Kavvintha
-
తాతయ్య మహారథి బాటలోనే...
సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారథి మనవడు, దర్శక, నిర్మాత త్రిపురనేని చిట్టి తనయుడు విజయ్ చౌదరి త్రిపురనేని దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘కవ్వింత’. విజయ్ దాట్ల, దీక్షా పంత్, ధన్‌రాజ్, త్రిపురనేని చిట్టి, ఎల్బీ శ్రీరామ్ ముఖ్య తారలు. పువ్వల శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం మేకింగ్ వీడియోను ‘మల్టీ డైమన్షన్’ వాసు ఆవిష్కరించారు. ఈ వేడుకలో దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీరశంకర్, రవికుమార్ చౌదరి, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని థియేటర్ అధినేతలు నేరుగా కొనుక్కునే విధానాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్ శ్రీకన్య థియేటర్ అధినేత వీవీ సత్యనారాయణరాజు ఈ చిత్రాన్ని లక్ష రూపాయలకు కొనుక్కున్నారు. ఈ సమావేశంలో త్రిపురనేని చిట్టి మాట్లాడుతూ -‘‘దర్శకుడు కావాలనే తన ఆకాంక్షను నేర్చుకోవడానికి విజయ్ ముందు దర్శకత్వ శాఖలో చేరాడు. అనుభవం సంపాదించాకే డెరైక్టర్ అయ్యాడు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు 22 థియేటర్స్‌కి ఈ సినిమా అమ్ముడుపోయింది. ధనార్జనే ధ్యేయంగా సినిమాలు చేయడంలేదు. ఈ సినిమా తర్వాత నేనే సినిమా చేసినా, నెల జీతానికే చేస్తాను. నిర్మాత శ్రేయస్సు నాకు ముఖ్యం. మా తాతగారు, నాన్నగార్ల బాటలోనే వెళ్లాలన్నది నా ఆకాంక్ష’’ అన్నారు. ఈ చిత్రం ద్వారా వచ్చే ప్రతి రూపాయినీ మా ‘అంజని ఫౌండేషన్’ ద్వారా జరిపే సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: టెంటు లక్ష్ము నాయుడు. -
‘కవ్వింత’ మేకింగ్ వీడియో విడుదల
-
కవ్వింత: అదే బాపతు
మేనేజరు: రోజూ ఎందుకు ఆఫీసుకు లేటుగా వస్తున్నావు? ఉద్యోగి: నాకు పెళ్లయ్యింది. నాకు వంట వచ్చని మా ఆవిడకు తెలుసు సార్. మేనేజరు: ఓకే గ్రాంటెడ్. టేక్ యువర్ ఓన్ టైం! వాడొక్కడే! సుబ్బారావు: ఎన్నాళ్లకు కలిశావురా? 20 ఏళ్లయ్యింది నిన్ను చూసి...ఎలా ఉన్నావు? ఎంత మంది పిల్లలు? రామారావు: బాగున్నాను. నలుగురు. మొదటి వాడు ఇంజినీరింగ్, రెండో వాడు ఎంసీఏ, మూడోవాడు పీహెచ్డీ చదివారు. సుబ్బారావు: మరి నాలుగో వాడు రామారావు: చదువుకోకుండా దొంగతనాలకు అలవాటుపడ్డాడు. సుబ్బారావు: మరి ఇంటి పరువు తీస్తుంటే గెంటేయకుండా ఇంట్లో పెట్టుకున్నావా? రామారావు: ఏం చేద్దాం? సంపాదిస్తున్నది వాడొక్కడే ఇపుడు. తాగుబోతు భాష డాక్టరు: తాగుడు మానడానికి మందిచ్చాను కదా, రోజూ వేసుకుంటున్నావా? తాగుబోతు పేషెంటు: అవును డాక్టర్, మూడు పూటలా మూడు పెగ్గులు వేసుకుంటున్నా. బరువైన ప్రశ్న బుజ్జిగాడు: నాన్నా నాకు సైకిల్ కొనివ్వవా? నాన్న: సైకిలంత బరువు లేవు నీకు సైకిల్ కావాలట్రా? బుజ్జిగాడు: మరి నువ్వు కారంత బరువున్నావా? కారు కొనుక్కున్నావు? హోంవర్క్! హోంవర్క్‌లు ఎన్నిరకాలో తెలుసా? రెండు రకాలు- ఒకటి భర్తకు భార్య చెప్పేది, రెండు టీచరు స్టూడెంట్‌కు చెప్పేది. -
కవ్వింత: నాతో పెట్టుకోకు
బంటి: నీకు టెన్నిస్ ఆడటం వచ్చా? చంటి: టెన్నిస్ ఆడటం ఒక్కటే ఏంటి... టెన్నిస్ గురించి నాకు తెలియనిది ఏమీ లేదు. బంటి: సరే..అయితే టెన్నిస్ నెట్లో ఎన్ని గళ్లు ఉంటాయో చెప్పు?!! అబ్బాయిలు నిరాడంబరులు అమ్మాయి పడాలంటే... ప్రేమించాలి, నవ్వించాలి, కవ్వించాలి, ఖర్చుపెట్టాలి, వేచిచూడాలి. అబ్బాయి పడాలంటే... నవ్వాలి! తెలివైన భర్త-అతి తెలివి భార్య భార్య: నాతో పదేళ్ల జీవితం గడపటం అంటే భర్త: ఒక సెకెను గడిచిపోయినంత భార్య: నాకు పది వేలు చీర కొనివ్వడం అంటే భర్త: ఒక రూపాయితో సమానం భార్య: అయితే ఒక రూపాయి ఇవ్వు భర్త: ఒక సెకెను ఆగు. అసలు విషయం చందు: జిమ్‌కు వెళ్తున్నావట కదా ఈ మధ్య ! రాము: అమ్మాయిలకు నచ్చేలా తయారవుదామని. చందు: నువ్వు ఉత్త అమాయకుడిలా ఉన్నావే, నువ్వెళ్లాల్సింది జిమ్‌కు కాదు, ఏటీఎంకు!! ప్రేమ-పెళ్లి తేడా! ప్రేమిస్తే...పెళ్లి చేసుకోవాలనిపిస్తుందట పెళ్లి చేసుకుంటే ప్రేమించడమే తప్పనిపిస్తుందట. వెయిటింగ్ రూం ప్రయాణికుడు: ప్రతి రైలు లేటుగా వస్తోంది. ఆ మాత్రానికి ఈ టైంటేబుల్ ఎందుకు? స్టేషన్ మాస్టర్: ప్రతి రైలు టైంకు వస్తే ఇక ఈ వెయిటింగ్ రూం మాత్రం ఎందుకు? -
కవ్వింత: ఏం చెప్పాడు!
పనివాడు: సార్... మన థియేట ర్లో ఆడుతోన్న సినిమా చూడ్డానికి ఎవరూ రావడం లేదు. ఒక్క టిక్కెట్టు కూడా అమ్ముడవ్వలేదు. యజమాని: దానికంత కంగారెందుకు? టిక్కెట్లు ఫ్రీగా పంచిపెట్టు. అందరూ వచ్చాక తలుపులు తాళం వేసెయ్. బయటకు వెళ్లాలంటే రెండొందలు కట్టాలని చెప్పు. పనివాడు: ఆ...! అంతే తెలుసు! తల్లి: స్వీటీ... ఇంగ్లిష్ ఎగ్జామ్ ఎలా రాశావ్? స్వీటీ: బాగా రాశాను మమ్మీ. మీ డాడీ ఏం చేస్తారు అని అడిగితే స్వీపర్ అని రాశాను. తల్లి: అదేంటి... మీ డాడీ అసిస్టెంట్ కమిషనర్ కదా? స్వీటీ: అవుననుకో. కానీ నాకు అసిస్టెంట్ కమిషనర్ స్పెల్లింగ్ రాదు. అందుకని...! అలా జరిగిందా? సుబ్బు: కడుపునొప్పని డాక్టర్ దగ్గరికెళ్లావ్గా, ఏమయ్యింది? పండు: ఆ డాక్టర్ ఇంతకుముందు హోటల్ నడిపాడేమోనని అనుమానంగా ఉందిరా? సుబ్బు: అదేంటి? పండు: ఇంజెక్షన్ చేసి డబ్బులడిగాడు. లేవు అంటే... హాస్పిటల్లో ఉన్న టవళ్లు, దుప్పట్లు ఉతికించాడు. అదెలా సాధ్యం?! భర్త: రాత్రి కలలో దేవుడు కనిపించాడు. భార్య: అవునా... ఏం కోరుకున్నారు? భర్త: నీ బుద్ధిని పదిరెట్లు చేయమని అడిగాను. భార్య: పెంచాడా? భర్త: సున్నాలకి మల్టిప్లికేషన్ ఉండదు అని మాయమైపోయాడు. -
కవ్వింత: భార్య లిస్టు
ఏమండీ మనం ఈ వారం సినిమాకెళ్దాం. వచ్చేవారం షాపింగ్‌కి వెళ్దాం. ఆ వచ్చేవారం వారం టూర్‌కి వెళ్దాం. భర్త: నాలుగో వారం గుడికెళ్దామా? భార్య: ఎందుకు? భర్త: బిచ్చమెత్తుకోవాలిగా. అమాయకుడు నెం.1 సురేష్: ఇంపాజిబుల్ అనే పదం నా డిక్షనరీలో లేదు. నరేష్: ఇపుడు బాధపడి ఏం లాభం, కొనుక్కునేటపుడు చూసుకోవాలి కదా! తొక్కలో తెలివి కస్టమర్: అరటి పండు ఎంత? సెల్లర్: ఐదు రూపాయలు. కస్టమర్: రెండ్రూపాయలకు ఇవ్వు సెల్లర్: తొక్క వస్తుంది కావాలా? కస్టమర్: ఓకే, మూడురూపాయలు ఇస్తా. తొక్క ఉంచుకుని, పండు ఇచ్చేయ్. నాది పూర్తి కల భార్య: మీరు డైమండ్ నెక్లెస్ కొంటున్నట్లు నాకు కల వచ్చింది. భర్త: అయ్యో నీకు అంతవరకే వచ్చిందా. నాకు మీ నాన్న బిల్లు కట్టినంత వరకు వచ్చింది. అదే ప్రిస్క్రిప్షన్ రంగారావు మందుల షాపుకి వెళ్లి పాయిజన్ ఇవ్వమని అడిగాడు. కెమిస్ట్: ప్రిస్క్రిప్షన్ లేకుండా పాయిజన్ అమ్మం. రంగారావు: ఇదిగో. కెమిస్ట్: ఏమిటిది? రంగారావు: నా మ్యారేజ్ సర్టిఫికెట్ !! లేటెస్ట్ బెగ్గర్ మొదటి బెగ్గర్: ఎందుకు ఆ సినిమా పోస్టరును తదేకంగా చూస్తున్నావు రెండో బెగ్గర్: అది నేను తీసిన సినిమా పోస్టర్లే, పదా!