కవ్వింత: నాతో పెట్టుకోకు | Don't play games with me | Sakshi
Sakshi News home page

కవ్వింత: నాతో పెట్టుకోకు

Published Sun, Jun 22 2014 1:26 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

కవ్వింత: నాతో పెట్టుకోకు - Sakshi

కవ్వింత: నాతో పెట్టుకోకు

బంటి: నీకు టెన్నిస్ ఆడటం వచ్చా?
 చంటి: టెన్నిస్ ఆడటం ఒక్కటే ఏంటి... టెన్నిస్ గురించి నాకు తెలియనిది ఏమీ లేదు.
 బంటి: సరే..అయితే టెన్నిస్ నెట్‌లో ఎన్ని గళ్లు ఉంటాయో చెప్పు?!!
 
 అబ్బాయిలు నిరాడంబరులు
 అమ్మాయి పడాలంటే...
 ప్రేమించాలి, నవ్వించాలి, కవ్వించాలి, ఖర్చుపెట్టాలి, వేచిచూడాలి.
 అబ్బాయి పడాలంటే...
 నవ్వాలి!
 
 తెలివైన భర్త-అతి తెలివి భార్య
 భార్య: నాతో పదేళ్ల జీవితం గడపటం అంటే
 భర్త: ఒక సెకెను గడిచిపోయినంత
 భార్య: నాకు పది వేలు చీర కొనివ్వడం అంటే
 భర్త: ఒక రూపాయితో సమానం
 భార్య: అయితే ఒక రూపాయి ఇవ్వు
 భర్త: ఒక సెకెను ఆగు.
 
 అసలు విషయం
 చందు: జిమ్‌కు వెళ్తున్నావట కదా ఈ మధ్య !
 రాము: అమ్మాయిలకు నచ్చేలా తయారవుదామని.
 చందు: నువ్వు ఉత్త అమాయకుడిలా ఉన్నావే, నువ్వెళ్లాల్సింది జిమ్‌కు కాదు, ఏటీఎంకు!!
 
 ప్రేమ-పెళ్లి తేడా!
 ప్రేమిస్తే...పెళ్లి చేసుకోవాలనిపిస్తుందట
 పెళ్లి చేసుకుంటే ప్రేమించడమే తప్పనిపిస్తుందట.
 
 వెయిటింగ్ రూం
 ప్రయాణికుడు: ప్రతి రైలు లేటుగా వస్తోంది. ఆ మాత్రానికి ఈ టైంటేబుల్ ఎందుకు?
 స్టేషన్ మాస్టర్: ప్రతి రైలు టైంకు వస్తే ఇక ఈ వెయిటింగ్ రూం మాత్రం ఎందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement