కేబుల్‌ వైర్లతో కట్టేసి కొరడాతో కొట్టేవాడు.. | Esme Bianco Shares Horrific Abuse By Singer Marilyn Manson | Sakshi
Sakshi News home page

కట్టేసి, కొరడాతో కొడుతూ లైంగిక దాడి: నటి

Published Sat, Feb 13 2021 8:54 AM | Last Updated on Sat, Feb 13 2021 11:38 AM

Esme Bianco Shares Horrific Abuse By Singer Marilyn Manson - Sakshi

వాషింగ్టన్‌: అమెరికన్‌ సింగర్‌, గేయ రచయిత మార్లిన్‌ మాన్సన్ కొంతకాలంగా తీవ్ర లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాజీ ప్రియురాలు, ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్’‌ నటి ఎస్మే బియాంకో సైతం అతడిపై లైంగిక ఆరోపణలు చేశారు. మార్లిన్‌తో కలిసి ఉన్న సమయంలో తనను చిత్రహింసలకు గురిచాశాడని, అవి తనకు చీకటి రోజులుగా చెప్పారు. అంతేగాక తనతో పాటు ఎంతో మంది మహిళలను కూడా మాన్సన్‌ లైంగికంగా వేధించించాడంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బియాంకో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఫాంటస్మాగోరి’ థ్రిల్లర్‌ మూవీ సమయంలో తన మాజీ భర్త, డ్యాన్సర్‌ డిటా వాస్‌ టీసే ద్వారా మార్లిన్‌ను మొదటిసారి కలిశానని చెప్పారు.

‘2007లో నేను, వాస్‌ టీస్‌తో విడిపోయాక. మార్లిన్‌ నాకు మధ్య సన్నిహితం పెరిగింది. ఈ క్రమంలో 2009 ‘ఐ వాంట్‌ టూ కిల్‌ యు లైక్‌ దే ఇస్‌ ది మూవీస్‌’ అనే ఆల్బంలోని ఓ పాటలో నన్ను నటించాలని మాన్సన్‌ కోరాడు. అయితే ఈ సాంగ్‌లో ఓ సైకో ప్రియుడి చేత కిడ్నాప్‌ చేయబడిన బాధిత ప్రియురాలిగా నటించాలని చెప్పాడు. అది నిజమైప నటననే నమ్మాను. కానీ మాన్సన్‌ షూటింగ్‌ పేరుతో నిజంగానే నన్ను ఓ రూమ్‌లో బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఆ సమయంలో అతడు కేబుల్‌ వైర్లతో కట్టేసి కొరడాతో కొట్టేవాడు. అంతేగాక లైంగిక దాడికి పాల్పడుతూ ఎలక్ట్రిక్‌ సెక్స్‌ బోమ్మను ఉపయోగించాడు. ఇక మూడు రోజుల షూట్‌లో కేవలం నేను లోదుస్తులపైనే ఉన్నాను. ఆ సమయంలో మాన్సన్‌ నాకు ఆహారం కూడా ఇవ్వకుండా కేవలం కోకైన్‌ మాత్రమే ఇచ్చేవాడు’ అంటూ చెప్పుకొచ్చారు.

అంతేగాక మాన్సన్‌తో డేటింగ్‌ సమయంలో తను ఒక ఖైదీలా ఉన్నానని పేర్కొన్నారు. ‘నేను పడుకునే సమయం, నా ఆహరపు ఆలవాట్లు, ధరించే దుస్తులు, చివరకు నేను ఎవరితో మాట్లాడాలో కూడా అతడే నిర్ణయించేవాడు. ఇక శృంగారం సమయంలో మాన్సన్‌ నన్ను కోరికేసి, శరీరాన్ని గాయపరిచేవాడు ఇప్పటికి ఆ గాయాలు ఉన్నాయి’ అంటూ చికటీ రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక మాన్సన్‌‌తో విడిపోయాక కూడా తను క్షణం​ క్షణం​ భయంతో గడిపేదాన్ని, తన మాజీ భర్త కూడా ఆ సమయంలో నాతో ఆసభ్యంగా ప్రవర్తించేవాడని పేర్కొన్నారు. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్‌’ మూవీ సమయంలో నా మానసిక పరిస్థితి బాగా లేదని,  ఆ తర్వాత నాకు సినిమాల అవకాశాలు దొరకలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మార్లిన్ మాన్సస్‌ మాత్రం​ బియాంకో ఆరోపణలను కొట్టిపారేశాడు.

(చదవండి: నాలుగేళ్ల సంపాదనతో ఈ డైమండ్‌ కొన్నాను: ర్యాపర్‌)
(20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి.. కామెడీ రోల్‌లో షాలిని!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement