Emilia Clarke
-
ప్రాణాంతక వ్యాధి బారిన హీరోయిన్, 2 సార్లు చావు అంచుల వరకు..
ప్రముఖ పాపులర్ హాలీవుడ్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. యాక్షన్, అడ్వెంచర్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ మొత్తం 73 ఎపిసోడ్స్, 8 సీజన్లుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఎమీలియా క్లార్క్. దీని అనంతరం వచ్చిన స్టార్‌వార్స్ సినిమాలతో ఈ నటి మరింత క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ బ్రిటిష్ బ్యూటీ నటించిన చిత్రం ‘ది సీగల్’. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి వీడియో ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తనకున్న ప్రాణాంతక వ్యాధి గురించి బయటపెట్టింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, దీనివల్ల రెండుసార్లు చావు అంచుల వరకు వెళ్లివచ్చానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొంతకాలంగా నేను బ్రెయిన్ అనూరిజం అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. బ్రెయిన్ అనూరిజం వల్ల మెదడుకి సరిగ రక్తం సరఫరా కాదు. దానివల్ల ఓ ప్రదేశంలో బ్లడ్ క్లాట్ అయ్యి పెలిపోయే ప్రమాదం ఉంది. నాలో ఈ వ్యాధి బయటపడగానే సర్జరీ చేయించుకున్నాను. తొలిసారి 2011లో సర్జరీ జరిగింది. ఆ తర్వాత 2013లో మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చదవండి: కొత్త ఇంటికి మారిన హిమజ, హోంటూర్ వీడియో వైరల్ అప్పుడు కొన్ని అత్యవసర చికిత్సలు తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఒక వ్యక్తి మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. సరిగ్గా మాట్లాడడం కూడా కష్టమే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సర్జరీల వల్ల తన మెదడులోని సగ భాగం పనిచేయదని చెప్పంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఇకపై నేను నా మెదడుని పూర్తిగా ఉపయోగించలేను. కానీ.. స్పష్టంగా మాట్లాడగలగడం నా అదృష్టం. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఆ కొద్ది మందిలో నేను ఉడడం అదృష్టంగా భావిస్తోన్న. మీ మెదడులోని ఏ భాగానికైన రక్తం అందకపోతే అది పనికిరాకుండా పోతుంది. ప్రవహించే దారిలో ఏదైనా అడ్డువస్తే రక్తం వెంటనే వేరే దారి చూసుకుంటుంది. దానివల్ల రక్తం అందని భాగం పనిచేయదు’ అని వివరిచింది. -
‘నగ్న సీన్ల కోసం నా పై ఒత్తిడి చేశారు’
రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులకు సంబంధించి 2016లో బీబీసీ నెట్వర్క్ కోసం తీసిన ‘క్లోజ్ టు ది ఎనిమీ’ మినీ సిరీస్ షూటింగ్ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ పొలియాకాఫ్ తనపై నగ్న సీన్ల చిత్రీకరణ కోసం ఒత్తిడి చేశారని 34 ఏళ్ల ఎమిలియా క్లార్క్ ఆరోపించారు. అందుకు తాను అంగీకరించకుండా సిరీస్ నుంచి తప్పుకున్నానని తాజా హాలీవుడ్ చిత్రం ‘హ్యూమన్’లో హీరోయిన్గా నటించిన ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సిరీస్‌కు రచయిత, దర్శకుడు స్టీఫెన్ పొలియాకాఫే. ఆయనకిప్పుడు 67 ఏళ్లు. ‘క్లోజ్ టు ది ఎనిమీ’ సిరీస్ నుంచి తప్పుకున్న ఆమె ‘సన్స్ ఆఫ్ లిబర్టీ’లో నటించారు. అది హిట్ కాకపోవడంతో ఆమెకు అంతగా పేరు రాలేదు. అయితే ఎమిలియా చేసిన ఆరోపణలను ‘బాఫ్టా’ అవార్డు గ్రహీత స్టీఫెన్ ఖండించారు. ఆమె ప్రస్తుతం ఉన్న స్థితికి చింతిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.‘నగ్న సీన్ల కోసం ఎంతసేపు బట్టలు లేకుండా ఉండాలి. ఏ పార్టులో బట్టలు లేకుండా ఉండాలి. నాపై లైట్ ఫోకస్ ఎలా ఉంటుంది?’ అని తానడగడంతో దర్శకుడికి కోపం వచ్చిందని, తాను ఏది ఎలా తీయదల్చుకుంటే అలాగే తీస్తానంటూ గొడవ చేశారని ‘ది గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆరోపించారు. ఈ విషయమై పత్రిక స్టీఫెన్ వివరణ కోరగా ‘ఎమిలియా క్లార్క్ ప్రస్తుతమున్న స్థితికి నేను చింతిస్తున్నాను. ఆ రోజులో ఏం జరిగిందనేది వరుసగా నేను గుర్తు చేయదల్చుకోలేదు. వాస్తవానికి సినిమా షూటింగ్‌కు ముందే ఆమె పాత్ర గురించి మా మధ్య చర్చకు వచ్చింది. మగ వాళ్లయినా, ఆడవాళ్లయినా నగ్నంగా నటించాలంటే ఎంత బాధ పడతారో, ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. వారిని అలా నేను బాధ పెట్టను. నాది సున్నితమైన మనసు’ అని ఆయన వివరణ ఇచ్చారు. ‘మీటూ’ ఉద్యమం కింద ఎంతోమంది హాలీవుడ్ తారలు దర్శక, నిర్మాతలపై ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. సెక్స్ సీన్లలో నటించడం ఇష్టం లేక తాను కూడా ఓ సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు గత డిసెంబర్ నెలలో బ్రిటీష్ తార రుత్ విల్సన్ ప్రకటించారు. -
మూడు ముక్కలకు రూ.16.75 కోట్లు తీసుకుంది
జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ గుర్తుంది కదా. అందులో చారి పాత్రలో విలన్ ఇంట్లో చేరిన ఎన్టీఆర్ మాట్లాడే మూడు ముక్కలు గుర్తున్నాయా..! 'ఏమో గుర్తులేదు తెలీదు మర్చిపోయా' అంటూ లక్షలు తీసుకుంటాడు. సేమ్ అలాంటి సన్నివేశమే గేమ్ ఆఫ్ థ్రాన్స్ ఎపిసోడ్లో జరిగింది. అందులో ఓ నటి మూడే మూడు ముక్కలు మాట్లాడి 2.6 మిలియనల్ డాలర్లు తన ఖాతాలో వేసుకుంది. గేమ్ ఆఫ్ థ్రాన్స్ అమెరికన్ ఫాంటసీ, యాక్షన్ సీరియల్. ఈ సిరీస్ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఇప్పటి వరకూ ఆరు సిరీస్‌లో వచ్చిన ఈ సీరియల్ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సీరియల్ వసూల్లు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఇందులో నటించే వారి పారితోషికాలు చూస్తే మాత్రం సగటు అభిమాని ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రధాన నటులు ఎమిలియా క్లార్క్, కిట్ హరింటన్, లేనా హెడీ, పీటర్ డింక్లేజ్, నికోలస్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కొక్కరికి సుమారు రెండు మిలయన్ డాలర్లు పుచ్చుకున్నారు. వారు మాట్లాడిన మాటలను బట్టీ రేటు పెరుగుతుంది. ఒక్కక్కరు ఎపిసోడ్‌కు 2.6 మిలియనల్ డాలర్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కిట్ హరింటన్ మాట్లాడిన పదాలు 560. అంటే ఒక్కక్క పదానికి సుమారు 4642 డాలర్లు తీసుకున్నారు. లీనా హెడీ పదానికి 6565 డాలర్లు, నికోలస్ కోస్టర్ పదానికి 7647 డాలర్లు తీసుకోగా, ఎమిలియా క్లార్క్ మాత్రం ఎపిసోడ్లో మూడే మూడు ముక్కలు మాట్లాడి 2.6 మిలియన్ డాలర్లు తీసుకుంది. అది కూడా 'షల్ వీ బిగిన్' అని చిలక పలుకులు పలికింది. -
ఆ సీన్లలో మందుకొట్టి నటించా: హీరోయిన్
ప్రపంచంలో సెక్సీయెస్ట్ వుమన్ అలైవ్‌గా ఎస్క్వైర్ మ్యాగజీన్ కవర్‌పేజీపై కనిపించి అందరి దృష్టి తనవైపు తిప్పుకొంది హాలీవుడ్ హీరోయిన్ ఎమిలియా క్లార్క్.. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సినిమాలో శృంగార సన్నివేశాల్లో ఈ 29 ఏళ్ల అమ్మడు చాలా బోల్డ్‌గా నటించింది. కెమెరా ముందు ఒంటి మీద నూలుపోగు లేకుండా కనిపించి.. ప్రేక్షకులు కళ్లు తిప్పుకోకుండా చూసింది. వెండితెరను వేడెక్కించిన ఈ సన్నివేశాల్లో ఎలా నటించిందా? ఆ సమయంలో ఏం చేసింది? అనే విషయాలను తాజాగా ఎమిలియా ఓ టీవీ షోలో వెల్లడించింది. శృంగార దృశ్యాల్లో నటించేటప్పుడు తనకు మద్యం అవసరమైందని తెలిపింది. 'నాకు తరచూ వొడ్కా ఇచ్చారు. సీన్ ముగిసిన వెంటనే నేను బెడ్‌షీట్ కప్పుకొనే దానిని.. అలా ఆ సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది' అని ఆమె వివరించింది. నగ్నంగా నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని గతంలో చెప్పిన ఎమిలియా.. రాబోయే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాల్లో పురుషులతో కలిసి నటించేందుకు సిద్ధమేనని చెప్పింది. శృంగార సన్నివేశాల్లోనూ పర్ఫెక్ట్గా కనిపించాలన్నది తన అభిమతమని 'గ్లామర్' మ్యాగజీన్‌తో ఆమె వ్యాఖ్యానించింది.