laughs
-
పగలబడి నవ్విన అలియా.. ఇక ట్రోలింగ్ చూడండయ్యా
Alia Bhatt Trolled For Her Laugh Video Goes Viral: సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా అలర్ట్‌గా ఉంటారు. సెలబ్రిటీల రెగ్యూలర్ యాక్టివిటీస్‌పై ఓ కన్ను వేసి ఉంచుతారు. హెయిర్ స్టైల్ నుంచి నడక వరకు ప్రతిదీ ఒ కంట కనపెడుతూ ఉంటారు. సెలబ్రిటీలు చేసింది ఏదైనా నచ్చితే ఆకాశానికెత్తేస్తారు. లేదా తారల వైఖరీ నెటిజన్స్‌కు కొంచెం తేడా కొట్టిన ట్రోలింగ్‌తో ఏకిపారేస్తారు. బాలీవుడ్లో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది క్యూట్ బ్యూటీ అలియా భట్. ప్రస్తుతం తెలుగులో రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సీతగా దగ్గర కానుంది. అయితే ఈ సీతను ప్రస్తుతం నెటిజన్స్ ట్రోలింగ్‌తో ఆడేసుకుంటున్నారు. ఇటీవల ఒక ఈవెంట్లో అలియా భట్ కెమెరాలకు ఫోజులిస్తూ నవ్వుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో వెంటనే వైరల్‌గా మారింది. ఇందులో అలియా రకరకాల ఫోజులిస్తూ కొంచెం పగలబడి నవ్వుతూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెది ఫేక్ నవ్వని ట్రోలింగ్ చేస్తున్నారు. 'బలవంతపు నవ్వు', 'ఆమె చిరునవ్వు చిందించడానికి ఎందుకు అంత బాధపడుతుందో తెలియట్లేదు' అని కామెంట్ల్ పెడుతున్నారు. ఇంతకుముందు దీపికా పదుకొణెది ఫేక్ నవ్వు అని అలియా కామెంట్ చేసిందని మరొక యూజర్ గుర్తు చేశాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: ప్రముఖ హీరోను చూసి కన్నీళ్లు పెట్టుకున్న రణ్వీర్ సింగ్ -
నవ్వొద్దు.. ఏడ్వొద్దు.. తాగొద్దు.. ఉల్లంఘిస్తే ఖతమే!
North Korea Banned Laughing: ఓవైపు నియంత పాలన.. మరోవైపు ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవించే కొరియన్లపై జాలి చూపించడం తప్ప ప్రపంచం చేయగలిగింది ఏం లేదు. ఈ మధ్యే అధ్యక్షుడిగా పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు అతనిలోని మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచాయి. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ వర్దంతి వేడుకల్ని శుక్రవారం(డిసెంబర్ 11) నుంచి 11 రోజులపాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1994 నుంచి 2011(చనిపోయేవరకు) ఉత్తర కొరియాను పాలించిన నియంతాధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఇల్ చిన్న కొడుకే.. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ తరుణంలో వర్ధంతి వేడుకల సందర్భంగా ఉత్తర కొరియాలో విధించిన ఆంక్షల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. సినుయిజు సిటీలోని ఫ్రీ ఏషియా రేడియో నెట్వర్క్ అందించిన కథనం ప్రకారం.. ఈ పదకొండు రోజులు ఏ పౌరుడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. మద్యం కూడా తాగ కూడదు. ఎవరూ పుట్టినరోజులు జరుపుకోకూడదు. బహిరంగంగా నవ్వడానికి, ఏడవడానికీ వీల్లేదు. ఎటువంటి వేడుకలు చేసుకోవడానికి, వాటిల్లో పాల్గొనకూడదు. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోకూడదు. వర్ధంతి రోజైన శుక్రవారం.. నిత్యావసరాల దుకాణాల ముందు జనాలెవరూ క్యూ కట్టడానికి వీల్లేదు. విషాద దినాల్లో మాజీ అధ్యక్షుడి నివాళి సమావేశానికి అందరూ హాజరవ్వాలి. వీటిని ఎవరు ఉల్లంఘించినా(కిమ్ కుటుంబం, పేషీ తప్ప) వాళ్లు నేరగాళ్ల కిందే లెక్క. శిక్షగా వాళ్లు మళ్లీ కనిపించకుండా పోతారు(అయితే మరణశిక్ష లేదంటే జీవితకాలం బానిస బతుకు). ఈ పదేళ్లలో ఇలాంటి ఉత్తర్వులు జారీ కావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ ఆదేశాల్ని జనాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇందుకోసం వాళ్లను నిద్ర కూడా పోకూడదన్న ఆదేశాలు జారీ చేసిందట కిమ్ కార్యాలయం. కొత్తేం కాదుగా.. - ఈ ఏడాది మొదట్లో కిమ్ కార్యాలయం.. జనాలను టైట్ జీన్స్ వేయకూడదని, స్టయిల్‌గా రెడీ కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. - క్యాపిటలిస్టిక్ లైఫ్‌స్టయిల్ కొరియా యువత మీద ప్రతికూల ప్రభావం చూపెడుతోందన్న ఉద్దేశంతో పాప్ కల్చర్‌ను బ్యాన్ చేశాడు. - తన స్టయిల్‌ను కాపీ కొట్టకూడదనే ఉద్దేశంతో ఆ తరహా లెదర్ జాకెట్లను నిషేధించాడు. - స్క్విడ్ గేమ్ దక్షిణ కొరియా సిరీస్ కావడంతో.. దానిని సర్క్యులేట్ చేసిన ఓ వ్యక్తిని కాల్చి చంపడంతో పాటు ఓ స్కూల్ ప్రిన్స్‌పాల్, టీచర్, ఐదుగురు పిల్లలకు బానిస శిక్షను అమలు చేశాడు. చదవండి: ఉత్తర కొరియా: కిమ్ వర్సెస్ కిమ్! -
జస్టిస్ సిక్రీ జోక్‌తో కోర్టులో నవ్వులు
న్యూఢిల్లీ: కర్ణాటక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సిక్రీ జోకుతో సుప్రీంలో నవ్వులు విరిశాయి. శుక్రవారం సుప్రీంకోర్టులో ఒకవైపు వాడీవేడిగా వాదనలు సాగుతుండగా.. జస్టిస్ సిక్రీ మధ్యలో జోక్యం చేసుకుంటూ ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక జోకు గురించి మీకు చెప్పాలి. తనకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రిసార్టు యజమాని గవర్నర్‌కు లేఖ రాశాడట’ అని ఆయన చెప్పగానే కోర్టులోని వారంతా పగలబడి నవ్వారు. బెంగళూరులోని ఈగల్టన్ రిసార్టులో కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేల్ని ఉంచిన అంశాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ సిక్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఫైర్‌బ్రాండ్‌కు ‘రెబల్’ మద్దతు
న్యూఢిల్లీ: బీజేపీ ‘రెబల్’ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శస్త్రాలు ఎక్కుపెట్టారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి బాసటగా నిలిచారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా నవ్వినందుకు బీజేపీ నాయకులు ఆమెను రామాయణంలోని తాటాకితో పోల్చి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శత్రుఘ్నసిన్హా ట్విటర్లో స్పందించారు. రేణుక ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎవరేమన్నా పట్టించుకోవద్దని, తనను చూసి ఏడ్చేవారిని ఏడవనివ్వాలని సూచించారు. మహిళా సాధికారతను వ్యతిరేకించేవాళ్లు త్వరలోనే పతనమవుతారని వ్యాఖ్యానించారు. వారికి ఇదే చివరి నవ్వు అవుతుందని పేర్కొంటూ నారీ శక్తికి జై కొట్టారు. బీజేపీకి తలనొప్పిలా తయారైన శత్రుఘ్నసిన్హా ఇంతకుముందు కూడా ప్రతిపక్ష నాయకులను ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టారు. బీజేపీ అగ్రనాయకులపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నాయకులను వెనకేసుకొచ్చారు. Laugh Renuka laugh! We love you, we're fond of you & wish you well. Don’t worry, be happy! Let them cry & shout hoarse. Things will settle down. Those who oppose women's empowerment & laughter would melt soon. We all will have the last laugh. Long live ‘Nari Shakti. Jai hind! — Shatrughan Sinha (@ShatruganSinha) February 13, 2018 -
పాతికేళ్ల నవ్వులు...
మిస్టర్ బీన్.. ఈ క్యారెక్టర్ మీకు పరిచయమే అనుకుంటాను. చాలా సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్త టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ హస్యగాడి పాత్రలో రోవన్ ఆట్కిన్ సన్ అద్భుతంగా జీవించాడు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్న బ్రిటీష్ కామెడీ సిరీస్ ‘మిస్టర్ బీన్’. పాలు తాగే పసికందు నుంచి కాటికి కాళ్లు చాపిన పండుముసలి వాళ్లను సైతం నవ్వించగలగటం రోవన్ అట్కిన్ సన్ ప్రత్యేకత.1990లో మొదలైన ఈ సీరియల్ ఈ ఏడాదితో పాతికేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీన్ పాత్రధారి రోవాన్ ఆట్కిన్సన్, లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలో ఫొటోగ్రాఫర్లకు ఫోజిస్తూ సందడి చేశారు.