అందమైన మహిళలను రేప్‌ చేయాలనే.. : నటుడు | Jason Momoa apologises for jokes about rape | Sakshi
Sakshi News home page

'రేప్‌'పై నటుడి దారుణమైన జోక్‌

Published Fri, Oct 13 2017 6:54 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

Jason Momoa apologises for jokes about rape - Sakshi

హాలీవుడ్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నటుడు బెన్‌ అఫ్లెక్‌.. ఓ మహిళా యాంకర్‌తో గతంలో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఆ యాంకర్‌తో అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించినందుకు అఫ్లెక్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. తాజాగా అతని సహా నటుడు జాసన్‌ మొమోవా రేప్‌ గురించి భయంకరమైన జోకులు వేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. అఫ్లెక్‌, మొమోవా 'జస్టిస్‌ లీగ్‌' సినిమాలో కలిసి నటించారు.

2011లో 'గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌' యూనిట్‌ ఓ కామెడీ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు యూనిట్‌ సమాధానం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందిన ఈ సిరీస్‌లో నటించడం ఎందుకు ఇష్టమని ఓ ప్రేక్షకుడు ప్రశ్నించగా.. మొమోవా దారుణమైన జోక్‌ వేశాడు. 'అందమైన మహిళలను రేప్‌ చేసేందుకే..' అంటూ ఎమిలీయా క్లార్క్‌ వైపు చూస్తూ వెకిలిగా చెప్పాడు. ఈ జోక్‌కు మిగతా వారు నవ్వినా.. యూనిట్‌లో భాగంగా ఉన్న నటీమణులు క్లార్క్‌, డీబీ వీసీ తదితరులు సిగ్గుతో ముఖం దాచుకున్నారు.

'గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'లో గిరిజన తెగ నాయకుడిగా నటించిన మొమోవా.. యువ వధువు (క్లార్క్‌)ను బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. ఆమెపై మొదట బలత్కారం జరిపినా.. తర్వాత వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. తాజాగా 'రేప్‌ జోక్‌' వీడియో వెలుగులోకి రావడంతో మొమోవాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్పందించిన మొమోవా క్షమాపణలు చెప్పారు. అత్యంత మొరటుగా తాను ఆ జోక్‌ వేశానంటూ సారీ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లో జాసన్‌ మొమోవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement