మూడు ముక్కలకు రూ.16.75 కోట్లు తీసుకుంది | Emilia Clarke made $2.6mn for saying just 3 words | Sakshi
Sakshi News home page

మూడు ముక్కలకు రూ.16.75 కోట్లు తీసుకుంది

Published Sat, Jul 22 2017 11:47 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

మూడు ముక్కలకు రూ.16.75 కోట్లు తీసుకుంది

మూడు ముక్కలకు రూ.16.75 కోట్లు తీసుకుంది

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన అదుర్స్‌ గుర్తుంది కదా. అందులో చారి పాత్రలో విలన్‌ ఇంట్లో చేరిన ఎన్‌టీఆర్‌ మాట్లాడే మూడు ముక్కలు గుర్తున్నాయా..! 'ఏమో గుర్తులేదు తెలీదు మర్చిపోయా' అంటూ లక్షలు తీసుకుంటాడు. సేమ్‌ అలాంటి సన్నివేశమే గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ ఎపిసోడ్‌లో జరిగింది. అందులో ఓ నటి మూడే మూడు ముక్కలు మాట్లాడి 2.6 మిలియనల్‌ డాలర్లు తన ఖాతాలో వేసుకుంది.

గేమ్‌ ఆఫ్‌ థ్రాన్స్‌ అమెరికన్‌ ఫాంటసీ, యాక్షన్‌ సీరియల్‌. ఈ సిరీస్‌ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఇప్పటి వరకూ ఆరు సిరీస్‌లో వచ్చిన ఈ సీరియల్‌ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సీరియల్‌ వసూల్లు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఇందులో నటించే వారి పారితోషికాలు చూస్తే మాత్రం సగటు అభిమాని ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రధాన నటులు ఎమిలియా క్లార్క్‌, కిట్‌ హరింటన్‌, లేనా హెడీ, పీటర్‌ డింక్లేజ్‌, నికోలస్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కొక్కరికి సుమారు రెండు మిలయన్‌ డాలర్లు పుచ్చుకున్నారు. వారు మాట్లాడిన మాటలను బట్టీ రేటు పెరుగుతుంది.

ఒక్కక్కరు ఎపిసోడ్‌కు 2.6 మిలియనల్‌ డాలర్లు రెమ్యునరేషన్‌ తీసుకున్నారు. ఇందులో కిట్‌ హరింటన్ మాట్లాడిన పదాలు 560. అంటే ఒక్కక్క పదానికి సుమారు 4642 డాలర్లు తీసుకున్నారు. లీనా హెడీ పదానికి 6565 డాలర్లు, నికోలస్‌ కోస్టర్‌ పదానికి 7647 డాలర్లు తీసుకోగా, ఎమిలియా క్లార్క్‌ మాత్రం ఎపిసోడ్‌లో మూడే మూడు ముక్కలు మాట్లాడి 2.6 మిలియన్‌ డాలర్లు తీసుకుంది. అది కూడా 'షల్‌ వీ బిగిన్‌' అని చిలక పలుకులు పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement