కవ్వింత: అదే బాపతు | Funday joke of the week | Sakshi
Sakshi News home page

కవ్వింత: అదే బాపతు

Published Sun, Aug 17 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

కవ్వింత: అదే బాపతు

కవ్వింత: అదే బాపతు

మేనేజరు: రోజూ ఎందుకు ఆఫీసుకు లేటుగా వస్తున్నావు?
 ఉద్యోగి: నాకు పెళ్లయ్యింది. నాకు వంట వచ్చని మా ఆవిడకు తెలుసు సార్.
 మేనేజరు: ఓకే గ్రాంటెడ్. టేక్ యువర్ ఓన్ టైం!
 
 వాడొక్కడే!
 సుబ్బారావు: ఎన్నాళ్లకు కలిశావురా? 20 ఏళ్లయ్యింది నిన్ను చూసి...ఎలా ఉన్నావు? ఎంత మంది పిల్లలు?
 రామారావు: బాగున్నాను. నలుగురు. మొదటి వాడు ఇంజినీరింగ్, రెండో వాడు ఎంసీఏ, మూడోవాడు పీహెచ్‌డీ చదివారు.
 సుబ్బారావు: మరి నాలుగో వాడు
 రామారావు: చదువుకోకుండా దొంగతనాలకు అలవాటుపడ్డాడు.
 సుబ్బారావు: మరి ఇంటి పరువు తీస్తుంటే గెంటేయకుండా ఇంట్లో పెట్టుకున్నావా?
 రామారావు: ఏం చేద్దాం? సంపాదిస్తున్నది వాడొక్కడే ఇపుడు.
 
 తాగుబోతు భాష
 డాక్టరు: తాగుడు మానడానికి మందిచ్చాను కదా, రోజూ వేసుకుంటున్నావా?
 తాగుబోతు పేషెంటు: అవును డాక్టర్, మూడు పూటలా మూడు పెగ్గులు వేసుకుంటున్నా.
 
 బరువైన ప్రశ్న
 బుజ్జిగాడు: నాన్నా నాకు సైకిల్ కొనివ్వవా?
 నాన్న: సైకిలంత బరువు లేవు నీకు సైకిల్ కావాలట్రా?
 బుజ్జిగాడు: మరి నువ్వు కారంత బరువున్నావా? కారు కొనుక్కున్నావు?
 
 హోంవర్క్!
 హోంవర్క్‌లు ఎన్నిరకాలో తెలుసా?
 రెండు రకాలు- ఒకటి భర్తకు భార్య చెప్పేది, రెండు టీచరు స్టూడెంట్‌కు చెప్పేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement