్ ద్వారా విమర్షించడంపై కాస్త భిన్నంగా స్పందించారు. ఒబామా త్వరలోనే దిగిపోతున్నారు.. అయితే, ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఇప్పటి వరకు ఎన్నికైన అధ్యక్షుల్లోనే చెత్త అధ్యక్షుడు అని ట్రంప్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఒబామా కనీసం తాను అధ్యక్షుడిగానైనా దిగిపోతున్నానని చెప్పారు. ట్రంప్‌ను టీవీలో చూస్తున్నప్పుడు మీరెప్పుడైనా నవ్వారా అని ప్రశ్నించగా చాలాసార్లు నవ్వానని అన్నారు. 2011లో సునామీ జపాన్ను చుట్టుముట్టినప్పుడు తాను నిద్రలో నుంచి మేల్కోని అర్థరాత్రి మూడు నాలుగుసార్లు బెడ్‌పై ఉండే ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అయితే, తాను ఎప్పుడూ కూడా తెల్లవారు జామున తన స్మార్ట్ ఫోన్ వద్దకు వెళ్లేవాడిని కాదని, తనను విమర్శించేవారిపై ఉదయం మూడు గంటలకే ట్వీట్ ల ద్వారా ఆరోపించే అలవాటు తనకు లేదంటూ ట్రంప్ ను విమర్శించారు. వాస్తవానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం ఓ వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉంది. -
'పీడికా'తో ప్రముఖ మ్యాగజీన్‌కు తిప్పలు
డిజిటల్ ప్లాట్ఫామ్లో వార్తను క్షణాల్లో ప్రజల ముందుంచడానికి వెబ్ జర్నలిజం తెగ పోటీపడుతోంది. ఈ తొందరపాటులో చిన్నచిన్న తప్పులు దొర్లడం సర్వసాధారణం అయిపోయింది. వ్యాకరణ దోషాలు, తప్పుగా చిత్రాలు పోస్టు చేయడం వంటివి సెకన్లలో జరిగిపోతూ ఉంటాయి. కానీ ఓ పాపులర్ ఫ్యాషన్ మ్యాగజీన్ ఏకంగా బాలీవుడ్ అందాల నటి పేరునే మార్చేసింది. అలా పేరు మార్చేసిన మ్యాగజీన్ ట్విట్టర్ నెటిజన్ల ముందు తెగ నవ్వుల పాలైందట. ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించిన 2016 అత్యధిక నటీమణలు జాబితాలో మొదటిసారి దీపికా పదుకొనే 10 మిలియన్ డాలర్లతో టాప్-10లో నిలవడంతో హార్పర్స్ బజార్ ఫ్యాషన్ మ్యాగజీన్ తామే ముందుగా వార్తను అందించాలనే తొందరపాటులో తప్పులో కాలేసింది. దీపికా పదుకొనే పేరును పీడికా పదుకొనేగా ప్రచురించింది. ఈ అక్షర దోషాన్ని వెంటనే గుర్తించిన ట్విట్టర్ నెటిజన్లు వెంటనే జోక్స్ పేల్చడం ప్రారంభించారు. ఈ మ్యాగజీన్ చేసిన చిన్న పొరపాటుకు కావాల్సినన్నీ కామెంట్లు, గిప్ట్‌లు ట్విట్టర్లోనే అందించారు. @iSRKATholic kaal hass hass ke bura haal ho gaya jab yeh dekha Peedika padukone 😂😂😂😂😂😂 — Baar Baar Dekho (@ayesha16Shahzy) August 24, 2016 -
వారిపై జోకులను బ్యాన్ చేయండి..!
నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం.. నవ్వలేక పోవడం ఒక రోగం అన్నారు. అయితే ఆ నవ్వుల పువ్వులు విరిసేందుకు హాస్యాన్ని పండించేవారూ, ఆస్వాదించేవారూ కూడ అవసరమే. స్పాంటేనియస్ గా పుట్టే హాస్యం... ఆరోగ్యంగా హాయిగా ఉంటుంది. కానీ హాస్యానికి వస్తువు ఏమిటి అనేది ఎంచుకోవడం మాత్రం ఒక్కోసారి కష్టంగానే మారుతుంది. ముఖ్యంగా నలుగురు కలిసినప్పుడు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడంలో భాగంగా ఏదో ఒక జోక్ చెప్పుకుని నవ్వుకుంటుంటారు. అందులో ఒక్కటైనా సర్దార్జీలపై ఉంటుండటం షరా మామూలుగా కనిపిస్తుంది. అయితే ఆ సర్దార్జీ జోక్ ల వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. జోక్ లపై అభ్యంతరాలతో ఓ లాయర్ ఉన్నత న్యాయస్థానంలో పిల్ వేయడంతో కేసు విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఒకప్పుడు హాస్యాన్నిపండించేందుకు సినిమా యాక్టర్లనో, రాజకీయ నాయకులనో, భాషనో, యాసనో వస్తువుగా మలచుకునేవారు. కానీ రాను రాను అది తీవ్ర రూపం దాల్చడంతో ఆయా సంబంధింత వర్గాలు అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో హాస్యాన్ని పండించడం ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కష్టంగానే మారింది. అయితే ఇప్పుడు సర్దార్జీ జోక్స్ పై సుప్రీంకు చేరిన పిల్ ను కోర్టు పరిశీలించేందుకు అంగీకరించింది. మొత్తం సిక్కు సమాజంపై నిర్లక్ష్యం, తొందరపాటుతనం తో వేసే జోక్స్... మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందంటూ సర్దార్జీలపై వెబ్ సైట్లలో జోక్ లను తొలగించాలన్న డిమాండ్ కోర్టు పరిశీలిస్తోంది. బుద్ధి తక్కువ వ్యక్తులుగానూ, అవివేకులుగానూ సిక్కులను చిత్రీకరిస్తుండటం బాధిస్తోందని సిక్కు న్యాయవాది హర్విందర్ చౌదరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేరస్తులకు పెనాల్టీ విధించే దిశగా అధికారులకు ఆదేశాలివ్వాలని ఆమె కోరారు. సర్దార్జీ జోక్స్ ఉన్న సుమారు ఐదు వేల వెబ్ సైట్లను నిషేధించాలని, లేదా వాటినుంచీ సిక్కు సమాజాన్ని కించపరిచే జోక్స్ ను పూర్తిగా తొలగించేందుకు టెలికాం, ఇన్ఫర్ మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రులకు ఆదేశాలివ్వాలని ఆమె అభ్యర్థించారు. కోర్టులు... విదేశాలతో సహా అన్ని ప్రాంతాల్లో తాము అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ వాతావరణంలో తమ పిల్లలు సైతం ఇంటిపేరైన కౌర్, సింగ్ లను పెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. న్యాయమూర్తులు టి.ఎస్. థాకూర్, గోపాల్ గౌడ లతో కూడిన ధర్మాసనం... ఈ జోక్స్ ను పలువురు సిక్కులు పెద్దగా పట్టించుకోవడం లేదని, వారిపై వారే జోక్స్ వేసుకుని హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారని అన్నారు. అంతేకాక హాస్యోక్తులు రాసిన కుష్వంత్ సింగ్ కూడ సిక్కేనని ఎత్తి చూపారు. పైగా ఎంతోమంది జోక్స్ ను స్పోర్టివ్ గా తీసుకుంటారని, అవమానంగా భావించడం లేదని అన్నారు. కేవలం వినోదం కోసం పండించే హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారన్నారు. అటువంటి జోక్స్ ను పూర్తిగా నిలిపివేయాలని మీరు కోరితే... ఏకంగా సిక్కులే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండొచ్చని బెంచ్ అభిప్రాయ పడింది. అయితే ఇటీవల బీహార్ లో ప్రధాని మోడీ పర్యటనను న్యాయవాది చౌదరి బెంచ్ కు ఉదహరించారు. అక్కడ జరిగిన ర్యాలీలో ప్రధాని బీహారీలు తెలివైన వారు అన్నారని, అదే మా విషయానికి వస్తే... ప్రతివారూ జోక్స్ వేసేందుకే ప్రయత్నిస్తారని చెప్పారు. దానికి బెంచ్ స్పందిస్తూ.. ఒకవేళ మోడీ పంజాబ్ వెడితే సిక్కులు కూడ తెలివైనవారని ప్రశంసిస్తారని మీరు చింతించాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా చౌదరి పిటిషన్.. ఓ నిర్దిష్ట కమ్యూనిటీకి సంబంధించిన సున్నిత విషయమని, అందుకే ఆమె పిటిషన్ ను సుప్రీం కోర్ట్ సిక్కు న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్. కెహర్ ముందు ఉంచుతామని చెప్పారు. మీ కమ్యూనిటీ నుంచీ సుప్రీంకోర్టు ఓ న్యాయమూర్తిని కలిగి ఉండటం అదృష్టమని, అదే సమాజానికి చెందిన వ్యక్తి సమస్యను మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని, కేసును ఆయన బెంచ్ కు తరలిస్తామని ఆమెను కోరారు. కాగా పిటిషనర్.. అందుకు అంగీకరిస్తూ... తిరిగి తన వాదనను కొనసాగించేందుకు ఒక నెల గడువును అడిగారు. -
దేవుడు కరెంటు బిల్లు కడతాడా?
నవ్వింత మా బుజ్జిగాడి ఇంటెలిజెన్స్ కాస్త తగ్గితే బాగుండని అనిపిస్తోంది నాకు. వాడి తెలివితేటలు కాస్తా అతి తెలివిలోకి దిగకుండా చూడమంటూ ఆ యొక్క భగవంతుడికి స్పెషల్ ప్రార్థన చేసుకోవాల్సిన అగత్యం దాపురించింది. ఇలా ఎవడైనా అనుకుంటాడా అని మీరు హాస్యర్యపోతున్నారా? మీరు నిలకడగా నా దైన్యవాదాలు వింటే మీకు ధన్యవాదాలు చెప్పుకుందామని ఉంది. మా ఇంటికి ఓ వసతి ఉంది. కరెంట్ లేనప్పుడు కాసేపు ఆరుబయట ఆకాశంలో చుక్కలు చూస్తూ పడుకోవచ్చు. అలాంటి ఒక రోజున మా బుజ్జిగాడూ నేనూ మంచంపై పడుకుని ఉండగా వాడు ఆకాశంలోని నక్షత్రాలను చూశాడు. ‘‘మొన్న దేవుడెక్కడుంటాడు అని అడిగితే ఆకాశంలో అంటూ పైకి చూపించావు కదా నాన్నా. ఇప్పుడు రాత్రి అయ్యింది కాబట్టి దేవుడు తన ఇంట్లో లైట్లు వేసుకున్నాడు కదా’’ అన్నాడు వాడు నింగిలో మెరుస్తున్న నక్షత్రాలను చూపుతూ. వెంటనే నక్షత్రాలూ, పాలపుంతలూ, విశ్వనిర్మాణం... వీటన్నింటి గురించీ చెబితే వాడికేం అర్థమవుతుందనే ఉద్దేశంతో ‘‘అవున్నాన్నా’’ అన్నాన్నేను. అంతే... అదే నా పాలిట శాపం అవుతుందని ఆ క్షణంలో అనుకోలేదు. వెంటనే అనుబంధ ప్రశ్నల వెల్లువ మొదలైంది. ‘‘అన్నట్టు నాన్నా... వాళ్లింట్లో కూడా అప్పుడప్పుడూ కరెంట్ పోతే చీకట్లో దేవుడికి చాలా ఇబ్బంది కదా నాన్నా. దేవుడు అప్పుడేం చేస్తాడో?’’ అన్నాడు వాడు. అయితే మావాడి దగ్గర ఉన్న సుగుణం ఏమిటంటే... నేనేం జవాబు చెప్పాలో అని సతమతమయ్యే సమయంలో చాలాసార్లు వాడే సమాధానం కూడా వెతుక్కుంటూ ఉంటాడు. ‘‘ఇప్పుడూ... కొన్ని చుక్కలు బ్రైట్‌గా ఉన్నాయి. అవన్నీ కరెంట్ మీద నడిచే బల్బులు కావచ్చు. మిగతావి డల్‌గా మిణుకు మిణుకుమంటున్నాయి చూడూ... అవి దేవుడి ఇంట్లో ఎమర్జెన్సీ లైట్లు కావచ్చు నాన్నా. దేవుడి ఇంట్లో నిత్యకళ్యాణం పచ్చతోరణం అంటూ మొన్న ఒకసారి అన్నావు కదా. అందుకే దేవుడు ఆకాశం నిండా రోజూ మిర్చిబల్బులూ అలంకరించుకుంటాడనుకుంటా. అక్కడ చూడు కొద్దిగా లైటు కాస్త సాగినట్లుగా ఒక గీతలాగా కనపడుతోంది. అంటే అది దేవుడు వేసిన టార్చిలైటంటావా?’’ అంటూ మళ్లీ అడిగాడు. ‘‘దేవుడికి టార్చిలైట్లూ... సెర్చిలైట్లూ అక్కర్లేదురా. అన్ని లైట్ల వెలుగుకూ ఆయనే మూలం. అన్నింటినీ ఆయనే సృష్టించగలడు’’ అన్నాన్నేను. ‘‘మరి అలాంటప్పుడు దేవుడి ఇంట్లో పవర్‌కట్ ఉండదన్నమాట. అయితే ఇందాక కాసేపు ఆకాశంలో లైట్లన్నీ కనపడకుండా పోయాయి కదా. అంటే అప్పుడు దేవుడి ఇంట్లో కరెంట్ పోయి ఉంటుందంటావా?’’ అని అడిగాడు వాడు. ‘‘అప్పుడూ... దేవుడింట్లో కరెంట్ పోలేదు నాన్నా. మనకు డేై టెమ్లో మబ్బులు కనిపిస్తుంటాయే... అవి రాత్రి కూడా ఉంటాయన్నమాట. అవి అడ్డం రావడం వల్ల ఆ టైమ్‌లో అవి మనకు కనిపించలేదంతే’’ అని జవాబిచ్చాన్నేను. ‘‘అలాగైతే నాన్నా... దేవుడికి కరెంట్ బిల్లు చాలా ఎక్కువే వస్తుంది కదా. ఆ కరెంటు బిల్లు ఏ అడ్రస్‌కు వెళుతుందో? మరి దేవుడింటికి వచ్చే కరెంటు బిల్లు ఎవరికి కడతాడు?’’ అడిగాడు. వాడి ప్రశ్నలకు జవాబిచ్చే ఓపిక లేక.. ‘‘ఒరే దేవుడికి కరెంటు బిల్లేమిట్రా? సకల ప్రపంచానికీ ఆయనే బాస్. ఆయన సర్యాంతర్యామి. అంటే అంతటా వ్యాపించి ఉంటాడన్నమాట. కాబట్టి అన్నిచోట్లా ఉండే ఆయన... ఎవరికీ ఏమీ జవాబుదారీ కాదు. ఎవరికీ పైసా ఇవ్వక్కర్లేదు’’ విసిగిపోయి కాస్త గసిరినట్లుగా అన్నా. అంతే... మళ్లీ ప్రశ్న మొదలు. ‘‘ఇవ్వాళ్లేమో సర్వాంతర్యామి, అన్ని చోట్లా ఉంటాడంటున్నావ్. రోజూ ఒక మంచి పద్యం చదవమని ఏదో ఒకటి చెబుతుంటావ్. అలా మొన్న పోతనగారి పోయమ్ చదివించావ్ కదా. ఆ పద్యంలో ‘అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం టవర్స్ దాపల, నియర్ మందారాగార్డెన్స్...’ అంటూ పోతన గారు దేవుడి పోస్టల్ అడ్రస్ ఓ క్రమపద్ధతిలో సిస్టమ్యాటిగ్గా రాయలా? అందులో పిన్‌కోడు మాత్రం ఇవ్వలేదంతే. నువ్వే మొన్న చెప్పావ్ కదా... సీఎమ్, పీఎమ్ రాష్ట్రమంతటికీ, దేశమంతటికీ నాయకులైనా ఏదో ఒక చోట వాళ్ల క్యాంపాఫీసు ఉంటుందని. క్యాంపాఫీసుకు కరెంటు బిల్లులు వాళ్లు కడతారా లేదా? అలాగే దేవుడూ కట్టాలా వద్దా?’’ అంటూ నన్ను నిలదీశాడు వాడు. పుట్టుకతోనే ఈ లోకంలోని సమస్తమైన పిల్లలందరూ అమితమైన తెలివితేటలతో పుడతారు. మనమే క్రమక్రమంగా లౌక్యం నేర్పుతూ వాళ్ల ఇంటెలిజెన్స్‌ను ఇంకిపోయేలా చేస్తూ ఉంటాం. మా బుజ్జిగాడెప్పుడు లౌక్యం కాస్త నేర్చుకుని, వాడి అతి తెలివితేటల్ని కుదించుకుంటాడో అనుకుంటూ దిగులుపడుతూ ఉన్నా. మీరైనా నాలుక్కూకలేసి వాడిక్కాస్త బుద్ధి చెప్పండి. - యాసీన్ కవ్వింత ఆ మాత్రం తెలుసు కస్టమర్: ఏమండీ, ఒక కిలో బంగారం ఇవ్వండి. సేటు: బాబూ కిలో బంగారం ఎంతో తెలుసా? కస్టమర్: ఆ మాత్రం తెలియదేంటీ, వెయ్యి గ్రాములు. నేను చేసేదదే ఇల్లాలు: ఏమేవ్, పోయేటప్పుడు ఇల్లూడ్చి పోవే అని ఎన్ని సార్లు చెప్పినా వినవే! పని మనిషి (మనసులో): నేను చాలాసార్లు ఊడ్చుకెళ్లా మీకు తెలియలేదు గానీ. ఆ పని చెయ్యి రాము: నేనో పెద్ద వజ్రాల దొంగనని పేరు సంపాదించాలంటే ఏం చెయ్యాలిరా? సోము: ఆ... కోహినూరు వజ్రం అని ఒకటుంది. దాన్ని దొంగిలిస్తే సరి. కొత్త కదా భర్త: ఏరా బంగారం.. వంట అయ్యిందా ఆకలేస్తోంది? కొత్త భార్య: ఉండండి, వండుతుంటే కరెంట్ పోయింది. భర్త: కరెంటు పోతేనేం, మనకు కుక్కర్ లేదు కదా. కొత్త భార్య: అన్నం ఎలా వండాలో టీవీలో చూసి చేస్తున్నానండీ. భర్త: !!! ఇంతకీ మీకొచ్చా? మాస్టారు: ఒరే టింకూ 1+1 ఎంత? టింకు: రెండు సార్. మాస్టారు: 2+2 ఎంత? టింకు: నాలుగు సార్ మాస్టారు: 4+4 ఎంత చెప్పు? టింకు: ఏంటి సార్... మీకు లెక్కలు రావా? అన్నీ నన్నే అడుగుతున్నారు!! - దూనబోయిన మల్లికార్జున, అయినాపురం, తూ.గో.జిల్లా