
న్యూఢిల్లీ: కర్ణాటక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సిక్రీ జోకుతో సుప్రీంలో నవ్వులు విరిశాయి. శుక్రవారం సుప్రీంకోర్టులో ఒకవైపు వాడీవేడిగా వాదనలు సాగుతుండగా.. జస్టిస్ సిక్రీ మధ్యలో జోక్యం చేసుకుంటూ ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక జోకు గురించి మీకు చెప్పాలి. తనకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రిసార్టు యజమాని గవర్నర్‌కు లేఖ రాశాడట’ అని ఆయన చెప్పగానే కోర్టులోని వారంతా పగలబడి నవ్వారు. బెంగళూరులోని ఈగల్టన్ రిసార్టులో కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేల్ని ఉంచిన అంశాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ సిక్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.