ఆ సీన్లలో మందుకొట్టి నటించా: హీరోయిన్‌ | Game of Thrones actor Emilia Clarke has to get naked often | Sakshi
Sakshi News home page

ఆ సీన్లలో మందుకొట్టి నటించా: హీరోయిన్‌

Published Sat, Apr 16 2016 12:30 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

ఆ సీన్లలో మందుకొట్టి నటించా: హీరోయిన్‌ - Sakshi

ఆ సీన్లలో మందుకొట్టి నటించా: హీరోయిన్‌

ప్రపంచంలో సెక్సీయెస్ట్ వుమన్‌ అలైవ్‌గా ఎస్క్వైర్ మ్యాగజీన్‌ కవర్‌పేజీపై కనిపించి అందరి దృష్టి తనవైపు తిప్పుకొంది హాలీవుడ్‌ హీరోయిన్‌ ఎమిలియా క్లార్క్‌..  'గేమ్‌ ఆఫ్ థ్రోన్స్‌‌' సినిమాలో శృంగార సన్నివేశాల్లో ఈ 29 ఏళ్ల అమ్మడు చాలా బోల్డ్‌గా నటించింది.

కెమెరా ముందు ఒంటి మీద నూలుపోగు లేకుండా కనిపించి.. ప్రేక్షకులు కళ్లు తిప్పుకోకుండా చూసింది. వెండితెరను వేడెక్కించిన ఈ సన్నివేశాల్లో ఎలా నటించిందా? ఆ సమయంలో ఏం చేసింది? అనే విషయాలను తాజాగా ఎమిలియా ఓ టీవీ షోలో వెల్లడించింది. శృంగార దృశ్యాల్లో నటించేటప్పుడు తనకు మద్యం అవసరమైందని తెలిపింది.

'నాకు తరచూ వొడ్కా ఇచ్చారు. సీన్‌ ముగిసిన వెంటనే నేను బెడ్‌షీట్‌ కప్పుకొనే దానిని.. అలా ఆ సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది' అని ఆమె వివరించింది. నగ్నంగా నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని గతంలో చెప్పిన ఎమిలియా.. రాబోయే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాల్లో పురుషులతో కలిసి నటించేందుకు సిద్ధమేనని చెప్పింది. శృంగార సన్నివేశాల్లోనూ పర్ఫెక్ట్‌గా కనిపించాలన్నది తన అభిమతమని 'గ్లామర్‌' మ్యాగజీన్‌తో ఆమె వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement